alladi anjaiah
-
12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత?
12వ ప్రణాళిక (2012 -2017) 12వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింద పేర్కొన్న అంశాలను ముఖ్య సాధనాలుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో పనితీరును మెరుగుపర్చడం. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనను వేగవంతం చేయడం. వ్యవస్థాపన సౌకర్యాలను విస్తృత పర్చడం. ఆరోగ్యం, విద్యా నైపుణ్యాల అభివృద్ధి. లాభదాయకంగా లేని లేదా వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలను ప్రారంభించడం. పేదలకు ఉద్దేశించిన పథకాల ప్రభావాన్ని మెరుగుపర్చడం. వృద్ధి లక్ష్యాలు 11వ ప్రణాళికలో నిర్ణయించిన 9శాతం వృద్ధిరేటునే ఈ ప్రణాళికలోనూ కొనసాగించడం. 9.5 శాతం సగటు వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా వివిధ రంగాల్లో వృద్ధిరేటు ను నిర్ణయించారు. ప్రణాళిక పెట్టుబడి 12వ ప్రణాళిక మొత్తం పెట్టుబడి - రూ. 80,50,124 కోట్లు కేంద్రం వాటా - రూ.43,33,739 కోట్లు రాష్ట్రాలు అందజేసిన పెట్టుబడి - రూ. 37,16,385 కోట్లు. మొత్తం = రూ. 80,50,124 కోట్లు లక్ష్యాలు విద్యుత్ ఉత్పత్తి: 82,000 మెగావాట్లకు పెంచాలని నిర్దేశించారు. ఉన్నత విద్య: 2016-17 నాటికి 18 నుంచి 25 శాతం, 2020 నాటికి 30 శాతానికి పెంచాలి. జీడీఎస్ : 36.2 శాతానికి పెంచాలి. (11వ ప్రణాళికలో 34 శాతం) జీడీఐ : 38.7 శాతం (11వ ప్రణాళికలో 36.4 శాతం) {దవ్యోల్బణం: 4.5 నుంచి 5 శాతం మధ్యలో ఉంటుందని ఆశించారు. (11వ ప్రణాళి కలో 6 శాతం) మూలధన ఖాతాలో మిగులు: 5 శాతం ఉండాలని నిర్దేశించుకున్నారు. (11వ ప్రణాళికలో 3.8 శాతం) పేదరికం 10 శాతం తగ్గించాలి. 50 మిలియన్ల ఉద్యోగాలు వ్యవసాయేతర రంగాల్లో కల్పించాలి. శిశు మరణాలు: 50నుంచి 25కు తగ్గించాలి. ఎంఎంఆర్:254 నుంచి 100కు తగ్గించాలి. (వేయికు ఒకటి తగ్గించాలి/లక్షకు 100) టీఎఫ్ఆర్: ప్రత్యుత్పత్తి రేటును 2.9 నుంచి 2.1కు తగ్గించాలి. {స్తీ-పురుష నిష్పత్తి (0-6సం): 950కి పెంచాలి. జీడీపీలో అవస్థాపన వ్యయం 9 శాతానికి పెంచాలి. స్థూల సాగుభూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు తీసుకురావాలి. విద్యుత్ నష్టాలను 20 శాతానికి తగ్గించాలి. గ్రామ టెలి సాంద్రతను 70 శాతానికి పెంచాలి. ఏటా ఒక మిలియన్ హెక్టార్ భూమిలో మొక్కలు పెంచాలి. 30,000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ను సాధించాలి. 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవ లు అందించాలి. ఆధార్ కార్డు ద్వారా ప్రత్యక్ష సబ్సిడీని కల్పించాలి. వ్యవసాయం - గ్రామీణాభివృద్ధి 11వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో సగటున 3.2 శాతం వృద్ధి సాధించారు. 12వ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో 4 శాతం, ధాన్యాల విషయంలో 1.5 శాతం వృద్ధిరేటును సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉత్పాదకతను పెంచడానికి విత్తనాలు, నీటిపారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించారు. పారిశ్రామిక అభివృద్ధి ఏటా 2 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడానికి 12వ ప్రణాళికలో 11.12 శాతం వరకు పారిశ్రామిక రంగ వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. కీలక రంగాల్లో పెట్టుబడిని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు కొత్త నవకల్పనలను ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నారు. రాష్ట్రాల వ్యవస్థాపరమైన సౌకర్యాలను, ప్రత్యేక పారిశ్రామిక మండళ్లను అనుసంధానంతో అభివృద్ధి చేయడం, అధికంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. విద్యా- నైపుణ్యాల అభివృద్ధి 2017 నాటికి సెకండరీ విద్యను విశ్వజనీనం చేయడంతోపాటు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి శాతాన్ని 2017 నాటికి 20 శాతానికి పెంచాలి. నాణ్యమైన విద్య, అధ్యాపకుల అభివృద్ధికి ఎక్కువ పెట్టుబడిని పెట్టడం, టీచర్ల శిక్షణ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిని సారించడం. ఆరోగ్యం 12వ ప్రణాళిక చివరి నాటికి కేంద్ర, రాష్ట్రాలు ఆరోగ్యం మీద చేసే వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.3 శాతం నుంచి 2 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీలైతే 2.5 శాతం వరకు కూడా పెంచాలని నిర్ణయించారు. శక్తి రంగం 12వ ప్రణాళికా లక్ష్యమైన 9 శాతం వృద్ధిరేటు సాధించడానికి వాణిజ్యపరమైన ఇంధన వృద్ధిరేటు ఏడాదికి 7 శాతం అవసరం అవుతుందని అంచనా. 12వ ప్రణాళికా కాలంలో లక్ష మెగావాట్ల కొత్త ఇంధన సామర్థ్యాన్ని కల్పించడం. అణు ఇంధన పథకాన్ని రక్షణ దృష్ట్యా సమీకరించి కొనసాగించడం. రవాణా 12వ ప్రణాళికలో రవాణాపరమైన వ్యవస్థాపనా సౌకర్యాలను త్వరితగతిన విస్తరింపచేయడంపై దృష్టి సారించారు. ఈ ప్రణాళిక చివరి నాటికి ‘తూర్పు- పశ్చిమ రైల్వే డెడికేటెడ్ ప్రైట్ కారిడార్స’ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూలధన సాంద్రత, రవాణా ప్రాజెక్టులకు కావాల్సిన వనరుల కోసం ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. ఓడరేవులు, ప్రస్తుతం ఉన్న రోడ్లు, రైల్వే నెట్వర్క మధ్య పూర్తి అనుసంధానం ఉండేలా చూడటం. 11, 12వ ప్రణాళికల నిర్ణయాలు- లక్ష్యాలు వ్యవసాయ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 3.2 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 4 శాతంగా నిర్ణయించారు. గనులు, ఖనిజాల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 4.7 శాతం సాధించగా, 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించుకున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.7 శాతం కాగా 12వ ప్రణాళికలో 9.8 శాతంగా నిర్ణయించారు. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 6.4 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 8.5 శాతం లక్ష్యం. నిర్మాణ రంగం వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 7.8 శాతం కాగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం 11వ ప్రణాళికలో 9.9 శాతం వృద్ధిరేటు సాధించగా, 12వ ప్రణాళికలో 11 శాతం వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నారు. బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 10.7 శాతం ఉండగా, 12వ ప్రణాళికలో 10 శాతంగా నిర్ణయించారు. సామాజిక, వ్యక్తిగత సేవల వృద్ధిరేటు 11వ ప్రణాళికలో 9.4 శాతం కాగా 12వ ప్రణాళికలో 8 శాతంగా నిర్దేశించారు. 11వ ప్రణాళికలో జీడీపీ వృద్ధిరేటు 8.2 శాతం. 12వ ప్రణాళిక వృద్ధిరేటును 9 శాతంగా నిర్ణయించారు. నోట్: 11వ, ప్రణాళికలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రంగాలు.. 1. బ్యాంకింగ్ - బీమా, రియల్ ఎస్టేట్, వర్తక సేవలు ( 10.7 శాతం) 2. వాణిజ్యం - హోటల్స్, రవాణా, సమాచారం, నిల్వలు ( 9.9 శాతం). 12వ ప్రణాళికలో కేటాయింపులు సాంఘిక సేవలు 34.7 శాతం శక్తి 18.8 శాతం రవాణా 15.7 శాతం ఆరోగ్యం 11.45 శాతం గ్రామీణాభివృద్ధి 6 శాతం సాగునీరు 5.5 శాతం పరిశ్రమలు 4.9 శాతం పట్టణాభివృద్ధి 4.6 శాతం వ్యవసాయం 4.7 శాతం ఎస్ అండ్ టీ 2.2 శాతం సమాచారం 1.1 శాతం సాధారణ సేవలు 1.4 శాతం ఇతరాలు 27.8 శాతం మాదిరి ప్రశ్నలు 1. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ స్థాయిలో ఉప ప్రయోజనాలు (సబ్ బెనిఫిట్స్) 27 కాగా, రాష్ర్టస్థాయిలోఉప ప్రయోజనాల సంఖ్య ఎంత? 1) 11 2) 13 3) 25 4) 50 2. రెండో ప్రణాళికలో అత్యధిక పెట్టుబడి ఏ రంగానిది? 1) వ్యవసాయం, నీటి పారుదల 2) పరిశ్రమలు 3)రవాణా,సమాచారం 4) విద్యుత్ శక్తి 3. రెండో ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం ఏది? 1) వ్యవసాయం, నీటిపారుదల 2) పరిశ్రమలు 3) రవాణా, సమాచారం 4) విద్యుత్ శక్తి 4. విదేశీ సహాయాన్ని అధికంగా వినియోగించుకున్న కేంద్ర ప్రణాళిక ఏది? 1) 1వ 2) 3వ 3) 5వ 4) 9వ 5. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారిలో పొదుపును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన పథకం ఏది? 1) రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన 2) ఆమ్ ఆద్మీ బీమా యోజన 3) స్వావలంబన 4) రాష్ట్రీయ పొదుపు పథకం సమాధానాలు 1) 2; 2) 3; 3) 2; 4) 2; 5) 3. -
లక్ష కోట్లు దాటిన మొదటి ప్రణాళిక ఏది?
