ప్రణాళికల దృష్టిలో స్వర్ణయుగంగా పేర్కొన్న కాలం? | Civils Prelims | Sakshi
Sakshi News home page

ప్రణాళికల దృష్టిలో స్వర్ణయుగంగా పేర్కొన్న కాలం?

Published Fri, Jul 4 2014 10:22 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ప్రణాళికల దృష్టిలో స్వర్ణయుగంగా పేర్కొన్న కాలం? - Sakshi

ప్రణాళికల దృష్టిలో స్వర్ణయుగంగా పేర్కొన్న కాలం?


 Civils Prelims
 
 పణాళికలు- నిరంతర ప్రణాళికలు (1978-80)

* నిరంతర ప్రణాళిక భానవను తొలిసారిగా జనతాపార్టీ ప్రవేశ పెట్టింది. ఈ భావనను స్వీడన్ ఆర్థికవేత్త అయిన Gunnar Myr-dal తన 'Asian Drama’ అనే గ్రంథం లో పేర్కొన్నారు. ఈ ప్రణాళికలు జపాన్, మెక్సికో, పోలాండ్‌లో విజయవంతమ య్యాయి. ఈ ప్రణాళికను భారతదేశంలో ప్రొఫెసర్ లకడావాలా రూపొందించారు.
* నిరంతర ప్రణాళికలు ఎప్పుడు చూసినా ఐదేళ్లు ఉంటాయి. అయితే ఏటా గడిచిన ఏడాదిని తొలగించి, రాబోయే మరో సంవత్సరాన్ని కలుపుతూ ఉంటారు. అంటే ఈ ప్రణాళికలలో ఏటా కేటాయింపులు, లక్ష్యాలు మారుతూ ఉంటాయి.
* నిరంతర ప్రణాళిక కాలంలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. శ్రమసాంద్రత ఉత్పత్తుల ఎంపిక వల్ల ఉద్యోగ కల్పనను పెం చారు. భారతదేశానికి అవసరమైన విధానాన్ని ఎంచుకోవడం వల్ల అత్యధిక ఫలితాలు సాధించారు. అందువల్ల ఈ కాలా న్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణ సాధించడానికి ప్రతి జిల్లాకు ఒక DIC (District Industrial Centre)ను ఏర్పాటు చేశారు.
* సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని (IRDP –Integrated Rural Develo- pment Programme)ను తొలిసారి 1978లో 2300 బ్లాక్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దీన్ని 1980 అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులు భరిస్తాయి. 1999, ఏప్రిల్ 1 నుంచి ఐఆర్‌డీపీని SGSY (Swarna Jayanthi Grameena  Swarozgar Yojana)లో విలీనం చేశారు.
* దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గ్రామీణుల్లో 18ృ35 ఏళ్ల మధ్య వారికి స్వయం ఉపాధి కల్పించడానికి 1979లో TRYSEM (Training for Rural Youth for Self Employment)ను ప్రారంభించారు. ఈ పథకాన్ని 1999, ఏప్రిల్ 1 నుంచి ఎ్గలో విలీనం చేశారు.
 
 6వ పంచవర్ష ప్రణాళిక (1980-85)
* దీన్ని రెండుసార్లు ప్రవేశపెట్టారు.1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1978–83 కాలానికి నిరంతర ప్రణాళిక (Rolling Plan)ను ప్రవేశపెట్టింది. తర్వాత 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర ప్ర ణాళికలను రద్దు చేసి 1980ృ85 కాలానికి ఒక ప్రణాళికను తయారు చేసింది. ఈ ప్ర ణాళికనే అమలు చేశారు. ప్రొఫెసర్ లకడావాలా ఈ ప్రణాళికను రూపొందించారు.
* ఈ ప్రణాళికలో ‘లాభదాయక ఉపాధి విస్తరణ అవకాశాలు తద్వారా పేదరిక నిర్మూలన, సాంకేతిక స్వావలంబన’ లక్ష్యాలుగా తీసుకున్నారు. మొదటిసారిగా శక్తి/ఇంధ నం (Energy) అనే రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఈ ప్రణాళికను ‘సమగ్ర ప్రణాళిక’ (Comprehensive) అంటారు. ఈ ప్రణాళికలో యాంత్రీకరణ ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చింది.
* 6వ ప్రణాళిక వ్యయం రూ.1,10,967 కోట్లు. తొలిసారి లక్ష కోట్లు దాటిన ప్రణాళిక ఇదే. ఈ ప్రణాళికలో శక్తికి/ ఇంధనానికి అత్యధికంగా 28% కేటాయించారు. తర్వాత వ్యవసాయం, నీటిపారుదల రం గాలకు 24 శాతం ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 5.2% కాగా, సాధించింది 5.7%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.2%గా నమోదయింది..
     ఈ ప్రణాళిక కాలంలో మూడు ఇనుము - ఉక్కు కర్మాగారాలు స్థాపించారు.
     1. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం
     2. తమిళనాడులోని సేలం
     3. కర్ణాటకలోని విజయనగర్
* 1980, ఏప్రిల్ 15న రూ. 200 కోట్ల మూలధనం మించిన 6 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేశారు. 1982, జూలై 12న శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ూఅఆఅఖఈ (National Bank for Agriculture and Rural Devel- opment)ను ఏర్పాటు చేశారు. ఎగుమతి, దిగుమతి దారులకు రుణం అందచేయడానికి 1982లో EXIM (Export– Import) ఆ్చజు స్థాపించారు.
* Food for Work Scheme (FWS)ను 1980లో NREPV> మార్చారు. ఇది గ్రామీణ పేదవారికి వేతన ఉద్యోగితను కల్పించే కార్యక్రమం. ‘జాతీయ గ్రామీణ ఉపాధి పథకం' NREP (National Rural Employment Programme). ఈ పథకంలో సగం వేతనం ఆహార రూ పంలో, సగం వేతనం నగదు రూపంలో చె ల్లించారు. NREP° 1989లో JRY (Ja-wahar Rojgar Yojana)గా మార్చారు.
* DWCRA (Development of Women and Children in Rural Areas): గ్రామీణ మహిళలు, శిశువుల జీవనంలో గుణాత్మక మార్పును తీసుకురావడానికి 1982లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీలకు శిక్షణను ఇవ్వటం ద్వారా స్వయం ఉపాధిని కల్పించటం ఈ కార్యక్రమం లక్ష్యం. డ్వాక్రాను IRDP (Integrated Rural Development Programme)లో అంతర్భాగంగా    ప్రా రంభించారు. ఈ పథకాన్ని 1999, ఏప్రిల్ 1 నుంచి ఎ్గలో విలీనం చేశారు.
* RLEGP (Rural Landless Empl-oyment Guarantee Progra-mme): గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని కుటుంబంలోని ఒక వ్యక్తికి ఏడాదిలో 100 రోజులపాటు పని కల్పించే ఉద్దేశంతో 1985 ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి నిధులను పూర్తిగా కేంద్రం సమకూరుస్తుంది. RLEGP° NREP (National Rural Empl-oyment Programme)తో కలిపి 1989లో JRY (Jawahar Rojgar Yojana)ను ప్రారంభించారు.
 
 7వ పంచవర్ష ప్రణాళిక (1985-90)

* 1985ృ90 కాలానికి ప్రవేశపెట్టిన ఏడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతలు తొలగించటం. ఆహారం, ఉద్యోగిత, ఉత్పాదకత ప్రధాన అంశాలుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి పారిశ్రామిక రంగంలో ఆధునికీకరణ, శ్రామిక యాజమాన్య సంబంధాలు మెరుగుపర్చడానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఉపాధి విస్తరణకు ఇంతకుముందు ప్రణాళికల్లో చేపట్టిన శ్రమసాంద్రత పద్ధతులను ఉపయోగించి సాంద్ర వ్యవసాయం, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ పథకాలను కొనసాగించారు.
* ఈ ప్రణాళిక ‘వకీల్ - బ్రహ్మానందంల వేతన వస్తువుల వ్యూహం’ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళిక పాక్షిక సరళీకరణ విధానాన్ని అవలంబించింది. దీనిలో ప్రైవేట్ , శాస్త్ర సాంకేతిక, సమా చార, ఐటీ, సంఘటిత రంగాల ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఈ ప్రణాళిక ‘రాజీవ్ మోడల్ ప్లాన్’, ‘ఉద్యోగ కల్పన ప్రణాళిక’, ‘శక్తి ప్రణాళిక’గా పేర్కొన్నారు.
* ఈ ప్రణాళిక వ్యయం రూ.2,18,730 కోట్లు. ఇందులో ఇంధన రంగానికి 28%, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు 22%, రవాణా, సమాచారానికి 19%, సాంఘిక సేవలకు 18%, పరిశ్రమలకు 13% ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో 5% వృద్ధి రేటును ఆశించగా, 6% సాధించారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.7%.
* 7వ ప్రణాళిక కాలంలో ఎస్సీ, ఎస్టీ, వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారికి, వితంతువులకు, పేదవారికి గృహవసతి కల్పించేందుకు 1985ృ86లో ఇందిరా ఆవాస్ యోజన (Indira Awas Yojana– IAY) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* 1986లో National Policy on Education (NPE) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం విద్య కోసం జీడీపీలో 6% కేటాయించారు.
* ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తూ, సాంకేతిక సహాయం అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడానికి గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇఅ్కఅఖఖీ (Council for Advancement of People's Action and Rural Techn- ology)ను 1986 సెప్టెంబరు 1న ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు.
* 1986లోనే CRSP (Central Rural Sanitation Programme) ను ప్రారంభించారు. ఇది గ్రామీణ పారిశుధ్యానికి ఉపయోగపడే కార్యక్రమం.
* పరిశ్రమల ఖాయిలాకు సంబంధించి 1985లో ఒక చట్టాన్ని చేశారు. దీనిపేరు SICA (Sick Industries Compan- ies Act) ఈ చట్టాన్ని అమలు పర్చేందుకు 1987లో BIFR (Board for Industrial Financial Reconstru- ction) ఏర్పాటు చేశారు. అతిచిన్న / లఘు/ సూక్ష్మ సంస్థలకు రుణ సహాయం చేసేందుకు 1987లో National Equity Fund (NEF)ను ప్రారంభించారు.
* 1987లోనే ఖీటజీఛ్చ Co-Operative Marketing Development Fed-eration (TRIFED) ఏర్పాటు చేశారు. ఇది గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి జాతీయ స్థాయిలో సహాయపడుతుంది.
* వయోజన విద్యా వ్యాప్తి కోసం జాతీయ స్థాయిలో 1988లో National Literacy Mission (NLM) ప్రారంభించారు. 1988లో Securities and Excha- nge Board of India (SEBI)ని ఏర్పా టు చేశారు. ఇది ్ఛఛిఠటజ్టీడ క్చటజ్ఛ్టులను నియంత్రిస్తుంది.
Million Wells Scheme(1988): గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు, సన్నకారు, ఉపాంత, చిన్నకారు రైతులకు, వెట్టిచాకిరి నుంచి విముక్తులైన వారికి సాగునీరు కల్పించడానికి (కగి) 10లక్షల బావులను ఉచితంగా తవ్వి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 1999లో Swarnajayanthi Gram Swarozgar Yojana (SGSY)లో విలీనం చేశారు.
* Jawahar Rojgar Yojana (JRY 1989): ఇది గ్రామీణ ఉపాధి పథకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారు. తద్వారా వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి, సామాజిక ఆస్తుల నిర్మాణానికి తోడ్పడతారు. ఈ పథకం కింద నిధులు నేరుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు అందిస్తారు. ఈ పథకంలో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించాలి. JRY ° 1999లో Jawahar Grama Samruddi Yojana (JGSY)గా మార్చారు. తిరిగి 2001లో JGSY¯]l$, Employement Assurance Scheme (EAS) లో కలిపి Sampoorna Grameena Rojgar Yojana (SGRY)ని ప్రారంభించారు.
* Nehru Rojgar Yojana (NRY - 1989) : పట్టణ ప్రాంత పేదలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు NR Yని 1989లో ప్రారంభించారు. దీన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. NRYని 1997, డిసెంబరు1న Swarna Jayanthi Sahari Rojagar Yojana (SJSRY)గా మార్చారు.
 
 వార్షిక ప్రణాళికలు (1990-1992)
* పపంచ రాజకీయ పరిణామాలు, అంతర్గత రాజకీయ అనిశ్చితి కారణంగా 1990లో ప్రారంభం కావాల్సిన 8వ పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కాబట్టి 1990ృ92లో వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. అంతేగానీ ఇది అధికారిక ప్రణాళికల సెలవు కాదు.
* ఈ వార్షిక ప్రణాళికా కాలంలో చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందించడానికి mall Industries Develop- ment Bank of India (SIDBI)ని 1990లో లక్నోలో ఏర్పాటు చేశారు.
* సురక్షిత తాగునీటి సౌకర్యం కోసం Rajiv Gandi National Drinking Water Mission (RGNDWM)ని 1991లో ప్రారంభించారు. పట్టణ ప్రాంతం వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి Urb- an Basic Services Programme (U BSP)ను 199091లో ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement