State government schemes
-
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
ప్రసవించిన ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోసం...తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
పార్వతీపురంటౌన్: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా, ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్1న ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి. గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు. ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతలు ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఎస్.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు -
నిధులు లేవు.. అభివృద్ధి పనులు జరగవు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభు త్వం ఓయూకు కేటాయించే బ్లాక్‌గ్రాంట్స్ నిధుల్లో సగానికి సగం కోత విధించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయా యి. బ్లాక్‌గ్రాంట్స్ నిధులను వేతనాలు, పించన్లతో పాటు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. గత మూడేళ్లులుగా అభివృద్ధి నిధులను నిలిపివేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అడిగినన్ని నిధులు విడుదల చేయనందున వివిధ వనరుల ద్వారా ఓయూకు లభించే ప్రతి పైసా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు వినియోగిస్తున్నారు. ఓయూ ఉద్యోగుల వేతనాలు, పించన్లకు ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏడాదికి రూ.584 కోట్లు అవసరం. ఇందుకోసం ఓయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు బ్లాక్‌గ్రాంట్స్ నిధులు అడుగుతున్నారు.కానీ ప్రభుత్వం రూ.309 కోట్లను మాత్రమే విడుదల చేస్తోంది. ఈ నిధులు సరిపోకపోవడంతో మిగతా నిధులను ఓయూ సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించకుండా వేతనాలు, పించన్లకు వాడుతున్నారు. దీంతో ఓయూలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తగ్గుతున్న ఓయూ ఆదాయం ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయం ప్రతి ఏటా తగ్గుతుంది. గతంలో పీజీ అడ్మిషన్స్ కార్యాలయం, దూరవిద్యా కేంద్రం, విదేశీ విద్యార్థులు, ఎగ్జామినేషన్ బ్రాంచ్, క్రీడా మైదానాలు తదితరాల నుంచి కోట్లాది రూపాయాల ఆదాయం లభించేంది. ఈ ఆదాయాన్ని ఓయూలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ఉపయోగించేవారు. తెలంగాణలో కొత్త వర్సిటీల రాకతో ఓయూకు ఆదాయం తగ్గింది. దీంతో ఉన్న నిధులు వేతనాలు, పించన్ల చెల్లింపులకే ఉపయోగిస్తున్నారు. మౌలిక వసతులు లేక నిలిచిన హాస్టల్ భవన ప్రారంభోత్సవం ఓయూ క్యాంపస్ ఐపీఈ ఎదురుగా 500 మంది పీజీ విద్యార్థుల వసతి కోసం పెద్ద హాస్టల్ భవనాన్ని నిర్మించారు. కానీ అందులో ఫర్నీచర్, మంచాలు (బెడ్స్) వంట సామాన్లు, ఫ్యాన్లు, టేబుల్స్, కుర్చీలు ఇతర మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు నిధులు లేకపోవడంతో భవనం ప్రారంభానికి నోచు కోకుండా పోయింది. హాస్టల్ గదుల కొరతతో విద్యార్థులు నిత్యం రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మించిన మెగా హాస్టల్ భవనంలో వసతులు లేక ఉత్సవ విగ్రహంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అభివృద్ధి గ్రాంట్స్‌ను పూర్తిగా నిలిపి వేసింది. ప్రస్తుతం ఓయూకు లభించే ప్రతి పైసాను నిబంధనలకు విరుద్ధంగా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. ఓయూకు నిధులు తగ్గడం, ప్రభుత్వం నుంచి లభించే బ్లాక్గ్రాంట్స్లో కోత విధించడంతో ప్రతి నెలా వేతనాల చెల్లింపు సవాల్‌గా మారి విద్యార్థుల అభివృద్ధికి కోసం వాడాల్సిన నిధులను సైతం వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. -
బ్యాంకు‘బంధు’!
సాక్షి, హైదరాబాద్: రైతుల పట్ల బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. తమ అప్పులను వసూలు చేసుకోవడంపైనే అవి దృష్టి సారించాయి. రబీ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాలో పడగానే, ఆ సొమ్మును వారి అప్పుల కింద జమ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతుబంధు సొమ్మును అలా అప్పుల కింద జమ చేసుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. అయినా కేంద్రం ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంలో విఫలమైంది. రైతులకు కీలకమైన రబీ సీజన్లో పెట్టుబడి సొమ్ము ఉపయోగపడాల్సి ఉండగా, ఆ డబ్బును బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సరాసరి ప్రతీ రైతుకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు రైతుబంధు కింద సొమ్ము అందుతుంది. ఆ సొమ్మును పాత బాకీల కింద వసూలు చేసుకుంటే రైతుకు మిగిలేది శూన్యమే. దీంతో ప్రభుత్వం అందజేసే రైతుబంధు సొమ్ము బ్యాంకులకు వరంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. అయితే ఎంతమంది రైతుల నుంచి పెట్టుబడి సొమ్మును బ్యాంకులు అప్పులుగా వసూలు చేశాయన్న వివరాలు తమకు అందలేదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. 15 లక్షల మంది రైతులు.. రూ.1,700 కోట్లు జమ.. ఖరీఫ్‌లో 52 లక్షల మంది రైతులకు రూ. 5,100 కోట్ల వరకు రైతుబంధు కింద ప్రభుత్వం మొదటిసారి పంపిణీ చేసింది. ఇంకా అనేకమంది ఎన్ఆర్ఐలకు, ఇతరులకు పెట్టుబడి చెక్కులు ఇవ్వాల్సి ఉండగా, వివిధ కారణాలతో అవి నిలిచిపోయాయి. ఇక రబీ సీజన్ కోసం పెట్టుబడి చెక్కులను వ్యవసాయశాఖ వర్గాలు ముద్రించాయి. అయితే ఎన్నికల కమిషన్ చెక్కుల పంపిణీ చేపట్టొద్దని, రైతు ఖాతాల్లోకే బదిలీ చేయాలని సూచించడంతో ఆ ప్రకారమే రైతుబంధును అమలు చేస్తున్నారు. సోమవారం నాటికి 15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. ఇంకా మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. వారికి కూడా పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నారు. అయితే అప్పుల కింద పెట్టుబడి సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులున్న బ్యాంకు ఖాతాలు కాకుండా ఇతర బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వాలని, ఒకవేళ లేకుంటే కొత్తగా మరో బ్యాంకు ఖాతా తెరవాలని వ్యవసాయ శాఖ రైతులను కోరింది. రైతుబంధు సొమ్మును బ్యాంకులు రైతు అప్పుల కింద జమ చేసుకుంటుండటంపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే బ్యాంకులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు. ఎన్ఆర్ఐల ఖాతాల్లో ఖరీఫ్ చెక్కుల జమకు సన్నాహాలు ఇదిలాఉండగా ఇక్కడ భూమి కలిగి విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు ఖరీఫ్‌లో చెక్కుల పంపిణీ జరగలేదు. ఎట్టకేలకు వారి అనుమతి మేరకు ఇక్కడి వారి కుటుంబ సభ్యులకు చెక్కులు ఇచ్చేలా సర్కారు ఆదేశాలు జారీచేసింది. అయితే ఎన్నికల సీజన్ మొదలు కావడంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్ నిలిపివేయడంతో ఎన్ఆర్ఐ చెక్కుల పంపిణీకి కూడా బ్రేక్ పడింది. అయితే ఆ చెక్కుల సొమ్మును సంబంధిత ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏ బ్యాంకు ఖాతాలో వేయాలో ఎన్ఆర్ఐలు తెలియజేస్తే ఆ ప్రకారం చేస్తామని వెల్లడించాయి. మొత్తం 63 వేల మంది ఎన్ఆర్ఐల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కానీ సమాచారం లేకపోవడంతో ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోకి రైతుబంధు సొమ్మును బదిలీ చేయలేదని అధికారులు తెలిపారు. -
ప్ర'గతులు'
- ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు - వేలాదిగా పింఛన్‌దారుల తొలగింపుపై విమర్శలు - కొండపిలో ‘జన్మభూమి -మా ఊరు’ లాంఛన ప్రారంభం నేడు శంకర్రావు వయస్సు 70 ఏళ్లు. రేషన్ కార్డులో తక్కువ వయస్సు నమోదైందని అతను ప్రభుత్వ పింఛన్ తీసుకోవడానికి అనర్హుడట. వయస్సు ధ్రువీకరణకు వైద్యుల దగ్గరకెళితే..మేమెలా నిర్ధారిస్తామని చెప్పి పంపారు. గత నాలుగేళ్లుగా ఠంచనుగా పింఛన్ పొందినా ప్రస్తుత సర్కారు వేసిన అనర్హత వేటుతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాసరావు ‘సదరమ్’ శిబిరంలో వికలాంగుడిగా అన్ని పరీక్షలు చేయించుకుని నాలుగేళ్లుగా ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సర్వే అధికారులు వచ్చినప్పుడు వికలాంగ ధ్రువీకరణ పత్రం లేదంటూ అతన్ని ప్రభుత్వ పింఛన్పొందేందుకు అనర్హుడిగా ప్రకటించారు. సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేక అతను ఆశలొదిలేసుకున్నాడు. సావిత్రమ్మ భర్త చనిపోయి ఏళ్లు గడిచాయి. అప్పట్లో తహశీల్దార్, గ్రామసర్పంచి పంచనామా జరిపి మరణ ధ్రువీకరణ పత్ర మిచ్చారు. ఇప్పుడేమో అది పనికిరాదంటూ ... వితంతు పింఛన్ తీసుకోవడానికి అనర్హురాలిగా సావిత్రమ్మ పేరును జాబితాలో నుంచి తొలగించారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయం ద్వారా ధ్రువీకరణ తెచ్చుకోవాలట. ఇప్పటికప్పుడు సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే, ఖర్చు రూ.వేలల్లో భరించాల్సి రావడంతో ఆర్థికస్థోమత లేని ఆమె మౌనంగా ఉంది. సాక్షి, ఒంగోలు: గాంధీ జయంతి రోజునే ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల సర్వే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.500 తీసుకునే పింఛన్‌దారులు ఇకనుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు అర్హతను బట్టి లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా జిల్లాలో అధికారులు, ప్రత్యేకంగా నియమించిన సర్వే కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హుల పేర్లను తొలగించి.. అర్హుల జాబితాను తయారు చేశాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత తదితర పింఛన్లు పొందుతున్న వారు ఇప్పటివరకు 3.12 లక్షల మంది ఉన్నారు. వీరిలో 34 వేల మందికిపైగా పేర్లను అనర్హుల జాబితాలోకి చేర్చారు. మరో రెండు వేల మంది ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన ప్ర‘గతులు' కొనసాగుతోంది. కమిటీల్లో అధికారపార్టీ నేతలుండటంతో ఇష్టానుసారంగా అర్హులను తొలగించి.. తమ కార్యకర్తలు, అనుచరులకు లబ్ధిచేకూర్చడానికే పనిచేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగించిన జాబితాలో సుమారు 20 వేల మందికిపైగా పింఛన్‌దారులకు ఆధార్కార్డుల్లేవని తొలగించగా, మరికొందరికి వయస్సు తక్కువని, కొందరు వితంతువులు, వికలాంగులు కాదని, చేనేత కార్మికులే కాదంటూ తమకు నచ్చని పేర్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిధిలోని అత్యధిక గ్రామాల్లో కొందరిపై పనిగట్టుకుని కక్షపూరితంగా తొలగించారంటూ.. నిరుపేద (బీపీఎల్) కేటగిరీ కాదని, మరికొందరు గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారంటూ .. ఇలా రకరకాల కారణాలతో పింఛన్‌దారులను అర్హులజాబితాలో నుంచి తొలగించారు. సుజలం ఎలా..? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆరంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం, ఐదువేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ప్లాంటుకు రూ.2 లక్షల (వెయ్యిలోపు జనాభా) నుంచి రూ.4 లక్షలు (మూడువేల లోపు జనాభా) వరకు ఖర్చవుతోందని అంచనా వేశారు. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలుండగా, వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఇందుకుగాను 818 ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. దాతలెవరూ ముందుకురాకపోవడం, కొన్ని రాజకీయ సమస్యల నేపథ్యంలో తొలిదశ లో మండలానికొకటి చొప్పున 56 ఆర్వోప్లాంట్లు అమల్లోకి తెస్తున్నట్లు జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం ..దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని రెండ్నెల్లకిందట స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి విడతలవారీగా జిల్లాలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర దాతలతో జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ జేఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌లు సమావేశాలు నిర్వహించారు. ఎన్నిసార్లు సమీక్షించినా.. సమావేశాలు పెట్టినా.. వారినుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలో 56 ప్లాంట్లు అమల్లోకి తేవాలని అనుకున్నా... అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క కొండెపి నియోజకవర్గంలో 9 ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కాగా .. ఆ నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలోని ప్లాంటును మంత్రి సిద్ధా రాఘరావు గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నిధులివ్వని ‘జన్మభూమి - మా ఊరు’ రోజుకో గ్రామంలో ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఎ. కరికాలవలన్ను నియమించింది. మండలంలో 14 గ్రామాలుంటే ఒక బృందం, 25 గ్రామాలుంటే రెండు, అంతకు మించితే మూడు బృందాలుగా అధికారులను ఇప్పటికే విభజించారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగుచోట్ల, చీరాల, మార్కాపురం, కందుకూరుల్లో రోజుకు మూడుచోట్ల సభలకు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ఎంపీడీవో, తహశీల్దార్, కమిషనర్, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తారు. బ్యానర్లు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులతో ప్రచారం కల్పించాలి. పింఛన్ల పంపిణీతో పాటు ప్రజల సమస్యలకు తక్షణపరిష్కారాలు చూపేందుకు అధికారులు పనిచేయాలి. అయితే, జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల కాకుండా అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారుల అంతర్మథనం. జిల్లాకోరోజు పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. ‘ప్రకాశం’ పర్యటనలో రెండు నియోజకవర్గాలు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
వైఎస్ఆర్ అభయహస్తం: ఫిబ్రవరి 6, 2008న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. నవంబర్ 1, 2009న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య దీని పేరును ‘వైఎస్ఆర్ అభయహస్తం’గా మార్చి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (ఏడాదికి 365 రూపాయలు) చొప్పున ప్రీమియం చెల్లించాలి. స్త్రీలు చెల్లించే రూపాయికి ప్రభుత్వం కూడా రూపాయి చొప్పున కలుపుతుంది. సభ్యులు సహజ మరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి అందజేస్తారు. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా (9, 10, ఇంటర్మీడియెట్ మొదటి, రెండు ఏళ్లు) వరకు 4 ఏళ్లు నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పింఛన్ ఇస్తారు. ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకానికి Society for Elim-ination of Rural Poverty (SERP) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందిరమ్మ కలలు: ఫిబ్రవరి 2, 2013న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టంపై అవగాహన కోసం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5, 2013న ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను ప్రజాప్రతినిధులు సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డీ లేని పంట రుణాలు (రైతుశ్రీ): దేశంలోనే మొదటిసారి మన రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది(సీఎం - కిరణ్‌కుమార్ రెడ్డి). ఏడాదిలోపే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తారు. లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు. ఇందిరమ్మ : (INDIRAMMA-Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas) ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2006న పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్య, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, పింఛ న్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు. NREGP(National Rural Employment Guarantee Programme): సెప్టెంబర్ 19, 2005న ూఖఉఎ్క చట్టం చేశారు. ఫిబ్రవరి 2, 2006న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 2, 2009న దీని పేరును ‘మహాత్మాగాంధీ NREGP’ గా మార్చారు. NREG-Act ప్రకారం 6 నెలల్లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయాలి. మొదటి విడతలో భాగంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా 200 జిల్లాల్లో అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు. రెండో దశ(2007)లో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి...1. శ్రీకాకుళం, 2. ప్రకాశం, 3.గుంటూరు, 4. నెల్లూరు, 5. కర్నూలు, 6. తూర్పుగోదావరి. మూడో దశలో ఏప్రిల్ 1, 2008న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి... 1. విశాఖపట్నం, 2. పశ్చిమగోదావరి, 3. కృష్ణా. ప్రారంభంలో ఈ పథకాన్ని 100 రోజులకు ప్రకటించి, ఒక రోజు వేతనం రూ 100గా నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రం దినసరి వేతనంగా రూ 115 చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ 149 అందజేస్తోంది. ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. దీంట్లో 60 శాతం వేతనాల కోసం, మిగిలిన 40 శాతం పనిముట్ల కోసం కేటాయించాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనట్లయితే దినసరి వేతనంలో 50 శాతం నష్టపరిహారంగా చెల్లించాలి. ఈ పథకాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ 1000 వరకు జరిమానా విధించవచ్చు. ఎన్ఆర్ఈజీపీలో విలీనమైన పథకాలు: 1. NFWP2004 (National Food for Work Programme) 2. SGRY-2001 (Sampurna Grameena Rozgar Yojana) ఏడాది ప్రీమియం కింద ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తే, ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి * 50,000 బీమా కల్పిస్తారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం (IKP) (2005-06): రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా పథకాలను విలీనం చేసి ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం)గా మార్చారు. మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారిని లక్షాధికారులుగా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో 80 లక్షల పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. ఐకేపీని ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ’ (SERP - Society for Elim-ination of Rural Poverty) అమలు పరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు ఐకేపీ సమగ్రమైన పథకం. మహిళా స్వయం సహాయక సంఘాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య పథకాలు: NMB (ఆగస్టు 15, 1995 ) (National Maternity Benefit Scheme): ‘జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం’ (National Social Assistance Pro-gramme)లో ఇది ఒకటి. ఈ పథకానికి కావల్సిన వనరులను కేంద్రం నిధుల నుంచి రాష్ట్రాలకు సమకూరుస్తారు. లబ్ధిదారులైన గర్భి ణులకు లభించాల్సిన సహాయక నిధులను ప్రసవానికి ముందు 8 నుంచి 12 వారాల మధ్యలో అందిస్తారు. జన్మించిన నూతన శిశువుకు పోలియో, బీసీజీ మొదలైన వ్యాధి నిరోధక టీకాల సదుపాయాన్ని కల్పిస్తారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం: (Integrated Child Development Services) ఈ పథకాన్ని 1975లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలు ఈ పథకంలో లబ్ధిదారులు. పోషక, ఆరోగ్య స్థాయిని పెంపొందించడం; పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడటం; మరణాల రేటు, అనారోగ్యం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యాలు. లబ్ధిదారులకు పౌష్టికాహారం, విటమిన్ ‘ఎ’, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణ, మంచినీటి సదుపాయం, పారిశుధ్యం మొదలైన సౌకర్యాలను అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఐఇఈ పథకం యూపీఏ ప్రభుత్వంలో జాతీయ కార్యక్రమంగాఅమల వుతోంది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ పథకం: వెనుకబడిన, బలహీన వర్గాల్లోని గర్భిణుల్లో 40 శాతం మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి పౌష్టికాహారాన్ని ముఖ్యంగా అప్పటికప్పుడు తినగలిగేటట్లు (Ready To Eat-RET) అందించడం ఈ పథకం ప్రత్యేకత. రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తుంది. 6 నెలల నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ 80 గ్రాముల పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, భూమి లేని శ్రామికులు, మురికివాడల్లో నివసించే ప్రజలను ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. బాలికా సమృద్ధి యోజన (BS్గ) (1997): రాష్ర్టంలో ఉన్న బాలికల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ, శిశు జననాల పట్ల ప్రజల్లో మార్పును తీసుకు రావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రసవించినవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారికి కావల్సిన అదనపు పౌష్టికాహారాన్ని అందిస్తారు. యుక్త వయసు బాలికల కోసం అభివృద్ధి పథకం: (Adolescent Girls Scheme) 11 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, సరైన శారీరక, మానసిక వృద్ధిని పెంపొందింప చేయడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్షరాస్యతను పెంచి, ఆరోగ్యవంతులుగా చేయడంతోపాటు, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ఆదర్శప్రాయ తల్లులుగా తీర్చిదిద్దడం ఈ పథకంలోని ముఖ్య అంశాలు. కిశోర బాలికా పథకం: బాల్య వివాహాలను అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నూటికి నూరు శాతం బాలికలకు ప్రాథమిక విద్య అందేటట్లు చేయడం, యుక్త వయసులో ఉన్న బాలికలకు అనువైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం ఈ పథకం ముఖ్య అంశాలు. డ్వాక్రా (DWCRA): (Development of Women and Ch-ildren in Rural Areas) 1982 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు, ూ్ఖఐఇఉఊ సంస్థ ఈ పథకం ఖర్చులను భరించేవి. 1996 నుంచి UNICEF నిధులను ఆపివేసినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూ రు చేస్తున్నాయి. రివాల్వింగ్ ఫండ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకాన్ని IRDPM అనుబంధ కార్యక్రమంగా ప్రారంభించారు. సామాజిక కారణాల వల్ల సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం (IRDP)ను మహిళలు వినియోగించుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ డ్వాక్రా పథకం అవసరం ఏర్పడింది. ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన స్థానంలో ఉంది. స్వయం సహాయక సంఘాలతో ఏర్పడిన ఈ పథకం మన రాష్ర్టంలో స్త్రీల సాంఘిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. స్త్రీలలో వ్యవస్థాపన నైపుణ్యాలను పెంచడానికి ఈ పథకం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అనేక రాష్ర్ట ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్’ (KVIC), హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డులను ఏర్పాటు చేశాయి. వారికి కావల్సిన ఆర్థిక కార్యకలాపాలన్నీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఙ్ట్చఛగ్రామ స్థాయిలో సమితి అభివృద్ధి అధికారి (బీడీఓ) లేదా మండలాభివృద్ధి అధికారి (ఎండీఓ) పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ఈ పథకం నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తాయి. జిల్లా మహిళా సహాయ ప్రాజెక్ట్ అధికారి జిల్లాలో కార్యక్రమాలను సమీక్షిస్తారు. డ్వాక్రా పథకం అమల్లో నెల్లూరు జిల్లా {పథమ, ఖమ్మం రెండు, గుంటూరు జిల్లా చివరి స్థానాల్లో ఉన్నాయి. డ్వాక్రా పథకాన్ని ఏప్రిల్ 1,1999న ‘స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన’ (SGSY) పథకంలో విలీనం చేశారు. ఇందిరా ఆవాస్ యోజన (ఐఅ్గ) (1985-86): ఇందిరా ఆవాస్ యోజన పథకం జవహర్ రోజ్‌గార్ యోజన (JRY) పథకంలో ఉప పథకం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేదలకు, విముక్తి పొందిన బానిసలకు చిన్న ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
బంగారు తల్లి (2013) 2013 జూన్ 19న చట్టం చేశారు. 2013 మే 1 తర్వాత జన్మించిన బాలికలకు (కుటుంబంలో ఇద్దరికి) వర్తిస్తుంది. తెల్ల కార్డుదారులకు వర్తిస్తుంది. పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఆడపిల్లల సంఖ్య పెంపుదల, ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి డిగ్రీ చదివే వరకు (21 ఏళ్లు) ఏటా కొంత మొత్తం చెల్లిస్తారు. శిశువు పుట్టగానే రూ 2500, టీకాల నిమిత్తం రూ 1000 నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇంటర్మీడియెట్(18 ఏళ్లు) తర్వాత రూ. 50వేలు, డిగ్రీ పూర్తైన(21 ఏళ్లు)తర్వాత లక్ష రూపాయలను అందిస్తారు. ఈ పథకం కింద ఒక బాలికకు మొత్తం రూ 2.16 లక్షలను అందిస్తారు. అమ్మ హస్తం 2013 ఏప్రిల్ 11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు. తెల్ల కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. {పతి నెలా 9 రకాల నిత్యావసర వస్తువులను రూ 185లకు అందిస్తారు. ఈ 9 వస్తువుల మార్కెట్ ధర రూ 292. (రూ 107లు లబ్ధి పొందుతారు) 9 వస్తువులు 1. కందిపప్పు (కిలో) రూ 50 2. గోధుమలు (కిలో) రూ 07 3. గోధుమపిండి (కిలో) రూ 16.50 4. చక్కెర (బీ కిలో) రూ 6.75 5. పామాయిల్ (లీటర్) రూ 40 6. పసుపు (100 గ్రా.) రూ 10 7. చింతపండు (బీ కిలో) రూ 30 8. కారం (బి కిలో) రూ 20 9. ఉప్పు (కిలో) రూ 5 మొత్తం రూ 185 మార్కెట్ ధర రూ 292 మిగులు రూ 107 ఈ పథకం ద్వారా 2.25 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. బాలామృతం (2013 నవంబర్ 14) నవజాత శిశువులకు పోషక విలువలు ఉన్న ఆహారం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఇఈ (Integrated Child Development Scheme) కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ 75 కోట్ల నిధులు మంజూరు చేసింది. మన బియ్యం (2013 జనవరి 16) ఏ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని ఆ ప్రాంతంలోనే సేకరించి మరపట్టించి, ఆ బియ్యాన్ని ఆ ప్రాంత చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల కార్డుదారులకు సరఫరా చేసే పథకం. ఈ పథకం ద్వారా రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని అనుసరిస్తోంది. రాష్ర్టంలో 7 జిల్లాల్లో 2013 జనవరి 16న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. 1. కరీంనగర్, 2. వరంగల్, 3. నల్గొండ, 4. గుంటూరు, 5. ప్రకాశం, 6. నెల్లూరు, 7. చిత్తూరు. మన బియ్యం పథకం ద్వారా సేకరించిన బియ్యాన్ని ‘రూపాయికే కిలో బియ్యం’ పథకం ద్వారా అందిస్తున్నారు. రాజీవ్ ఉద్యోగశ్రీ (2007 జూలై) నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లల్లో 10 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడం దీని లక్ష్యం (ప్రైవేట్ రంగంలో). రాజీవ్ ఉద్యోగశ్రీ సొసైటీని Employ-ment and Training Department కింద నెలకొల్పారు. విభిన్న రంగాల్లో ఉపాధి సామర్థ్యాన్ని గుర్తించి, అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తారు. రాజీవ్ యువ కిరణాలు (ఆర్‌వైకే) (2011 ఆగస్టు 20) {పతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం (ప్రైవేట్ రంగంలో). ఆర్‌వైకే అమలు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీని పేరు REECAP (Rajeev Education and Employ- ment Council of Andhra Pradesh) ఆర్‌వైకే అమలు కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దీని పేరు REEMAP (Rajeev Education and Employment Mission of Andhra Pradesh). ఆర్‌వైకే అమలును కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 15 రోజులకోసారి సమావేశమై పర్యవేక్షిస్తుంది. రాజీవ్ యువశక్తి (2004 నవంబర్ 19) అర్హులైన నిరుద్యోగ యువతీ యువ కులు... పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి పొందడానికి రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, రుణ సదుపాయాలను అందిస్తారు. ఈ పథకం కింద రూ. 50,000 లేదా లక్ష రూపాయలను వ్యక్తిగత రుణాలుగా అందిస్తారు. రూ. 5 లక్షలవరకు గ్రూపు రుణాలను కూడా అందిస్తారు. బాల కిరణాలు (2012 జనవరి 2) }M>Mుళం జిల్లాలో ప్రారంభించారు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం. విద్యతో పాటు ఉపాధికి తోడ్పడే వృత్తి విద్యా కోర్సులను పాఠశాల స్థాయి నుంచే అందిస్తారు. చిన్నారి చూపు (2012 అక్టోబర్ 29) పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కంటిచూపు, కళ్ల సంరక్షణకు సంబంధించిన పథకం. ఈ పథకంలో మూడు దశలు ఉంటాయి. 1) కంటి పరీక్షలు చేయడం 2) అవసరం అయిన వారికి కంటి అద్దాలు అందజేయడం 3) కంటి ఆపరేషన్లు నిర్వహించడం. ఇందిరా ఆవాస్ యోజన (IA్గ) (1985-86) దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు గృహ నిర్మాణం కోసం ప్రారంభించారు. సమగ్ర ఆవాస్ యోజన (AY) (1999-2000) ఇంటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రారంభించారు. రాజీవ్ ఆవాస్ యోజన (RAY) (2009) మురికివాడల నిర్మూలన లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మీ సేవ (2011 నవంబర్ 14) తిరుపతిలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇందులో ఈ-సేవ, ఏపీ-ఆన్లైన్ పథకాలను కలిపారు. ‘సులభంగా, వేగంగా’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. మీ సేవ కేంద్రాల నుంచి సేవలను పొందే వ్యక్తి చెల్లించాల్సిన రుసుం రూ. 30. మీ సేవ ద్వారా డిజిటల్ సంతకాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న తొలి రాష్ర్టం - ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బాట (2008 మార్చి 1) అధికారులు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సందర్శించి, విద్యార్థుల సమస్యలను తీర్చే సంక్షేమ కార్యక్రమం. వసతి గృహాల్లో మెరుగైన సేవలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. రైతు బంధు (2008) పంట చేతికి వచ్చినప్పుడు విక్రయ ధరలు తక్కువగా ఉన్న సమయంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ నిల్వలపై 90 రోజుల రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ రుణంపై వడ్డీ ఉండదు. ఈ కాలంలో ధర పెరిగినప్పుడు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉంది. దీపం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు, డ్వాక్రా గ్రూపు మహిళలకు ఈ పథకం కింద సిలిండర్, గ్యాస్ స్టౌవ్‌ను అందిస్తారు. రూ. 1250లకే గ్యాస్ కనెక్షన్‌ను సబ్సిడీ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. జనశ్రీ బీమా కుటుంబ వార్షిక ఆదాయం రూ 20 వేల లోపు ఉండి, ఒకే బాలిక ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. బాలికకు 9 నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి రూ1200 స్కాలర్షిప్ అందిస్తారు. బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత లక్ష రూపాయలు చెల్లిస్తారు. ఈ పథకం కింద రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ... జీవిత బీమా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందిరమ్మ జీవిత బీమా (2008 ఏప్రిల్) భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద అందించే నగదు వివరాలు: 1. {పమాదవశాత్తు మరణం: రూ 75,000 2. సహజ మరణం: రూ 30,000 3. అంగవైకల్యం: రూ 75,000 4. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ 37,500 నగదు అందిస్తారు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం : 2009 నవంబర్ 1 - 2008 ఫిబ్రవరి 6న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభయహస్తం పేరుతో ఒక పథకం ప్రారంభించారు. - 2009 నవంబర్ 1న దీని పేరును అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య గారు ‘వైఎస్ఆర్ అభయహస్తం’గా మార్చారు. ముఖ్యమంత్రి రోశయ్య గారు పథకాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. - 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న స్త్రీలు రోజుకు ఒక్క రూపాయి (సంవత్సరానికి 365 రూపాయలు) చొప్పున ప్రీమియం చెల్లిస్తూ ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. - స్త్రీలు చెల్లించే ఒక్క రూపాయి ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి చొప్పున ఇస్తుంది. - సభ్యురాలు సహజమరణం పొందితే రూ 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 75,000 నామినీకి అందిస్తారు. - సభ్యురాలి ఇద్దరు పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ((10+2 లేదా 10+ఐటీఐ) లేదా 9, 10, ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాలు) వరకు 4 సంవత్సరాలు ------ నెలకు రూ 100 చొప్పున (ఏడాదికి రూ 1200) ఉపకార వేతనం చెల్లిస్తారు. - 60 ఏళ్లు పైబడిన మహిళలకు రూ 500 నుంచి రూ 2200 వరకు పెన్షన్ అందిస్తారు. - ఈ పథకం స్వయం సహాయక బృందం మహిళలకు సౌకర్యం కల్పిస్తుంది. - ఇందిరాక్రాంతి పథం (IKP)లో భాగంగా దీన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తుంది. - ఈ పథకానికి Society for Elimination of Rural Poverty (SERP) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందిరమ్మ కలలు : 2013 ఏప్రిల్ 5 - 2013 ఫిబ్రవరి 2న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికా చట్టాన్ని తీసుకువచ్చారు. - ఈ చట్టంపై అవగాహన తేవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా 2013 ఏప్రిల్ 5న ఈ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు. - {పజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ కాలనీలు సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డీ లేని పంట రుణాలు : (రైతుశ్రీ) - దేశంలోనే మొదటిసారిగా మన రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టింది (ముఖ్యమంత్రి-కిరణ్‌కుమార్ రెడ్డి). - సంవత్సరంలోనే పంట రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. - ఒక లక్ష వరకు వడ్డీ లేని పంట రుణాలలు అందిస్తారు. - ఒక లక్ష నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ పథకాన్ని కల్పిస్తారు. INDIRAMMA (Integrated Novel Development In Rural Areas and Model Municipal Areas) - 2006 April 1 - ఈ పథకాన్ని 2006 ఏప్రిల్ 1న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలంలోని ‘పశ్చిమ ఖండ్రిక’ గ్రామంలో ప్రారంభించారు. - ఈ పథకం కింద అన్ని ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా గృహాలు, విద్యా సౌకర్యం, వైద్యం, రోడ్లు, మురుగునీటి పారుదల, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయం, పెన్షన్ మొదలైన సదుపాయాలు కల్పిస్తారు. NREGP (National Rural Employment Guarantee Programme) : - 2005 సెప్టెంబర్ 19 ూఖఉఎ్క చట్టం చేశారు. - 2006 ఫిబ్రవరి 2 రోజున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని నార్సల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. - 2009 అక్టోబర్ 2న దీని పేరును మహాత్మాగాంధీ ూఖఉఎ్క గా మార్చారు. - ూఖఉఎఅఛ్టి ప్రకారం 6 నెలల లోపు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకం అమలుపరచాలి. - దేశ వ్యాప్తంగా ఈ పథకం మొదటి విడతగా 200 జిల్లాల్లో అమలు చేశారు. - ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశలో 13 జిల్లాల్లో అమలు చేశారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో అమలు ........ (హైదరాబాద్ తప్ప). - ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశలో 2007 మేలో ఆరు జిల్లాల్లో అమలు చేశారు. అవి... 1) శ్రీకాకుళం, 2) ప్రకాశం, 3) గుంటూరు, 4) నెల్లూరు, 5) కర్నూలు, 6) తూర్పుగోదావరి. - 3వ దశలో 2008 ఏప్రిల్ 1న మూడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అవి... 1) విశాఖపట్టణం, 2) పశ్చిమగోదావరి, 3) కృష్ణా. - {పారంభంలో ఈ పథకాన్ని 100 రోజులు, రోజు వేతనం రూ. 100/-లుగా నిర్ణయించారు. - {పస్తుతం కేంద్రంలో రోజు వేతనం రూ. 115/-లు చెల్లిస్తుండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ. 149/-లు చెల్లిస్తుంది. - ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. - ఈ వ్యయాన్ని 60% వేతనాల కోసం, మిగిలిన 40% పనిముట్ల కోసం కేటాయించాలి. - ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో పని కల్పించాలి. లేనిచో రోజూ వేతనంలో 50% నష్టపరిహారంగా చెల్లించాలి. - ఈ పథకం అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై రూ. 1000/- వరకు జరిమానా విధించవచ్చు. - ఈ పథకంలో విలీనమైన పథకాలు. 1. National Food for Work Programme (NFWP2004) 2. Sampurna Grameena Rozgari Yojana (SGRY-2001). - సంవత్సరం ప్రీమియం కింద ఒకరోజు వేతనాన్ని చెల్లిస్తే ఉపాధి కోసం వెళ్లినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 50,000/- బీమా కల్పిస్తారు. - MG-NREGS ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘రాగాస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం (IKP) : 2005-06 - రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వెలుగు, డ్వాక్రా, పథకాలను విలీనం చేసి ఐఓ్క గా మార్చారు. - మహిళా సాధికారత పెంచడమే లక్ష్యంగా, మహిళా స్వయం సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మహిళలను లక్షాధికారులుగా చేయడమే