రూరల్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ | Rural Economy and Development | Sakshi
Sakshi News home page

రూరల్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

Published Mon, Feb 10 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

రూరల్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

రూరల్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

1.    నీటిసరఫరాను  ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు?
       ద్వితీయ రంగం (తయారీ, నిర్మాణం, విద్యుత్, చమురు రంగాలను కూడా ద్వితీయ రంగాల్లో భాగంగానే పరిగణిస్తారు)
 2.    గర్బిణులు,బాలింతలకు పోషకాహార పంపిణీ, సంరక్షణ  కోసం డిసెంబర్ 4, 2012న ప్రారంభించిన పథకం?
       అమృతహస్తం
 3.    నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహంలో కన్పించే మార్పులు?
       1. జీవశాస్త్ర  2. రసాయనిక  
     3. యాంత్రిక
 4.    రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి అక్టోబరు 4, 2006న  జాతీయ రైతు కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది?
       ఎం.ఎస్. స్వామినాథన్
 5.    లాభదాయక వ్యవసాయం కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
       జయతీఘోష్
 6.    రైతుల ఆత్మహత్యలపై   అధ్యయనం చేసి, వాటి నివారణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్?
       రామచెన్నారెడ్డి కమిషన్
 7.    1983లో ఏపీలో నిమ్న జాతుల అభివృద్ధి కోసం ఎన్టీయార్ ‘15 సూత్రాల ప్రగతి పథకాలు’ ప్రవేశపెట్టారు. దీనిలోని ముఖ్యాంశాలు?
       1. కిలో రెండు రూపాయల బియ్యం 2. నిరుపేదలకు జనతా వస్త్రాల పంపిణీ 3. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన
         పథకం
      4. వితంతువులకు పింఛన్లు
 8.    భూగర్భ జల మట్టాన్ని పెంచడంతోపాటు వృథా నీటిని నిలువ చేయాలనే ఉద్దేశంతో 1997, డిసెంబర్‌లో ఏ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని  వాటర్‌షెడ్ పథకాన్ని ప్రారంభించారు?
       మహారాష్ర్ట
 9.    భారతదేశంలో  నక్సలైట్ల  ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం?
       రోష్నీ (జూన్ 7, 2013)
 10.    పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడుంది?
       నంద్యాల  (కర్నూల్ జిల్లా)
 11.     మిర్చి పరిశోధన  కేంద్రం ఎక్కడుంది?
       లాం (గుంటూరు జిల్లా)
 12. 1929లో బాల్య వివాహాల నిరోధక చట్టం (దీన్నే శారదా చట్టం అంటారు)  చేశారు. ఈ చట్టం స్థానంలో  బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం  ఎప్పుడు తీసుకువచ్చింది?
       2006 (2007 నుంచి అమల్లోకి వచ్చింది)
 13    స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ర్టం?
       బీహార్
 14.    నిర్బంధ ప్రాథమిక విద్యను సూచించే అధికరణలు ఏవి?
       21(ఎ), 45, 51(ఎ) (ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల్లో నిర్బంధ విద్య గురించి పేర్కొన్నారు)
 15.     అక్టోబరు 29, 2013న కేంద్ర ఆహార శాఖ మంత్రి కె.వి. థామస్ లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్) పేరును ఏ విధంగా మార్చారు?
       ఇందిరమ్మ అన్న యోజన
 16.    ఐదేళ్లలో మురికివాడలు లేని భారతదేశాన్ని రూపొందించడానికి 2012లో ఏర్పాటు చేసిన పథకం?
       ఆర్‌ఏవై - రాజీవ్ ఆవాస్ యోజన
 17.    రాజ్యాంగంలో 40వ అధికరణం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతోంది. ఐతే స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి వివరించే భాగం?
      4వ భాగం
 18.    {V>-Ð]l$-çసభకు ప్రాధాన్యత కల్పించడం, న్యాయ పంచాయతీ విధానం ఏర్పాటు, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం గురించి సిఫారసు చేసిన కమిటీ?
       ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ (1986)
 19.    {పాంతీయ ఆచారాలు, సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ఏయే రాష్ట్రాల్లో ప్రత్యేక పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు?
       నాగాలాండ్, మణిపూర్, మిజోరామ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్
 20.    ఏపీలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి శాతం?
       15.8 శాతం
 21.    2011-12 నాటికి దేశంలోని పేదల శాతం ఎంత?
       21.9 శాతం (26.93 కోట్లు)
 22.    {V>-Ò$× ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు?
       25.7 శాతం
 23.    పట్టణ ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు?
       13.7 శాతం
 24.    2015 నాటికి  పేదరికం  ఎంత శాతం తగ్గుతుందని అంచనా వేశారు?
       22 శాతం
 25.    భారతదేశంలో అత్యధిక పేదరికంలో ఉన్న రాష్ట్రాలు?
       ఒడిశా, బీహార్, చత్తీస్‌ఘడ్
 26.    పేదరికం అంచనాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
       21వ స్థానం (15.79శాతం)
 27.    15 నుంచి 60  ఏళ్ల మధ్య వయసున్న వారిని  ఏమంటారు?
       ఉత్పాదక వయోవర్గం
 28.    {శామికుల పెరుగుదల రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండటాన్ని ఏమంటారు?
       వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
 29.    వ్యవసాయ రంగంలో కొన్ని నెలలపాటు శ్రామికులకు పని ఉండి, మరికొన్ని నెలలు నిరుద్యోగులుగా ఉండటాన్ని ఏమంటారు?
       కాలిక నిరుద్యోగిత/ రుతు సంబంధిత నిరుద్యోగిత
 30.    ఉత్పాదక వయోవర్గంలో అధిక జనాభాను కలిగిన జిల్లా?
       తూర్పు గోదావరి (61.93 శాతం)
 31.    జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)ను ఎప్పుడు ప్రారంభించారు?
       ఆగస్టు  2007
 32.    జూలై 12,1982న శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్‌‌డను ఎవరు ఏర్పాటు చేశారు?
       ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా
 33.    అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్న సంస్థ?
       {sాన్‌‌సపరెన్సీ ఇంటర్నేషనల్
 34.    అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానం?
       94వ స్థానం
 35.    కేంద్ర నిఘా కమిషన్ మాజీ అధిపతి ఎన్. విఠల్ ప్రకారం భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం అవినీతి చోటు చేసుకుంది?
       40 శాతం
 36.    {పపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాన మంత్రి?
       పి.వి.నరసింహారావు (1990)
 37.    అవినీతి నిరోధక చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది?
       1947
 38.    అవినీతి నివారణకు తొలిసారిగా పరిపాలన సంస్కరణలను సూచించడానికి వేసిన కమిటీ?
       కె. సంతానం
 39.    భారతదేశంలో తొలిసారి నక్సలిజం ప్రారంభమైన రాష్ర్టం?
       పశ్చిమ బెంగాల్
 40.    హార్టికల్చర్ రంగం అభివృద్ధికి(పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్) 2005 మేలో నియమించిన మిషన్?
       నేషనల్ హార్టికల్చర్ మిషన్
 41.    పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి  సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన కనీస క్యాలరీలు?
       2100
 42.    {V>-Ò$× ప్రాంతంలో ఒక వ్యక్తి సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన క్యాలరీలు?
       2400
 43.    {పధానమంత్రి గ్రామోదయ యోజన(పీఎంజీవై)  ముఖ్య లక్ష్యం?
       ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం, తాగునీరు
 44. ఎస్‌ఐటీఆర్‌ఏ(సిట్రా) ఉద్దేశం?
       గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తిదారులకు ఆధునిక పనిముట్ల సరఫరా
 45.    డ్వాక్రా ఒక?
       గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు అభివృద్ధి పథకం
 46.    సుఖీభవ పథకం దేనికి ఉద్దేశించింది?
       ఆడశిశువుల సంక్షేమం
 47.    ఆంధ్రాప్రాంతంలో ఇనాందార్లను ఏమని పిలిచేవారు?
       మొఘసా
 48.    ఆంధ్ర కౌలుదారుల చట్టాన్ని  ఎప్పుడు చేశారు?
       1956
 49.    హైదరాబాద్ (తెలంగాణ) కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని  ఎప్పుడు చేశారు?
       1950
 50.    రక్షిత కౌలుదారులుగా ఎవరిని పేర్కొంటారు?
       ఆరేళ్లు కౌలుదారులుగా ఉన్నవారిని
 51.    ఆంధ్రరాష్ర్ట రైతుసంఘం  ఎప్పుడు ఏర్పడింది?
       1928లో
 52.    అఖిల భారత కిసాన్ సభను  ఎప్పుడు ఏర్పాటు చేశారు?
       1936లో
 53.    మనదేశంలో అత్యధిక సగటు భూకమతం కలిగిన రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, పంజాబ్ కాగా, అతి తక్కువ కలిగిన రాష్ర్టం?
       కేరళ
 54.    భూ సంస్కరణల అంతిమ లక్ష్యం ఏమిటి?
       సామాజిక న్యాయం సాధించడం
 55.    ఏపీలో భూగరిష్ఠ పరిమితి చట్టాలు ఏవి?
  1) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం-1(1961)
      2) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం  
         - 2 (1973)
 56.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాకులను పునర్ వ్యవస్థీకరించే విషయంలో పరిశీలన కోసం వేసిన కమిటీ?
       పాయ్ కమిటీ
 57.    ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం  గ్రామసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
       1994
 58.    ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామసభకు  అధిక ప్రాధాన్యం కల్పించారు?
       73వ
 59.    సమాజాభివృద్ధి పథకం (సీడీపీ)ని ఎప్పుడు ప్రారంభించారు?
       అక్టోబరు 2, 1952
 60.    సమాజం తనంతట తాను స్వయంశక్తిపై ఆధారపడి అభివృద్ధి చెందడం ఏ పథకం ముఖ్య లక్షణం?
       సమాజాభివృద్ధి పథకం
 61.    ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని  ఎప్పుడు ప్రారంభించారు?
       1977

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement