
జీఎంను సన్మానిస్తున్న పాత్రికేయులు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం) : సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఆర్జీ–2 జీఎం వజ్జల విజయబాబు, గోదావరిఖని టూటౌన్ సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం యైటింక్లయిన్‌కాలనీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆధునీకీకరించిన ప్రెస్‌భవన్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం, ప్రజలు, యాజమాన్యం, ఉద్యోగుల మధ్య పత్రికలు వారధిగా పనిచేస్తున్నాయన్నారు. పాజిటివ్ ఆలోచనలతో పాత్రికేయులు ముందుకు సాగి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. సమాజంలో నిత్యం జరుగుతున్న కార్యక్రమాలు, సంఘటనలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు ముందున్నారని కొనియాడారు.
సింగరేణి సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్మిక కుటుంబాలకు చేరవేడంతో పాటు విలువైన సూచనలు సలహాలు అందించాలన్నారు. సంస్థలో జరుగుతున్న ఘటనలు, ముఖ్యమైన విషయాలపై యాజమాన్యం వివరణ తీసుకుని వార్తను మరో కోణంలో కూడా చూడాలని సూచించారు. ఈసందర్భంగా జీఎం విజయబాబు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రెస్‌భవన్‌ను ప్రారంభించారు.
ప్రెస్‌భవన్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం రవీందర్, గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వంశీ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, డీజీఎం సివిల్ రామక్రిష్ణ, పర్సనల్ ఎన్‌వీరావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ప్రెస్‌భవన్ కార్యదర్శి వర్ధినేని సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్జీ–2 జీఎం విజయబాబు, ఎస్‌ఓటూ జీఎం రవీందర్‌ను పాత్రికేయులు శాలువాతో సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment