నల్లగొండ : ఇంటర్మీడియట్ విద్యలోనూ ఆన్‌లైన్ అడ్మిషన్‌లకు శ్రీకారం చుట్టబోతున్నారు..! ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్‌లు ఏవిధంగా అయితే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయో అదే తరహాలో ఇంటర్ అడ్మిషన్‌లు కూడా చేపట్టాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్‌లు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహించాలంటే ముందుగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు తప్పనిసరి. ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కాలేజీల్లో మాత్రమే ఆన్‌లైన్ అడ్మిషన్‌లు చేపట్టేందుకు వీ లుంటుంది. దీంతో ఈసారి ముందుస్తుగానే కాలేజీలకు ఆఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు తప్పనిసరిగా ఆఫిలియేషన్‌కు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫిలియేషన్ నిబంధనల విషయంలో ప్రభుత్వ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన అన్ని జూనియర్ కాలేజీలు కూడా అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలి.
బోర్డు నిబంధనలకు లోబడి కాలేజీలకు సంబంధించిన లీజు డీడ్, ఆటస్థలం, శానిటరీ సర్టి ఫికెట్, తరగతి గదుల వివరాలు, అగ్ని మాపకశాఖ నుంచి అనుమతి పత్రం, గ్రూపులు, నిర్ణయించిన ఫీజుల వివరాలతో సహా సమస్త సమాచారాన్ని జతచేసి అనుబంధ గుర్తింపు పొందేం దుకు జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 25 కాలేజీల యాజమాన్యాలు ఆఫిలియేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో ఐదు కాలేజీల దరఖాస్తులు లోపాలు ఉండటంతో వాటిని తిప్పిపంపారు. బోర్డు మార్గదర్శకాల మేరకు సర్టిఫికెట్లున్నీ ఉంటేనే జిల్లాకు అధికారులు ఆఫిలియేషన్ కోసం బోర్డుకు సిఫార్సు చేస్తున్నారు. బోర్డుకు పంపిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించేందుకు ప్రత్యేక అధికారులు జిల్లాల్లో పర్యటిస్తారు. కాలేజీల్లో వసతులన్నీ సవ్యంగా ఉ న్నాయని నిర్ధారించుకున్న తర్వాతే బోర్డునుంచి అనుబంధ గుర్తింపు జారీ చేస్తారు. ఇదంతా నిర్ణీత కాలవ్యవదితో జరుగుతుంది కాబట్టి మొత్తం ఆఫిలియేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు మార్చి వరకు గడువు పెట్టుకున్నారు.
మార్చి వరకు పూర్తి
వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్‌లు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి ముందుగానే కాలేజీల గుర్తింపు ఇవ్వనున్నారు. అన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. మార్చి నాటికి కాలేజీల గుర్తింపు పూర్తివుతుంది. ఆ తర్వాత కాలేజీల నోటిఫికేషన్ జారీ చేస్తారు. బోర్డు గుర్తింపు పొందిన కా లేజీల్లోనే ఆన్‌లైన్ అడ్మిషన్‌లు తీసుకుంటారు.
– హనుమంతరావు, జిల్లా ఇంటర్ విద్యా అధికారి
ఫీజులు వివరాలు ఆన్‌లైన్‌లోనే...
ఆఫిలియేషన్ పొందిన కాలేజీల జాబితాను బోర్డు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. ఆ కాలేజీల్లోనే విద్యార్థులు అడ్మిషన్‌లు తీసుకోవాలి. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెం టర్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తమకు నచ్చిన కాలేజీలను ఎంపిక చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఏ కాలేజీ ఎంత ఫీజు వసూలు చేస్తుంది అనే వివరాలు కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. దీంతో పాటు కాలేజీల్లో వసతులు, నిర్వహిస్తున్న గ్రూపుల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీంతో విద్యార్థులకు తమకు నచ్చిన కాలేజీలను ఎంపిక చేసుకుని అవకాశం లభిస్తుంది.
అవకతవకలకు ఆస్కారం లేకుండా....
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు, అనుమతి లేని కాలేజీల్లో చేరి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేం దుకు, నాణ్యమైన విద్యను అం దించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్‌లకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఆన్‌లైన్ అడ్మిషన్ వ్యవస్థ సాఫీగా సాగాలంటే బోర్డు నిబంధనలను యాజమన్యాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే ముందస్తు ఆఫిలియేషన్ ఫీజు చెల్లించి, ఆ తర్వాత అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవడం జరిగేది. దీంతో కాలేజీల్లో లోపాలు ఉన్న అధికారులను ఏదోరకంగా మేనేజ్ చేసుకుని అడ్మిషన్‌లు తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా ముం దుగానే అన్ని సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిన్నింటినీ పరిశీలించి బోర్డునుంచి గుర్తింపు అనుమతి పొందిన తర్వాతే ఆఫిలియేషన్ ఫీజు తీసుకుంటారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment