సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ మంగళవారం ప్రారంభమైంది. అబిడ్స్‌లోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యూయేషన్ ఏర్పాటు చేశారు. తొలిరోజు 350 మంది లెక్చరర్లు రిపోర్టు చేశారు. ఒక్కో గదిలో పది నుంచి 15 మంది లెక్చరర్లకు వసతి కల్పించారు. జవాబు పత్రాలతో పాటు ఆయా స్పాట్ వాల్యూయేషన్ గదులను పూర్తిగా శానిటైజ్ చేశారు. లెక్చరర్లు మాస్క్‌లు ధరించి..భౌతిక దూరం పాటిస్తూ పేపర్లను దిద్దారు. ఒక్కో లెక్చర్ 45 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇదే అబిడ్స్‌లోని సెయింట్‌జార్జ్, సుజాత జూనియర్ కాలేజీ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీసర్ జయప్రద బాయి తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే..20 రోజుల్లో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment