grading
-
చేపల పట్టుబడి.. మెలకువలతో అధిక రాబడి
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే.. పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం ∙రైతులు మార్కెట్లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి ∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి ∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి ∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి. ∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి ∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి పట్టుబడి సమయంలో.. ∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి ∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి ∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి ∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు ∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు ∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి ∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి పట్టుబడి తర్వాత.. ∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి ∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి ∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి ∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి ∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి ∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు ∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి ∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి గ్రేడింగ్ ఇలా.. ∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం ∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి ∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి ∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి ∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! -
వీఆర్వోలకు గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్‌తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు. 15 ఇతర శాఖల్లో సర్దుబాటు! రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఆశిస్తున్నారు. -
సులభతర వాణిజ్యానికి గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామికీకరణ, తద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిప్) ప్రతీ ఏటా రా ష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) కోసం ఆయా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా.. ప్రపంచ బ్యాంకు సహకారంతో డిప్ ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 340 అంశాల్లో రాష్ట్రాలు చేపట్టే వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బ్రాప్)ను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను ఏటా ప్రకటిస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్‌ల విధానంపై తెలంగాణ, గుజరాత్ సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈఓడీబీ ర్యాంకింగ్ విధానాన్ని సమీక్షించిన డిప్.. 2019 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ర్యాంకులకు బదులుగా గ్రేడింగ్ విధానం పారిశ్రామికీకరణలో ముందంజలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ర్యాంకింగులో వెనుకబడి పోవడం కూడా ఈఓడీబీ ర్యాంకింగ్‌పై సందేహాలకు కార ణమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. గ్రేడింగ్ విధానం పాటించాలని డిప్ నిర్ణయించగా, మార్కులకు బదులుగా దశాంశమాన పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తోంది. ఒక్కో సంస్కరణకు సంబంధించి కనీసం 75కు పైగా పాయింట్లు వస్తేనే గ్రేడింగ్ సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన ర్యాంకింగుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిన డిప్.. ఈ ఏడాది పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలను గ్రేడ్ల కేటాయింపులో ప్రాతిపదికగా తీసుకుంటోంది. బడ్జెట్లో ఏటా నిధులు కేటాయిస్తున్నా.. విడుదల కాకపోవడంపై పారిశ్రామికవర్గాలు డిప్ సర్వేలో ప్రతికూలంగా స్పందిం చే అవకాశముంది. ర్యాంకుల స్థానంలో టాప్ అచీవర్ (95 శాతానికి పైగా పాయింట్లు), అచీవర్ (90 నుంచి 95), ఫాస్ట్ మూవర్ (80 నుంచి 90), ఆస్పైరర్స్ (80 కంటే తక్కువ పాయింట్లు) పేరిట డిప్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడ్లను ప్రకటించనుంది. ఈ ఏడాది గ్రేడింగ్‌పై ప్రభావం ఈ ఏడాది సులభతర వాణిజ్య గ్రేడింగ్‌లో తొలి స్థానం చేరుకునేందుకు అవసరమైన సంస్కరణల అమలుపై తెలంగాణ పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలపై.. పారిశ్రామికవర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడింగ్‌లో కీలకం కానుంది. డిప్ నిర్వహించే సర్వేలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధిం చిన ప్రతిస్పందన కీలకంగా మారే అవకాశముంది. -
తెలంగాణకు నాలుగో గ్రేడ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాల పనితీరు, ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్చార్డీ) గ్రేడింగ్ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో మొదటిసారిగా గ్రేడింగ్‌ను ప్రకటించింది. అభ్యసన సామర్థ్యాలు, ప్రమాణాలు, ఫలితాలు, పాఠశాల ప్రగతి, పాలన, నిర్వహణ, అందుబాటులో పాఠశాల, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాల అమలు తదితర 70 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ గ్రేడ్లను కేటాయించింది. ఒక్కో అంశానికి 10–20 పాయింట్ల చొప్పున పరిగణనలోకి తీసుకొని మొత్తంగా 1000 పాయింట్ల ఆధారంగా ఈ గ్రేడ్లను నిర్ణయించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు గ్రేడ్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరం లెక్కల ఆధారంగా వీటిని కేటాయించిన నివేదికను ఎంహెచ్ఆర్డీ ఇటీవల విడుదల చేసింది. ప్రతి ఏటా నివేదిక జాతీయ స్థాయిలో పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండె క్స్ నివేదికను ఇకపై ప్రతి ఏటా జనవరిలో, రాష్ట్రాల వారీ నివేదికను ప్రతి ఏటా ఏప్రిల్‌లో వెల్లడిస్తామని హెచ్చార్డీ తెలిపింది. రాష్ట్రాలు, అక్కడి పాఠశాలల పనితీరు ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు భవిష్యత్తులో నిధులను కేటాయించనున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా కొన్ని ప్రధాన అంశాల్లో పనితీరును ఎంహెచ్ఆర్డీ ప్రశంసించింది. తెలంగాణ విషయంలో.. విద్యార్థుల ఆన్లైన్ హాజరు విధానం భేష్ అని ప్రశంసించింది. పాఠశాల పాలన, నిర్వహణలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ పద్ధతిలో అధిక సంఖ్యలో టీచర్ల బదిలీలను బాగా చేశారని వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్ విద్యకు బడ్జెట్‌ను ఎక్కువ కేటాయిస్తోందని, స్టేట్ షేర్ బాగా ఇస్తోందని పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లో స్టూడెంట్స్ యూనిక్ ఐడీ విధానం బాగుందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు పెద్ద ఎత్తున వృత్తి విద్యా కోర్సులను నేర్పిస్తున్నారని తెలిపింది. జార్ఖండ్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారని వెల్లడించింది. కేరళలో సింగిల్ టీచర్ స్కూళ్లు చాలా తక్కువ ఉన్నాయని వివరించింది. ఇవీ వివిధ రాష్ట్రాలకు లభించిన గ్రేడ్లు.. కేరళ, చండీగఢ్, గుజరాత్ రాష్ట్రాలకు 801–850 మధ్య పాయింట్లతో మొదటి గ్రేడ్ లభించింది. 851–1000 పాయింట్లు ఏ ఒక్క రాష్ట్రానికి లభించలేదు. 751–800 పాయింట్లతో దాద్రానగర్ హవేలీ, హరియాణా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలకు గ్రేడ్–2 లభించింది. 701–750 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గ్రేడ్–3 లభించింది. 651–700 పాయింట్లతో డయ్యూ డామన్, మహారాష్ట్ర, మిజోరాం, పుదుచ్చేరి, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాలకు నాలుగో గ్రేడ్ ఇచ్చింది. 601–650 పాయింట్లతో అండమాన్ నికోబార్, బిహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గ్రేడ్–5లో ఉన్నాయి. 551–600 పాయింట్లతో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఆరో గ్రేడ్ లభించింది. ఏడో గ్రేడ్‌లో ఏ రాష్ట్రాలు లేవు. -
గులాబీ నేతలకు ‘పంచాయతీ’ గ్రేడింగ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి రావడం.. గ్రామపంచాయతీలను పెంచుతూ తీర్మానించి అసెంబ్లీ లో ఆమోదించడం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహుర్తం కుదిరినట్లు సంకేతాలు ఇస్తున్నాయి. పంచాయతీ చట్టంలో సవరణలు చేసినప్పటికీ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కొత్త గ్రామ పంచాయతీలనూ ప్రకటించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ‘పంచాయతీ’ సమరం ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో జోరందుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రం కీలకంగా మారాయి. నెలరోజులుగా పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎన్నికలపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఫలితాలను విశ్లేషించి ఏమాత్రం తగ్గకుండా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ‘ముందస్తు’గా అప్రమత్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే ‘గ్రేడింగ్’ ఉంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. హైదరాబాద్‌ను వదిలి నియోజకవర్గాల్లో తిరగాలనీ ఇటీవల సూచించారు. సాధారణ ఎన్నికలకు ముందువస్తున్న ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేంత పగడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు సంకటంగా మారనున్నాయి. ‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే.. సాధారణ ఎన్నికలకు ముందు వస్తున్న పంచాయతీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్‌లు ఇస్తోంది. దాని ఆధారంగానే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం కావడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది. సర్పంచ్‌లను గెలిపించుకునే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్.. బలం నిరూపించుకునేందుకు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలను పాత పద్ధతిలో (ప్రత్యక్ష పద్ధతి) నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు ఉండగా జిల్లాల విభజన తర్వాత కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న జీపీల సంఖ్య 1022 కు తగ్గింది. ఇటీవల ప్రకటించిన కొత్త పంచాయతీలతో తిరిగి 1202కు చేరింది. వీటిలో అత్యధిక స్థానాలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధికార పార్టీ నేతలపై పడింది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ సర్పంచులే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్ సీరియస్‌గా ఆదేశించడం అధికార నేతల్లో ఆందోళన మొదలైంది. ‘పంచాయతీ’లో ఎక్కడెక్కడ ఆధిక్యం.. గత ఫలితాల విశ్లేషణలో నేతలు 2013లో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చిపెట్టాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రజాప్రతినిధులు గత సర్పంచ్ ఎన్నికల విశ్లేషణలో పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గస్థాయి నేతలూ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో కూడిన ఈ రెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 12 నియోజకవర్గాలకు ఐదుచోట్ల అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నాయి. మంథనిలో మాత్రం శ్రీధర్‌బాబు అప్పుడు మంత్రిగా ఉండడంతో 122 పంచాయతీలకుగాను 83 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 19 చోట్ల టీఆర్ఎస్, 20 చోట్ల టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులు, ఇతరులు గెలిచారు. జగిత్యాలలో 80 పంచాయతీలకు 39 కాంగ్రెస్, 18 టీడీపీ, కేవలం 4మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పోలిస్తే కోరుట్లలో మొత్తం 69 స్థానాలకు 26 కాంగ్రెస్, 23 టీఆర్ఎస్, మానకొండూరులో 122 జీపీలకు 38స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల టీఆర్ఎస్, చొప్పదండిలో 118 జీపీలకు 34కాంగ్రెస్, 23 టీఆర్ఎస్ గెలుచుకుంది. హుజూరాబాద్‌లో 92 జీపీలకు టీఆర్ఎస్ 53, కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. అక్కడ 21మంది స్వతంత్రులు గెలిచారు. సిరిసిల్లలో 92జీపీలకు టీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 19 చోట్ల గెలిచాయి. 14 మంది స్వతంత్రులు, 8 మంది వైఎస్ఆర్ సీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ బలపరచినవారు విజయం సాధించారు. హుస్నాబాద్‌లో 122 జీపీలకు టీఆర్ఎస్ 62, కాంగ్రెస్ 21 గెలుచుకున్నాయి. మిగతా చోట్ల సీపీఐ, ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ధర్మపురిలో 129జీపీలకు 51 టీఆర్ఎస్, 42చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, టీడీపీ, ఇతరపార్టీలు గెలిచాయి. వేములవాడలో 109 జీపీలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ తలా24 గెలిచాయి. పెద్దపల్లిలో 102 జీపీలకు టీడీపీ అత్యధికంగా 31 గెలుచుకుంది. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 20చోట్ల గెలిచాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు గెలిచాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫలితాలు తారుమారై చాలామంది స్వతంత్రులు, ఇతర పార్టీల సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఇంటర్మీడియట్ గ్రేడింగ్‌పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో గ్రేడింగ్‌పై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరిగే పరీక్షల్లో గ్రేడింగ్ ఎలా అమలు చేయాలి? జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలు ఏంటన్న అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటయ్యాక 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
ఐటీఐలకు స్టార్ రేటింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లకు గ్రేడింగ్‌లు కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 13,000 ఐటీఐల్లో ఇప్పటికే 3,500 ఐటీఐలకు గ్రేడింగ్ ఇవ్వడం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐటీఐల్లో అత్యుత్తమంగా రాణించిన సంస్థలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యుత్తమ ఐటీఐలవైపు విద్యార్థులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు. ఐటీఐల్లో మౌలిక వసతులు, పరిశ్రమలతో అనుసంధానం, యంత్ర పరికరాల లభ్యత, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది తదితర 43 అంశాలపై గ్రేడింగ్‌లు కేటాయించనున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) రెండు దశల్లో అన్ని ఐటీఐలను సమీక్షించి గ్రేడింగ్ ఇవ్వనుంది. గ్రేడింగ్‌తో పాటు 3 స్టార్ల కంటే అధికంగా రేటింగ్ సాధించే ఐటీఐలకు వివిధ పథకాల కింద ప్రపంచ బ్యాంకు నిధుల్ని అందించనున్నారు. సదరు విద్యాసంస్థల ప్రిన్సిపల్స్‌కు దేశ, విదేశాల్లోని అత్యున్నత సంస్థల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడింగ్
–నంద్యాల, డోన్ ఆసుపత్రులు టాప్ –పలు సీహెచ్‌సీల్లో సున్నా ప్రసవాలు కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్స్ ఇస్తోంది. ఆయా ఆసుపత్రులు రోగులకు అందించే సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరు ఆధారంగా ఏ,బీ,సీ, గ్రేడింగ్ ఇచ్చారు. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, పీహెచ్‌సీలు మినహా ఇతర ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పనితీరును బట్టి గ్రేడింగ్స్ ఇచ్చింది. నంద్యాలలోని జిల్లా ఆసుపత్రికి ఏ గ్రేడ్, 18 సీహెచ్‌సీల్లో 5 ఏ గ్రేడ్, ఒకటి బీ గ్రేడ్, 12 సీ గ్రేడ్ సాధించాయి. ఓపీ, ఐపీ సేవల్లో నంద్యాల జిల్లా ఆసుపత్రి , ఆదోని ఆసుపత్రి లక్ష్యాన్ని మించాయి. సీహెచ్‌సీల్లో డోన్ టాప్ అన్నిరకాల ఇండికేటర్లలో డోన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నత స్థానంలో నిలిచింది. ట్యూబెక్టమి ఆపరేషన్లలో 101కి గాను 337, ఓపీ 8100కి గాను 7754, ఐపీ 600లకు గాను 532 మందికి చికిత్స అందించారు. 30 ప్రసవాలకు గాను 110 మందికి, 110 ట్యూబెక్టమి ఆపరేషన్లకు గాను 367 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి నెలకు 180 మందికి ప్రసవం చేయాలని లక్ష్యం నిర్దేశించగా 336 మంది, బనగానపల్లిలో 60 మందికి గాను 35, ఆదోని ఎంసీహెచ్‌లో 300లకు గాను 365, ఎమ్మిగనూరులో 60కి గాను 174 మంది ప్రసవించారు. 30 పడకల ఆసుపత్రుల్లో ఆలూరులో 30కి గాను 46, పత్తికొండలో 41,ఆళ్లగడ్డలో 71, ఆత్మకూరులో 22, కోడుమూరులో 7, డోన్‌లో అత్యధికంగా 101, ఓర్వకల్లులో 28, వెల్దుర్తిలో ఏడుగురు మహిళల కాన్పులు జరిగాయి. కాగా ఆలూరు, అవుకు, కోవెలకుంట్ల సున్నిపెంట, నందికొట్కూరు, యాళ్లూరు, పాణ్యం, మిడుతూరు, వెలుగోడు సీహెచ్‌సీల్లో ఒక్క కాన్పు జరగలేదు. -
ఆన్లైన్లో ప్రభుత్వ బడిపిల్లల మార్కులు
మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు! సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభ ఇకపై విద్యాశాఖ వెబ్సైట్లో కనిపించనుంది. విద్యార్థులు రాస్తున్న పరీక్షల తాలూకు మార్కులను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం పాఠశాలల్లో సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫలితాలను ఇప్పటివరకు సర్వ శిక్షా అభియాన్ అధికారులు సేకరించి క్రోఢీ కరించేవారు. తాజాగా ఈ మార్కులను వెబ్ సైట్లో పొందుపర్చాలని అధికారులు నిర్ణయిం చారు. ఏటా పాఠశాల వారీగా విద్యార్థుల వివరాలను ఎస్ఎస్ఏ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలకు మార్కు లను జోడిస్తే సులభతరమవుతుందని విద్యా శాఖ ఈమేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమాచార లింకుకు ఆయా సబ్జెక్టులలో వచ్చే మార్కులను జతచేసేలా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రక్రియతో పిల్లలకు ఆయా సబ్జెక్టులలో వచ్చే మార్కులను తెలుసు కునే అవకాశము ఉంటుంది. అంతే కాకుండా పాఠశాల వారీగా వచ్చే మార్కులతో పాఠ శాల, గ్రామ, మండల స్థాయిలో గ్రేడింగ్‌లు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టు లకు 12 కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య పథకాన్ని అమలు చేయడానికి 40 శాతం వరకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకూ త్వరలో ప్యాకేజీ పెంచాలని నిర్ణయించింది. ఆయా నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్‌లు ఇచ్చాక ప్యాకేజీ పెంపుపై నిర్ణయం తీసుకో వాలని నిర్ణయించింది. గ్రేడింగ్ కోసం ఉద్యో గులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజే హెచ్ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని నిర్ణయిం చింది. కమిటీలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌లు సభ్యులు గా ఉంటారు. ఆ కమిటీ 230 నెట్వర్క్ ఆస్పత్రులను అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఆస్పత్రులను ఎ, బి, సిలుగా వర్గీకరించి దాని ప్రకారం ప్యాకేజీ పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ ప్యాకేజీ ఆరోగ్యశ్రీలోని పేదరోగులకు ఇది వర్తించదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజీ సరిపోదని కార్పొరేట్ ఆస్పత్రులు రెండేళ్లుగా వైద్యసేవలు ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కార్పొ రేట్లకు ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకూ పెంచాలని నిర్ణయించింది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో వసతులు, స్పెషలిస్టు వైద్యులు, అందించే వైద్యసేవలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిని వర్గీకరించాక గ్రేడింగ్‌ల ప్రకారం వాటికి ప్యాకేజీ పెంచాలని నిర్ణయించారు. -
ఉల్లి గ్రేడింగ్‌కు 13 టీములు
- డివిజన్ల వారీగా రోజులు కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ 13 టీములను నియమించారు. ఒక్కో టీములో ఉద్యాన అధికారి, మార్కెటింగ్ శాఖ సూపర్వైజర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. మార్కెట్లో 13 షెడ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్‌కు ఒక టీమును ఏర్పాటు చేశారు. ఈ టీములు రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడ్లు ఇస్తుంది. ఇందుకు అనుగుణంగా ధరలు రావాల్సి ఉంది. గ్రేడ్‌కు తగిన ధర లభించకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటారు. ఉల్లికి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తెచ్చుకొని విక్రయించుకోవాల్సిఉంది. ఆదోని రెవెన్యూ డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో, నంద్యాల రెవెన్యూ డివిజన్ రైతులు శనివారం మాత్రమే ఉల్లిని తెచ్చు కోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రైతులకు సూచించారు. మార్కెట్లోకి ఉల్లిని ముందు రోజు సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని వివరించారు. రైతులు మార్కెట్‌కు వచ్చేటపుడు ఆన్లైన్ అడంగల్, ఆధార్ కార్డు , బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ తీసుకరావాలని సూచించారు. ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తారు. ఇందులో రైతుల భూముల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేసింది ఉంటుంది. రైతులు ఈ కార్డుపై సంబంధిత వీఆర్ఓ, తహసీల్దారు సంతకాలు చేయించి మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించాలి. ఆ తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాకు మద్దతు మొత్తాన్ని జమ చేస్తారు. రూ.50 నుంచి రూ.300 వరకు ఉల్లికి ధర లభిస్తే ఆ రైతులకు ప్రభుత్వం రూ.300 మద్దతు చెల్లిస్తుంది. రూ.400 ధర లభిస్తే రూ.200, రూ.500 ధర లభిస్తే రూ.100 ప్రకారం మద్దతును చెల్లిస్తారు.గరిష్టంగా క్వింటాలుకు రూ.300 మద్దతు కి ంద చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరీ తెలిపారు. -
సుజాతకు ఫస్ట్.. మాణిక్యాలరావుకు 12
మంత్రులకు మళ్లీ గ్రేడింగ్‌లు ఇచ్చిన చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రుల పనితీరుకు సంబంధించి టీడీపీ అధిష్టానం ఇచ్చుకునే ర్యాంకుల్లో ఈసారి జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యలతో భేటీ అయ్యారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు సమావేశమై మంత్రుల పనితీరుపై సమీక్షించారు. సుదీర్ఘ సమీక్షల అనంతరం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం, శాఖల పర్యవేక్షణ, మంత్రిగా జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించడం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన పీతల సుజాతకు మొదటి ర్యాంకు ఇచ్చినట్టు తెలిసింది. 6 నెలల క్రితం ఇంట్లో నోట్లకట్టలు దొరకి.. వివాదాల్లో కూరుకున్న ఆమెకు ఆ కేసులో పోలీసుల నుంచి క్లీన్చిట్ వచ్చినా పార్టీ అధిష్టానం వద్ద ఒకింత పట్టు తగ్గిందన్న ప్రచారం జరిగింది. తదనంతర పరిణామాల్లో జిల్లాలోని ఓ వర్గం తనను ఉద్దేశపూరకంగా చిన్నచూపు చూస్తోందని ఆమె మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆమెకు మొదటి ర్యాంకు రావడంతో పార్టీ అధినేత వద్ద మంచి పలుకుబడి సాధించనట్టయ్యిందన్న వాదనలు మొదలయ్యాయి. జిల్లాకే చెందిన పైడికొండల మాణిక్యాలరావుకు 12వ ర్యాంకు ఇచ్చినట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకే చెందిన కృష్ణాజిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్‌కు నాలుగో ర్యాంకు రాగా, పైడికొండల 12వ ర్యాంకుకు దిగిపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. టీడీపీ నేతలను కాదని.. నిట్ సాధించిన నేతగా ఆయనకు గుర్తింపు లభించినా చంద్రబాబు ఇచ్చిన గ్రేడుల్లో వెనుకబడటం గమనార్హం. కాగా, ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రులకు చంద్రబాబు ఇచ్చే గ్రేడింగ్‌లు ఏమేరకు ఫలితమిస్తాయి, 6 నెలలకోసారి ఇచ్చే ర్యాంకులు ఎవరికి ఉపకరిస్తాయన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. -
టీచర్లకూ గ్రేడింగ్
పనితీరు సూచికల ఆధారంగానే పదోన్నతులు డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా హెచ్ఎం, ఎంఈవో పోస్టులు అమలుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించిన కేంద్రం ఆ దిశగా రాష్ట్రంలోనూ చర్యలకు విద్యాశాఖ కసరత్తు వచ్చే విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు కూడా పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారా? తదితర అంశాలపై ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు పని తీరు సూచికలు ఇవ్వాలని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. విద్యా బోధనపై దృష్టి పెట్టని టీచర్లు పాఠశాలల్లో విద్యా బోధన ఎలా సాగుతుందన్న అంశంపై గతంలో విద్యాశాఖ రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో పనితీరు సూచికలు ప్రవేశ పెట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిభ, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతుల్లో ప్రాధాన్యం టీచర్ల ప్రతిభా ప్రదర్శన, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తోంది. దీనికోసం అవసరమైన నియమావళి రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ విధానం కర్ణాటకలో అమల్లో ఉంది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తోంది. పనితీరు అంచనాలో పరిగణనలోకి తీసుకునే ప్రధాన అంశాలు - తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. - పిల్లల ప్రగతి వివరాలను తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు. - టీచర్లకు సబ్జెక్టుపై, సోపానాల ప్రకారం బోధించడంపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. - ప్రతి నెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తి పరమైన నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు. -
