
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో గ్రేడింగ్‌పై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరిగే పరీక్షల్లో గ్రేడింగ్ ఎలా అమలు చేయాలి? జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలు ఏంటన్న అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటయ్యాక 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment