తొమ్మిదో ప్రణాళికను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? | which government has been introduced the ninth plan? | Sakshi
Sakshi News home page

తొమ్మిదో ప్రణాళికను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది?

Published Sun, Jul 13 2014 10:24 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

తొమ్మిదో ప్రణాళికను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? - Sakshi

తొమ్మిదో ప్రణాళికను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది?

  ప్రణాళికలు

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)
ఏడో పంచవర్ష ప్రణాళిక తర్వాత 1990-92 మధ్య రెండేళ్లపాటు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. ఆ తర్వాత 1992-97 కాలానికి పి.వి. నరసింహారావు ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ద్రవ్యలోటు, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం, కనిష్ఠ స్థాయి పెట్రోలు నిల్వలు, దిగుమతుల చెల్లింపులకు విదేశీ మారక ద్రవ్య సహాయానికి అంతర్జాతీయ సంస్థలు నిరాకరించడం లాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఈ ప్రణాళిక ప్రారంభమైంది. స్థూల అసమతౌల్య పరిస్థితులను చక్కదిద్ది, ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను చైతన్యవంతం చేయడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జాతీయాదాయం వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం, ఉత్పాదక ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఊఈఐ) అత్యవసరమని భావించి, మార్కెట్ల ప్రాతినిధ్యం పెంచడానికి సరళీకృత విధానాలు అమలు చేయాలని నిశ్చయించారు.
     ‘మానవ వనరుల అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణాభివృద్ధి’ ప్రాధాన్య అంశాలుగా 8వ ప్రణాళికను ప్రారంభించారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దీన్ని సూచనాత్మక ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. 8వ ప్రణాళిక వ్యయం రూ. 4,85,460 కోట్లు. దీంట్లో ఇంధన రంగానికి 27%, సాంఘిక సేవలకు 22%, వ్యవసాయం, నీటిపారుదల రంగానికి 21%, రవాణా రంగానికి 21%, పరిశ్రమలకు 10% కేటాయించారు. రవాణా, ఇంధనం లాంటి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, పబ్లిక్ పెట్టుబడుల ద్వారా సరళీకృత విధానాలు, ప్రైవేటు రంగ పెట్టుబడులు ఉత్పాదక ఉద్యోగితను కల్పిస్తాయని భావించి, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన ద్రవ్య వనరులను సాంఘిక రంగాల అభివృద్ధికి మళ్లించాలని నిర్ణయించారు.
     ఈ ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 5.6% కాగా, సాధించిన వృద్ధిరేటు 6.7%, తలసరి ఆదాయ వృద్ధిరేటు 4.6%.
     NRF: సరళీకృత ఆర్థిక విధానాల వల్ల నష్టపోయిన వ్యక్తులకు, సంస్థలకు సహాయం చేయడానికి 1992 ఫిబ్రవరిలో ూ్చ్టజీౌ్చ ఖ్ఛ్ఛఠ్చీ ఊఠఛీ (ూఖఊ)ను ఏర్పాటు చేశారు. నిధుల కొరత కారణంగా దీన్ని 2000లో రద్దు చేశారు.
     ITRA:గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారి ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి ఆధునిక పనిముట్లను పంపిణీ చేసే కార్యక్రమం ఠఞఞడ ౌజ ఐఝఞటౌఠ్ఛిఛీ ఖీౌౌజుజ్టీట ౌ్ట ఖఠట్చ అట్టజీట్చటను 1992లో ప్రారంభించారు. మొదట దీన్ని ఐఖఈ్కలో అంతర్భాగంగా అమలు చేశారు. 1999లో ఐఖీఖఅను ఎ్గలో విలీనం చేశారు.
     ఉఅ: 1972-73లో మహారాష్ట్ర ప్రభు త్వం దేశంలోనే మొదటిసారిగా Emplo-yment Guarantee Scheme of Maharashtraపథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం అమలు చేయడానికి 1993లో Employ-ment Assurance Scheme (EAS)ను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతంవారికి వంద రోజులు ఉపాధి కల్పించే కార్యక్రమం ఇది. దీన్ని‘జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ’ (డీఆర్‌డీఏ) అమలు చేస్తుంది. ఉఅ ను జవహర్ గ్రామీణ సంవృద్ధి యో జన (JGSY–1999)తో కలిపి 2002 సెప్టెంబరు 25న సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన(SGRY)ను ప్రారంభించారు.
     Prime Minister's Rozgar Yojana (PMRY):దీన్ని 1993 అక్టోబరు 2న ప్రారంభించారు. మొదట పట్టణ ప్రాంతాల్లో అమలు చేశారు. 1994 ఏప్రిల్ 1 నుంచి దేశమంతటికి విస్తరించారు. దీని ద్వారా 18ృ35 మధ్య వయసు ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఇద్దరి కంటే ఎక్కువ సభ్యులు కలిిసి ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రూ. 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలపై సబ్సిడీ 15 శాతం వరకు లేదా గరిష్ఠంగా రూ. 15,000 వరకు ఉంటుంది. లబ్దిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు 22.5%, ఇతర వెనుకబడిన తరగతుల వారికి 27% వరకు రిజర్వేషన్ కల్పిస్తారు. PMRY¯]lు 2008 ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్‌‌స ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP)లో విలీనం చేశారు.
     మహిళా సంవృద్ధి యోజన (MSY):గ్రామీణ మహిళల్లో పొదుపు ప్రవృత్తి పెంచడానికి, వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్రం నిధులతో 1993 అక్టోబరు2న ఈ పథకం ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలు తమ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీసుల్లో రోజుకు కనీసం ఒక్క రూపాయికి తగ్గకుండా పొదుపు చేసి, ఆ సొమ్ము మొత్తాన్ని ఏడాది వరకు నిల్వ ఉంచితే కేంద్ర ప్రభుత్వం 25 శాతం బోనస్ ఇస్తుంది. అంటే గరిష్ఠంగా సంవత్సరానికి రూ. 300 వరకు ఇస్తుంది. దీన్ని 2001 జూలై 12న మహిళా స్వయం సిద్ధ యోజన (MSSY)లో విలీనం చేశారు.
     MPLAD: మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్‌ను 1993 డిసెంబరు 23న ప్రారంభించారు. పార్లమెంట్ సభ్యులకు వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలను ఇస్తుంది. లోక్‌సభ ఎంపీ ఈ మొత్తాన్ని తన నియోజకవర్గానికి, రాజ్యసభ ఎంపీ తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి ఖర్చు చేయాలి. ఎంపీ రూ.10 లక్షల లోపు పనులను సిఫారసు చేస్తే, ఆ నిధులను కలెక్టర్ ద్వారా మంజూ రు చేస్తారు. ఈ మొత్తాన్ని 1998లో రెండు కోట్లకు పెంచారు. 2011లో 2 కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలకు పెంచారు.
     GKY: గంగా కల్యాణ్ యోజన పథకాన్ని 1997 ఫిబ్రవరి 1న దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు. సన్నకారు, చిన్నకారు రైతులకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించేందుకు సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించే కార్యక్రమమిది. రైతులకు ఒక హెక్టార్‌కు రూ.5000 వరకు అందజేస్తారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 80:20 వంతున భరిస్తాయి. ఈ పథకాన్ని 1999 ఏప్రిల్ 1న ఎ్గలో విలీనం చేశారు.
     NSAP (National Social Assista-nce Programme): ఆదేశిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని దేశంలోని పేద ప్రజలకు అవసరమయ్యే సామాజిక అవసరాలు తీర్చడానికి 1995లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇది సామాజిక అభివృద్ధికి ఉద్దేశించింది. ూఅ్కలో భాగంగా 3 పథకాలను అమలు చేస్తున్నారు. అవి..
     1.    IGNOAPS (Indira Gandhi National Old Age Pension Scheme)ృపేదలకు పెన్షన్ సౌకర్యం.
     2.    NFBS (National Family Benefit Scheme) –Mుటుంబ ఆధారమైన వ్యక్తి మరణిస్తే రూ. 10,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
     3.    NMBS – National Maternity Benefit Scheme
 
 9వ పంచవర్ష ప్రణాళిక (1-9-9-7--2-0-0-2)
 యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9వ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ‘సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి’. జన నాణ్యత, ఉత్పాదకత, ఉద్యోగిత, ప్రాంతీయ సమానాభివృద్ధి, స్వావలంబన ప్రధాన అంశాలుగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనకు వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక కృషి జరపాలని నిర్ణయించారు. ఈ సమస్యలను 15 ఏళ్లలో రూపుమాపగలమని భావించారు.
     ప్రభుత్వ రంగం పెట్టుబడులు రూ. 8,59,200 కోట్లు కాగా, వాస్తవంగా ఖర్చయిన మొత్తం రూ. 9,41,047 కోట్లు. దీంట్లో రవాణా, సమాచార రంగాలకు 25%, ఇంధనం 23.3%, వ్యవసాయం, నీటిపారుదలకు 21.4%, సాంఘిక సేవలకు 21 %, పరిశ్రమలకు 8% కేటాయించారు. ఈ ప్రణాళికలో మొదటగా 7% వృద్ధి రేటును నిర్ణయించి, తర్వాత 6.5%కి తగ్గించారు. సాధించిన వృద్ధిరేటు 5.4 %. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.6 % ఉంది.
     SJSRY:భారతదేశం స్వాతంత్య్రం సాధించిన గోల్డెన్ జుబ్లీ ఇయర్ (50వ సంవత్సరం)ను పురస్కరించుకొని స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన (SJSRY)కార్యక్రమాన్ని 1997 డిసెంబరు 1న ప్రారంభించారు. ఇది పట్టణ ప్రాంత పేదవారికి, నిరుద్యోగులకు, అల్ప ఉద్యోగులకు స్వయం ఉపాధి, వేతన ఉపాధి కల్పించే కార్యక్రమం. దీనికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25లో భరిస్తాయి. ఈ పథకం దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది.
     SJSRYపథకంలో 3 పట్టణ ప్రాంత పథకాలను విలీనం చేశారు.
     1)    NRY (Nehru Rojgar Yojana) - 1989.
     2)    UBSP (Urban Basic Service for the Poor) - 1990-91
     3)    PMIUPEP – Prime Minister's Integrated Urban Poverty Eradication Programme – 1995
     SJSRYMìS అనుబంధంగా 3 ఉప పథ కాలు అమలు చేస్తున్నారు. అవి...
     1)    USEP– Urban Self –  Employment Programme
     2)    UWEP – Urban Wage – Employment Programme
     3)    DWCUA – Development of Women & Children in Urban Areas
 n    BSBKY (Bagya Shree Balika Kalyan Yojana):తల్లిదండ్రులు మరణించిన బాలికలకు ఆర్థిక సహాయం చేసి, వారి పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమమిది. దీన్ని 1998 అక్టోబరు 19న ప్రారంభించారు.
     RRMKY (Raja Rajeswari Mahila Kalyan Yojana): భర్త మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం కల్పించే కార్యక్రమం. స్త్రీలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. దీన్ని 1998 అక్టోబరు 19న ప్రారంభించారు.
     SGSY:దేశంలో అమలవుతున్న వివిధ స్వయం ఉపాధి పథకాలను విలీనం చేసి ఏర్పాటు చేసిన ఏకైక కార్యక్రమం స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎ్గ). దీన్ని 1999 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఇందులో ఆరు పథకాలను విలీనం చేశారు. అవి..
     1) IRDP (1978)
     2) TRYSEM (1979)
     3) DWCRA (1982)
     4) MWS (1988-89)
     5) SITRA (1992)
     6) GKY (1997-98)
     ఈ పథకం ద్వారా లబ్దిదారులకు 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ కలిగిన రుణాలను బ్యాంకుల ద్వారా అంద చేస్తారు. ఈ పథకానికి కావాల్సిన నిధు లను 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అందజేస్తాయి. లబ్దిదారుల ఎంపికలో 50% ఎస్సీ, ఎస్టీలకు; 40% మహిళలకు; 3% వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
     Annapurna Yojana-మార్చి 1999: పెన్షన్ అందుబాటు లేని వృద్ధులకు నెలకు 10 కిలోల ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం.
     AAY:అంత్యోదయ అన్న యోజన పేదవారికి ఆహార భద్రత కల్పించే పథకం. దీన్ని 2000 డిసెంబరు 25న ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారికి మూడు రూపాయలకు కిలో బియ్యం లేదా రెండు రూపాయలకు కిలో గోధుమలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తారు. 2002 ఏప్రిల్ 1 నుంచి దీంట్లో భాగంగా అందజేసే ఆహారధాన్యాలను 25 కిలోల నుంచి 35 కిలోలకు పెంచారు.
     PMGY (Prime Minister Gramodaya Yojana):ఇది గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సౌకర్యాలు కల్పించే కార్యక్రమం. దీన్ని 2000-01లో ప్రారంభించారు. ఇది గ్రామీణాభివృద్ధిలో భాగమైన ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, గృహ వసతి, ప్రాథమిక విద్య, గ్రామీణ రోడ్లు మొదలైన 5 అంశాలను అభివృద్ధి చేసే కేంద్ర ప్రభుత్వ పథకం.
     PMGSY (Prime Minister Gram Sadak Yojana):ఇది గ్రామీణ ప్రాంతాలకు పక్కా రోడ్లు నిర్మించే కార్యక్రమం. దీన్ని 2000 డిసెంబరు 25న ప్రారంభించారు. సాధారణంగా 500 మందికి మించిన జనాభా ఉన్న అన్ని గ్రామాలను రహదారులతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువగా జనాభా ఉన్న గ్రామాలకు కూడా రోడ్లను అనుసంధానం చేయడానికి కేంద్రం నిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం.
     GRY (Sampoorna Grameena Rojgar Yojana): దీన్ని 2001 సెప్టెంబరు 25న ప్రారంభించారు. అప్పటికే అమలవుతున్న ఉఝఞౌడఝ్ఛ్ట ఛిజ్ఛిఝ్ఛ (ఉఅ), ఒ్చఠ్చీజ్చిట ఎట్చఝ ్చఝటజీఛీజిజీ ౌ్గ్జ్చ్చ (ఒఎ్గ) లను కలిపి ఎఖ్గని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెండు ముఖ్యాంశాలున్నాయి. 1) అదనపు వేతన ఉపాధి కల్పించడం, 2) ఆహార భద్రత కల్పించడం. వీటికి కావాల్సిన నిధులను 75:25 నిష్పత్తిలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు భరిస్తాయి. ఎఖ్గని 2006 ఫిబ్రవరి 2 నుంచిNational Rural Employment Guarantee Schemeలో భాగంగా అమలు చేస్తున్నారు.
     VAMBAY (Valmiki Ambedkar Awas Yojana):పట్టణ ప్రాంత స్లమ్ ఏరియాల్లో నివసించే పేదవారికి గృహాలు, సామూహిక మరుగుదొడ్లు నిర్మించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 2001 డిసెంబరులో ప్రారంభించారు. దీన్ని ‘నిర్మల్ భారత్ అభియాన్’లో భాగంగా అమలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కల్పించటం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.
     Shiksha Sahayog Yogana (SSY): దీన్ని 2001 డిసెంబరు 1న ప్రారంభించారు. పేదరిక రేఖ దిగువన నివసిస్తున్న పిల్లలకు విద్యావకాశాలు కల్పించే నిమిత్తం స్కాలర్‌షిప్‌లు అందించే కార్యక్రమం. ‘జనశ్రీ బీమా యోజన’ పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్ల పాటు స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement