పేదరికపు ప్రణాళిక అని దేన్ని అంటారు? | What is the plan that is poverty? | Sakshi
Sakshi News home page

పేదరికపు ప్రణాళిక అని దేన్ని అంటారు?

Published Thu, Jun 26 2014 9:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

పేదరికపు ప్రణాళిక అని దేన్ని అంటారు? - Sakshi

పేదరికపు ప్రణాళిక అని దేన్ని అంటారు?

పంచవర్ష ప్రణాళికలు

రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)
రెండో ప్రణాళికను ‘మహలనోబిస్ భారీ పరిశ్రమల వ్యూహం’ (మహలనోబిస్ నాలుగు రంగాల నమూనా) ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక వ్యయం రూ.4,672 కోట్లు. దీని లో 27 శాతం రవాణా, 4 శాతం సమాచారానికి వ్యయం చేశారు. అందువల్ల దీన్ని ‘రవాణా, పరిశ్రమల ప్రణాళిక’ అంటారు. దీన్నే ‘నెహ్రూ -మహలనోబిస్ ప్రణాళిక’ అని, ‘ధైర్యంతో కూడిన ప్రణాళిక’ (ఆౌఛీ ్క్చ) అని అంటారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 4.5 శాతం కాగా, సాధించిన వృద్ధిరేటు 4.2 శాతం. తలసరి ఆదాయ వృద్ధిరేటు 1.9 శాతం.

ఈ ప్రణాళికపై Industrial Develo-pment and Regulation Act– 1951, సమసమాజ స్థాపన, 1956 పారిశ్రామిక తీర్మానం ప్రభావం పడింది. వీటివల్ల ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ రంగం ఆధీనంలో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మూడు భారీ ఇనుము ఉక్కు పరిశ్రమలను స్థాపించారు. అవి...
     1.    పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశాలో ‘రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం’
     2.    యూఎస్‌ఎస్‌ఆర్ సహకారంతో మధ్యప్రదేశ్ (ప్రస్తుతం-ఛత్తీస్‌గఢ్)లో భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం.
     3.    యూకే సహకారంతో పశ్చిమ బెంగాల్‌లో ‘దుర్గాపూర్’ ఇనుము ఉక్కు కర్మాగారం.

ఈ ప్రణాళికా కాలంలోనే నైవేలిలో 'Lign-ite Corporation; పెరంబుదూర్‌లో Railway Coach Factory; రాంచీలో భారీ ఇంజనీరింగ్ పరికాల సంస్థ; 1957 లో Automic Energy Commision, Tata Institute of Fundamental Research ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా కాలంలోనే 1956లో P.L. – 480 ఒప్పందం కింద అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. 1957 - 58, 1959 - 60 కాలాల్లో అనావృష్టి సంభవించి ధరలు 30 శాతం వరకు పెరిగాయి. కానీ సంస్థాగత పటిష్టత సాధించి ఆర్థిక వ్యవస్థను ప్లవన దశకు చేర్చిన రెండో ప్రణాళిక భావి పంచవర్ష ప్రణాళికలకు ఆధారమైంది.
 
మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)

 రెండో ప్రణాళికలో ఏర్పడ్డ ఒడిదుడుకుల ను దృష్టిలో ఉంచుకుని స్వయం సమృద్ధి, స్వావలంబన లక్ష్యాలుగా ఈ ప్రణాళికను అమలు చేశారు. రూ. 8577 కోట్ల వ్యయం తో ‘సంతులన ప్రణాళిక’గా రూపొందించిన మూడో ప్రణాళికలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ ప్రణాళికను హరాడ్-డోమార్ అభివృద్ధి వ్యూహం నమూనా ఆధారంగా అశోక్ మోహతా రూపొందించారు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు లక్ష్యం 5.6% కాగా, సాధించింది 2.8%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 0.2%. అంటే ఈ ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. ఈ కాలంలో 1962 లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం, అనావృష్టి కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి సమస్య లు ఏర్పడ్డాయి. ఈ కాలంలో ధరలు 36.4% పెరిగాయి. అందువల్ల ఈ ప్రణాళికను విఫలమైన ప్రణాళిక, జబ్బుపడిన ప్రణాళిక,Washout Plan అంటారు.
 
ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ. 8577 కోట్లు కాగా, అత్యధికంగా రవాణా, సమాచార రంగాల మీద 24.6% వ్యయం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల మీద 20.5% ఖర్చు చేశారు. ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రత్యేకంగా ‘దీర్ఘదర్శి ప్రణాళిక’ (్క్ఛటటఞ్ఛఛ్టిజీఠ్ఛి ్క్చ) ను ఆమోదించారు. అందువల్ల ఈ ప్రణాళిక పూర్తిగా అపజయాన్ని పొందినప్పటికీ పారిశ్రామిక రంగంలో 9% వృద్ధిరేటు సాధించింది. 1964లో యూఎస్‌ఎస్‌ఆర్ సహకారంతో బీహార్‌లో Bokaro Iron & Steel Company స్థాపించారు.
   
 వార్షిక ప్రణాళికలు (1966-69)
4వ, ప్రణాళిక ప్రారంభించడానికి తగిన వాతావరణం లేకపోవడంతో 1966ృ69  మధ్య మూడేళ్లపాటు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలాన్ని ‘ప్రణాళిక విరామం’ (Plan Holiday) ‘ప్రణాళిక సెలవు కాలం’ అంటారు. 3వ ప్రణాళిక విఫలం, నిధుల కొరత, ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగా వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. వ్యవసాయ రంగానికి 23% పెట్టుబడులు కేటాయించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 1966 ఖరీఫ్ సీజన్‌లో ‘నూతన వ్యవసాయ వ్యూహం’ (New Agriculture Strategy – NAS) పేరుతో ’ఎట్ఛ్ఛ ఖ్ఛఠిౌఠ్టజీౌ’ (హరిత విప్లవం/ సస్య విప్లవం) ప్రారంభించారు. వార్షిక ప్రణాళిక కాలం (1966–67)లో ‘హరిత విప్లవం’ ప్రారంభించారు. ఈ మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థ కొంతవరకు పునర్నిర్మాణం చెంది 4వ ప్రణాళిక ప్రారంభానికి పరిస్థితులు చక్కబడ్డాయి.
 
     
4వ పంచవర్ష ప్రణాళిక (1969-74)
ఆర్థిక స్థిరత్వం లేదా స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించటం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. దీన్ని డి.ఆర్. గాడ్గిల్ రూపొందించారు. ఇది మహలనోబిస్ నమూనాకు భిన్నంగా భారీ పరిశ్రమల స్థానంలో మధ్యతరహా- చిన్నతరహా పరిశ్రమలు, వేగంగా ఫలితాలనిచ్చే ప్రాజెక్టులపై దృష్టి సారించింది.
     
ఈ ప్రణాళిక వ్యయం రూ. 15779 కోట్లు. ఇందులో వ్యవసాయం, నీటిపారుదలకు గరిష్టంగా 24%, పరిశ్రమలకు 23% ఖర్చు చేశారు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు 5.7% కాగా, సాధించింది 3.5%. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.1%.

ఈ ప్రణాళిక కాలంలోనే ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించారు. PL – 480 కింద దిగుమతి చేసుకుంటున్న ఆహార ధాన్యాల దిగుమతి తగ్గించటం, విదేశీ సహాయాన్ని తగ్గించటానికి ఎగుమతులు పెంచడంతో పాటు ప్రాంతీయ అసమానతలు తగ్గించటానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతికూల వాతావరణం, విద్యుచ్ఛక్తి కొరత, పారిశ్రామిక అశాంతి, రవాణా ఇబ్బందుల వల్ల అన్ని రంగాల్లో సాధించిన ఉత్పత్తి, లక్ష్యం కంటే తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ విమోచన, కాందిశీకుల భారం లాంటి సమస్యలతో 4వ ప్రణాళిక అంతగా విజయవంతం కాలేదు.

 ఈ ప్రణాళిక కాలంలో గ్రామీణ బలహీన వర్గాలకు సహాయం చేయటానికి 1972ృ73లో ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ (ఈజీఎస్). దీన్నే 1993లో Employment Assurance Scheme (EA)గా మార్చారు. దీన్నే 2005లో National Rural Employment Guarantee Act (NREGA) చేసి, 2006 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ూఖఉఎ్కని 2009, అక్టోబరు 2 నుంచి Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme గా పేరు మార్చారు.

తాగునీరు కల్పించడానికి 1972ృ73లో ARWSP (Accelerated Rural Water Supply Programme) ను ప్రారంభించారు. కరువు పీడిత ప్రాం తాల్లో భూగర్భ జలాల అభివృద్ధి కోసం ఈ్కఅ్క (Drought Prone Area Programme)ను 1973లో ప్రారంభిం చారు. డీపీఏపీ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 50:50 నిధులు కేటాయిస్తా యి. సన్నకారు రైతులకు సాంకేతిక, విత్త పర సహాయం అందించటానికి 1973ృ 74లో MFALA (Marginal Farmers and Agricultural Labours Age-ncy)ను ప్రారంభించారు. చిన్నకారు రైతులకు సాంకేతిక, విత్తపర సహాయం అందించటానికి 1974–75లో SFDA (mall Farmers Development Agency)ను ప్రారంభించారు. మెట్టప్రాం తాల అభివృద్ధి, నీటిపారుదల వినియోగం కోసం 1975లో CADP (Command Area Development Programme) ను ప్రారంభించారు. 1974లో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు.
 
5వ పంచవర్ష ప్రణాళిక (1974-79)

పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన ప్రాధాన్యంగా ఈ ప్రణాళికను ఏర్పాటు చేశారు. దీన్ని డీ.పీ.ధార్ రూపొందించా రు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటును మొదట 5.5%గా నిర్ణయించి, తర్వాత 4.4 శాతానికి తగ్గించారు. కానీ వాస్తవంగా సాధించిన వృద్ధిరేటు 4.8%. తలసరి ఆదాయ వృద్ధిరేటు 2.7%. ఈ ప్రణాళిక వ్యయం రూ. 39,426 కోట్లు. పరిశ్రమలు, సమాచార రంగాలకు అధికంగా 26% ఖర్చు చేశారు. ఆ తర్వాత వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు 22% ఖర్చు చేశారు.

 వ్యవసాయ రంగంలో నిరుద్యోగిత, అను ద్యోగిత పేదరికానికి కారణంగా గుర్తించారు. ఆర్థిక వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నంత మాత్రాన పేదరిక నిర్మూలన జరగదని భావించారు. ఈ ప్రణాళికలో సాంఘిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.

{పాధాన్యం దృష్ట్యా ఈ ప్రణాళికను ‘పేదరికపు ప్రణాళిక’ అంటారు. పేదరిక నిర్మూలన కోసం 1975, జూలై 1న 20 అంశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదరికాన్ని నిర్మూలించడానికి గ్రామీణ ప్రజల ఆదాయస్థాయిని పెంచుతూనే గ్రామాల కనీస అవసరాలైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, శానిటేషన్ మొదలైన వాటిని కల్పించడానికి 1975లో ‘కనీస అవసరాల పథకం’ (Minimum Needs Programme – MNP)ను ప్రారంభించారు.

1975-76లో ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’ (Intigrated Child Develo- pment Scheme - ICDS)ను ప్రారంభించారు. ఈ పథకం గర్భిణులు,6 సంవత్సరాల లోపు శిశువులు, పాలిచ్చే తల్లులకు వర్తిస్తుంది.

1977–78లో Food for Work Pro-gramme (పనికి ఆహార పథకం) రాజ స్థాన్‌లో ప్రారంభించారు. గ్రామీణ పేదరికాన్ని రూపుమాపడం, ఆహార భద్రత, వేతనంతో కూడిన ఉపాధిని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు పని కల్పించి వేతనాన్ని పదార్థాల రూపంలో అందజేస్తారు. ఈ పథకాన్ని 1980లో NREP (National Rural Empl-oyment Programme) గా మార్చారు. ఈ కార్యక్రమాన్ని 2004లో NFWP (National Food for Work Programme) పేరు తో అమలు చేశారు. దీన్ని 2006, ఫిబ్రవరి 2 నుంచి ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (NREG)లో విలీనం చేశారు.
    
‘ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం’ (Desert Development Progra- mme – DDP) 1977–78లో 7 రాష్ట్రాలలోని 36 జిల్లాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్ జిల్లా ఎంపికైంది.
ప్రాంతాల్లో అతి పేదవారి కోసం 1977లో ‘అంత్యోదయ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా రాజస్థాన్‌లో ప్రారంభించి తర్వాత ఏపీలో అనంతరం దేశం అంతటా విస్తరించారు.

ఈ ప్రణాళికలో సమ్మెను చట్ట విరుద్ధం చేసి పని గంటలు పెంచారు. ఉత్పత్తి పెరిగింది. ఆహార ధాన్యాల నిల్వలు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. అనుకూల చెల్లింపుల శేషం ఏర్పడింది. జనతాపార్టీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను అమలు చేయటంవల్ల 5వ ప్రణాళిక ఏడాది ముందుగానే(1978లోనే) ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement