మహబూబ్‌నగర్‌లోని ఓ కళాశాలలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 28వ తేదీ నుంచి థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారులు ఏర్పాట్లు చేయడంలో ని మగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 17 ప్రైవేటు కేంద్రాలు కాగా.. 22 ప్రభుత్వ కళాశాలలకు చెందిన కేంద్రాలున్నాయి. ఇందులో మొత్తం 27,098 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే జరగనున్నాయి. 22 ప్రభుత్వ కళాశాలలకు ప్రభుత్వం నిఘా కోసం గత విద్యా సంవత్సరం సీసీ కెమెరాలు అందించింది. కానీ ప్రైవేటు కళాశాలల్లో మాత్రం కొన్నింటిలో మాత్రమే సీసీ కెమెరాలున్నాయి. లేని వాటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
అపరాధ రుసుంతో..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు పొంది వివిధ కారణాలతో ఇప్పటి వరకు 2,959 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. పలు ప్రైవేటు కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్లు పొంది తర్వాత మధ్యలోనే బంద్ చేయడం, కళాశాలల్లో ఫీజులు కట్టలేకపోవడం, అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోవడం ప్రధానంగా ఉన్నాయి. మరింత మంది వలస వెళ్లడం, ఇతర ఎంట్రెన్స్‌ల్లో సీట్లు వచ్చి ఇతర కోర్సుల్లోకి వెళ్లడం, కొంతమంది బాలికలు చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకోవడం కారణంగా ఫీజు చెల్లించనట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఫీజులు కట్టిన విద్యార్థుల్లో మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న వారు అత్యధికంగా 1,916 మంది ఫీజులు చెల్లించలేదు. గత నెల రెండో వారంలోనే సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ ముగియగా.. విద్యార్థులు అధిక సంఖ్యలో ఫీజులు చెల్లించకపోవడాన్ని గమనించిన అధికారులు ఈ నెల 25వ తేదీ వరకు రూ.5 వేల అపరాధ రుసుంతో చివరి అవకాశం కల్పించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కచ్చితత్వం చేసింది. ముఖ్యంగా ప్రైవేటు క ళాశాలల్లో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంది. పరీక్ష పే పర్లు సీల్ కవరు తెరవడం మొదలు.. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసే వర కు కూడా అన్ని ప్రక్రియలు సీసీ కెమెరాల ని ఘాలోనే జరగాల్సి. ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ చాలా పరీక్ష కేంద్రాల్లో వసతుల కొరత తీవ్రంగా వేస్తుంది. ఇందులో వసతులు కల్పించడంలో అధికారులు ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాల్సిందే.
సద్వినియోగం చేసుకోవాలి..
ఈ నెల 28 నుంచి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా చాలామంది విద్యార్థులు కొన్ని ఇబ్బందులతో ఫీజులు కట్టలేదు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25 వరకు రూ.5 వేల అపరాధ రుసుంతో చివరి అవకాశం కల్పించాం. ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాల్‌టికెట్లు వస్తాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలను పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– శంకర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి,మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment