intermediat
-
హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
-
స్పృహతప్పి ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర విషాదం!
రామచంద్రాపురం: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బీహెచ్ఈఎల్ కాలనీలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసముండే మదిహాబేగం (19) ఇంటర్మీడియట్ చదువుతుంది. శనివారం రాత్రి తన నివాసంలో చదువుకుంటూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా.. -
ఆగస్టు 3 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్ష ఆగస్టు 24న.. పర్యావరణ విద్య పరీక్ష ఆగస్టు 26న జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జులై 8లోపు చెల్లించాలని పేర్కొంది. -
జులై మధ్య నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆన్ లైన్ క్లాసులు
-
ఇంటర్ ‘స్పాట్’ షురూ
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ మంగళవారం ప్రారంభమైంది. అబిడ్స్‌లోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యూయేషన్ ఏర్పాటు చేశారు. తొలిరోజు 350 మంది లెక్చరర్లు రిపోర్టు చేశారు. ఒక్కో గదిలో పది నుంచి 15 మంది లెక్చరర్లకు వసతి కల్పించారు. జవాబు పత్రాలతో పాటు ఆయా స్పాట్ వాల్యూయేషన్ గదులను పూర్తిగా శానిటైజ్ చేశారు. లెక్చరర్లు మాస్క్‌లు ధరించి..భౌతిక దూరం పాటిస్తూ పేపర్లను దిద్దారు. ఒక్కో లెక్చర్ 45 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇదే అబిడ్స్‌లోని సెయింట్‌జార్జ్, సుజాత జూనియర్ కాలేజీ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీసర్ జయప్రద బాయి తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే..20 రోజుల్లో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవుతుందని స్పష్టం చేశారు. -
ఇంటర్ వరకు అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అమ్మ ఒడి పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మంచినీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డులు, ఫ్యానులు ఏర్పాటు చేయాలని, ప్రహరీల నిర్మాణంతో పాటు మరమ్మతులుంటే పూర్తి చేసి రంగులు వేసి తీర్చిదిద్దాలన్నారు. ఈ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల ఫొటో తీసి రెండేళ్ల తరువాత రూపురేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని దీనికోసం టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణ పద్ధతిలో ప్రతి స్కూలులో 20 – 25 మంది విద్యార్ధులకు ఒక టీచర్ చొప్పున ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కావాలనే ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారు.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగార్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పుస్తకాలు అందని దుస్థితిని తాను స్వయంగా పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథాకానికి సంబంధించి ఆరు నెలల పాటు సరకుల బిల్లులు కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో యూనిఫారాలను సైజుల ప్రకారం ఇవ్వకుండా విద్యార్ధులను ఇబ్బంది పెట్టారని, ఈసారి అలాకాకుండా వారే దుస్తులు కుట్టించుకొనేందుకు, షూలు, సాక్సులు కొనుక్కునేందుకు నేరుగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డుదారులంతా అర్హులు: విద్యాశాఖ మంత్రి సురేష్ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులని, ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పిల్లలు బడిలో చేరడం నుంచి ఉద్యోగాలు పొందేవరకు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఉద్యోగ భద్రత కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ముఖ చిత్రాలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. వైస్ చాన్స్‌లర్, అధ్యాపకులు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై త్వరలోనే సెర్చ్ కమిటీని నియమిస్తామని వివరంచారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. చదువుకోలేకపోతున్నామనే బాధతో పిల్లలు, చదివించలేకపోతున్నామనే ఆవేదనతో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న అనేక ఘటనలను పాదయాత్రలో స్వయంగా నా కళ్లతో చూశా. భవిష్యత్ తరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. ప్రభుత్వ విద్యా సంస్థలను బతికించుకోవడం ద్వారానే పేద, మధ్య తరగతి పిల్లలను చదివించుకోగలం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ప్రమోగాలకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలుకానుంది.. ఈనెలాఖరు నుంచి ఒకదాని వెంట మరొకటి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్(విలువలు, మానవ సంబంధాలు) పరీక్ష, 30న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఏడాది నుంచి పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు ఇష్టారాజ్యంగా మార్కులు వేసే విధానానికి స్వస్తి పలికారు. అయితే, సరిపడా అధ్యాపకులను నియమించకపోగా.. ప్రాక్టికల్స్ కోసం సామాగ్రిని ఇవ్వకుండా ప్రాక్టికల్స్ పరీక్షలు విద్యార్థులు ఎలా రాయగలుగుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈసారి ప్రయోగ పరీక్షలు జరగనున్న కేంద్రా ల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేశారు. పరీక్షకు గంట ముందు ప్రశ్నాపత్రం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరగనున్న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలకు సంబందించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో ముఖ్యమైన ప్రశ్నలను అధ్యాపకులే ఎంపిక చేసి పరీక్ష నిర్వహించేవారు. ఈ కారణంగా పరీక్షలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేవి. అయితే, ఈ సంవత్సరం ఈ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు కళాశాల ప్రిన్సిపాల్ సెల్ ఫోన్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దీన్ని ఆధారంగా ఆన్లైన్లో ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏమేం ప్రశ్నలు వస్తాయనేది అధ్యాపకులకు సైతం అప్పటి వరకు తెలియదు. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు మాత్రమే మంచి మార్కులు వస్తాయని చెబుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 7,238 మంది జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 51 ప్రైవేట్ కళాశాలలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు 7,238 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హారుకానున్నారు. ఇందులో బైపీసీ విద్యార్థులు 4,005 మంది కాగా, ఎంపీసీ చదివే విద్యార్థులు 3,233 మంది ఉన్నారు. కాగా, ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్ విధానంలో కొద్ది సమయం ముందే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అవలంబించనుండగా.. ప్రతీ కేంద్రానికి ఓ పరిశీలకుడిని నియమిస్తారు. తద్వారా యాజమాన్యాల ప్రమేయం లేకుండా నిక్కచ్చిగా మార్కులు వేసే వెసలుబాటు కలగనుంది. ప్రాక్టికల్ సామాగ్రి లేక ఇబ్బందులు ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించేందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చలేదు. ఈక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పరికరాలలను ఇప్పటి వరకు ప్రభుత్వం అందించలేదు. అంతేకాకుండా రీ ఏజెంట్స్, లిక్విడ్ వంటి వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు కూడా ఇవ్వలేదు. ఇక ఒకేషనల్ కళాశాల, పారామెడికల్ కళాశాల విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించాలంటే పూర్తి స్థాయిలో వసతులు ఉండాలన్న అధికారులు.. ప్రైవేట్ కళాశాలల్లో ఎంత మేరకు వసతులు ఉన్నాయన్న విషయమై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాఠాలు చెప్పకుండానే పరీక్ష ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిటీ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరార్మెంట్ సబ్జెక్టులను చేర్చారు. కానీ ఈ సబ్జెక్టును బోధించేందుకు ఏ ప్రభుత్వ కళాశాలల్లో కూడా ప్రత్యేక అధ్యాపకులను నియమించలేదు. ఇక ప్రైవేట్ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వీటికి వచ్చిన మార్కులు ప్రత్యేకంగా మెమోలో సాధారణ సబ్జెక్టులతో కలపకపోయినా... మార్కలు తక్కువ వచ్చినా, హాజరుకాకపోయినా ఫెయిల్ అయినట్లే పరిగణిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టుల బోధన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. ఇప్పుడు పరీక్ష రాయాలని చెబుతుండడం గమనార్హం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో బోధించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను గతంలోనే ఆదేశించాం. అలాగే, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేశాం. గతంలో మాదిరిగా ప్రశ్నపత్రాన్ని ఇక్కడ తయారు చేయకుండా బోర్డు నుండే పంపిస్తారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండాపరీక్షలు నిర్వహిస్తాం. – వెంక్యానాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి -
విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం
సాక్షి, ప్రకాశం: మహిళలపై లైంగిక అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిది మంది యువకులు ఏడాది కాలంగా లైగికంగా హింసిస్తూ, పలుమార్లు అత్యాచారం జరిపారు. ఈ దుర్మార్గంపై బాధితురాలు ఆదివారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు విలేకరులకు తెలిపారు. -
మధ్యాహ్నం.. అర్ధాకలి
వేడి నీళ్ళను తలపించే సాంబారు... రుచీ పచీ లేని అన్నం.. కనీసం తాలింపు కూడా లేని కూరలుతినలేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నందున పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యారేజీ పెట్టకుండా పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తీరు చూసి కొందరు విద్యార్థులు అన్నం తినకుండానే ఆకలితో ఉండిపోతున్నారు. పశ్చిమగోదావరి, నిడదవోలు: ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణా లోపాలు పిల్లలకు శాపంగా పరిణమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 7,361 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందిస్తోంది. ఆశయం మంచిదే అయినప్పటికీ పథకం నిర్వహణ తీరు మాత్రం అగమ్యగోచరంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవీ నిబంధనలు : ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 996 క్యాలరీల ఆహారం మధ్యాహ్న భోజనంలో అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు కేటాయించింది. ఈ మేరకు కళాశాలల సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల నిర్వాహకులు వండి పెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇంటర్ విద్యార్థులకు కూడా అక్కడే తయారు చేసి కళాశాలలకు అందించాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పెడుతున్న మెనూ ప్రకారం రోజుకు రూ.6.18 పైసలుమధ్యాహ్న భోజనానికి ఖర్చు చేస్తున్నారు. అయితే జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా హైస్కూల్ విద్యార్థికి కేటాయించిన 150 గ్రాముల బియ్యాన్ని కేటాయించడంతో వారికి భోజనం సరిపోవడం లేదని అంటున్నారు. ఏజన్సీ నిర్వాహకులు కూడా ఒక్కో విద్యార్థికి పావు కేజీ బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు. అసలు ఇంటర్ విద్యార్థులకు ఎంత కేటాయించాలో నిర్దిష్టమైన విధి విధానాలు ఇప్పటి వరకు అధికారులకు అందలేదు. మరో వైపు కళాశాలల ప్రిన్సిపల్స్ రోజూ విద్యార్థుల హాజరు సేకరించి వారి వివరాలను పంట చేసే స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అందించాలి. హెచ్ఎంలు నిర్వాహకులచే వంట వండించి కళాశాలలకు చేరవేయాలి. నాణ్యతకు తిలోదకాలు మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల ద్వారా పంపిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండటం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. నాసిరకం బియ్యంతో అన్నం వండితే అది చిమిడి ముద్దయిపోతోంది. వారానికి మూడు రోజులు గుడ్డు, సాంబారు, మూడు రోజులు పప్పుతో ఆకుకూరలు పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలు మాత్రం గుడ్డును తూతూ మంత్రంగా ఉడికీ ఉడకనట్టు పంపించేస్తున్నారు. గుడ్డును ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి పంపించాల్సి ఉండగా ఎక్కడా పాటించటం లేదు. దీంతో గుడ్డును తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి వస్తోందని వాపోతున్నారు. సాంబారులో కనీసం 10 గ్రాముల కందిపుప్ప కూడా కనిపించకుండా నీళ్ళను తలపించే సాంబారును పంపిస్తున్నారు. సాంబారును చూస్తే వేడి నీళ్ళా అని సందేహం రాకమానదు. సాంబారు కాసేటప్పుడు కనీస నాణ్యత, రుచి ఉండకుండా తక్కువ పప్పుతో తయారు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇది తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల్లో వండించడం భారంగా ఉందని పలువురు హెచ్ఎంలు వాపోతున్నారు. అంతే కాకుండా సరైన గదులు, వంట పాత్రలు లేకపోవడం, గ్యాస్ కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు కాకపోవడం, వంట సరుకులు కొనుగోలు కోసం పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని వంట ఏజన్సీ నిర్వాహకులు హెచ్‌ఎంలపై ఒత్తిడి పెంచుతున్నారు. సకాలంలో బిల్లులు అందక , కిరాణా షాపుల్లో అప్పులు చేసి పథకాన్ని నిర్వహించడం వల్ల తమకు నష్టమే కానీ ఎటువంటి లాభదాయకం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. సాంబారు రుచిగా ఉండటం లేదు మా కళాశాలలో ఆగస్టు నుంచి మధ్యాహ్న సమయంలో భోజనం పెడుతున్నారంటే ఎంతో ఆనందపడ్డాం. ఇంటి నుండి బాక్సులు తీసుకువచ్చే పనిలేదని అనుకున్నాం. భోజనం చాలా అధ్వానంగా ఉంటోంది. సాంబారు నీళ్ళుగా ఉంటుంది. రుచి లేకుండా ఎలా తినాలి.– కె.కరుణ, ఇంటర్ సెకండియర్, నిడదవోలు ఉడకని గుడ్డు పెడుతున్నారు భోజనాలు చేసేటప్పుడు ఇచ్చే గుడ్లు ఉడ కటం లేదు. అన్నం చిమిడి పోతోంది. గుడ్లు వేయించకుండా ఉడకబెట్టి మాకు ఇస్తున్నారు. అన్నం సాంబారు కనీసం నోట్లో కూడా పెట్టబుద్ది కావడంలేదు. రుచిగా ఉన్న ఆహారం ఎప్పుడూ పెట్టలేదు. భోజనాలకు మాకు ఫ్లేట్లు కూడా ఇవ్వడం లేదు.– పి.జ్యోతిర్మయి, ఇంటర్ సెకండియర్, నిడదవోలు -
చదువుపై ప్రేమను చంపుకోలేక..
రఘునాథపల్లి: పట్టుదలతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలనుకున్న ఆ విద్యార్థిని అర్ధంతరంగా తనువు చాలించింది. పేదరికం కారణంగా చదువు మానేయాలని తండ్రి ఆదేశించడంతో మస్తాపానికి గురైన ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పారునంది కరుణాకర్, సుశీల దంపతుల కుమార్తె ప్రియాంక (17) ఇంటర్మీడియట్ చదువుతోంది. కరుణాకర్ గ్రామంలోని ఓ రైతు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. కూతురును చదువు మానేయాలని తండ్రి సూచించగా తాను చదువుకుంటానని వారించింది. ఈ క్రమంలో కూతురును తండ్రి మందలించాడు. ఆ తర్వాత కరుణాకర్ తన కుమార్తెతో కలిసి పత్తి చేనులో కలుపు కుప్పలు తీసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి ఇంటికి వెళ్లి తల్లిని తీసుకొస్తానని కుమార్తెకు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియాంక అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వచ్చి చూడగా ప్రియాంక అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటలిక సాగవు
కరీంనగర్ ఎడ్యుకేషన్ : 2018–19 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్లో చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇంటర్మీడియెట్‌లోనూ ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టాలని సర్కారు భావించింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ సైతం రూపొందించి ఆయా జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులకు ఆన్లైన్ ప్రవేశాలపై ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్లో ప్రవేశానికి ఇక ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పదో తరగతి పరీక్షలు పూర్తికాక ముందే అడ్మిషన్ల కోసం ఎగబడే కొన్ని కళాశాలలకు మూకుతాడు వేసేందుకు ఇంటర్ అడ్మిషన్లను అన్లైన్లో చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ విధానం అమలైతే కార్పొరేట్ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలలు వసూలు చేసే ఫీజులు అదుపు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు.. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విధానంలో ప్రభుత్వం కొత్త తరహా విధానానికి తెరతీసింది. ఆయా కళాశాలల్లో నేరుగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు స్వస్తి చెప్పి ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. రెండేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రవేశ విధానం సఫలీకృతం కావడంతో ఇదే పద్ధతిని ఇంటర్‌కూ అనుసరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇష్టం వచ్చినట్లు ఫీజులు దండుకుంటూ అడ్మిషన్లు తీసుకుంటున్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. విద్యార్థుల మెరిట్ «ఆధారంగానే సీట్లు కేటాయిస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాణ్యమైన కళాశాలలో సీట్లు లభించే అవకాశం ఉంది. మింగుడు పడని యాజమాన్యం.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు సైతం ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులకే కల్పించాల్సి రావడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు ఈ విషయం మింగుడు పడడం లేదు. ప్రత్యేక కోర్సులంటూ వేలాది రూపాయలు అదనంగా గుంజుతున్న వారు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయాన్ని పలు కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. జిల్లాలోని పలు కళాశాలలు ఐఐటీ ఫౌండేషన్, ఎంసెట్ తదితర కోర్సుల పేరుతో ఏడాదికి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో విద్యార్థులను కళాశాలలు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించే వరకు యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేసే వారు. జిల్లాలో 121 కళాశాలలు.. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్, సోషల్, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్, ఒకేషనల్ జూనియర్ కళాశాలలు 121 ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్ పద్ధతి ద్వారా జిల్లాలో ఎక్కడైనా ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీట్లు లభించే ఆవకాశం ఉంది. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవడం కొంత ఇబ్బంది కరంగానే పరిగణించే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానం అన్ని విధాలా మేలు – రామచంద్రం, డీఐఈఓ ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ విధానంతో విద్యార్థులకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. పేద విద్యార్థులకు న్యాయం కలుగుతుంది. కళాశాలల్లో ఫీజుల నియంత్రణతో తల్లిదండ్రులకు ఊరట వస్తుంది. ఆన్లైన్ విధానంతో ప్రతిభ ఉన్న వారికి చోటు లభిస్తుంది. ఇప్పటికే తమకు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆన్లైన్ విధానంతోనే ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని ఆదేశాలు అందాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 21 నుంచి మొదలైంది. ప్రవేశాలు గడువు ఈనెల 30తో ముగుస్తుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
సెలవుల్లేవ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాల్సిన సమయంలో ద్వితీయ సంవత్సర సిలబస్‌తో తరగతులను మొదలెట్టాయి. సప్లిమెంటరీ పరీక్షల పేరుతో యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పరీక్షల హడావుడితో అలసిన విద్యార్థులు ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులకు మానసిక విశ్రాంతి తప్పనిసరి. సెలవుల్లో వారు కొంత సేద తీరి ఊపిరి పీల్చుకుంటారు. సీనియర్ ఇంటర్ తరగతులతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తోపాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంలోని చంద్రమౌళీనగర్‌తోపాటు శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు కొనసాగుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని కళాశాలల యాజమాన్యాలను స్పష్టంగా చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విషయమై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై త్వరలోనే యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని యాజమాన్యాల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -
13న ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలను ఈ నెల 13న విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేస్తుండటం.. 14, 15 తేదీల్లో సెలవులుండటంతో 13నాడే ఫలితాలను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చింది. గుర్తింపు దరఖాస్తుకు 15 వరకు గడువు .. రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు గుర్తింపు పొందేందుకు ఈ నెల 15 లోపు తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే సోమవారం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. హాస్టళ్లకు సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని యాజమాన్యాలు తెలిపాయని.. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అశోక్ వివరించారు -
చివరి అవకాశం!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 28వ తేదీ నుంచి థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారులు ఏర్పాట్లు చేయడంలో ని మగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 17 ప్రైవేటు కేంద్రాలు కాగా.. 22 ప్రభుత్వ కళాశాలలకు చెందిన కేంద్రాలున్నాయి. ఇందులో మొత్తం 27,098 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే జరగనున్నాయి. 22 ప్రభుత్వ కళాశాలలకు ప్రభుత్వం నిఘా కోసం గత విద్యా సంవత్సరం సీసీ కెమెరాలు అందించింది. కానీ ప్రైవేటు కళాశాలల్లో మాత్రం కొన్నింటిలో మాత్రమే సీసీ కెమెరాలున్నాయి. లేని వాటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. అపరాధ రుసుంతో.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు పొంది వివిధ కారణాలతో ఇప్పటి వరకు 2,959 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. పలు ప్రైవేటు కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్లు పొంది తర్వాత మధ్యలోనే బంద్ చేయడం, కళాశాలల్లో ఫీజులు కట్టలేకపోవడం, అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోవడం ప్రధానంగా ఉన్నాయి. మరింత మంది వలస వెళ్లడం, ఇతర ఎంట్రెన్స్‌ల్లో సీట్లు వచ్చి ఇతర కోర్సుల్లోకి వెళ్లడం, కొంతమంది బాలికలు చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకోవడం కారణంగా ఫీజు చెల్లించనట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఫీజులు కట్టిన విద్యార్థుల్లో మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న వారు అత్యధికంగా 1,916 మంది ఫీజులు చెల్లించలేదు. గత నెల రెండో వారంలోనే సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ ముగియగా.. విద్యార్థులు అధిక సంఖ్యలో ఫీజులు చెల్లించకపోవడాన్ని గమనించిన అధికారులు ఈ నెల 25వ తేదీ వరకు రూ.5 వేల అపరాధ రుసుంతో చివరి అవకాశం కల్పించారు. సీసీ కెమెరాల ఏర్పాటు గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కచ్చితత్వం చేసింది. ముఖ్యంగా ప్రైవేటు క ళాశాలల్లో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంది. పరీక్ష పే పర్లు సీల్ కవరు తెరవడం మొదలు.. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసే వర కు కూడా అన్ని ప్రక్రియలు సీసీ కెమెరాల ని ఘాలోనే జరగాల్సి. ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ చాలా పరీక్ష కేంద్రాల్లో వసతుల కొరత తీవ్రంగా వేస్తుంది. ఇందులో వసతులు కల్పించడంలో అధికారులు ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి.. ఈ నెల 28 నుంచి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా చాలామంది విద్యార్థులు కొన్ని ఇబ్బందులతో ఫీజులు కట్టలేదు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25 వరకు రూ.5 వేల అపరాధ రుసుంతో చివరి అవకాశం కల్పించాం. ఆన్లైన్ పద్ధతిలో చెల్లించవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాల్‌టికెట్లు వస్తాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలను పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – శంకర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి,మహబూబ్‌నగర్ -
ఆన్లైన్ అడ్మిషన్లు
నల్లగొండ : ఇంటర్మీడియట్ విద్యలోనూ ఆన్లైన్ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టబోతున్నారు..! ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్లు ఏవిధంగా అయితే ఆన్లైన్లో జరుగుతున్నాయో అదే తరహాలో ఇంటర్ అడ్మిషన్లు కూడా చేపట్టాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహించాలంటే ముందుగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు తప్పనిసరి. ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కాలేజీల్లో మాత్రమే ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు వీ లుంటుంది. దీంతో ఈసారి ముందుస్తుగానే కాలేజీలకు ఆఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు తప్పనిసరిగా ఆఫిలియేషన్కు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫిలియేషన్ నిబంధనల విషయంలో ప్రభుత్వ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన అన్ని జూనియర్ కాలేజీలు కూడా అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నిబంధనలకు లోబడి కాలేజీలకు సంబంధించిన లీజు డీడ్, ఆటస్థలం, శానిటరీ సర్టి ఫికెట్, తరగతి గదుల వివరాలు, అగ్ని మాపకశాఖ నుంచి అనుమతి పత్రం, గ్రూపులు, నిర్ణయించిన ఫీజుల వివరాలతో సహా సమస్త సమాచారాన్ని జతచేసి అనుబంధ గుర్తింపు పొందేం దుకు జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 25 కాలేజీల యాజమాన్యాలు ఆఫిలియేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో ఐదు కాలేజీల దరఖాస్తులు లోపాలు ఉండటంతో వాటిని తిప్పిపంపారు. బోర్డు మార్గదర్శకాల మేరకు సర్టిఫికెట్లున్నీ ఉంటేనే జిల్లాకు అధికారులు ఆఫిలియేషన్ కోసం బోర్డుకు సిఫార్సు చేస్తున్నారు. బోర్డుకు పంపిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించేందుకు ప్రత్యేక అధికారులు జిల్లాల్లో పర్యటిస్తారు. కాలేజీల్లో వసతులన్నీ సవ్యంగా ఉ న్నాయని నిర్ధారించుకున్న తర్వాతే బోర్డునుంచి అనుబంధ గుర్తింపు జారీ చేస్తారు. ఇదంతా నిర్ణీత కాలవ్యవదితో జరుగుతుంది కాబట్టి మొత్తం ఆఫిలియేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు మార్చి వరకు గడువు పెట్టుకున్నారు. మార్చి వరకు పూర్తి వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి ముందుగానే కాలేజీల గుర్తింపు ఇవ్వనున్నారు. అన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. మార్చి నాటికి కాలేజీల గుర్తింపు పూర్తివుతుంది. ఆ తర్వాత కాలేజీల నోటిఫికేషన్ జారీ చేస్తారు. బోర్డు గుర్తింపు పొందిన కా లేజీల్లోనే ఆన్లైన్ అడ్మిషన్లు తీసుకుంటారు. – హనుమంతరావు, జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఫీజులు వివరాలు ఆన్లైన్లోనే... ఆఫిలియేషన్ పొందిన కాలేజీల జాబితాను బోర్డు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. ఆ కాలేజీల్లోనే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలి. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెం టర్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తమకు నచ్చిన కాలేజీలను ఎంపిక చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఏ కాలేజీ ఎంత ఫీజు వసూలు చేస్తుంది అనే వివరాలు కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి. దీంతో పాటు కాలేజీల్లో వసతులు, నిర్వహిస్తున్న గ్రూపుల వివరాలు కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో విద్యార్థులకు తమకు నచ్చిన కాలేజీలను ఎంపిక చేసుకుని అవకాశం లభిస్తుంది. అవకతవకలకు ఆస్కారం లేకుండా.... ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు, అనుమతి లేని కాలేజీల్లో చేరి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేం దుకు, నాణ్యమైన విద్యను అం దించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్లకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఆన్లైన్ అడ్మిషన్ వ్యవస్థ సాఫీగా సాగాలంటే బోర్డు నిబంధనలను యాజమన్యాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే ముందస్తు ఆఫిలియేషన్ ఫీజు చెల్లించి, ఆ తర్వాత అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవడం జరిగేది. దీంతో కాలేజీల్లో లోపాలు ఉన్న అధికారులను ఏదోరకంగా మేనేజ్ చేసుకుని అడ్మిషన్లు తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా ముం దుగానే అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిన్నింటినీ పరిశీలించి బోర్డునుంచి గుర్తింపు అనుమతి పొందిన తర్వాతే ఆఫిలియేషన్ ఫీజు తీసుకుంటారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. -
ఇంటర్మీడియట్ గ్రేడింగ్‌పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో గ్రేడింగ్‌పై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరిగే పరీక్షల్లో గ్రేడింగ్ ఎలా అమలు చేయాలి? జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలు ఏంటన్న అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటయ్యాక 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
మంత్రి మాట ఫెయిల్
►ఫెయిలైన విద్యార్థులకు మొక్కుబడి తరగతులు ►మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ►90 శాతం కాలేజీల్లో ప్రారంభం కాని శిక్షణ ►25 నుంచి ఇన్స్టంట్ పరీక్షలు 3,814 మొదటి సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు 1,972 ద్వితీయ సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తాం. - గత నెల 28న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటన వాస్తవ పరిస్థితి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మౌఖికంగా ఆదేశించినా.. లిఖితపూర్వక ఉత్తర్వులు లేకపోవడంతో జిల్లాలోని 90 శాతం కళాశాలల్లో ప్రత్యేక తరగతులు ఊసే కరువైంది. ఈనెల 25 నుంచి ఇన్స్టంట్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మంత్రి చేసిన ప్రకటన ఎందుకూ కొరగాకుండా పోయింది. కర్నూలు(జిల్లా పరిషత్) : సాక్షాత్తూ మంత్రి ప్రకటనకే విలువ లేకుండాపోయింది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఫెయిలైన విద్యార్థులకు కనీసం మూడు వారాల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. నోటి మాటే తప్పితే లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో.. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరేట్ కూడా మౌఖిక ఆదేశాలతో సరిపెట్టింది. వేసవి సెలవుల్లో రెగ్యులర్ లెక్చరర్లు గైర్హాజరవుతారని.. కాంట్రాక్టు లెక్చరర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో రెన్యూవల్ చేయబోమని సైతం స్పష్టం చేశారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొన్ని కళాశాలల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తుండగా.. తక్కిన కళాశాలలు ఆ ఆదేశాన్ని పెడచెవిన పెట్టాయి. మరో ఐదు రోజుల్లో ఇన్స్టంట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి హామీ చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం 35,602 మందికి గాను 20,661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 7,309 మంది విద్యార్థుల్లో 3,495 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 30,270 మందికి గాను 20,999 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 41 ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 6,317 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,345 మంది పాసయ్యారు. ఇదిలాఉంటే వేసవి సెలవుల్లో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు వారి కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా.. బస్సు పాసులు చెల్లవని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో సొంత ఖర్చులతో కళాశాలలకు చేరుకునేందుకు విద్యార్థులు ముందుకు రాలేకపోయారు. మొత్తంగా మంత్రి ప్రకటన అభాసుపాలైంది. -
ఇంటర్ తప్పిన వారికి ఉచిత క్లాసులు
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తోడ్పాటునందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీరికోసం సప్లిమెంటరీ పరీక్షలకు కొద్ది రోజులు ముందుగా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు. సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి మూడు వారాలపాటు సంబంధిత సబ్జెక్టులపై ఉచిత శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు చూస్తారని తెలిపారు. ఈ తరహా విధానం ఇదే మొదటిసారి. -
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 29న
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 29న విడుదలయ్యే అవకాశముంది. తొలి ఏడాది ఫలితాల్ని 25న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను 24 లేదా 25 తేదీల్లో, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని 28 లేదా 29 తేదీల్లో విడుదల షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల తర్వాతే ఏపీ ఇంటర్‌ఫలితాల్ని విడుదలచేయాలని భావిస్తున్నారు. ఒక వేళ తెలంగాణ ఫలితాల తేదీల్లో మార్పులు జరిగితే వాటినిబట్టి ఇవీ మారతాయి. కాగా ప్రైవేటు వర్సిటీల బిల్లుపై ఈనెల 22న సీఎం వీసీలతో సమీక్షించనున్నారు.