రాష్ట్ర ప్రభుత్వ పథకాలు | State government schemes | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

Published Mon, Jan 20 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

 బంగారు తల్లి (2013)
     2013 జూన్ 19న చట్టం చేశారు.
     2013 మే 1 తర్వాత జన్మించిన బాలికలకు (కుటుంబంలో ఇద్దరికి) వర్తిస్తుంది.
     తెల్ల కార్డుదారులకు వర్తిస్తుంది.
     పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు.
     ఆడపిల్లల సంఖ్య పెంపుదల, ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు.
     ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి డిగ్రీ చదివే వరకు (21 ఏళ్లు) ఏటా కొంత మొత్తం చెల్లిస్తారు.
     శిశువు పుట్టగానే రూ 2500, టీకాల నిమిత్తం రూ 1000 నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
     ఇంటర్మీడియెట్(18 ఏళ్లు) తర్వాత రూ. 50వేలు, డిగ్రీ పూర్తైన(21 ఏళ్లు)తర్వాత లక్ష రూపాయలను అందిస్తారు.
     ఈ పథకం కింద ఒక బాలికకు మొత్తం  రూ 2.16 లక్షలను అందిస్తారు.
 
 అమ్మ హస్తం
     2013 ఏప్రిల్ 11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
     తెల్ల కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు.
     {పతి నెలా 9 రకాల నిత్యావసర వస్తువులను రూ 185లకు అందిస్తారు.
     ఈ 9 వస్తువుల మార్కెట్ ధర రూ 292.
 (రూ 107లు లబ్ధి పొందుతారు)
 
 9 వస్తువులు
 1. కందిపప్పు (కిలో)    రూ 50
 2. గోధుమలు (కిలో)    రూ 07
 3. గోధుమపిండి (కిలో)    రూ 16.50
 4. చక్కెర (బీ కిలో)    రూ 6.75
 5. పామాయిల్ (లీటర్)    రూ 40
 6. పసుపు (100 గ్రా.)    రూ 10
 7. చింతపండు (బీ కిలో)    రూ 30
 8. కారం (బి కిలో)          రూ 20
 9. ఉప్పు (కిలో)        రూ 5
 మొత్తం                   రూ 185    
 మార్కెట్ ధర             రూ 292
 మిగులు                  రూ 107
     ఈ పథకం ద్వారా 2.25 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది.
 
 బాలామృతం (2013 నవంబర్ 14)
     నవజాత శిశువులకు పోషక విలువలు ఉన్న ఆహారం అందించే లక్ష్యంతో  ఈ పథకాన్ని ప్రారంభించారు.
     ఈ సందర్భంగా ఐఇఈ (Integrated Child Development Scheme) కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ 75 కోట్ల నిధులు మంజూరు చేసింది.
 మన బియ్యం
 (2013 జనవరి 16)
     ఏ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని ఆ ప్రాంతంలోనే సేకరించి మరపట్టించి, ఆ బియ్యాన్ని ఆ ప్రాంత చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల కార్డుదారులకు సరఫరా చేసే పథకం.
     ఈ పథకం ద్వారా రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని అనుసరిస్తోంది.
     రాష్ర్టంలో 7 జిల్లాల్లో 2013 జనవరి 16న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు.
     1. కరీంనగర్, 2. వరంగల్, 3. నల్గొండ, 4. గుంటూరు, 5. ప్రకాశం, 6. నెల్లూరు, 7. చిత్తూరు.
     మన బియ్యం పథకం ద్వారా సేకరించిన బియ్యాన్ని ‘రూపాయికే కిలో బియ్యం’ పథకం ద్వారా అందిస్తున్నారు.
 
 రాజీవ్ ఉద్యోగశ్రీ (2007 జూలై)
     నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం.
     ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లల్లో 10 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడం దీని లక్ష్యం (ప్రైవేట్ రంగంలో).
     రాజీవ్ ఉద్యోగశ్రీ సొసైటీని Employ-ment and Training Department కింద నెలకొల్పారు.
     విభిన్న రంగాల్లో ఉపాధి సామర్థ్యాన్ని గుర్తించి, అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తారు.
 
 రాజీవ్ యువ కిరణాలు (ఆర్‌వైకే)
 (2011 ఆగస్టు 20)
     {పతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
     2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం (ప్రైవేట్ రంగంలో).
     ఆర్‌వైకే అమలు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీని పేరు REECAP (Rajeev Education and Employ- ment Council of Andhra Pradesh)
     ఆర్‌వైకే అమలు కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దీని పేరు REEMAP (Rajeev Education and Employment Mission of Andhra Pradesh).
     ఆర్‌వైకే అమలును కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 15 రోజులకోసారి  సమావేశమై పర్యవేక్షిస్తుంది.
 రాజీవ్ యువశక్తి (2004 నవంబర్ 19)
     అర్హులైన నిరుద్యోగ యువతీ యువ కులు... పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి  పొందడానికి రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుంది.
     నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, రుణ సదుపాయాలను అందిస్తారు.
     ఈ పథకం కింద రూ. 50,000 లేదా లక్ష రూపాయలను వ్యక్తిగత రుణాలుగా అందిస్తారు. రూ. 5 లక్షలవరకు గ్రూపు రుణాలను కూడా అందిస్తారు.
 
 బాల కిరణాలు (2012 జనవరి 2)
     }M>Mుళం జిల్లాలో ప్రారంభించారు.
     8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం.
     విద్యతో పాటు ఉపాధికి తోడ్పడే వృత్తి విద్యా కోర్సులను పాఠశాల స్థాయి నుంచే అందిస్తారు.
 
 చిన్నారి చూపు (2012 అక్టోబర్ 29)
     పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కంటిచూపు, కళ్ల సంరక్షణకు సంబంధించిన పథకం.
     ఈ పథకంలో మూడు దశలు ఉంటాయి.
 1)    కంటి పరీక్షలు చేయడం
 2)    అవసరం అయిన వారికి కంటి అద్దాలు అందజేయడం
 3)    కంటి ఆపరేషన్‌లు నిర్వహించడం.
 
 ఇందిరా ఆవాస్ యోజన (IA్గ) (1985-86)
     దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు గృహ నిర్మాణం కోసం ప్రారంభించారు.
 
 సమగ్ర ఆవాస్ యోజన (AY) (1999-2000)
     ఇంటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రారంభించారు.
 
 రాజీవ్ ఆవాస్ యోజన (RAY) (2009)
     మురికివాడల నిర్మూలన లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
 
 మీ సేవ (2011 నవంబర్ 14)
     తిరుపతిలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు.
     ఇందులో ఈ-సేవ, ఏపీ-ఆన్‌లైన్ పథకాలను కలిపారు. ‘సులభంగా, వేగంగా’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.
     మీ సేవ కేంద్రాల నుంచి సేవలను పొందే వ్యక్తి చెల్లించాల్సిన రుసుం రూ. 30.
     మీ సేవ ద్వారా డిజిటల్ సంతకాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న తొలి రాష్ర్టం - ఆంధ్రప్రదేశ్
 
 సంక్షేమ బాట
 (2008 మార్చి 1)
     అధికారులు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సందర్శించి, విద్యార్థుల సమస్యలను తీర్చే సంక్షేమ కార్యక్రమం.
     వసతి గృహాల్లో మెరుగైన సేవలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం.
 రైతు బంధు (2008)
     పంట చేతికి వచ్చినప్పుడు విక్రయ ధరలు తక్కువగా ఉన్న సమయంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ నిల్వలపై 90 రోజుల రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ రుణంపై వడ్డీ ఉండదు.
     ఈ కాలంలో ధర పెరిగినప్పుడు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉంది.
 
 దీపం
     దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు, డ్వాక్రా గ్రూపు మహిళలకు ఈ పథకం కింద సిలిండర్, గ్యాస్ స్టౌవ్‌ను అందిస్తారు.
     రూ. 1250లకే గ్యాస్ కనెక్షన్‌ను సబ్సిడీ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది.
 
 జనశ్రీ బీమా
     కుటుంబ వార్షిక ఆదాయం రూ 20 వేల లోపు ఉండి, ఒకే బాలిక ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
     బాలికకు 9 నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి రూ1200 స్కాలర్‌షిప్ అందిస్తారు.
     బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత లక్ష రూపాయలు చెల్లిస్తారు.
     ఈ పథకం కింద రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ... జీవిత బీమా సంస్థతో ఒప్పందం చేసుకుంది.
 
 ఇందిరమ్మ జీవిత బీమా (2008 ఏప్రిల్)
     భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఈ పథకం వర్తిస్తుంది.
     ఈ పథకం కింద అందించే నగదు వివరాలు:
 1.    {పమాదవశాత్తు మరణం: రూ 75,000
 2.    సహజ మరణం:  రూ 30,000
 3.    అంగవైకల్యం:  రూ 75,000
 4.    పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే  రూ 37,500 నగదు అందిస్తారు.
 
 వైఎస్‌ఆర్ అభయహస్తం పథకం : 2009 నవంబర్ 1
 -    2008 ఫిబ్రవరి 6న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అభయహస్తం పేరుతో ఒక పథకం ప్రారంభించారు.
 -    2009 నవంబర్ 1న దీని పేరును అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య గారు ‘వైఎస్‌ఆర్ అభయహస్తం’గా మార్చారు. ముఖ్యమంత్రి రోశయ్య గారు పథకాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు.
 -    18 నుంచి 59 సంవత్సరాల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (సంవత్సరానికి 365 రూపాయలు) చొప్పున ప్రీమియం చెల్లిస్తూ ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.
 -    స్త్రీలు చెల్లించే ఒక్క రూపాయి ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి చొప్పున ఇస్తుంది.
 -    సభ్యురాలు సహజమరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి అందిస్తారు.
 -    సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా 9, 10, ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాలు) వరకు 4 సంవత్సరాలు ------ నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు.
 -    60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పెన్షన్ అందిస్తారు.
 -    ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు సౌకర్యం కల్పిస్తుంది.
 -    ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తుంది.
 -    ఈ పథకానికి Society for Elimination of Rural Poverty (SERP) నోడల్  ఏజెన్సీగా పనిచేస్తుంది.
 ఇందిరమ్మ కలలు : 2013 ఏప్రిల్ 5
 -    2013 ఫిబ్రవరి 2న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు.
 -    ఈ చట్టంపై అవగాహన తేవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాబూ  జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా 2013 ఏప్రిల్ 5న ఈ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు.
 -    {పజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ కాలనీలు సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 వడ్డీ లేని పంట రుణాలు : (రైతుశ్రీ)
 -    దేశంలోనే మొదటిసారిగా మన రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టింది (ముఖ్యమంత్రి-కిరణ్‌కుమార్ రెడ్డి).
 -    సంవత్సరంలోనే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
 -    ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలలు అందిస్తారు.
 -    ఒక లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు.
 
 INDIRAMMA (Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas) - 2006 April 1
 -    ఈ పథకాన్ని 2006 ఏప్రిల్ 1న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు.
 -     ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్యా సౌకర్యం, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయం, పెన్షన్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు.
 NREGP (National Rural Employment Guarantee Programme) :
 -    2005 సెప్టెంబర్ 19 ూఖఉఎ్క చట్టం చేశారు.
 -    2006 ఫిబ్రవరి 2 రోజున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని నార్సల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు.
 -    2009 అక్టోబర్ 2న దీని పేరును మహాత్మాగాంధీ ూఖఉఎ్క గా మార్చారు.
 -    ూఖఉఎఅఛ్టి ప్రకారం 6 నెలల లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకం అమలుపరచాలి.
 -    దేశ వ్యాప్తంగా ఈ పథకం మొదటి విడతగా 200 జిల్లాల్లో అమలు చేశారు.
 -    ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో అమలు ........ (హైదరాబాద్ తప్ప).
 -    ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశలో 2007 మేలో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి...
     1) శ్రీకాకుళం, 2) ప్రకాశం, 3) గుంటూరు, 4) నెల్లూరు, 5) కర్నూలు, 6) తూర్పుగోదావరి.
 -    3వ దశలో 2008 ఏప్రిల్ 1న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి...
     1) విశాఖపట్టణం, 2) పశ్చిమగోదావరి, 3) కృష్ణా.
 -    {పారంభంలో ఈ పథకాన్ని 100 రోజులు, రోజు వేతనం రూ. 100/-లుగా నిర్ణయించారు.
 -    {పస్తుతం కేంద్రంలో రోజు వేతనం రూ. 115/-లు చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ. 149/-లు చెల్లిస్తుంది.
 -    ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి.
 -    ఈ వ్యయాన్ని 60% వేతనాల కోసం, మిగిలిన 40% పనిముట్ల కోసం కేటాయించాలి.
 -    ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనిచో రోజూ వేతనంలో 50% నష్టపరిహారంగా చెల్లించాలి.
 -    ఈ పథకం అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ. 1000/- వరకు జరిమానా విధించవచ్చు.
  -    ఈ పథకంలో విలీనమైన పథకాలు.
     1.    National Food for Work Programme (NFWP2004)
     2.    Sampurna Grameena Rozgari Yojana (SGRY-2001).
 -    సంవత్సరం ప్రీమియం కింద ఒకరోజు వేతనాన్ని చెల్లిస్తే ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 50,000/- బీమా కల్పిస్తారు.
 -    MG-NREGS ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.
 ఇందిరాక్రాంతి పథం (IKP) : 2005-06
 -    రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా, పథకాలను విలీనం చేసి ఐఓ్క గా మార్చారు.
 -    మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మహిళలను లక్షాధికారులుగా చేయడమే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement