రాష్ట్ర ప్రభుత్వ పథకాలు | state government schemes | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

Published Thu, Jan 23 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

వైఎస్‌ఆర్ అభయహస్తం:
     ఫిబ్రవరి 6, 2008న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
      నవంబర్ 1, 2009న  నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య దీని పేరును ‘వైఎస్‌ఆర్ అభయహస్తం’గా  మార్చి  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు.
     18 నుంచి 59 ఏళ్ల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (ఏడాదికి 365 రూపాయలు)  చొప్పున ప్రీమియం  చెల్లించాలి.
     స్త్రీలు చెల్లించే  రూపాయికి ప్రభుత్వం కూడా రూపాయి చొప్పున కలుపుతుంది.
     సభ్యులు సహజ మరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి  అందజేస్తారు.
     సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా (9, 10, ఇంటర్మీడియెట్ మొదటి, రెండు  ఏళ్లు) వరకు 4  ఏళ్లు నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు.


     60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పింఛన్ ఇస్తారు.
     ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది.
     ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు  చేస్తోంది.
     ఈ పథకానికి Society for Elim-ination of Rural Poverty (SERP) నోడల్  ఏజెన్సీగా పనిచేస్తుంది.
 
     ఇందిరమ్మ కలలు:
     ఫిబ్రవరి 2, 2013న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు.
     ఈ చట్టంపై అవగాహన కోసం బాబూ  జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5, 2013న ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి  ప్రారంభించారు.
     ఎస్సీ, ఎస్టీ కాలనీలను ప్రజాప్రతినిధులు  సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు  నిర్వహిస్తారు.
 
     వడ్డీ లేని పంట రుణాలు (రైతుశ్రీ):     దేశంలోనే మొదటిసారి మన రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది(సీఎం - కిరణ్‌కుమార్ రెడ్డి).    ఏడాదిలోపే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
     ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తారు. లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు.
 
     ఇందిరమ్మ :
     (INDIRAMMA-Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas)
     ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2006న పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు.
     ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్య, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు,  పింఛ న్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు.
 
     NREGP(National Rural Employment Guarantee Programme):
     సెప్టెంబర్ 19, 2005న  ూఖఉఎ్క చట్టం చేశారు.
     ఫిబ్రవరి 2, 2006న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు.
     అక్టోబర్ 2, 2009న దీని పేరును ‘మహాత్మాగాంధీ NREGP’ గా మార్చారు.
     NREG-Act ప్రకారం 6 నెలల్లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయాలి.
     మొదటి విడతలో భాగంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా 200 జిల్లాల్లో అమలు చేశారు.
     ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు.


     రెండో దశ(2007)లో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి...1. శ్రీకాకుళం, 2. ప్రకాశం, 3.గుంటూరు, 4. నెల్లూరు, 5. కర్నూలు, 6. తూర్పుగోదావరి.
     మూడో దశలో ఏప్రిల్ 1, 2008న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి...
     1. విశాఖపట్నం, 2. పశ్చిమగోదావరి,
     3. కృష్ణా.
     ప్రారంభంలో ఈ పథకాన్ని 100 రోజులకు ప్రకటించి, ఒక రోజు వేతనం రూ 100గా నిర్ణయించారు.
     ప్రస్తుతం కేంద్రం దినసరి వేతనంగా రూ 115 చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ 149  అందజేస్తోంది.
     ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. దీంట్లో 60 శాతం వేతనాల కోసం, మిగిలిన 40 శాతం పనిముట్ల కోసం కేటాయించాలి.
     ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనట్లయితే దినసరి వేతనంలో 50 శాతం నష్టపరిహారంగా చెల్లించాలి.
     ఈ పథకాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ 1000 వరకు జరిమానా విధించవచ్చు.
     ఎన్‌ఆర్‌ఈజీపీలో విలీనమైన పథకాలు:
 1.    NFWP2004 (National Food for Work Programme)


 2.    SGRY-2001 (Sampurna Grameena Rozgar Yojana)
     ఏడాది ప్రీమియం కింద ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తే, ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి * 50,000 బీమా కల్పిస్తారు.
     ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు  చేయడానికి ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.
 
     ఇందిరాక్రాంతి పథం (IKP)    (2005-06):
     రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా పథకాలను విలీనం చేసి ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం)గా మార్చారు.
     మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారిని లక్షాధికారులుగా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
     గ్రామాల్లో 80 లక్షల పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత  ఇవ్వడమే ఈ పథకం  లక్ష్యం.
     ఐకేపీని ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ’ (SERP - Society for Elim-ination of Rural Poverty) అమలు పరుస్తోంది.
     ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు ఐకేపీ సమగ్రమైన పథకం. మహిళా స్వయం సహాయక సంఘాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య పథకాలు:
 NMB (ఆగస్టు 15, 1995 )
 (National Maternity Benefit Scheme):
 ‘జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం’ (National Social Assistance Pro-gramme)లో ఇది ఒకటి. ఈ పథకానికి కావల్సిన వనరులను  కేంద్రం నిధుల నుంచి రాష్ట్రాలకు సమకూరుస్తారు. లబ్ధిదారులైన గర్భి ణులకు లభించాల్సిన సహాయక నిధులను ప్రసవానికి ముందు 8 నుంచి 12 వారాల మధ్యలో అందిస్తారు. జన్మించిన నూతన శిశువుకు పోలియో, బీసీజీ మొదలైన వ్యాధి నిరోధక టీకాల సదుపాయాన్ని  కల్పిస్తారు.
 
 సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం: (Integrated Child Development Services)
 ఈ పథకాన్ని 1975లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు  పిల్లలు ఈ పథకంలో లబ్ధిదారులు. పోషక, ఆరోగ్య స్థాయిని పెంపొందించడం; పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడటం; మరణాల రేటు, అనారోగ్యం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యాలు. లబ్ధిదారులకు పౌష్టికాహారం, విటమిన్ ‘ఎ’, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణ, మంచినీటి సదుపాయం, పారిశుధ్యం మొదలైన సౌకర్యాలను అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా  అందిస్తారు. ప్రస్తుతం ఐఇఈ పథకం యూపీఏ ప్రభుత్వంలో జాతీయ కార్యక్రమంగాఅమల వుతోంది.
 
 సప్లిమెంటరీ న్యూట్రిషన్ పథకం: వెనుకబడిన, బలహీన వర్గాల్లోని గర్భిణుల్లో 40 శాతం మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి పౌష్టికాహారాన్ని ముఖ్యంగా అప్పటికప్పుడు తినగలిగేటట్లు (Ready To Eat-RET) అందించడం ఈ పథకం ప్రత్యేకత. రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తుంది. 6 నెలల నుంచి 5  ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ 80 గ్రాముల  పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, భూమి లేని శ్రామికులు, మురికివాడల్లో నివసించే ప్రజలను ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.
 
 బాలికా సమృద్ధి యోజన (BS్గ) (1997):
 రాష్ర్టంలో ఉన్న బాలికల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ, శిశు జననాల పట్ల ప్రజల్లో మార్పును తీసుకు రావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రసవించినవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి కావల్సిన అదనపు పౌష్టికాహారాన్ని  అందిస్తారు.
 
 యుక్త వయసు బాలికల కోసం అభివృద్ధి పథకం: (Adolescent Girls Scheme)
 11 నుంచి 17 ఏళ్ల వయసున్న  బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, సరైన శారీరక, మానసిక వృద్ధిని  పెంపొందింప చేయడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్షరాస్యతను పెంచి, ఆరోగ్యవంతులుగా చేయడంతోపాటు, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఆదర్శప్రాయ తల్లులుగా తీర్చిదిద్దడం ఈ పథకంలోని ముఖ్య అంశాలు.
 
 కిశోర బాలికా పథకం:
  బాల్య వివాహాలను అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నూటికి నూరు శాతం బాలికలకు ప్రాథమిక విద్య అందేటట్లు చేయడం, యుక్త వయసులో ఉన్న బాలికలకు అనువైన నైపుణ్యాల్లో శిక్షణ  ఇవ్వడం  ఈ పథకం ముఖ్య అంశాలు.
 
 డ్వాక్రా (DWCRA):
 (Development of Women and Ch-ildren in Rural Areas)
     1982 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు, ూ్ఖఐఇఉఊ సంస్థ ఈ పథకం ఖర్చులను భరించేవి. 1996 నుంచి UNICEF  నిధులను ఆపివేసినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  మంజూ రు చేస్తున్నాయి. రివాల్వింగ్ ఫండ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమకూరుస్తుంది.

      ఈ పథకాన్ని IRDPM అనుబంధ కార్యక్రమంగా ప్రారంభించారు. సామాజిక కారణాల వల్ల సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం (IRDP)ను  మహిళలు వినియోగించుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ డ్వాక్రా పథకం  అవసరం ఏర్పడింది. ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన స్థానంలో ఉంది.

      స్వయం సహాయక సంఘాలతో ఏర్పడిన ఈ పథకం మన రాష్ర్టంలో స్త్రీల సాంఘిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. స్త్రీలలో వ్యవస్థాపన నైపుణ్యాలను పెంచడానికి ఈ పథకం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అనేక రాష్ర్ట ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్’ (KVIC), హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డులను ఏర్పాటు చేశాయి. వారికి కావల్సిన ఆర్థిక కార్యకలాపాలన్నీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) నేతృత్వంలో  నిర్వహిస్తున్నారు.  

 ఙ్ట్చఛగ్రామ స్థాయిలో సమితి అభివృద్ధి అధికారి (బీడీఓ) లేదా మండలాభివృద్ధి అధికారి (ఎండీఓ) పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ఈ పథకం నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
     జిల్లా మహిళా సహాయ ప్రాజెక్ట్ అధికారి జిల్లాలో కార్యక్రమాలను  సమీక్షిస్తారు.

       డ్వాక్రా పథకం అమల్లో నెల్లూరు జిల్లా     {పథమ, ఖమ్మం రెండు, గుంటూరు జిల్లా చివరి స్థానాల్లో ఉన్నాయి.
     డ్వాక్రా పథకాన్ని ఏప్రిల్ 1,1999న ‘స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన’ (SGSY) పథకంలో విలీనం చేశారు.
 
 ఇందిరా ఆవాస్ యోజన (ఐఅ్గ) (1985-86):
 ఇందిరా ఆవాస్ యోజన పథకం జవహర్ రోజ్‌గార్ యోజన (JRY) పథకంలో ఉప పథకం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేదలకు, విముక్తి పొందిన బానిసలకు చిన్న ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement