12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత?
12వ ప్రణాళిక (2012 -2017)
12వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింద పేర్కొన్న అంశాలను ముఖ్య సాధనాలుగా చెప్పవచ్చు.
వ్యవసాయ రంగంలో పనితీరును మెరుగుపర్చడం.
పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనను వేగవంతం చేయడం.
వ్యవస్థాపన సౌకర్యాలను విస్తృత పర్చడం.
ఆరోగ్యం, విద్యా నైపుణ్యాల అభివృద్ధి.
లాభదాయకంగా లేని లేదా వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలను ప్రారంభించడం.
పేదలకు ఉద్దేశించిన పథకాల ప్రభావాన్ని మెరుగుపర్చడం.
వృద్ధి లక్ష్యాలు
11వ ప్రణాళికలో నిర్ణయించిన 9శాతం వృద్ధిరేటునే ఈ ప్రణాళికలోనూ కొనసాగించడం.
9.5 శాతం సగటు వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా వివిధ రంగాల్లో వృద్ధిరేటు ను నిర్ణయించారు.
ప్రణాళిక పెట్టుబడి
12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి - రూ. 80,50,124 కోట్లు
కేంద్రం వాటా - రూ.43,33,739 కోట్లు
రాష్ట్రాలు అందజేసిన పెట్టుబడి - రూ. 37,16,385 కోట్లు.
మొత్తం = రూ. 80,50,124 కోట్లు
లక్ష్యాలు
విద్యుత్ ఉత్పత్తి: 82,000 మెగావాట్లకు పెంచాలని నిర్దేశించారు.
ఉన్నత విద్య: 2016-17 నాటికి 18 నుంచి 25 శాతం, 2020 నాటికి 30 శాతానికి పెంచాలి.
జీడీఎస్ : 36.2 శాతానికి పెంచాలి. (11వ ప్రణాళికలో 34 శాతం)
జీడీఐ : 38.7 శాతం (11వ ప్రణాళికలో 36.4 శాతం)
{దవ్యోల్బణం: 4.5 నుంచి 5 శాతం మధ్యలో ఉంటుందని ఆశించారు. (11వ ప్రణాళి కలో 6 శాతం)
మూలధన ఖాతాలో మిగులు: 5 శాతం ఉండాలని నిర్దేశించుకున్నారు. (11వ ప్రణాళికలో 3.8 శాతం)
పేదరికం 10 శాతం తగ్గించాలి.
50 మిలియన్ల ఉద్యోగాలు వ్యవసాయేతర రంగాల్లో కల్పించాలి.
శిశు మరణాలు: 50నుంచి 25కు తగ్గించాలి.
ఎంఎంఆర్:254 నుంచి 100కు తగ్గించాలి. (వేయికు ఒకటి తగ్గించాలి/లక్షకు 100)
టీఎఫ్‌ఆర్: ప్రత్యుత్పత్తి రేటును 2.9 నుంచి 2.1కు తగ్గించాలి.
{స్తీ-పురుష నిష్పత్తి (0-6సం): 950కి పెంచాలి.
జీడీపీలో అవస్థాపన వ్యయం 9 శాతానికి పెంచాలి.
స్థూల సాగుభూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు తీసుకురావాలి.
విద్యుత్ నష్టాలను 20 శాతానికి తగ్గించాలి.
గ్రామ టెలి సాంద్రతను 70 శాతానికి పెంచాలి.
ఏటా ఒక మిలియన్ హెక్టార్ భూమిలో మొక్కలు పెంచాలి.
30,000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ను సాధించాలి.
90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవ లు అందించాలి.
ఆధార్ కార్డు ద్వారా ప్రత్యక్ష సబ్సిడీని కల్పించాలి.
వ్యవసాయం - గ్రామీణాభివృద్ధి
11వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో సగటున 3.2 శాతం వృద్ధి సాధించారు. 12వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో 4 శాతం, ధాన్యాల విషయంలో 1.5 శాతం వృద్ధిరేటును సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉత్పాదకతను పెంచడానికి విత్తనాలు, నీటిపారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించారు.
పారిశ్రామిక అభివృద్ధి
ఏటా 2 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడానికి 12వ ప్రణాళికలో 11.12 శాతం వరకు పారిశ్రామిక రంగ వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. కీలక రంగాల్లో పెట్టుబడిని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు కొత్త నవకల్పనలను ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నారు. రాష్ట్రాల వ్యవస్థాపరమైన సౌకర్యాలను, ప్రత్యేక పారిశ్రామిక మండళ్లను అనుసంధానంతో అభివృద్ధి చేయడం, అధికంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు.
విద్యా- నైపుణ్యాల అభివృద్ధి
2017 నాటికి సెకండరీ విద్యను విశ్వజనీనం చేయడంతోపాటు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి శాతాన్ని 2017 నాటికి 20 శాతానికి పెంచాలి.
నాణ్యమైన విద్య, అధ్యాపకుల అభివృద్ధికి ఎక్కువ పెట్టుబడిని పెట్టడం, టీచర్ల శిక్షణ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిని సారించడం.
ఆరోగ్యం
12వ ప్రణాళిక చివరి నాటికి కేంద్ర, రాష్ట్రాలు ఆరోగ్యం మీద చేసే వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.3 శాతం నుంచి 2 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీలైతే 2.5 శాతం వరకు కూడా పెంచాలని నిర్ణయించారు.
శక్తి రంగం
12వ ప్రణాళికా లక్ష్యమైన 9 శాతం వృద్ధిరేటు సాధించడానికి వాణిజ్యపరమైన ఇంధన వృద్ధిరేటు ఏడాదికి 7 శాతం అవసరం అవుతుందని అంచనా.
12వ ప్రణాళికా కాలంలో లక్ష మెగావాట్ల కొత్త ఇంధన సామర్థ్యాన్ని కల్పించడం.
అణు ఇంధన పథకాన్ని రక్షణ దృష్ట్యా సమీకరించి కొనసాగించడం.
రవాణా
12వ ప్రణాళికలో రవాణాపరమైన వ్యవస్థాపనా సౌకర్యాలను త్వరితగతిన విస్తరింపచేయడంపై దృష్టి సారించారు.
ఈ ప్రణాళిక చివరి నాటికి ‘తూర్పు- పశ్చిమ రైల్వే డెడికేటెడ్ ప్రైట్ కారిడార్‌స’ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూలధన సాంద్రత, రవాణా ప్రాజెక్టులకు కావాల్సిన వనరుల కోసం ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహిస్తారు.
ఓడరేవులు, ప్రస్తుతం ఉన్న రోడ్లు, రైల్వే నెట్‌వర్‌క మధ్య పూర్తి అనుసంధానం ఉండేలా చూడటం.
11, 12వ ప్రణాళికల నిర్ణయాలు- లక్ష్యాలు
వ్యవసాయ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 3.2 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 4 శాతంగా నిర్ణయించారు.
గనులు, ఖనిజాల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 4.7 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించుకున్నారు.
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.7 శాతం కాగా 12వ ప్రణాళికలో 9.8 శాతంగా నిర్ణయించారు.
విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 6.4 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 8.5 శాతం లక్ష్యం.
నిర్మాణ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.8 శాతం కాగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు.
వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం 11వ ప్రణాళికలో 9.9 శాతం వృద్ధిరేటు సాధించగా, 12వ ప్రణాళికలో 11 శాతం వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నారు.
బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 10.7 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు.
సామాజిక, వ్యక్తిగత సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 9.4 శాతం కాగా 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించారు.
11వ ప్రణాళికలో జీడీపీ వృద్ధిరేటు 8.2 శాతం. 12వ ప్రణాళిక వృద్ధిరేటును 9 శాతంగా నిర్ణయించారు.
నోట్: 11వ, ప్రణాళికలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రంగాలు..
1. బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవలు ( 10.7 శాతం)
2. వాణిజ్యం - హోటల్స్, రవాణా, సమాచారం, నిల్వలు ( 9.9 శాతం).
12వ ప్రణాళికలో కేటాయింపులు
సాంఘిక సేవలు 34.7 శాతం
శక్తి 18.8 శాతం
రవాణా 15.7 శాతం
ఆరోగ్యం 11.45 శాతం
గ్రామీణాభివృద్ధి 6 శాతం
సాగునీరు 5.5 శాతం
పరిశ్రమలు 4.9 శాతం
పట్టణాభివృద్ధి 4.6 శాతం
వ్యవసాయం 4.7 శాతం
ఎస్ అండ్ టీ 2.2 శాతం
సమాచారం 1.1 శాతం
సాధారణ సేవలు 1.4 శాతం
ఇతరాలు 27.8 శాతం
మాదిరి ప్రశ్నలు
1. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ స్థాయిలో ఉప ప్రయోజనాలు (సబ్ బెనిఫిట్స్) 27 కాగా, రాష్ర్టస్థాయిలోఉప ప్రయోజనాల సంఖ్య ఎంత?
1) 11 2) 13 3) 25 4) 50
2. రెండో ప్రణాళికలో అత్యధిక పెట్టుబడి ఏ రంగానిది?
1) వ్యవసాయం, నీటి పారుదల
2) పరిశ్రమలు 3)రవాణా,సమాచారం
4) విద్యుత్ శక్తి
3. రెండో ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం ఏది?
1) వ్యవసాయం, నీటిపారుదల
2) పరిశ్రమలు
3) రవాణా, సమాచారం
4) విద్యుత్ శక్తి
4. విదేశీ సహాయాన్ని అధికంగా వినియోగించుకున్న కేంద్ర ప్రణాళిక ఏది?
1) 1వ 2) 3వ 3) 5వ 4) 9వ
5. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారిలో పొదుపును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన పథకం ఏది?
1) రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన
2) ఆమ్ ఆద్మీ బీమా యోజన
3) స్వావలంబన
4) రాష్ట్రీయ పొదుపు పథకం
సమాధానాలు
1) 2; 2) 3; 3) 2; 4) 2; 5) 3.