ప్రణాళికలు పదో పంచవర్ష ప్రణాళిక పదో పంచవర్ష ప్రణాళికలో సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి, పేదరికం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2002 లో ఆమోదించింది. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.15,25,639 కోట్లు. వీటిలో శక్తి/ ఇంధన రంగానికి 27%, సేవల రంగానికి 26%, రవాణా, సమాచార రంగానికి 23%, వ్యవసాయం, నీటిపారుదలకు 20%, పరిశ్రమలకు 4% కేటాయించారు. 10వ ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం 8%. సాధించింది 7.8%. వృద్ధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ముఖ్యలక్ష్యం మెరుగైన జీవన విధానాన్ని సాధించడం. దీన్ని గుర్తించి పదో పంచవర్ష ప్రణాళికలో 8 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతోపాటు అదనంగా ప్రజా సంక్షేమం పెంపొందించే కొన్ని అంశాలను పొందుపరిచారు. అవి... * జాతీయాదాయ వృద్ధిరేటు లక్ష్యం 8% (సాధించింది 7.8%) * వ్యవసాయ రంగం వృద్ధిరేటు లక్ష్యం 4% (సాధించింది 3.42%) * పారిశ్రామిక రంగం వృద్ధిరేటు లక్ష్యం 8.9% (సాధించింది 8.74%) * సేవల రంగం వృద్ధిరేటు లక్ష్యం 9.4% (సాధించింది) 9.3% * జీడీపీలో పొదుపురేటు వృద్ధి లక్ష్యం26.8% (సాధించింది 23.3%) * జీడీపీలో పెట్టుబడి వృద్ధిరేటు 28.4% (సాధించింది 28.1%) పదో ప్రణాళికలో పైనపేర్కొన్న కీలక అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలకు చాలా దగ్గరగా చేరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథం వైపు మళ్లించడానికి దోహదం చేయగలిగారు. కానీ, వృద్ధి ప్రక్రియలో ఉన్న కఠినత్వం వల్ల దాని ప్రయోజనాలు సమాజంలోని పేద, బలహీన వర్గాలకు అందలేదు. పదో ప్రణాళికలో నిర్దేశించిన మరికొన్ని లక్ష్యాలు * 2007 నాటికి అందరికీ సార్వత్రిక, ప్రాథమిక విద్యను కల్పించడం. * అక్షరాస్యత రేటును 75 శాతానికి పెంచడం. * పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5% పాయింట్లు, 2012 నాటికి 15% పాయింట్లు తగ్గించడం. * 2001-11 దశాబ్దంలో జనాభావృద్ధి రేటు 16.2 శాతానికి తగ్గించడం. * 2007 నాటికి 50 మిలియన్ల (5 కోట్లు) ఉద్యోగావకాశాలు కల్పించడం. * అడవుల విస్తీర్ణం 2007 నాటికి 25 శాతానికి, 2012 నాటికి 33 శాతానికి విస్తరింపజేయడం. * జీడీపీలో పన్ను నిష్పత్తిని 10.3 శాతానికి పెంచడం. * ఏటా సగటున 7.5 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) సమీకరించడం. * సగటు ద్రవ్యోల్బణం రేటు 5 శాతానికి మించకుండా చూడటం. * 2012 నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ రక్షిత తాగునీరు అందించడం. * 2007 నాటికి దేశంలోని నదులు, 2012 నాటికి గుర్తించిన నీటి వనరుల ఆధారాలన్నింటినీ శుద్ధి చేయడం. (కాలుష్యానికి గురైన ముఖ్య నదులన్నింటినీ శుద్ధి చేయడం). పదో ప్రణాళికలో ప్రారంభించినముఖ్యమైన పథకాలు ప్రణాళికా సంఘం సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ గుప్తా 'Indian Vision 2020’°రూపొందించారు. దీన్ని ప్రణాళికా సంఘం 2003 జనవరి 23న విడుదల చేసింది. ఇది 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను గుర్తించింది. Vision - 2020 ముఖ్యాంశాలు: 1. జీడీపీ వార్షిక వృద్ధిరేటు 9% సాధించాలి. 2. 2020 నాటికి నిరుద్యోగిత, పేదరికం, నిరక్షరాస్యతలను నిర్మూలించాలి. 3. 6-14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి. 4. పర్యావరణ సమతౌల్యం సాధించాలి. 5. వార్షిక ఉద్యోగ కల్పనరేటు 2% పెంచు తూ, 2020 నాటికి 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. 6. వ్యవసాయ రంగం ఉపాధి కల్పనను 2020 నాటికి 40 శాతానికి తగ్గించాలి. PURA (Provision of Urban Amenities in Rural Areas): ఏపీజే అబ్దుల్ కలాం నమూనా ఆధారంగా గ్రామాలను పటిష్ట పర్చేందుకు పట్టణాల్లోని సౌకర్యాలను గ్రామాల్లో కల్పించడానికి 2004 ఫిబ్రవరి 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ్క్ఖఖఅ నమూనా 4 రంగాల మధ్య సంధానంతో కూడింది. అవి: 1. భౌతిక అంశాల అనుసంధానం 2. ఆర్థిక అంశాల అనుసంధానం 3. విద్య లేదా పరిజ్ఞాన అనుసంధానం 4. విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రానిక్ అనుసంధానం ఈ నమూనాలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేసి, వాటి చుట్టూ 15 కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో మున్సిపాలిటీ స్థాయి సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టారు. 15 నుంచి 20 గ్రామాలను అనుసంధానం చేసి రోడ్లు నిర్మించడం, ప్రతి 5-7 కి.మీ. వ్యవధిలో ఒక రింగ్ రోడ్, పాఠశాల, ఒక ఉన్నత విద్యాకేంద్రం, ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే అంశాలను తీసుకున్నారు. 2020 నాటికి ‘సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించాలి’ అనేది దీని లక్ష్యం. JNNURM (Jawaharlal Nehru National Urban Renewal Mission): ఇది దేశంలో పట్టణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం. దీన్ని 2005 డిసెంబరు 3న ప్రారంభించారు. దేశంలోని ఎంపిక చేసిన 63 పట్టణాల్లో 2005 నుంచి 2012 లోపు పేదవారికి గృహ వసతి కల్పించడం, వారికి కనీస వసతులు కల్పించి పట్టణ పేదప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టారు. BNY (Bharath Nirman Yojana): గామీణ అవస్థాపన సౌకర్యాలను మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీన్ని 2005 డిసెంబరు 16న ప్రారంభించారు. 6 అంశాలను మెరుగుపర్చడం వల్ల వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. మొదట ఈ కార్యక్రమానికి కాలపరిమితిని 4 ఏళ్లుగా (2005-09) నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో 6 అంశాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం రూ. 1,74,000 కోట్లు కేటాయించారు. ఆరు అంశాలు: 1. సాగునీరు 2. తాగునీరు 3. గ్రామీణ రోడ్లు - రవాణా 4. గృహవసతి 5. గ్రామీణ సమాచారం (టెలిఫోన్) 6.గ్రామీణ విద్యుద్దీకరణ (Rural Electrification) ఈ ఆరు అంశాలను గ్రామీణ ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తారు. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో ప్రణాళికల గురించి దేంట్లో ప్రస్తావించారు? 1) పౌర హక్కులు 2) పౌర విధులు 3) ఆదేశిక సూత్రాలు 4) సమన్వయ సూత్రాలు 2. భారత క్షిపణి పితామహుడు ఎవరు? 1) హోమీ జె. బాబా 2) ఏపీజే అబ్దుల్ కలాం 3) విక్రమ్ సారాబాయ్ 4) బి.వి.రావ్ 3. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు కొద్దిమందికే లభించాయని, వీటిని అన్ని వర్గాలవారికి వర్తించే విధంగా రెండో తరం ఆర్థిక సంస్కరణలు అవసరమని ఎన్నో ప్రణాళికలో పేర్కొన్నారు? 1) 8 2) 9 3) 10 4) 11 4. 1991లోని ఆర్థిక సంస్కరణలు ఏ రంగంలో ప్రవేశపెట్టలేదు? 1) బ్యాంకింగ్ రంగం 2) విదేశీ వర్తకం 3) పన్నుల విధానం 4) శ్రామిక చట్టాలు 5. కిందివాటిలో 8వ ప్రణాళికలో అనుసరించని అంశం ఏది? 1) ఉద్యోగ కల్పన 2) మానవ వనరుల అభివృద్ధి 3) వికేంద్రీకరణ 4) ప్రభుత్వ నియంత్రణ 6. భారత్ నిర్మాణ్ పథకం (2005-09)లో భాగం కాని అవస్థాపనా సౌకర్యం ఏది? 1) గ్రామీణ ఆరోగ్యం 2) గ్రామీణ రోడ్లు 3) గ్రామీణ ఆవాసం 4) నీటి పారుదల 7. భారతదేశంలో తొలిసారిగా 5 శాతం వృద్ధిరేటును మించిన ప్రణాళిక ఏది? 1) 5 2) 6 3) 4 4) 3 8. భారతదేశంలో లక్ష కోట్లు దాటిన మొదటి ప్రణాళిక ఏది? 1) 5 2) 6 3) 4 4) 3 9. కిందివాటిలో 7వ ప్రణాళికలో అనుసరించిన అంశాలేవి? 1) వేతన వస్తు వ్యూహం 2) ఆహారం - ఉపాధి - ఉత్పాదకత 3) రాజీవ్ మోడల్ 4) పైవన్నీ 10. 2003లో ప్రారంభించిన ధరల స్థిరీకరణ నిధిలో భాగం కాని పంట ఏది? 1) కాఫీ 2) రబ్బర్ 3) పత్తి 4) పొగాకు 11. భారతదేశంలో అమలు చేయని ప్రణాళిక విధానం ఏది? 1) ఆర్థిక ప్రణాళిక 2) సూచనాత్మక ప్రణాళిక 3) నిర్దేశాత్మక ప్రణాళిక 4) పైవేవీకావు 12. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు కిందివాటిలో ఏ ప్రణాళికా విధానం అనుసరణీయం? 1) ఆర్థిక ప్రణాళిక 2) సూచనాత్మక ప్రణాళిక 3) నిర్దేశాత్మక ప్రణాళిక 4) మిశ్రమ ప్రణాళిక 13. ఎన్నో ప్రణాళికలో మొదటిసారిగా ప్రభుత్వ పెట్టుబడి కంటే ప్రైవేట్ పెట్టుబడి ఎక్కువగా ఉంది? 1) 5 2) 7 3) 8 4) 11 14. జాతీయ సామాజిక సహాయత కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1) 1985 2) 1995 3) 2005 4) 2012 15. {V>-Ò$× ప్రాంతాల్లో భూమిలేని కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజులు ఉపాధి కల్పించడానికి దేశంలో ప్రారంభించిన మొదటి పథకం ఏది? 1) RLEGP 2) NREGP 3) JRY 4) NRY 16. కిందివాటిలో గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యంఇచ్చిన ప్రణాళిక ఏది? 1)7వ 2) 8వ 3)9వ 4)10వ 17. ‘తెలంగాణా అభివృద్ధి బోర్డు’ను ఎన్నో ప్రణాళికలో ఏర్పాటు చేశారు? 1) 12 2) 11 3) 10 4) 4 18. భారతదేశంలో 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1) 1975 జనవరి 1 2) 1975 ఏప్రిల్ 1 3) 1975 మే 1 4) 1975 జూలై 1 -
తొమ్మిదో ప్రణాళికను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
ప్రణాళికలు ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97) ఏడో పంచవర్ష ప్రణాళిక తర్వాత 1990-92 మధ్య రెండేళ్లపాటు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. ఆ తర్వాత 1992-97 కాలానికి పి.వి. నరసింహారావు ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ద్రవ్యలోటు, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం, కనిష్ఠ స్థాయి పెట్రోలు నిల్వలు, దిగుమతుల చెల్లింపులకు విదేశీ మారక ద్రవ్య సహాయానికి అంతర్జాతీయ సంస్థలు నిరాకరించడం లాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఈ ప్రణాళిక ప్రారంభమైంది. స్థూల అసమతౌల్య పరిస్థితులను చక్కదిద్ది, ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను చైతన్యవంతం చేయడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జాతీయాదాయం వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం, ఉత్పాదక ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఊఈఐ) అత్యవసరమని భావించి, మార్కెట్ల ప్రాతినిధ్యం పెంచడానికి సరళీకృత విధానాలు అమలు చేయాలని నిశ్చయించారు. ‘మానవ వనరుల అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణాభివృద్ధి’ ప్రాధాన్య అంశాలుగా 8వ ప్రణాళికను ప్రారంభించారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దీన్ని సూచనాత్మక ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. 8వ ప్రణాళిక వ్యయం రూ. 4,85,460 కోట్లు. దీంట్లో ఇంధన రంగానికి 27%, సాంఘిక సేవలకు 22%, వ్యవసాయం, నీటిపారుదల రంగానికి 21%, రవాణా రంగానికి 21%, పరిశ్రమలకు 10% కేటాయించారు. రవాణా, ఇంధనం లాంటి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, పబ్లిక్ పెట్టుబడుల ద్వారా సరళీకృత విధానాలు, ప్రైవేటు రంగ పెట్టుబడులు ఉత్పాదక ఉద్యోగితను కల్పిస్తాయని భావించి, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన ద్రవ్య వనరులను సాంఘిక రంగాల అభివృద్ధికి మళ్లించాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 5.6% కాగా, సాధించిన వృద్ధిరేటు 6.7%, తలసరి ఆదాయ వృద్ధిరేటు 4.6%. NRF: సరళీకృత ఆర్థిక విధానాల వల్ల నష్టపోయిన వ్యక్తులకు, సంస్థలకు సహాయం చేయడానికి 1992 ఫిబ్రవరిలో ూ్చ్టజీౌ్చ ఖ్ఛ్ఛఠ్చీ ఊఠఛీ (ూఖఊ)ను ఏర్పాటు చేశారు. నిధుల కొరత కారణంగా దీన్ని 2000లో రద్దు చేశారు. ITRA:గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారి ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి ఆధునిక పనిముట్లను పంపిణీ చేసే కార్యక్రమం ఠఞఞడ ౌజ ఐఝఞటౌఠ్ఛిఛీ ఖీౌౌజుజ్టీట ౌ్ట ఖఠట్చ అట్టజీట్చటను 1992లో ప్రారంభించారు. మొదట దీన్ని ఐఖఈ్కలో అంతర్భాగంగా అమలు చేశారు. 1999లో ఐఖీఖఅను ఎ్గలో విలీనం చేశారు. ఉఅ: 1972-73లో మహారాష్ట్ర ప్రభు త్వం దేశంలోనే మొదటిసారిగా Emplo-yment Guarantee Scheme of Maharashtraపథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం అమలు చేయడానికి 1993లో Employ-ment Assurance Scheme (EAS)ను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతంవారికి వంద రోజులు ఉపాధి కల్పించే కార్యక్రమం ఇది. దీన్ని‘జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ’ (డీఆర్డీఏ) అమలు చేస్తుంది. ఉఅ ను జవహర్ గ్రామీణ సంవృద్ధి యో జన (JGSY–1999)తో కలిపి 2002 సెప్టెంబరు 25న సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన(SGRY)ను ప్రారంభించారు. Prime Minister's Rozgar Yojana (PMRY):దీన్ని 1993 అక్టోబరు 2న ప్రారంభించారు. మొదట పట్టణ ప్రాంతాల్లో అమలు చేశారు. 1994 ఏప్రిల్ 1 నుంచి దేశమంతటికి విస్తరించారు. దీని ద్వారా 18ృ35 మధ్య వయసు ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఇద్దరి కంటే ఎక్కువ సభ్యులు కలిిసి ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రూ. 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలపై సబ్సిడీ 15 శాతం వరకు లేదా గరిష్ఠంగా రూ. 15,000 వరకు ఉంటుంది. లబ్దిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు 22.5%, ఇతర వెనుకబడిన తరగతుల వారికి 27% వరకు రిజర్వేషన్ కల్పిస్తారు. PMRY¯]lు 2008 ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్‌స ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP)లో విలీనం చేశారు. మహిళా సంవృద్ధి యోజన (MSY):గ్రామీణ మహిళల్లో పొదుపు ప్రవృత్తి పెంచడానికి, వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్రం నిధులతో 1993 అక్టోబరు2న ఈ పథకం ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలు తమ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీసుల్లో రోజుకు కనీసం ఒక్క రూపాయికి తగ్గకుండా పొదుపు చేసి, ఆ సొమ్ము మొత్తాన్ని ఏడాది వరకు నిల్వ ఉంచితే కేంద్ర ప్రభుత్వం 25 శాతం బోనస్ ఇస్తుంది. అంటే గరిష్ఠంగా సంవత్సరానికి రూ. 300 వరకు ఇస్తుంది. దీన్ని 2001 జూలై 12న మహిళా స్వయం సిద్ధ యోజన (MSSY)లో విలీనం చేశారు. MPLAD: మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్‌ను 1993 డిసెంబరు 23న ప్రారంభించారు. పార్లమెంట్ సభ్యులకు వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలను ఇస్తుంది. లోక్‌సభ ఎంపీ ఈ మొత్తాన్ని తన నియోజకవర్గానికి, రాజ్యసభ ఎంపీ తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి ఖర్చు చేయాలి. ఎంపీ రూ.10 లక్షల లోపు పనులను సిఫారసు చేస్తే, ఆ నిధులను కలెక్టర్ ద్వారా మంజూ రు చేస్తారు. ఈ మొత్తాన్ని 1998లో రెండు కోట్లకు పెంచారు. 2011లో 2 కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలకు పెంచారు. GKY: గంగా కల్యాణ్ యోజన పథకాన్ని 1997 ఫిబ్రవరి 1న దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు. సన్నకారు, చిన్నకారు రైతులకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించేందుకు సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించే కార్యక్రమమిది. రైతులకు ఒక హెక్టార్‌కు రూ.5000 వరకు అందజేస్తారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 80:20 వంతున భరిస్తాయి. ఈ పథకాన్ని 1999 ఏప్రిల్ 1న ఎ్గలో విలీనం చేశారు. NSAP (National Social Assista-nce Programme): ఆదేశిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని దేశంలోని పేద ప్రజలకు అవసరమయ్యే సామాజిక అవసరాలు తీర్చడానికి 1995లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇది సామాజిక అభివృద్ధికి ఉద్దేశించింది. ూఅ్కలో భాగంగా 3 పథకాలను అమలు చేస్తున్నారు. అవి.. 1. IGNOAPS (Indira Gandhi National Old Age Pension Scheme)ృపేదలకు పెన్షన్ సౌకర్యం. 2. NFBS (National Family Benefit Scheme) –Mుటుంబ ఆధారమైన వ్యక్తి మరణిస్తే రూ. 10,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. 3. NMBS – National Maternity Benefit Scheme 9వ పంచవర్ష ప్రణాళిక (1-9-9-7--2-0-0-2) యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9వ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ‘సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి’. జన నాణ్యత, ఉత్పాదకత, ఉద్యోగిత, ప్రాంతీయ సమానాభివృద్ధి, స్వావలంబన ప్రధాన అంశాలుగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకు వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక కృషి జరపాలని నిర్ణయించారు. ఈ సమస్యలను 15 ఏళ్లలో రూపుమాపగలమని భావించారు. ప్రభుత్వ రంగం పెట్టుబడులు రూ. 8,59,200 కోట్లు కాగా, వాస్తవంగా ఖర్చయిన మొత్తం రూ. 9,41,047 కోట్లు. దీంట్లో రవాణా, సమాచార రంగాలకు 25%, ఇంధనం 23.3%, వ్యవసాయం, నీటిపారుదలకు 21.4%, సాంఘిక సేవలకు 21 %, పరిశ్రమలకు 8% కేటాయించారు. ఈ ప్రణాళికలో మొదటగా 7% వృద్ధి రేటును నిర్ణయించి, తర్వాత 6.5%కి తగ్గించారు. సాధించిన వృద్ధిరేటు 5.4 %. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.6 % ఉంది. SJSRY:భారతదేశం స్వాతంత్య్రం సాధించిన గోల్డెన్ జుబ్లీ ఇయర్ (50వ సంవత్సరం)ను పురస్కరించుకొని స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన (SJSRY)కార్యక్రమాన్ని 1997 డిసెంబరు 1న ప్రారంభించారు. ఇది పట్టణ ప్రాంత పేదవారికి, నిరుద్యోగులకు, అల్ప ఉద్యోగులకు స్వయం ఉపాధి, వేతన ఉపాధి కల్పించే కార్యక్రమం. దీనికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25లో భరిస్తాయి. ఈ పథకం దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది. SJSRYపథకంలో 3 పట్టణ ప్రాంత పథకాలను విలీనం చేశారు. 1) NRY (Nehru Rojgar Yojana) - 1989. 2) UBSP (Urban Basic Service for the Poor) - 1990-91 3) PMIUPEP – Prime Minister's Integrated Urban Poverty Eradication Programme – 1995 SJSRYMìS అనుబంధంగా 3 ఉప పథ కాలు అమలు చేస్తున్నారు. అవి... 1) USEP– Urban Self – Employment Programme 2) UWEP – Urban Wage – Employment Programme 3) DWCUA – Development of Women & Children in Urban Areas n BSBKY (Bagya Shree Balika Kalyan Yojana):తల్లిదండ్రులు మరణించిన బాలికలకు ఆర్థిక సహాయం చేసి, వారి పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమమిది. దీన్ని 1998 అక్టోబరు 19న ప్రారంభించారు. RRMKY (Raja Rajeswari Mahila Kalyan Yojana): భర్త మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం కల్పించే కార్యక్రమం. స్త్రీలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. దీన్ని 1998 అక్టోబరు 19న ప్రారంభించారు. SGSY:దేశంలో అమలవుతున్న వివిధ స్వయం ఉపాధి పథకాలను విలీనం చేసి ఏర్పాటు చేసిన ఏకైక కార్యక్రమం స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎ్గ). దీన్ని 1999 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఇందులో ఆరు పథకాలను విలీనం చేశారు. అవి.. 1) IRDP (1978) 2) TRYSEM (1979) 3) DWCRA (1982) 4) MWS (1988-89) 5) SITRA (1992) 6) GKY (1997-98) ఈ పథకం ద్వారా లబ్దిదారులకు 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ కలిగిన రుణాలను బ్యాంకుల ద్వారా అంద చేస్తారు. ఈ పథకానికి కావాల్సిన నిధు లను 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అందజేస్తాయి. లబ్దిదారుల ఎంపికలో 50% ఎస్సీ, ఎస్టీలకు; 40% మహిళలకు; 3% వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. Annapurna Yojana-మార్చి 1999: పెన్షన్ అందుబాటు లేని వృద్ధులకు నెలకు 10 కిలోల ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం. AAY:అంత్యోదయ అన్న యోజన పేదవారికి ఆహార భద్రత కల్పించే పథకం. దీన్ని 2000 డిసెంబరు 25న ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారికి మూడు రూపాయలకు కిలో బియ్యం లేదా రెండు రూపాయలకు కిలో గోధుమలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తారు. 2002 ఏప్రిల్ 1 నుంచి దీంట్లో భాగంగా అందజేసే ఆహారధాన్యాలను 25 కిలోల నుంచి 35 కిలోలకు పెంచారు. PMGY (Prime Minister Gramodaya Yojana):ఇది గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సౌకర్యాలు కల్పించే కార్యక్రమం. దీన్ని 2000-01లో ప్రారంభించారు. ఇది గ్రామీణాభివృద్ధిలో భాగమైన ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, గృహ వసతి, ప్రాథమిక విద్య, గ్రామీణ రోడ్లు మొదలైన 5 అంశాలను అభివృద్ధి చేసే కేంద్ర ప్రభుత్వ పథకం. PMGSY (Prime Minister Gram Sadak Yojana):ఇది గ్రామీణ ప్రాంతాలకు పక్కా రోడ్లు నిర్మించే కార్యక్రమం. దీన్ని 2000 డిసెంబరు 25న ప్రారంభించారు. సాధారణంగా 500 మందికి మించిన జనాభా ఉన్న అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువగా జనాభా ఉన్న గ్రామాలకు కూడా రోడ్లను అనుసంధానం చేయడానికి కేంద్రం నిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. GRY (Sampoorna Grameena Rojgar Yojana): దీన్ని 2001 సెప్టెంబరు 25న ప్రారంభించారు. అప్పటికే అమలవుతున్న ఉఝఞౌడఝ్ఛ్ట ఛిజ్ఛిఝ్ఛ (ఉఅ), ఒ్చఠ్చీజ్చిట ఎట్చఝ ్చఝటజీఛీజిజీ ౌ్గ్జ్చ్చ (ఒఎ్గ) లను కలిపి ఎఖ్గని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెండు ముఖ్యాంశాలున్నాయి. 1) అదనపు వేతన ఉపాధి కల్పించడం, 2) ఆహార భద్రత కల్పించడం. వీటికి కావాల్సిన నిధులను 75:25 నిష్పత్తిలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు భరిస్తాయి. ఎఖ్గని 2006 ఫిబ్రవరి 2 నుంచిNational Rural Employment Guarantee Schemeలో భాగంగా అమలు చేస్తున్నారు. VAMBAY (Valmiki Ambedkar Awas Yojana):పట్టణ ప్రాంత స్లమ్ ఏరియాల్లో నివసించే పేదవారికి గృహాలు, సామూహిక మరుగుదొడ్లు నిర్మించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 2001 డిసెంబరులో ప్రారంభించారు. దీన్ని ‘నిర్మల్ భారత్ అభియాన్’లో భాగంగా అమలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కల్పించటం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. Shiksha Sahayog Yogana (SSY): దీన్ని 2001 డిసెంబరు 1న ప్రారంభించారు. పేదరిక రేఖ దిగువన నివసిస్తున్న పిల్లలకు విద్యావకాశాలు కల్పించే నిమిత్తం స్కాలర్షిప్లు అందించే కార్యక్రమం. ‘జనశ్రీ బీమా యోజన’ పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్ల పాటు స్కాలర్షిప్లు అందజేస్తారు. -
ప్రణాళికల దృష్టిలో స్వర్ణయుగంగా పేర్కొన్న కాలం?
Civils Prelims పణాళికలు- నిరంతర ప్రణాళికలు (1978-80) * నిరంతర ప్రణాళిక భానవను తొలిసారిగా జనతాపార్టీ ప్రవేశ పెట్టింది. ఈ భావనను స్వీడన్ ఆర్థికవేత్త అయిన Gunnar Myr-dal తన 'Asian Drama’ అనే గ్రంథం లో పేర్కొన్నారు. ఈ ప్రణాళికలు జపాన్, మెక్సికో, పోలాండ్‌లో విజయవంతమ య్యాయి. ఈ ప్రణాళికను భారతదేశంలో ప్రొఫెసర్ లకడావాలా రూపొందించారు. * నిరంతర ప్రణాళికలు ఎప్పుడు చూసినా ఐదేళ్లు ఉంటాయి. అయితే ఏటా గడిచిన ఏడాదిని తొలగించి, రాబోయే మరో సంవత్సరాన్ని కలుపుతూ ఉంటారు. అంటే ఈ ప్రణాళికలలో ఏటా కేటాయింపులు, లక్ష్యాలు మారుతూ ఉంటాయి. * నిరంతర ప్రణాళిక కాలంలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. శ్రమసాంద్రత ఉత్పత్తుల ఎంపిక వల్ల ఉద్యోగ కల్పనను పెం చారు. భారతదేశానికి అవసరమైన విధానాన్ని ఎంచుకోవడం వల్ల అత్యధిక ఫలితాలు సాధించారు. అందువల్ల ఈ కాలా న్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణ సాధించడానికి ప్రతి జిల్లాకు ఒక DIC (District Industrial Centre)ను ఏర్పాటు చేశారు. * సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని (IRDP –Integrated Rural Develo- pment Programme)ను తొలిసారి 1978లో 2300 బ్లాక్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దీన్ని 1980 అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులు భరిస్తాయి. 1999, ఏప్రిల్ 1 నుంచి ఐఆర్డీపీని SGSY (Swarna Jayanthi Grameena Swarozgar Yojana)లో విలీనం చేశారు. * దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గ్రామీణుల్లో 18ృ35 ఏళ్ల మధ్య వారికి స్వయం ఉపాధి కల్పించడానికి 1979లో TRYSEM (Training for Rural Youth for Self Employment)ను ప్రారంభించారు. ఈ పథకాన్ని 1999, ఏప్రిల్ 1 నుంచి ఎ్గలో విలీనం చేశారు. 6వ పంచవర్ష ప్రణాళిక (1980-85) * దీన్ని రెండుసార్లు ప్రవేశపెట్టారు.1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1978–83 కాలానికి నిరంతర ప్రణాళిక (Rolling Plan)ను ప్రవేశపెట్టింది. తర్వాత 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర ప్ర ణాళికలను రద్దు చేసి 1980ృ85 కాలానికి ఒక ప్రణాళికను తయారు చేసింది. ఈ ప్ర ణాళికనే అమలు చేశారు. ప్రొఫెసర్ లకడావాలా ఈ ప్రణాళికను రూపొందించారు. * ఈ ప్రణాళికలో ‘లాభదాయక ఉపాధి విస్తరణ అవకాశాలు తద్వారా పేదరిక నిర్మూలన, సాంకేతిక స్వావలంబన’ లక్ష్యాలుగా తీసుకున్నారు. మొదటిసారిగా శక్తి/ఇంధ నం (Energy) అనే రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఈ ప్రణాళికను ‘సమగ్ర ప్రణాళిక’ (Comprehensive) అంటారు. ఈ ప్రణాళికలో యాంత్రీకరణ ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చింది. * 6వ ప్రణాళిక వ్యయం రూ.1,10,967 కోట్లు. తొలిసారి లక్ష కోట్లు దాటిన ప్రణాళిక ఇదే. ఈ ప్రణాళికలో శక్తికి/ ఇంధనానికి అత్యధికంగా 28% కేటాయించారు. తర్వాత వ్యవసాయం, నీటిపారుదల రం గాలకు 24 శాతం ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5.2% కాగా, సాధించింది 5.7%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.2%గా నమోదయింది.. ఈ ప్రణాళిక కాలంలో మూడు ఇనుము - ఉక్కు కర్మాగారాలు స్థాపించారు. 1. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం 2. తమిళనాడులోని సేలం 3. కర్ణాటకలోని విజయనగర్ * 1980, ఏప్రిల్ 15న రూ. 200 కోట్ల మూలధనం మించిన 6 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేశారు. 1982, జూలై 12న శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ూఅఆఅఖఈ (National Bank for Agriculture and Rural Devel- opment)ను ఏర్పాటు చేశారు. ఎగుమతి, దిగుమతి దారులకు రుణం అందచేయడానికి 1982లో EXIM (Export– Import) ఆ్చజు స్థాపించారు. * Food for Work Scheme (FWS)ను 1980లో NREPV> మార్చారు. ఇది గ్రామీణ పేదవారికి వేతన ఉద్యోగితను కల్పించే కార్యక్రమం. ‘జాతీయ గ్రామీణ ఉపాధి పథకం' NREP (National Rural Employment Programme). ఈ పథకంలో సగం వేతనం ఆహార రూ పంలో, సగం వేతనం నగదు రూపంలో చె ల్లించారు. NREP° 1989లో JRY (Ja-wahar Rojgar Yojana)గా మార్చారు. * DWCRA (Development of Women and Children in Rural Areas): గ్రామీణ మహిళలు, శిశువుల జీవనంలో గుణాత్మక మార్పును తీసుకురావడానికి 1982లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీలకు శిక్షణను ఇవ్వటం ద్వారా స్వయం ఉపాధిని కల్పించటం ఈ కార్యక్రమం లక్ష్యం. డ్వాక్రాను IRDP (Integrated Rural Development Programme)లో అంతర్భాగంగా ప్రా రంభించారు. ఈ పథకాన్ని 1999, ఏప్రిల్ 1 నుంచి ఎ్గలో విలీనం చేశారు. * RLEGP (Rural Landless Empl-oyment Guarantee Progra-mme): గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని కుటుంబంలోని ఒక వ్యక్తికి ఏడాదిలో 100 రోజులపాటు పని కల్పించే ఉద్దేశంతో 1985 ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి నిధులను పూర్తిగా కేంద్రం సమకూరుస్తుంది. RLEGP° NREP (National Rural Empl-oyment Programme)తో కలిపి 1989లో JRY (Jawahar Rojgar Yojana)ను ప్రారంభించారు. 7వ పంచవర్ష ప్రణాళిక (1985-90) * 1985ృ90 కాలానికి ప్రవేశపెట్టిన ఏడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతలు తొలగించటం. ఆహారం, ఉద్యోగిత, ఉత్పాదకత ప్రధాన అంశాలుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి పారిశ్రామిక రంగంలో ఆధునికీకరణ, శ్రామిక యాజమాన్య సంబంధాలు మెరుగుపర్చడానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఉపాధి విస్తరణకు ఇంతకుముందు ప్రణాళికల్లో చేపట్టిన శ్రమసాంద్రత పద్ధతులను ఉపయోగించి సాంద్ర వ్యవసాయం, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ పథకాలను కొనసాగించారు. * ఈ ప్రణాళిక ‘వకీల్ - బ్రహ్మానందంల వేతన వస్తువుల వ్యూహం’ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళిక పాక్షిక సరళీకరణ విధానాన్ని అవలంబించింది. దీనిలో ప్రైవేట్ , శాస్త్ర సాంకేతిక, సమా చార, ఐటీ, సంఘటిత రంగాల ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఈ ప్రణాళిక ‘రాజీవ్ మోడల్ ప్లాన్’, ‘ఉద్యోగ కల్పన ప్రణాళిక’, ‘శక్తి ప్రణాళిక’గా పేర్కొన్నారు. * ఈ ప్రణాళిక వ్యయం రూ.2,18,730 కోట్లు. ఇందులో ఇంధన రంగానికి 28%, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు 22%, రవాణా, సమాచారానికి 19%, సాంఘిక సేవలకు 18%, పరిశ్రమలకు 13% ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో 5% వృద్ధి రేటును ఆశించగా, 6% సాధించారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.7%. * 7వ ప్రణాళిక కాలంలో ఎస్సీ, ఎస్టీ, వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారికి, వితంతువులకు, పేదవారికి గృహవసతి కల్పించేందుకు 1985ృ86లో ఇందిరా ఆవాస్ యోజన (Indira Awas Yojana– IAY) కార్యక్రమాన్ని ప్రారంభించారు. * 1986లో National Policy on Education (NPE) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం విద్య కోసం జీడీపీలో 6% కేటాయించారు. * ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తూ, సాంకేతిక సహాయం అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడానికి గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇఅ్కఅఖఖీ (Council for Advancement of People's Action and Rural Techn- ology)ను 1986 సెప్టెంబరు 1న ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు. * 1986లోనే CRSP (Central Rural Sanitation Programme) ను ప్రారంభించారు. ఇది గ్రామీణ పారిశుధ్యానికి ఉపయోగపడే కార్యక్రమం. * పరిశ్రమల ఖాయిలాకు సంబంధించి 1985లో ఒక చట్టాన్ని చేశారు. దీనిపేరు SICA (Sick Industries Compan- ies Act) ఈ చట్టాన్ని అమలు పర్చేందుకు 1987లో BIFR (Board for Industrial Financial Reconstru- ction) ఏర్పాటు చేశారు. అతిచిన్న / లఘు/ సూక్ష్మ సంస్థలకు రుణ సహాయం చేసేందుకు 1987లో National Equity Fund (NEF)ను ప్రారంభించారు. * 1987లోనే ఖీటజీఛ్చ Co-Operative Marketing Development Fed-eration (TRIFED) ఏర్పాటు చేశారు. ఇది గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి జాతీయ స్థాయిలో సహాయపడుతుంది. * వయోజన విద్యా వ్యాప్తి కోసం జాతీయ స్థాయిలో 1988లో National Literacy Mission (NLM) ప్రారంభించారు. 1988లో Securities and Excha- nge Board of India (SEBI)ని ఏర్పా టు చేశారు. ఇది ్ఛఛిఠటజ్టీడ క్చటజ్ఛ్టులను నియంత్రిస్తుంది. * Million Wells Scheme(1988): గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు, సన్నకారు, ఉపాంత, చిన్నకారు రైతులకు, వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారికి సాగునీరు కల్పించడానికి (కగి) 10లక్షల బావులను ఉచితంగా తవ్వి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 1999లో Swarnajayanthi Gram Swarozgar Yojana (SGSY)లో విలీనం చేశారు. * Jawahar Rojgar Yojana (JRY 1989): ఇది గ్రామీణ ఉపాధి పథకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారు. తద్వారా వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి, సామాజిక ఆస్తుల నిర్మాణానికి తోడ్పడతారు. ఈ పథకం కింద నిధులు నేరుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు అందిస్తారు. ఈ పథకంలో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించాలి. JRY ° 1999లో Jawahar Grama Samruddi Yojana (JGSY)గా మార్చారు. తిరిగి 2001లో JGSY¯]l$, Employement Assurance Scheme (EAS) లో కలిపి Sampoorna Grameena Rojgar Yojana (SGRY)ని ప్రారంభించారు. * Nehru Rojgar Yojana (NRY - 1989) : పట్టణ ప్రాంత పేదలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు NR Yని 1989లో ప్రారంభించారు. దీన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. NRYని 1997, డిసెంబరు1న Swarna Jayanthi Sahari Rojagar Yojana (SJSRY)గా మార్చారు. వార్షిక ప్రణాళికలు (1990-1992) * పపంచ రాజకీయ పరిణామాలు, అంతర్గత రాజకీయ అనిశ్చితి కారణంగా 1990లో ప్రారంభం కావాల్సిన 8వ పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కాబట్టి 1990ృ92లో వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. అంతేగానీ ఇది అధికారిక ప్రణాళికల సెలవు కాదు. * ఈ వార్షిక ప్రణాళికా కాలంలో చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందించడానికి mall Industries Develop- ment Bank of India (SIDBI)ని 1990లో లక్నోలో ఏర్పాటు చేశారు. * సురక్షిత తాగునీటి సౌకర్యం కోసం Rajiv Gandi National Drinking Water Mission (RGNDWM)ని 1991లో ప్రారంభించారు. పట్టణ ప్రాంతం వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి Urb- an Basic Services Programme (U BSP)ను 199091లో ప్రారంభించారు. -
పేదరికపు ప్రణాళిక అని దేన్ని అంటారు?
పంచవర్ష ప్రణాళికలు రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) రెండో ప్రణాళికను ‘మహలనోబిస్ భారీ పరిశ్రమల వ్యూహం’ (మహలనోబిస్ నాలుగు రంగాల నమూనా) ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక వ్యయం రూ.4,672 కోట్లు. దీని లో 27 శాతం రవాణా, 4 శాతం సమాచారానికి వ్యయం చేశారు. అందువల్ల దీన్ని ‘రవాణా, పరిశ్రమల ప్రణాళిక’ అంటారు. దీన్నే ‘నెహ్రూ -మహలనోబిస్ ప్రణాళిక’ అని, ‘ధైర్యంతో కూడిన ప్రణాళిక’ (ఆౌఛీ ్క్చ) అని అంటారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 4.5 శాతం కాగా, సాధించిన వృద్ధిరేటు 4.2 శాతం. తలసరి ఆదాయ వృద్ధిరేటు 1.9 శాతం. ఈ ప్రణాళికపై Industrial Develo-pment and Regulation Act– 1951, సమసమాజ స్థాపన, 1956 పారిశ్రామిక తీర్మానం ప్రభావం పడింది. వీటివల్ల ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ రంగం ఆధీనంలో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మూడు భారీ ఇనుము ఉక్కు పరిశ్రమలను స్థాపించారు. అవి... 1. పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశాలో ‘రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం’ 2. యూఎస్ఎస్ఆర్ సహకారంతో మధ్యప్రదేశ్ (ప్రస్తుతం-ఛత్తీస్‌గఢ్)లో భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. 3. యూకే సహకారంతో పశ్చిమ బెంగాల్లో ‘దుర్గాపూర్’ ఇనుము ఉక్కు కర్మాగారం. ఈ ప్రణాళికా కాలంలోనే నైవేలిలో 'Lign-ite Corporation; పెరంబుదూర్‌లో Railway Coach Factory; రాంచీలో భారీ ఇంజనీరింగ్ పరికాల సంస్థ; 1957 లో Automic Energy Commision, Tata Institute of Fundamental Research ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా కాలంలోనే 1956లో P.L. – 480 ఒప్పందం కింద అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. 1957 - 58, 1959 - 60 కాలాల్లో అనావృష్టి సంభవించి ధరలు 30 శాతం వరకు పెరిగాయి. కానీ సంస్థాగత పటిష్టత సాధించి ఆర్థిక వ్యవస్థను ప్లవన దశకు చేర్చిన రెండో ప్రణాళిక భావి పంచవర్ష ప్రణాళికలకు ఆధారమైంది. మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66) రెండో ప్రణాళికలో ఏర్పడ్డ ఒడిదుడుకుల ను దృష్టిలో ఉంచుకుని స్వయం సమృద్ధి, స్వావలంబన లక్ష్యాలుగా ఈ ప్రణాళికను అమలు చేశారు. రూ. 8577 కోట్ల వ్యయం తో ‘సంతులన ప్రణాళిక’గా రూపొందించిన మూడో ప్రణాళికలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికను హరాడ్-డోమార్ అభివృద్ధి వ్యూహం నమూనా ఆధారంగా అశోక్ మోహతా రూపొందించారు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు లక్ష్యం 5.6% కాగా, సాధించింది 2.8%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 0.2%. అంటే ఈ ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. ఈ కాలంలో 1962 లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం, అనావృష్టి కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి సమస్య లు ఏర్పడ్డాయి. ఈ కాలంలో ధరలు 36.4% పెరిగాయి. అందువల్ల ఈ ప్రణాళికను విఫలమైన ప్రణాళిక, జబ్బుపడిన ప్రణాళిక,Washout Plan అంటారు. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ. 8577 కోట్లు కాగా, అత్యధికంగా రవాణా, సమాచార రంగాల మీద 24.6% వ్యయం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల మీద 20.5% ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రత్యేకంగా ‘దీర్ఘదర్శి ప్రణాళిక’ (్క్ఛటటఞ్ఛఛ్టిజీఠ్ఛి ్క్చ) ను ఆమోదించారు. అందువల్ల ఈ ప్రణాళిక పూర్తిగా అపజయాన్ని పొందినప్పటికీ పారిశ్రామిక రంగంలో 9% వృద్ధిరేటు సాధించింది. 1964లో యూఎస్ఎస్ఆర్ సహకారంతో బీహార్‌లో Bokaro Iron & Steel Company స్థాపించారు. వార్షిక ప్రణాళికలు (1966-69) 4వ, ప్రణాళిక ప్రారంభించడానికి తగిన వాతావరణం లేకపోవడంతో 1966ృ69 మధ్య మూడేళ్లపాటు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలాన్ని ‘ప్రణాళిక విరామం’ (Plan Holiday) ‘ప్రణాళిక సెలవు కాలం’ అంటారు. 3వ ప్రణాళిక విఫలం, నిధుల కొరత, ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగా వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. వ్యవసాయ రంగానికి 23% పెట్టుబడులు కేటాయించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 1966 ఖరీఫ్ సీజన్లో ‘నూతన వ్యవసాయ వ్యూహం’ (New Agriculture Strategy – NAS) పేరుతో ’ఎట్ఛ్ఛ ఖ్ఛఠిౌఠ్టజీౌ’ (హరిత విప్లవం/ సస్య విప్లవం) ప్రారంభించారు. వార్షిక ప్రణాళిక కాలం (1966–67)లో ‘హరిత విప్లవం’ ప్రారంభించారు. ఈ మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థ కొంతవరకు పునర్నిర్మాణం చెంది 4వ ప్రణాళిక ప్రారంభానికి పరిస్థితులు చక్కబడ్డాయి. 4వ పంచవర్ష ప్రణాళిక (1969-74) ఆర్థిక స్థిరత్వం లేదా స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించటం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. దీన్ని డి.ఆర్. గాడ్గిల్ రూపొందించారు. ఇది మహలనోబిస్ నమూనాకు భిన్నంగా భారీ పరిశ్రమల స్థానంలో మధ్యతరహా- చిన్నతరహా పరిశ్రమలు, వేగంగా ఫలితాలనిచ్చే ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఈ ప్రణాళిక వ్యయం రూ. 15779 కోట్లు. ఇందులో వ్యవసాయం, నీటిపారుదలకు గరిష్టంగా 24%, పరిశ్రమలకు 23% ఖర్చు చేశారు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు 5.7% కాగా, సాధించింది 3.5%. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.1%. ఈ ప్రణాళిక కాలంలోనే ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించారు. PL – 480 కింద దిగుమతి చేసుకుంటున్న ఆహార ధాన్యాల దిగుమతి తగ్గించటం, విదేశీ సహాయాన్ని తగ్గించటానికి ఎగుమతులు పెంచడంతో పాటు ప్రాంతీయ అసమానతలు తగ్గించటానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతికూల వాతావరణం, విద్యుచ్ఛక్తి కొరత, పారిశ్రామిక అశాంతి, రవాణా ఇబ్బందుల వల్ల అన్ని రంగాల్లో సాధించిన ఉత్పత్తి, లక్ష్యం కంటే తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ విమోచన, కాందిశీకుల భారం లాంటి సమస్యలతో 4వ ప్రణాళిక అంతగా విజయవంతం కాలేదు. ఈ ప్రణాళిక కాలంలో గ్రామీణ బలహీన వర్గాలకు సహాయం చేయటానికి 1972ృ73లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ (ఈజీఎస్). దీన్నే 1993లో Employment Assurance Scheme (EA)గా మార్చారు. దీన్నే 2005లో National Rural Employment Guarantee Act (NREGA) చేసి, 2006 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ూఖఉఎ్కని 2009, అక్టోబరు 2 నుంచి Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme గా పేరు మార్చారు. తాగునీరు కల్పించడానికి 1972ృ73లో ARWSP (Accelerated Rural Water Supply Programme) ను ప్రారంభించారు. కరువు పీడిత ప్రాం తాల్లో భూగర్భ జలాల అభివృద్ధి కోసం ఈ్కఅ్క (Drought Prone Area Programme)ను 1973లో ప్రారంభిం చారు. డీపీఏపీ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 50:50 నిధులు కేటాయిస్తా యి. సన్నకారు రైతులకు సాంకేతిక, విత్త పర సహాయం అందించటానికి 1973ృ 74లో MFALA (Marginal Farmers and Agricultural Labours Age-ncy)ను ప్రారంభించారు. చిన్నకారు రైతులకు సాంకేతిక, విత్తపర సహాయం అందించటానికి 1974–75లో SFDA (mall Farmers Development Agency)ను ప్రారంభించారు. మెట్టప్రాం తాల అభివృద్ధి, నీటిపారుదల వినియోగం కోసం 1975లో CADP (Command Area Development Programme) ను ప్రారంభించారు. 1974లో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు. 5వ పంచవర్ష ప్రణాళిక (1974-79) పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన ప్రాధాన్యంగా ఈ ప్రణాళికను ఏర్పాటు చేశారు. దీన్ని డీ.పీ.ధార్ రూపొందించా రు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటును మొదట 5.5%గా నిర్ణయించి, తర్వాత 4.4 శాతానికి తగ్గించారు. కానీ వాస్తవంగా సాధించిన వృద్ధిరేటు 4.8%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 2.7%. ఈ ప్రణాళిక వ్యయం రూ. 39,426 కోట్లు. పరిశ్రమలు, సమాచార రంగాలకు అధికంగా 26% ఖర్చు చేశారు. ఆ తర్వాత వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు 22% ఖర్చు చేశారు. వ్యవసాయ రంగంలో నిరుద్యోగిత, అను ద్యోగిత పేదరికానికి కారణంగా గుర్తించారు. ఆర్థిక వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నంత మాత్రాన పేదరిక నిర్మూలన జరగదని భావించారు. ఈ ప్రణాళికలో సాంఘిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. {పాధాన్యం దృష్ట్యా ఈ ప్రణాళికను ‘పేదరికపు ప్రణాళిక’ అంటారు. పేదరిక నిర్మూలన కోసం 1975, జూలై 1న 20 అంశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదరికాన్ని నిర్మూలించడానికి గ్రామీణ ప్రజల ఆదాయస్థాయిని పెంచుతూనే గ్రామాల కనీస అవసరాలైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, శానిటేషన్ మొదలైన వాటిని కల్పించడానికి 1975లో ‘కనీస అవసరాల పథకం’ (Minimum Needs Programme – MNP)ను ప్రారంభించారు. 1975-76లో ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’ (Intigrated Child Develo- pment Scheme - ICDS)ను ప్రారంభించారు. ఈ పథకం గర్భిణులు,6 సంవత్సరాల లోపు శిశువులు, పాలిచ్చే తల్లులకు వర్తిస్తుంది. 1977–78లో Food for Work Pro-gramme (పనికి ఆహార పథకం) రాజ స్థాన్లో ప్రారంభించారు. గ్రామీణ పేదరికాన్ని రూపుమాపడం, ఆహార భద్రత, వేతనంతో కూడిన ఉపాధిని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు పని కల్పించి వేతనాన్ని పదార్థాల రూపంలో అందజేస్తారు. ఈ పథకాన్ని 1980లో NREP (National Rural Empl-oyment Programme) గా మార్చారు. ఈ కార్యక్రమాన్ని 2004లో NFWP (National Food for Work Programme) పేరు తో అమలు చేశారు. దీన్ని 2006, ఫిబ్రవరి 2 నుంచి ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (NREG)లో విలీనం చేశారు. ‘ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం’ (Desert Development Progra- mme – DDP) 1977–78లో 7 రాష్ట్రాలలోని 36 జిల్లాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్ జిల్లా ఎంపికైంది. ప్రాంతాల్లో అతి పేదవారి కోసం 1977లో ‘అంత్యోదయ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా రాజస్థాన్‌లో ప్రారంభించి తర్వాత ఏపీలో అనంతరం దేశం అంతటా విస్తరించారు. ఈ ప్రణాళికలో సమ్మెను చట్ట విరుద్ధం చేసి పని గంటలు పెంచారు. ఉత్పత్తి పెరిగింది. ఆహార ధాన్యాల నిల్వలు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. అనుకూల చెల్లింపుల శేషం ఏర్పడింది. జనతాపార్టీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను అమలు చేయటంవల్ల 5వ ప్రణాళిక ఏడాది ముందుగానే(1978లోనే) ముగిసింది. -
ప్రణాళికల పితామహుడు ఎవరు?
పంచవర్ష ప్రణాళికలు నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అనుసరించే విధా నాన్నే ప్రణాళిక అంటారు. లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపునకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళిక అంటారు. వివిధ పెట్టుబడుల మార్గాంతరాలకు ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళికను ‘ఆర్థిక ప్రణాళిక’ అంటారు. మనదేశంలో ఈ ప్రణాళికలనే అనుసరిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారి ప్రణాళికలను అమలు చేసింది ్ఖఖ. దీన్ని ఆదర్శంగా తీసుకుని భారత్ ప్రణాళిక రచనను ప్రారంభించింది. భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని లాహోర్‌లో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. 1947కు పూర్వం భారతదేశంలో ప్రణాళికలు స్వాతంత్య్రానికి పూర్వమే ప్రణాళికల అవసరాన్ని గుర్తించారు. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారత ఆర్థిక అభివృద్ధికి పదేళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 'Planned Economy for India' అనే గ్రంథాన్ని రచించారు. ఆయనను ప్రణా ళికల పితామహుడు అంటారు. 1943లో బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు ’అ Plan for Economic Development of India'ను రూపొందించారు. దీన్నే ‘బాంబే ప్లాన్’ లేదా ‘టాటా-బిర్లా ప్లాన్’ అంటారు. ఈ ప్రణాళికలో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 10వేల కోట్ల రూపాయలతో 15 ఏళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది ఈ ప్రణాళిక లక్ష్యంగా తీసుకుంది. 1943 – 44 కాలంలో Indian Labour Federationకు చెందిన M.N. రాయ్ ప్రజా ప్రణాళిక (People's Plan) ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇచ్చారు. బాంబే ప్రణాళిక పెట్టుబడిదారి లక్షణాలతో, ప్రజాప్రణాళిక సామ్యవాద లక్షణాలతో ఉన్నాయి. 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ‘గాంధీ ప్రణాళిక’ ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ప్రణాళిక లక్షణాలు గ్రామీణ స్వయం సమృద్ధి, వికేంద్రీకరణ. పై ప్రణాళికల్లో ఏదీ అమలు కాలేదు. అందుకే వీటినే పేపర్ ప్లాన్స్ అంటారు. జయప్రకాశ్ నారాయణ్ 1950 జనవరిలో ‘సర్వోదయ ప్రణాళిక’ను రూపొందించారు. దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. కానీ, ఈ ప్రణాళికలోని కొన్ని మౌలిక అంశాలను స్వీకరించారు. 1944లో ఆర్థిక వ్యవస్థకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ‘ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ’ (ఈ్ఛఞ్చట్టఝ్ఛ్ట ౌజ ్క్చజీజ ్చఛీ ఈ్ఛఠిౌ్ఛఞఝ్ఛ్ట)ను ఎ. దళాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం చిన్నాభిన్నమైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ శాఖ స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలను తయారు చేసింది. 1946లో ‘‘ప్రణాళిక సలహా బోర్డు’’ను (్క్చజీజ అఛీఠిజీటౌటడ ఆౌ్చటఛీ)ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడిగా గుల్జారీలాల్ నందా, కార్యదర్శిగా కృష్ణమాచారీని నియమించారు. ప్రణాళికా సంఘం స్వాతంత్య్రానంతరం కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర, శాసనేతర, చట్టబద్ధం కాని సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. ప్రణాళిక సంఘానికి చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. పరిపాలనా సౌలభ్యం, కార్యనిర్వహణ కోసం ప్రణాళికా సంఘంలో క్రియాశీలకంగా పనిచేసే ఒక ఉపాధ్యక్షుడు (ఈ్ఛఞఠ్టడ ఇజ్చిజీటఝ్చ) ఉంటారు. ఇతనికి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది. భారతదేశంలో ప్రణాళిక సంఘం తొలి చైర్మన్ అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాగా, డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నంద. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ప్రణాళికా సంఘం దేశంలో లభించే వనరులను అంచనావేసి వాటిని సమర్థంగా, సంతులనంగా ఉపయోగించడం కోసం అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తుంది. దాని ముసాయిదాను ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు, జాతీయ అభివృద్ధి మండలికి పంపుతుంది. జాతీయ అభివృద్ధి మండలి జాతీయ అభివృద్ధి మండలిని 1952, ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ. దీనికి కూడా చట్టబద్ధత లేదు. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలించడం దీని ముఖ్య విధి. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించకపోతే ప్రణాళికలు అమలు కావు. దీనికి కూడా చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రారంభంలో ఎన్‌డీసీలో కేంద్ర ఆర్థికమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండేవారు. కానీ 1967 నుంచి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ సెక్రటరీలను సభ్యులుగా పరిగణిస్తున్నారు. పంచవర్ష ప్రణాళికలు - సాధారణ లక్ష్యాలు 1. జాతీయాదాయాన్ని, తలసరి ఆదాయాన్ని గరిష్టం చేయడం. 2. దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం. 3. త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడం. 4. ఆహారధాన్యాల ఉత్పత్తిలో, ముడిసరు కులలో స్వయం సమృద్ధిని సాధించడం. 5. {పాంతీయ అసమానతలను తొలగించి, ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించడం. 6. ఆదాయ, సంపదల్లో వ్యత్యాసాలను తగ్గించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం. 7. ఉద్యోగావకాశాలు పెంచడం ద్వారా నిరుద్యోగ నిర్మూలనను సాధించడం. 8. ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం. 9. సేవల రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆధునికీకరణను సాధించడం. మొదటి పంచవర్ష ప్రణాళిక (1951ృ56) ఈ ప్రణాళికను హరడ్ -డోమార్ వ్యూహా న్ని అనుసరించి రూపొందించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.1960 కోట్లు మాత్రమే. అత్యధిక వాటా(31 శాతం) ను వ్యవసాయం, నీటిపారుదలకు కేటాయించారు. అందువల్ల ఈ ప్రణాళికను ‘వ్యవసాయ - నీటి పారుదల ప్రణాళిక’అని అంటారు. మొదటి ప్రణాళికను ‘చిన్నప్రణాళిక’ అని, ‘నెహ్రూ వియన్ ప్లాన్’ అని కూడా అంటారు. ఈ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు రెండో ప్రాధాన్యం ఇచ్చారు. వీటికోసం 27 శాతం అంటే రూ.520 కోట్లు కేటాయించారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 2.1శాతం ఉండగా, సాధించిన వృద్ధిరేటు (వాస్తవ వృద్ధిరేటు) 3.6శాతం ఉంది. ఈ ప్రణాళికలోనే ఆశించిన వృద్ధిరేటు కంటే సాధించిన వృద్ధిరేటు గరిష్టంగా ఉంది. అంటే 1.5 శాతం ఎక్కు వ వృద్ధిరేటు సాధించింది. తలసరి ఆదా య వృద్ధిరేటు 1.8 శాతం సాధించింది. గాంధీ భావనలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, గ్రామాల్లో ప్రాథమిక అవసరాలను కల్పిం చే కార్యక్రమమైన 'Community De-velopment Programme'ను 1952, అక్టోబరు 2న ప్రారంభించారు. దీంట్లో భాగంగానే 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీడీపీని విస్తరించి 1953, అక్టోబరు 2న ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం’ (Nati-onal Extension Service Scheme - NES)గా ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళిక కాలంలోనే సింధ్రీ ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం, దుర్గాపూర్‌లో హిందూస్థాన్ కేబుల్స్, విశాఖపట్నంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్, మైసూర్లో హెచ్ఎంటీ, బెంగళూరులో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీని ప్రారంభించారు. బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు. రుతుపవనాల అనుకూలత వల్ల మొదటి ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఈ ప్రణాళిక విజయవంతమైంది. ఈ ప్రణాళికలో ధరలు 13శాతం వరకు తగ్గాయి. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళికగా గుర్తింపు పొందింది. మాదిరి ప్రశ్నలు 1. భారతదేశ ప్రణాళికల రూపశిల్పి అని ఎవరిని పిలుస్తారు? 1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య 2) జవహర్ లాల్ నెహ్రూ 3) మోతీలాల్ నెహ్రూ 4) సుభాష్ చంద్రబోస్ 2. సామ్యవాద లక్షణాలున్న ప్రణాళిక? 1) సర్వోదయ 2) గాంధేయ 3) బాంబే 4) ప్రజా 3. {పణాళికా వ్యవస్థ రూపకల్పనలో భారత దేశం ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంది? 1) బ్రిటన్ 2) జర్మనీ 3) రష్యా 4) చైనా 4. భారతదేశంలో ప్రణాళికా సలహా బోర్డును ఎప్పుడు ప్రారంభించారు? 1) 1936 2) 1944 3) 1946 4) 1947 5. 1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణాళిక, అభివృద్ధి శాఖకు అధ్యక్షులు ఎవరు? 1) జవహర్ లాల్ నెహ్రూ 2) మహాత్మాగాంధీ 3) బాబు రాజేంద్రప్రసాద్ 4) ఎ. దళాల్ 6. {పణాళిక సంఘానికి ప్రస్తుత అధ్యక్షుడెవరు? 1) నరేంద్రమోడీ 2) మన్మోహన్సింగ్ 3) మాంటెక్ సింగ్ అహ్లూవాలియా 4) ఎవరూ కాదు 7. మనదేశంలో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది? 1) రాష్ర్టపతి 2) ప్రధానమంత్రి 3) ప్రణాళిక సంఘం 4) జాతీయ అభివృద్ధి మండలి 8. ‘ఎ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా’ను రూపొందించింది? 1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య 2) ఎం.ఎన్.రాయ్ 3) జవహర్లాల్ నెహ్రూ 4) కొంతమంది పారిశ్రామిక వేత్తలు 9. చిన్న ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు? 1) ఒకటో 2) మూడో 3) ప్రజాప్రణాళిక 4) గాంధీ ప్రణాళిక 10. ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది? 1) ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ 2) హిందూస్థాన్ షిప్‌యార్డ్ 3) వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4) హెచ్ఎంటీ 11. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎన్నో ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? 1) 1 2) 2 3) 3 4) 4 12. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1) 1947 2) 1935 3) 1950 4) 1952 13. వీటిలో భారతదేశం ఏ ప్రణాళికను అనుసరిస్తోంది? 1) భౌతిక ప్రణాళిక 2) ఆర్థిక ప్రణాళిక 3) దేశీయ ప్రణాళిక 4) సామాజికన్యాయంతో కూడిన ప్రణాళిక 14. దేని సూచనల మేరకు ప్రణాళిక సంఘాన్ని 1950, మార్చి 15న ఏర్పాటు చేశారు? 1) రాష్ర్టపతి తీర్మానం 2) క్యాబినెట్ తీర్మానం 3) సుప్రీంకోర్టు సలహా 4) పైవన్నీ 15. జాతీయాభివృద్ధి మండలిలో 1967కు ముందు సభ్యులు కానివారు? 1) రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు 3) కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి 4) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 16. భారతదేశంలో ప్రారంభించిన తొలి పథకం పేరు? 1) కుటుంబ నియంత్రణ కార్యక్రమం 2) సామాజిక అభివృద్ధి కార్యక్రమం 3) జాతీయ విస్తరణ కార్యక్రమం 4) గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం సమాధానాలు 1) 2; 2) 4; 3) 3; 4) 3;5) 4; 6) 1; 7) 4; 8) 4; 9) 1; 10) 2;11) 1;12) 4;13) 2;14) 2;15) 2;16) 2. -
రూరల్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్
1. నీటిసరఫరాను ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు? ద్వితీయ రంగం (తయారీ, నిర్మాణం, విద్యుత్, చమురు రంగాలను కూడా ద్వితీయ రంగాల్లో భాగంగానే పరిగణిస్తారు) 2. గర్బిణులు,బాలింతలకు పోషకాహార పంపిణీ, సంరక్షణ కోసం డిసెంబర్ 4, 2012న ప్రారంభించిన పథకం? అమృతహస్తం 3. నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహంలో కన్పించే మార్పులు? 1. జీవశాస్త్ర 2. రసాయనిక 3. యాంత్రిక 4. రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి అక్టోబరు 4, 2006న జాతీయ రైతు కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఎం.ఎస్. స్వామినాథన్ 5. లాభదాయక వ్యవసాయం కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? జయతీఘోష్ 6. రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, వాటి నివారణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్? రామచెన్నారెడ్డి కమిషన్ 7. 1983లో ఏపీలో నిమ్న జాతుల అభివృద్ధి కోసం ఎన్టీయార్ ‘15 సూత్రాల ప్రగతి పథకాలు’ ప్రవేశపెట్టారు. దీనిలోని ముఖ్యాంశాలు? 1. కిలో రెండు రూపాయల బియ్యం 2. నిరుపేదలకు జనతా వస్త్రాల పంపిణీ 3. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం 4. వితంతువులకు పింఛన్లు 8. భూగర్భ జల మట్టాన్ని పెంచడంతోపాటు వృథా నీటిని నిలువ చేయాలనే ఉద్దేశంతో 1997, డిసెంబర్లో ఏ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని వాటర్‌షెడ్ పథకాన్ని ప్రారంభించారు? మహారాష్ర్ట 9. భారతదేశంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం? రోష్నీ (జూన్ 7, 2013) 10. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? నంద్యాల (కర్నూల్ జిల్లా) 11. మిర్చి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? లాం (గుంటూరు జిల్లా) 12. 1929లో బాల్య వివాహాల నిరోధక చట్టం (దీన్నే శారదా చట్టం అంటారు) చేశారు. ఈ చట్టం స్థానంలో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకువచ్చింది? 2006 (2007 నుంచి అమల్లోకి వచ్చింది) 13 స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ర్టం? బీహార్ 14. నిర్బంధ ప్రాథమిక విద్యను సూచించే అధికరణలు ఏవి? 21(ఎ), 45, 51(ఎ) (ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల్లో నిర్బంధ విద్య గురించి పేర్కొన్నారు) 15. అక్టోబరు 29, 2013న కేంద్ర ఆహార శాఖ మంత్రి కె.వి. థామస్ లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్) పేరును ఏ విధంగా మార్చారు? ఇందిరమ్మ అన్న యోజన 16. ఐదేళ్లలో మురికివాడలు లేని భారతదేశాన్ని రూపొందించడానికి 2012లో ఏర్పాటు చేసిన పథకం? ఆర్‌ఏవై - రాజీవ్ ఆవాస్ యోజన 17. రాజ్యాంగంలో 40వ అధికరణం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతోంది. ఐతే స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి వివరించే భాగం? 4వ భాగం 18. {V>-Ð]l$-çసభకు ప్రాధాన్యత కల్పించడం, న్యాయ పంచాయతీ విధానం ఏర్పాటు, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం గురించి సిఫారసు చేసిన కమిటీ? ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ (1986) 19. {పాంతీయ ఆచారాలు, సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ఏయే రాష్ట్రాల్లో ప్రత్యేక పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు? నాగాలాండ్, మణిపూర్, మిజోరామ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ 20. ఏపీలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి శాతం? 15.8 శాతం 21. 2011-12 నాటికి దేశంలోని పేదల శాతం ఎంత? 21.9 శాతం (26.93 కోట్లు) 22. {V>-Ò$× ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు? 25.7 శాతం 23. పట్టణ ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు? 13.7 శాతం 24. 2015 నాటికి పేదరికం ఎంత శాతం తగ్గుతుందని అంచనా వేశారు? 22 శాతం 25. భారతదేశంలో అత్యధిక పేదరికంలో ఉన్న రాష్ట్రాలు? ఒడిశా, బీహార్, చత్తీస్ఘడ్ 26. పేదరికం అంచనాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 21వ స్థానం (15.79శాతం) 27. 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఏమంటారు? ఉత్పాదక వయోవర్గం 28. {శామికుల పెరుగుదల రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండటాన్ని ఏమంటారు? వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత 29. వ్యవసాయ రంగంలో కొన్ని నెలలపాటు శ్రామికులకు పని ఉండి, మరికొన్ని నెలలు నిరుద్యోగులుగా ఉండటాన్ని ఏమంటారు? కాలిక నిరుద్యోగిత/ రుతు సంబంధిత నిరుద్యోగిత 30. ఉత్పాదక వయోవర్గంలో అధిక జనాభాను కలిగిన జిల్లా? తూర్పు గోదావరి (61.93 శాతం) 31. జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)ను ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 2007 32. జూలై 12,1982న శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డను ఎవరు ఏర్పాటు చేశారు? ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా 33. అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్న సంస్థ? {sాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 34. అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానం? 94వ స్థానం 35. కేంద్ర నిఘా కమిషన్ మాజీ అధిపతి ఎన్. విఠల్ ప్రకారం భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం అవినీతి చోటు చేసుకుంది? 40 శాతం 36. {పపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాన మంత్రి? పి.వి.నరసింహారావు (1990) 37. అవినీతి నిరోధక చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది? 1947 38. అవినీతి నివారణకు తొలిసారిగా పరిపాలన సంస్కరణలను సూచించడానికి వేసిన కమిటీ? కె. సంతానం 39. భారతదేశంలో తొలిసారి నక్సలిజం ప్రారంభమైన రాష్ర్టం? పశ్చిమ బెంగాల్ 40. హార్టికల్చర్ రంగం అభివృద్ధికి(పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్) 2005 మేలో నియమించిన మిషన్? నేషనల్ హార్టికల్చర్ మిషన్ 41. పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన కనీస క్యాలరీలు? 2100 42. {V>-Ò$× ప్రాంతంలో ఒక వ్యక్తి సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన క్యాలరీలు? 2400 43. {పధానమంత్రి గ్రామోదయ యోజన(పీఎంజీవై) ముఖ్య లక్ష్యం? ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం, తాగునీరు 44. ఎస్ఐటీఆర్ఏ(సిట్రా) ఉద్దేశం? గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తిదారులకు ఆధునిక పనిముట్ల సరఫరా 45. డ్వాక్రా ఒక? గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు అభివృద్ధి పథకం 46. సుఖీభవ పథకం దేనికి ఉద్దేశించింది? ఆడశిశువుల సంక్షేమం 47. ఆంధ్రాప్రాంతంలో ఇనాందార్లను ఏమని పిలిచేవారు? మొఘసా 48. ఆంధ్ర కౌలుదారుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1956 49. హైదరాబాద్ (తెలంగాణ) కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1950 50. రక్షిత కౌలుదారులుగా ఎవరిని పేర్కొంటారు? ఆరేళ్లు కౌలుదారులుగా ఉన్నవారిని 51. ఆంధ్రరాష్ర్ట రైతుసంఘం ఎప్పుడు ఏర్పడింది? 1928లో 52. అఖిల భారత కిసాన్ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1936లో 53. మనదేశంలో అత్యధిక సగటు భూకమతం కలిగిన రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, పంజాబ్ కాగా, అతి తక్కువ కలిగిన రాష్ర్టం? కేరళ 54. భూ సంస్కరణల అంతిమ లక్ష్యం ఏమిటి? సామాజిక న్యాయం సాధించడం 55. ఏపీలో భూగరిష్ఠ పరిమితి చట్టాలు ఏవి? 1) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం-1(1961) 2) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం - 2 (1973) 56. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాకులను పునర్ వ్యవస్థీకరించే విషయంలో పరిశీలన కోసం వేసిన కమిటీ? పాయ్ కమిటీ 57. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం గ్రామసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1994 58. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామసభకు అధిక ప్రాధాన్యం కల్పించారు? 73వ 59. సమాజాభివృద్ధి పథకం (సీడీపీ)ని ఎప్పుడు ప్రారంభించారు? అక్టోబరు 2, 1952 60. సమాజం తనంతట తాను స్వయంశక్తిపై ఆధారపడి అభివృద్ధి చెందడం ఏ పథకం ముఖ్య లక్షణం? సమాజాభివృద్ధి పథకం 61. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1977 -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
వైఎస్ఆర్ అభయహస్తం: ఫిబ్రవరి 6, 2008న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. నవంబర్ 1, 2009న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య దీని పేరును ‘వైఎస్ఆర్ అభయహస్తం’గా మార్చి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (ఏడాదికి 365 రూపాయలు) చొప్పున ప్రీమియం చెల్లించాలి. స్త్రీలు చెల్లించే రూపాయికి ప్రభుత్వం కూడా రూపాయి చొప్పున కలుపుతుంది. సభ్యులు సహజ మరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి అందజేస్తారు. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా (9, 10, ఇంటర్మీడియెట్ మొదటి, రెండు ఏళ్లు) వరకు 4 ఏళ్లు నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పింఛన్ ఇస్తారు. ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకానికి Society for Elim-ination of Rural Poverty (SERP) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందిరమ్మ కలలు: ఫిబ్రవరి 2, 2013న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టంపై అవగాహన కోసం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5, 2013న ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను ప్రజాప్రతినిధులు సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డీ లేని పంట రుణాలు (రైతుశ్రీ): దేశంలోనే మొదటిసారి మన రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది(సీఎం - కిరణ్‌కుమార్ రెడ్డి). ఏడాదిలోపే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తారు. లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు. ఇందిరమ్మ : (INDIRAMMA-Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas) ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2006న పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్య, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, పింఛ న్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు. NREGP(National Rural Employment Guarantee Programme): సెప్టెంబర్ 19, 2005న ూఖఉఎ్క చట్టం చేశారు. ఫిబ్రవరి 2, 2006న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 2, 2009న దీని పేరును ‘మహాత్మాగాంధీ NREGP’ గా మార్చారు. NREG-Act ప్రకారం 6 నెలల్లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయాలి. మొదటి విడతలో భాగంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా 200 జిల్లాల్లో అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు. రెండో దశ(2007)లో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి...1. శ్రీకాకుళం, 2. ప్రకాశం, 3.గుంటూరు, 4. నెల్లూరు, 5. కర్నూలు, 6. తూర్పుగోదావరి. మూడో దశలో ఏప్రిల్ 1, 2008న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి... 1. విశాఖపట్నం, 2. పశ్చిమగోదావరి, 3. కృష్ణా. ప్రారంభంలో ఈ పథకాన్ని 100 రోజులకు ప్రకటించి, ఒక రోజు వేతనం రూ 100గా నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రం దినసరి వేతనంగా రూ 115 చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ 149 అందజేస్తోంది. ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. దీంట్లో 60 శాతం వేతనాల కోసం, మిగిలిన 40 శాతం పనిముట్ల కోసం కేటాయించాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనట్లయితే దినసరి వేతనంలో 50 శాతం నష్టపరిహారంగా చెల్లించాలి. ఈ పథకాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ 1000 వరకు జరిమానా విధించవచ్చు. ఎన్ఆర్ఈజీపీలో విలీనమైన పథకాలు: 1. NFWP2004 (National Food for Work Programme) 2. SGRY-2001 (Sampurna Grameena Rozgar Yojana) ఏడాది ప్రీమియం కింద ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తే, ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి * 50,000 బీమా కల్పిస్తారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం (IKP) (2005-06): రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా పథకాలను విలీనం చేసి ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం)గా మార్చారు. మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారిని లక్షాధికారులుగా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో 80 లక్షల పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. ఐకేపీని ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ’ (SERP - Society for Elim-ination of Rural Poverty) అమలు పరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు ఐకేపీ సమగ్రమైన పథకం. మహిళా స్వయం సహాయక సంఘాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య పథకాలు: NMB (ఆగస్టు 15, 1995 ) (National Maternity Benefit Scheme): ‘జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం’ (National Social Assistance Pro-gramme)లో ఇది ఒకటి. ఈ పథకానికి కావల్సిన వనరులను కేంద్రం నిధుల నుంచి రాష్ట్రాలకు సమకూరుస్తారు. లబ్ధిదారులైన గర్భి ణులకు లభించాల్సిన సహాయక నిధులను ప్రసవానికి ముందు 8 నుంచి 12 వారాల మధ్యలో అందిస్తారు. జన్మించిన నూతన శిశువుకు పోలియో, బీసీజీ మొదలైన వ్యాధి నిరోధక టీకాల సదుపాయాన్ని కల్పిస్తారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం: (Integrated Child Development Services) ఈ పథకాన్ని 1975లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలు ఈ పథకంలో లబ్ధిదారులు. పోషక, ఆరోగ్య స్థాయిని పెంపొందించడం; పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడటం; మరణాల రేటు, అనారోగ్యం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యాలు. లబ్ధిదారులకు పౌష్టికాహారం, విటమిన్ ‘ఎ’, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణ, మంచినీటి సదుపాయం, పారిశుధ్యం మొదలైన సౌకర్యాలను అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఐఇఈ పథకం యూపీఏ ప్రభుత్వంలో జాతీయ కార్యక్రమంగాఅమల వుతోంది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ పథకం: వెనుకబడిన, బలహీన వర్గాల్లోని గర్భిణుల్లో 40 శాతం మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి పౌష్టికాహారాన్ని ముఖ్యంగా అప్పటికప్పుడు తినగలిగేటట్లు (Ready To Eat-RET) అందించడం ఈ పథకం ప్రత్యేకత. రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తుంది. 6 నెలల నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ 80 గ్రాముల పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, భూమి లేని శ్రామికులు, మురికివాడల్లో నివసించే ప్రజలను ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. బాలికా సమృద్ధి యోజన (BS్గ) (1997): రాష్ర్టంలో ఉన్న బాలికల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ, శిశు జననాల పట్ల ప్రజల్లో మార్పును తీసుకు రావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రసవించినవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి కావల్సిన అదనపు పౌష్టికాహారాన్ని అందిస్తారు. యుక్త వయసు బాలికల కోసం అభివృద్ధి పథకం: (Adolescent Girls Scheme) 11 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, సరైన శారీరక, మానసిక వృద్ధిని పెంపొందింప చేయడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్షరాస్యతను పెంచి, ఆరోగ్యవంతులుగా చేయడంతోపాటు, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఆదర్శప్రాయ తల్లులుగా తీర్చిదిద్దడం ఈ పథకంలోని ముఖ్య అంశాలు. కిశోర బాలికా పథకం: బాల్య వివాహాలను అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నూటికి నూరు శాతం బాలికలకు ప్రాథమిక విద్య అందేటట్లు చేయడం, యుక్త వయసులో ఉన్న బాలికలకు అనువైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం ఈ పథకం ముఖ్య అంశాలు. డ్వాక్రా (DWCRA): (Development of Women and Ch-ildren in Rural Areas) 1982 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు, ూ్ఖఐఇఉఊ సంస్థ ఈ పథకం ఖర్చులను భరించేవి. 1996 నుంచి UNICEF నిధులను ఆపివేసినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూ రు చేస్తున్నాయి. రివాల్వింగ్ ఫండ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకాన్ని IRDPM అనుబంధ కార్యక్రమంగా ప్రారంభించారు. సామాజిక కారణాల వల్ల సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం (IRDP)ను మహిళలు వినియోగించుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ డ్వాక్రా పథకం అవసరం ఏర్పడింది. ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన స్థానంలో ఉంది. స్వయం సహాయక సంఘాలతో ఏర్పడిన ఈ పథకం మన రాష్ర్టంలో స్త్రీల సాంఘిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. స్త్రీలలో వ్యవస్థాపన నైపుణ్యాలను పెంచడానికి ఈ పథకం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అనేక రాష్ర్ట ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్’ (KVIC), హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డులను ఏర్పాటు చేశాయి. వారికి కావల్సిన ఆర్థిక కార్యకలాపాలన్నీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఙ్ట్చఛగ్రామ స్థాయిలో సమితి అభివృద్ధి అధికారి (బీడీఓ) లేదా మండలాభివృద్ధి అధికారి (ఎండీఓ) పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ఈ పథకం నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తాయి. జిల్లా మహిళా సహాయ ప్రాజెక్ట్ అధికారి జిల్లాలో కార్యక్రమాలను సమీక్షిస్తారు. డ్వాక్రా పథకం అమల్లో నెల్లూరు జిల్లా {పథమ, ఖమ్మం రెండు, గుంటూరు జిల్లా చివరి స్థానాల్లో ఉన్నాయి. డ్వాక్రా పథకాన్ని ఏప్రిల్ 1,1999న ‘స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన’ (SGSY) పథకంలో విలీనం చేశారు. ఇందిరా ఆవాస్ యోజన (ఐఅ్గ) (1985-86): ఇందిరా ఆవాస్ యోజన పథకం జవహర్ రోజ్‌గార్ యోజన (JRY) పథకంలో ఉప పథకం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేదలకు, విముక్తి పొందిన బానిసలకు చిన్న ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
బంగారు తల్లి (2013) 2013 జూన్ 19న చట్టం చేశారు. 2013 మే 1 తర్వాత జన్మించిన బాలికలకు (కుటుంబంలో ఇద్దరికి) వర్తిస్తుంది. తెల్ల కార్డుదారులకు వర్తిస్తుంది. పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఆడపిల్లల సంఖ్య పెంపుదల, ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి డిగ్రీ చదివే వరకు (21 ఏళ్లు) ఏటా కొంత మొత్తం చెల్లిస్తారు. శిశువు పుట్టగానే రూ 2500, టీకాల నిమిత్తం రూ 1000 నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇంటర్మీడియెట్(18 ఏళ్లు) తర్వాత రూ. 50వేలు, డిగ్రీ పూర్తైన(21 ఏళ్లు)తర్వాత లక్ష రూపాయలను అందిస్తారు. ఈ పథకం కింద ఒక బాలికకు మొత్తం రూ 2.16 లక్షలను అందిస్తారు. అమ్మ హస్తం 2013 ఏప్రిల్ 11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు. తెల్ల కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. {పతి నెలా 9 రకాల నిత్యావసర వస్తువులను రూ 185లకు అందిస్తారు. ఈ 9 వస్తువుల మార్కెట్ ధర రూ 292. (రూ 107లు లబ్ధి పొందుతారు) 9 వస్తువులు 1. కందిపప్పు (కిలో) రూ 50 2. గోధుమలు (కిలో) రూ 07 3. గోధుమపిండి (కిలో) రూ 16.50 4. చక్కెర (బీ కిలో) రూ 6.75 5. పామాయిల్ (లీటర్) రూ 40 6. పసుపు (100 గ్రా.) రూ 10 7. చింతపండు (బీ కిలో) రూ 30 8. కారం (బి కిలో) రూ 20 9. ఉప్పు (కిలో) రూ 5 మొత్తం రూ 185 మార్కెట్ ధర రూ 292 మిగులు రూ 107 ఈ పథకం ద్వారా 2.25 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. బాలామృతం (2013 నవంబర్ 14) నవజాత శిశువులకు పోషక విలువలు ఉన్న ఆహారం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఇఈ (Integrated Child Development Scheme) కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ 75 కోట్ల నిధులు మంజూరు చేసింది. మన బియ్యం (2013 జనవరి 16) ఏ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని ఆ ప్రాంతంలోనే సేకరించి మరపట్టించి, ఆ బియ్యాన్ని ఆ ప్రాంత చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల కార్డుదారులకు సరఫరా చేసే పథకం. ఈ పథకం ద్వారా రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని అనుసరిస్తోంది. రాష్ర్టంలో 7 జిల్లాల్లో 2013 జనవరి 16న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. 1. కరీంనగర్, 2. వరంగల్, 3. నల్గొండ, 4. గుంటూరు, 5. ప్రకాశం, 6. నెల్లూరు, 7. చిత్తూరు. మన బియ్యం పథకం ద్వారా సేకరించిన బియ్యాన్ని ‘రూపాయికే కిలో బియ్యం’ పథకం ద్వారా అందిస్తున్నారు. రాజీవ్ ఉద్యోగశ్రీ (2007 జూలై) నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లల్లో 10 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడం దీని లక్ష్యం (ప్రైవేట్ రంగంలో). రాజీవ్ ఉద్యోగశ్రీ సొసైటీని Employ-ment and Training Department కింద నెలకొల్పారు. విభిన్న రంగాల్లో ఉపాధి సామర్థ్యాన్ని గుర్తించి, అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తారు. రాజీవ్ యువ కిరణాలు (ఆర్‌వైకే) (2011 ఆగస్టు 20) {పతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం (ప్రైవేట్ రంగంలో). ఆర్‌వైకే అమలు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీని పేరు REECAP (Rajeev Education and Employ- ment Council of Andhra Pradesh) ఆర్‌వైకే అమలు కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దీని పేరు REEMAP (Rajeev Education and Employment Mission of Andhra Pradesh). ఆర్‌వైకే అమలును కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 15 రోజులకోసారి సమావేశమై పర్యవేక్షిస్తుంది. రాజీవ్ యువశక్తి (2004 నవంబర్ 19) అర్హులైన నిరుద్యోగ యువతీ యువ కులు... పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి పొందడానికి రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, రుణ సదుపాయాలను అందిస్తారు. ఈ పథకం కింద రూ. 50,000 లేదా లక్ష రూపాయలను వ్యక్తిగత రుణాలుగా అందిస్తారు. రూ. 5 లక్షలవరకు గ్రూపు రుణాలను కూడా అందిస్తారు. బాల కిరణాలు (2012 జనవరి 2) }M>Mుళం జిల్లాలో ప్రారంభించారు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం. విద్యతో పాటు ఉపాధికి తోడ్పడే వృత్తి విద్యా కోర్సులను పాఠశాల స్థాయి నుంచే అందిస్తారు. చిన్నారి చూపు (2012 అక్టోబర్ 29) పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కంటిచూపు, కళ్ల సంరక్షణకు సంబంధించిన పథకం. ఈ పథకంలో మూడు దశలు ఉంటాయి. 1) కంటి పరీక్షలు చేయడం 2) అవసరం అయిన వారికి కంటి అద్దాలు అందజేయడం 3) కంటి ఆపరేషన్లు నిర్వహించడం. ఇందిరా ఆవాస్ యోజన (IA్గ) (1985-86) దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు గృహ నిర్మాణం కోసం ప్రారంభించారు. సమగ్ర ఆవాస్ యోజన (AY) (1999-2000) ఇంటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రారంభించారు. రాజీవ్ ఆవాస్ యోజన (RAY) (2009) మురికివాడల నిర్మూలన లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మీ సేవ (2011 నవంబర్ 14) తిరుపతిలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇందులో ఈ-సేవ, ఏపీ-ఆన్లైన్ పథకాలను కలిపారు. ‘సులభంగా, వేగంగా’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. మీ సేవ కేంద్రాల నుంచి సేవలను పొందే వ్యక్తి చెల్లించాల్సిన రుసుం రూ. 30. మీ సేవ ద్వారా డిజిటల్ సంతకాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న తొలి రాష్ర్టం - ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బాట (2008 మార్చి 1) అధికారులు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సందర్శించి, విద్యార్థుల సమస్యలను తీర్చే సంక్షేమ కార్యక్రమం. వసతి గృహాల్లో మెరుగైన సేవలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. రైతు బంధు (2008) పంట చేతికి వచ్చినప్పుడు విక్రయ ధరలు తక్కువగా ఉన్న సమయంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ నిల్వలపై 90 రోజుల రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ రుణంపై వడ్డీ ఉండదు. ఈ కాలంలో ధర పెరిగినప్పుడు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉంది. దీపం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు, డ్వాక్రా గ్రూపు మహిళలకు ఈ పథకం కింద సిలిండర్, గ్యాస్ స్టౌవ్‌ను అందిస్తారు. రూ. 1250లకే గ్యాస్ కనెక్షన్‌ను సబ్సిడీ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. జనశ్రీ బీమా కుటుంబ వార్షిక ఆదాయం రూ 20 వేల లోపు ఉండి, ఒకే బాలిక ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. బాలికకు 9 నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి రూ1200 స్కాలర్షిప్ అందిస్తారు. బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత లక్ష రూపాయలు చెల్లిస్తారు. ఈ పథకం కింద రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ... జీవిత బీమా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందిరమ్మ జీవిత బీమా (2008 ఏప్రిల్) భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద అందించే నగదు వివరాలు: 1. {పమాదవశాత్తు మరణం: రూ 75,000 2. సహజ మరణం: రూ 30,000 3. అంగవైకల్యం: రూ 75,000 4. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ 37,500 నగదు అందిస్తారు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం : 2009 నవంబర్ 1 - 2008 ఫిబ్రవరి 6న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభయహస్తం పేరుతో ఒక పథకం ప్రారంభించారు. - 2009 నవంబర్ 1న దీని పేరును అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య గారు ‘వైఎస్ఆర్ అభయహస్తం’గా మార్చారు. ముఖ్యమంత్రి రోశయ్య గారు పథకాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. - 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (సంవత్సరానికి 365 రూపాయలు) చొప్పున ప్రీమియం చెల్లిస్తూ ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. - స్త్రీలు చెల్లించే ఒక్క రూపాయి ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి చొప్పున ఇస్తుంది. - సభ్యురాలు సహజమరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి అందిస్తారు. - సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా 9, 10, ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాలు) వరకు 4 సంవత్సరాలు ------ నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు. - 60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పెన్షన్ అందిస్తారు. - ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు సౌకర్యం కల్పిస్తుంది. - ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తుంది. - ఈ పథకానికి Society for Elimination of Rural Poverty (SERP) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందిరమ్మ కలలు : 2013 ఏప్రిల్ 5 - 2013 ఫిబ్రవరి 2న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు. - ఈ చట్టంపై అవగాహన తేవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా 2013 ఏప్రిల్ 5న ఈ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు. - {పజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ కాలనీలు సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డీ లేని పంట రుణాలు : (రైతుశ్రీ) - దేశంలోనే మొదటిసారిగా మన రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టింది (ముఖ్యమంత్రి-కిరణ్‌కుమార్ రెడ్డి). - సంవత్సరంలోనే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. - ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలలు అందిస్తారు. - ఒక లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు. INDIRAMMA (Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas) - 2006 April 1 - ఈ పథకాన్ని 2006 ఏప్రిల్ 1న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు. - ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్యా సౌకర్యం, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయం, పెన్షన్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు. NREGP (National Rural Employment Guarantee Programme) : - 2005 సెప్టెంబర్ 19 ూఖఉఎ్క చట్టం చేశారు. - 2006 ఫిబ్రవరి 2 రోజున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని నార్సల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. - 2009 అక్టోబర్ 2న దీని పేరును మహాత్మాగాంధీ ూఖఉఎ్క గా మార్చారు. - ూఖఉఎఅఛ్టి ప్రకారం 6 నెలల లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకం అమలుపరచాలి. - దేశ వ్యాప్తంగా ఈ పథకం మొదటి విడతగా 200 జిల్లాల్లో అమలు చేశారు. - ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో అమలు ........ (హైదరాబాద్ తప్ప). - ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశలో 2007 మేలో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి... 1) శ్రీకాకుళం, 2) ప్రకాశం, 3) గుంటూరు, 4) నెల్లూరు, 5) కర్నూలు, 6) తూర్పుగోదావరి. - 3వ దశలో 2008 ఏప్రిల్ 1న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి... 1) విశాఖపట్టణం, 2) పశ్చిమగోదావరి, 3) కృష్ణా. - {పారంభంలో ఈ పథకాన్ని 100 రోజులు, రోజు వేతనం రూ. 100/-లుగా నిర్ణయించారు. - {పస్తుతం కేంద్రంలో రోజు వేతనం రూ. 115/-లు చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ. 149/-లు చెల్లిస్తుంది. - ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. - ఈ వ్యయాన్ని 60% వేతనాల కోసం, మిగిలిన 40% పనిముట్ల కోసం కేటాయించాలి. - ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనిచో రోజూ వేతనంలో 50% నష్టపరిహారంగా చెల్లించాలి. - ఈ పథకం అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ. 1000/- వరకు జరిమానా విధించవచ్చు. - ఈ పథకంలో విలీనమైన పథకాలు. 1. National Food for Work Programme (NFWP2004) 2. Sampurna Grameena Rozgari Yojana (SGRY-2001). - సంవత్సరం ప్రీమియం కింద ఒకరోజు వేతనాన్ని చెల్లిస్తే ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 50,000/- బీమా కల్పిస్తారు. - MG-NREGS ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం (IKP) : 2005-06 - రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా, పథకాలను విలీనం చేసి ఐఓ్క గా మార్చారు. - మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మహిళలను లక్షాధికారులుగా చేయడమే