రేటింగ్ ఏజెన్సీలపై ఆధారపడొద్దు
ముంబై: పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోలను ఎంపిక చేసుకునేటప్పుడు పూర్తిగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చిన గ్రేడింగ్‌లపై ఆధారపడకుండా రిస్కులను సొంతంగా మదింపు చేయాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా సూచించారు. ఇందుకోసం తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎక్సెలెన్స్ ఎనేబ్లర్స్ సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో ఆయన ఈ విషయాలు తెలిపారు. వివిధ పెట్టుబడి సాధనాలను ఫండ్ సంస్థలు సొంతంగా పరిశోధించాలన్నారు. అలాగే ఏయే రంగాల సంస్థల్లో ఎంత ఎంత పెట్టుబడులు పెట్టవచ్చన్న పరిమితులకు సంబంధించి మరిన్ని మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సిన్హా పేర్కొన్నారు. మరోవైపు స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్ అంశంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించి త్వరలో మార్గదర్శకాలు ప్రకటించగలమని సిన్హా చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆందోళన వద్దు కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను అంశాన్ని ప్రభుత్వం తమపై బలవంతంగా రుద్దుతోందని భావించరాదని సిన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతూనే ఉన్నాయన్నారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి మార్గదర్శకాలు.. డెట్ సెక్యూరిటీలు, నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు మొదలైన వాటిని లిస్ట్ చేసిన కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి నిర్దిష్ట ఫార్మాట్‌ను సెబీ విడుదల చేసింది. ఈ లిస్టెడ్ కంపెనీలు క్రితం సంవత్సరంతో పోలుస్తూ నికర అమ్మకాలు, లాభాలు తదితర వివరాలతో అర్థ సంవత్సర ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ మొండి బకాయిలు, క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి తదితర వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి తోడ్పతాయని సర్క్యులర్‌లో తెలిపింది. -
రహానేకు ‘ఎ’ గ్రేడ్
‘బి’కి పడిపోయిన సురేశ్ రైనా ముంబై: వచ్చే ఏడాది కాలానికి క్రికెటర్లకు బీసీసీఐ గ్రేడింగ్‌లు ప్రకటించింది. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తూ వచ్చిన అజింక్య రహానేకు తొలి సారి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. వన్డే, టి20 కెప్టెన్ ధోని, టెస్టు కెప్టెన్ కోహ్లిలతో పాటు జట్టు ప్రధాన స్పిన్నర్ ఆర్. అశ్విన్‌లు మాత్రమే ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరికి ఏడాదికి రూ. కోటి కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. మరో వైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న భువనేశ్వర్, వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సురేశ్ రైనాలను ‘ఎ’ గ్రేడ్‌నుంచి తొలగించి ‘బి’ గ్రేడ్‌లో ఉంచారు. ఈ గ్రేడ్‌లోని రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజాలు ‘సి’కి పడిపోగా...‘సి’లో ఉన్న ఏడుగురు యువ ఆటగాళ్లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. ‘బి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 50 లక్షలు, ‘సి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 25 లక్షలు లభిస్తాయి. ఈ ఏడాది ఆటగాళ్ల సంఖ్య 32నుంచి 26కు తగ్గడం విశేషం. మిథాలీరాజ్‌కు ‘ఎ’ గ్రేడ్ బీసీసీఐ తొలి సారి మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు ప్రకటించింది. రూ. 15 లక్షలు లభించే ‘ఎ’ గ్రేడ్‌లో మిథాలీరాజ్‌తో పాటు జులన్, హర్మన్‌ప్రీత్, తిరుష్కామినిలకు స్థానం లభించగా, మరో ఏడుగురు ‘బి’ గ్రేడ్ (రూ. 10 లక్షలు)లో ఉన్నారు. -
ఫలితమివ్వని చర్చలు
రెండో రోజూ బెల్లం మార్కెట్ బంద్ కొలగార్లు, వ్యాపారుల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన 16 పైసలు పెంచేందుకు వర్తకుల ప్రతిపాదన బుధవారం ఉదయం నిర్ణయం వెల్లడిస్తామన్న కొలగార్లు అనకాపల్లి: బెల్లం మార్కెట్లో కొలగారం పెంపు విషయమై చోటుచేసుకున్న ప్రతిష్టంభన తొలగలేదు. కొలగార్లు, వర్తకుల మధ్య మంగళవారం రాత్రి వరకు సాగిన చర్చలు ఫలించలేదు. మంగళవారం కూడా కొలగార్లు ఎవరూ మార్కెట్‌కు రాలేదు. కొలగారం పెంచాలన్న డిమాండ్‌తో కొలగార్లు మార్కెట్లో సోమవారం నుంచి బీట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులు సుమారు రూ.4 కోట్లకు పైబడి బెల్లం వ్యాపారం ఆగిపోయింది. బుధవారం నాటి లావాదేవీలపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మార్చి నెల కావడంతో బెల్లం సీజన్ జోరుగానే ఉంటుంది. సీజన్ ముగింపు దశలో లావాదేవీలు నిలిచిపోవడం రైతులకు పెద్ద నష్టమే. కమతాలలో తయారు చేసిన బెల్లం పాడయ్యే ప్రమాదముంది. కొలగార్లకు వంద కిలోలకు 16 పైసలు పెంచేందుకు ఎగుమతి వర్తకులు సుముఖత వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం గిట్టుబాటుకాదని కొలగార్లు అభిప్రాయపడుతున్నారు. గ్రేడింగ్‌తో పాటు బీట్ నిర్వహణ కోసం దిగుమతి వర్తకులు అదనపు కొలగారం ఇవ్వాలని కోరుతున్నారు. బుధవారం ఉదయం వారంతా సమావేశమై 16 పైసలు పెంపు విషయమై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. చర్చలు ఫలిస్తే బుధవారం మధ్యాహ్నం నుంచైనా లావాదేవీలు జరిగే అవకాశముంది. లేకుంటే ప్రతిష్టంభన కొనసాగుతుంది. -
‘గ్రేడింగ్’ దగా!
తాండూరు: మార్కెట్ యార్డులో వ్యాపారులకు మక్కలు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే ఇక్కడ కూడా వంచనకు గురైతే ఇక రైతులకెవరు దిక్కు. డీసీఎంఎస్ అధికారులు కొనుగోలు చేసిన మక్కలను మార్క్‌ఫెడ్ తిరస్కరిస్తోంది. కొనుగోలు చేసిన పంటలో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంతో సీడబ్ల్యూసీకి వెళ్లిన దిగుబడులను తిరస్కరిస్తున్నారు. బాణాపూర్, ఎల్మకన్నె, సంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రాజు, డాక్యానాయక్, పాండురంగారెడ్డి, అమృతారెడ్డిల నుంచి ఈ నెల 8, 10, 14 తేదీల్లో 228.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ తాండూరు కేంద్రం నుంచి అధికారులు లారీలో తరలించారు. ఆయా రైతులకు చెందిన మక్కలు నాణ్యతగా లేవని అక్కడి అధికారులు తిరస్కరించారు. దీంతో కొంత చిక్కు వచ్చింది. కొనుగోలు చేసి రసీదులు ఇచ్చిన తర్వాత నాణ్యతగా లేవని నిర్ధారించడంతో రైతులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావంతో తాండూరులోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల తూకాలు నిలిచిపోవడంతో కొనుగోళ్లకు బ్రేక్ పడింది. తాము కొనుగోలు చేసి గోదాంకు తరలిస్తే అక్కడికి వెళ్లిన తర్వాత నాణ్యతగా లేవని తిరస్కరిస్తే రైతులకు మేం ఏం సమాధానం చెప్పాలని స్థానిక డీసీఎంఎస్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 బస్తాల మక్కలు కొనుగోలు కేంద్రానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన పంపించిన తర్వాత తిరస్కరిస్తున్నందున తూకాలు చేయలేమని డీసీఎంఎస్ గోదాం సిబ్బంది చెబుతున్నారు. సంబంధిత అధికారులు వచ్చి నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నాయని చెబితేనే తూకాలు వేస్తామని డీసీఎంఎస్ గోదాం ఇన్చార్జి ఎల్లయ్య స్పష్టం చేశారు. రూ.12.57 లక్షల విలువైన మక్కల సేకరణ అక్టోబర్ 15న తాండూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. అదే నెల 28 నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 15 వరకు 26 మంది రైతుల నుంచి ఏ, బీ, సీ గ్రేడ్లకు చెందిన రూ.12.57లక్షల విలువ చేసే దాదాపు 997.50 క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వరకు రైతులకు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంది. -
సిద్దిపేటలో భారీ వర్షం
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ గ్రామాల నుంచి 8 వేల క్వింటాళ్ల మక్కలు, వడ్లు విక్రయానికి వచ్చాయి. పీఏసీఎస్ అధికారులు బీట్‌ను నిర్వహించి గ్రేడింగ్‌కు అనుగుణంగా వాటిని కొనుగోలు చేశారు. వీటిని తూకం వేసి బస్తాల్లో నిం పి గోదాంలకు తరలిస్తున్నారు. సుమారు 7 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని వాహనాల్లో వేసి తరలించారు. మరో వెయ్యి క్వింటాళ్ల మక్కల తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఊహించని రీతిలో వర్షం మొదలైంది. ఇది అధికం కావడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ముత్యంరెడ్డి హుటాహుటిన యార్డును సందర్శించి మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి తడిసిన మక్కలను పరిశీలించారు. ఈ సమయంలో రైతులు ఆర్డీఓతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తడిసిందనే కారణంతో కొనుగోళ్లను నిలిపేయొద్దని కోరారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ, జాయింట్ కలెక్టర్ శరత్‌లకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. అయితే తడిసిన మక్కలను పత్తి మార్కెట్ ఆవరణలో ఆరబోసి ఎండిన తర్వాత మార్క్‌ఫెడ్ అధికారులకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆర్డీఓను ఆదేశించారు. రైతులకు ఇబ్బం దులు కలగకుండా చూడాలని తెలిపారు. సమస్యపై ఆర్డీఓ సమీక్ష... సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు ఆర్డీఓ ముత్యంరెడ్డి వేగవంతంగా చర్య లు చేపట్టారు. యార్డులోని 2 వేల బస్తా ల మక్కలను వెంటనే ఆరబెట్టాలని మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ అధికారుల కు తెలిపారు. అవసరమైతే గురువారం రైతులు మార్కెట్‌యార్డుకు ధాన్యం తేకుండా చూడాలని పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డికి సూచించారు. బుధవారం రాత్రంతా యార్డులోని ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షంకారణంగా గురువారం కొనుగోళ్లు నిలిపేస్తున్నామని మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగప్ప తెలిపారు. రైతుల్లో ఆందోళన... సిద్దిపేట రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఇర్కోడ్, పొన్నాల, తోర్నాల, నారాయణరావుపేట, పుల్లూరు, చిన్నగుండవెల్లిలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ధాన్యం తడవలే దని ఐకేపీ ఏపీఎం ధర్మసాగర్ తెలిపారు. -
బాబుకు గ్రేడింగ్ ఇస్తే సున్నా
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 5 హామీల్లో ఇంతవరకు స్పష్టత రాలేదని, ప్రభుత్వం వెంటనే వీటిపై స్పష్టత ఇవ్వాలని పామర్రు ఎమ్మెల్యే ,శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయలలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయకుండా మార్గదర్శకాల పేరిట కమిటీలను ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాలపై సాధికారిత కమిటీలను ఏర్పాటు చేసి సంవత్సరానికి 20శాతం రుణాలను మాత్రమే రద్దు చేస్తామని చెప్పడం వారిని అయోమయానికి గురిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తమ మంత్రులకు గ్రేడింగ్ ఇస్తున్నారని, మరి సీఎంకు గ్రేడింగ్ పెడితే ‘0’ వస్తుందని ప్రజలు వాపోతున్నరన్నారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంపై సీఎం తెలిపిన విధి విధానాల ప్రకారం ప్రతీ కార్యక్రమాన్ని ఆయా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించాలని ఉందన్నారు. కానీ పామర్రు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలా లేదన్నారు. ఇది కేవలం టీడీపీ సమావేశంలా ఉందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడం లేదన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట ఓడిపోయిన టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి పార్టీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ పక్కనే ఉన్నా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వర్ల రామయ్య వేదిక మీదకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, ఎమ్మెల్యే హక్కులకు భంగం కల్గించినందుకు, జన్మభూమికి సంబంధం లేని వ్యాఖ్యలు చేసి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరుగనీయనందుకు, ఎమ్మెల్యే, సర్పంచులను అవమానపర్చినందుకు వర్లపై ‘సభా హక్కుల కమిటీ’లో ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చేయవద్దని వర్లని హెచ్చరించారు. పామర్రు గ్రామ ఉపసర్పంచి అరేపల్లి శ్రీనివాసరావు, తోట్ల వల్లూరు మండలం ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, కనుమూరు సర్పంచి బొప్పూడి మేరి కమల, కురుమద్దాలి, కొండిపర్రు ఎంపీటీసీలు కొలుసు ఆదిలక్ష్మీ, బీవీ రాఘవులు, నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వర్లకు మతి భ్రమించింది.... కనుమూరు(పామర్రు) : ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు టీడీపీకి చెందిన వర్ల రామయ్యను ఏ హోదాలో ఆహ్వానించారని సంబంధిత అధికారిపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘జన్మభూమి-మా వూరు’ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామ సర్పంచి బొప్పుడి మేరికమలకు అధ్యక్ష స్థానం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల విజిట్ పుస్తకంలో వర్ల రామయ్య సంతకం పెట్టడంపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, వర్ల రామయ్య ప్రజా ప్రతినిధి కాదు అయినా ఆయనతో ఏ హోదాతో సంతకం పెట్టించారని సంబంధిత అధికారిని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమిలారు. దీంతో వర్ల కల్పనపై విరుచుకు పడారు. వర్ల మాట్లాడుతూ ఇది తమ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమమని, పార్టీ సభ్యుడుగా తాను పాల్గొన్నానని చెప్పారు. ఎమ్మెల్యేనుద్దేశించి అవహేళనగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహించిన కల్పన మాట్లాడుతూ ఓటమి చెందడంతో మతి భ్రమించి కుసంస్కారంతో మాట్లాడవద్దని హితవు పలికి సభాప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. -
ఇక టీచర్లకు.. గ్రేడింగ్
పనితీరుపై బేరీజు - మూడు నెలలకోసారి ‘ఆన్లైన్’లో నమోదు - విద్యాప్రమాణాల పెంపునకు పకడ్బందీ చర్యలు - సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకం రూపకల్పన - జిల్లా ఇన్చార్జిగా కృష్ణారావ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇక నుంచి టీచర్ల పనితీరుకు రేటింగ్ నమోదు చేయనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసే గ్రేడింగ్ వివరాలు ఆన్లైన్లో ఉంచేందు కు ఏర్పాట్లు మొదలయ్యాయి. పాఠశాల వివరాలు.. విద్యార్థుల స్థాయి.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరుతో పాటు నైపుణ్యాల పెంపు వంటి అంశాలు ఇందులో పొందుపర్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రాష్ట్ర ఓపెన్ స్కూల్ జాయింట్ డెరైక్టర్ కృష్ణారావ్ను ఇన్చార్జిగా నియమించింది. ఈ నెలలోనే జిల్లాలోని సుమారు 14వేల మంది ఉపాధ్యాయుల పనితీరుపై విశ్లేషణ ప్రారంభం కాబోతోంది. కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లాలో 1963 ప్రాథమిక, 332 ప్రాథమికోన్నత, 645 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2940 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం కింద విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు వారి సామర్థ్యాలు, పని తీరు అంచనా వేసేందుకు క్వార్టర్లీ మాని టరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీని కింద పాఠశాల మానటరింగ్, విద్యార్థి ప్రమాణాలతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి ఆన్లైన్లో ఉంచుతారు. స్కూల్ మాని టరింగ్ కింద పాఠశాల వివరాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు,లైబ్రరీ వినియోగం తది తర అంశాలను నమోదు చేస్తారు. విద్యార్థి పర్మార్మెన్స్ కింద సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ నమోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్ఫార్మెన్స్ నమోదులో 7 అంశాలుంటాయి. ఒక్కో అంశానికి గరిష్టం గా 4 రేటింగ్ పాయింట్లు ఉంటాయి. వీటిని మొదట ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన రేటింగ్‌ను తానే నమోదు చేసుకోవా ల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే పర్యవేక్షణాధికారులు మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగుసార్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుం ది. జూన్ నుంచి ఆగస్టు వరకు తొలి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2వ క్వార్ట ర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3వ క్వార్ట ర్, మార్చి నుంచి మే వరకు 4వ క్వార్టర్‌ను నమోదు చేస్తారు. గతంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులుకు కాన్ఫిడెన్షియల్ రిపోర్టు పంపేవారు కానీ 20ఏళ్లుగా అలాంటి రిపోర్టులకు మం గళం పలికారు. ప్రస్తుతం రేటింగ్ విధానంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే ఆవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలిచ్చే ఆస్కారం ఉంటుంది. లోపాలను తేల్చిన సర్వే... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సర్వే చేపట్టింది. సర్వేలో ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి బట్టబయలైంది. విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన లేకపోవడం, సిల బస్ సకాలంలో పూర్తికాకపోవడం వంటి అం శాలు వెలుగులోకి వచ్చాయి. పలు చోట్ల ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని కూడా తేలింది. ఒక్కో జిల్లాలో వంద మందికి పైగా టీచర్లు విద్యాబోధనకు దూరంగాఉంటూ ప్రతినెల వేతనాలు మాత్రం తీసుకుంటున్న విషయం బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో అధికారుల పరిశీలన, తనిఖీలు మరుగున పడ్డాయని దీంతో విద్యాబోధన అస్తవ్యస్తంగా తయారైందని గుర్తిం చారు. కొందరు టీచర్లు సంఘనాయకుల పేరిట విధులకు దూరంగా ఉండడం, వ్యాపారాలు చేయడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి కూడా జరుగుతున్నాయని తేలింది. దీంతో రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ నాలుగు జిల్లాల మాదిరిగానే మిగతా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి గాడితప్పిన ప్రభుత్వ పాఠశాలల విద్యను సక్రమార్గంలో పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఎప్పటికిప్పుడు పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి బృందాలను నియమించింది. పంతుళ్లు ఇక జరజాగ్రత్త.. గ్రేడింగ్ విధానాన్ని ఉపసంరించుకోవాలి... పుష్కర కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా విద్యావ్యవస్థలో అప్పటికప్పుడు సమూల మార్పులు, సంస్కరణలు తీసుకరావడం తగదు. ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసే విషయంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల మధ్య బేధాభిప్రాయాలు నెలకొని గందరగోళ వాతావరణ నెలకొనే ప్రమాదం ఉంది. -నందికొండ విద్యాసాగర్, ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాఠశాలలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో తొలుత మౌలిక వసతులు కల్పించి, బోధన, బోధనేతర సిబ్బం ది నియమించి సంస్కరణలు చేపడితే ఫలి తాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పేరుకపోయిన విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి, తనిఖీ బృందాలు పర్యవేక్షణలో చదు వులు చెప్పాలనడం పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవుతోంది. -ఎం.రఘుశంకర్‌రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మంత్రులకు చంద్రబాబు క్లాస్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. పనితీరు బాగోలేదని సగానికిపైగా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిని వెళ్లగక్కారు. పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడులు కేటాయిస్తూ మంత్రులకు చంద్రబాబు షాకిచ్చారు. ఏ గ్రేడులో ఆరుగురు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పించినట్టు తెలిసింది. మంత్రుల పనితీరును ప్రతిరోజు సమీక్షించేందుకు రహస్య యంత్రాంగం ఏర్పాటు చేశారు. వంద రోజుల తర్వాత పూర్తి స్థాయి గ్రేడుల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు పంపారు. -
గ్రేడింగ్ చెరిపివేతపై రైతుల ఆగ్రహం
కేసముద్రం మార్కెట్లో గంటన్నరపాటు నిలిచిన పసుపు వేలం పాటలు కేసముద్రం : మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పసుపు రాశులకు సెక్యూరిటీ గార్డులు వేసిన గ్రేడింగ్‌లను వ్యాపారులు చెరిపివేసి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో రైతులు గొడవకు దిగారు. దీంతో రైతులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం పెరిగి పసుపు వేలం పాటలు నిలిచి పోయాయి. సోమవారం మార్కెట్‌కు సుమారు 2వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. మొదట సెక్యూరిటీ గార్డులు వచ్చిన పసుపు రాశులకు గ్రేడింగ్ విధానాన్ని సూచిస్తూ ఏ,బీ, సీ, ఇంటూ, ఎం ఇంటూ అనే గుర్తులు వేశారు. వాటి ప్రకారం వేలంపాటలు నిర్వహించాల్సిన వ్యాపారులు గ్రేడింగ్ తప్పు పడిందంటూ పలు రాశుల వద్ద గుర్తులను చెరిపివేసి ధరలను నిర్ణయిస్తూ వచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మహమూద్‌పట్నం గ్రామానికి చెందిన రైతు వెంకటాచారి నిలదీయగా వ్యాపారులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఇలాగైతే తాము కొనుగోళ్లు జరపలేమంటూ వ్యాపారు లు వేలంపాటలు నిలిపివేసి వెళ్లిపోయారు. అనంతరం మార్కెట్ అధికారులు జోక్యం చేసుకున్నా లాభంలేకుండా పోయింది. దీంతో రైతు లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడంలేదం టూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వ్యాపారులను ఒప్పించి గంటన్నర తర్వాత వేలంపాటలు ప్రారంభించారు. సోమవారం పసుపు క్వింటాలుకు గరిష్ట ధర రూ.5605, కనిష్ట ధర రూ.4300, గోళ రకానికి గరిష్టంగా రూ.5400, కనిష్టంగా రూ.4050 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
చెట్టెక్కిన చదువు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: అమ్మా,నాన్నా..నేను బాగా చదువుతున్నాను.. అందరికంటే నాకే ఎక్కువ మార్కులొచ్చాయి..నాకు స్కూ లు ఫస్ట్ వచ్చింది..అని విద్యార్థులు ఇంట్లో చెప్పుకుంటే వారికి అవధుల్లేని ఆనందం కలుగుతుంది. బాగా చదివే విద్యార్థికి ఇలా సంతోషంగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పాఠ్యాంశాల్లో అంతగా ప్రతిభ చూపలేని విద్యార్థులకు సైతం ‘ఎ’ గ్రేడ్ వస్తుండడంతో బాగా చదివే విద్యార్థులు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువు చెట్టెక్కుతోంద నే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంపై ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం, పర్యవేక్షణ లోపం, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో తేడాలు వంటి అంశాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ప్రవేశ పెట్టిన సమగ్ర మూల్యాంకన (గ్రేడింగ్) విధానం ఇంకా గాడిలో పడలేదు. పరీక్షలపై విద్యార్థుల కున్న భయాన్ని పోగొట్టేందుకు గత విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించిన గ్రేడింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారింది.సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇటీవ ల జరిగిన త్రైమాసిక పరీక్షల ఫలితాల విడుదల తర్వాత జిల్లా విద్యారంగంలో గ్రేడింగ్ విధానం చర్చనీయాంశమైంది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ విధానం కొనసాగుతుండడంతో విద్యార్థుల్లోనూ అయోమయం నెలకొంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రాజీవ్ విద్యామిషన్ ఒకటి నుంచి 8వ తరగతి వరకూ జరిగే పరీక్ష విధానంలో గత విద్యాసంవత్సరం నుంచి సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులు, ఎలాంటి రాతపరీక్షలూ నిర్వహించరు. పాఠ్యాంశాల బోధన కంటే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. తద్వారా సామర్థ్యాన్ని అంచనా వేయాలి. జూన్ రెండో వారంలోనే విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించాలి. యూనిట్ టెస్ట్‌లకు బదులుగా ఫార్మాట్, త్రైమాసిక పరీక్షలకు బదులుగా సమ్మేట్లను చేపట్టాలి. ఫార్మాట్లో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి ఐదు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టాలి. వారు సమాధానాలు చెప్పే విధానాన్ని బట్టి ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మె నేపథ్యంలో త్రైమాసిక పరీక్షల సమ్మేట్ మినహా ఏవీ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. సామర్థ్యం కలిగిన విద్యార్థికి తక్కువ గ్రేడింగ్ జిల్లాలో ఇటీవల జరిగిన సమ్మేట్ పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన విధానంలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలా గ్రేడింగ్ ఇస్తారు. ఉదాహరణకు సాంఘికశాస్త్రం సబ్జెక్ట్‌లో ఆరు సామర్థ్యాలు ఉం టాయి. ఇందులో పాఠాలను అవగాహన చేసుకోవడం, మ్యాప్‌లో ప్రాంతాలను గుర్తించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని చర్చిం చడం, సునిశిత విమర్శ (చెప్పిన అంశంపై సొంతంగా స్పందించి మాట్లాడడం, రాయ డం), ప్రాజెక్టువర్క్లో భాగంగా గ్రామాల్లో జరుపుకొనే పండగలు, నీటి సరఫరా ఏవిధంగా జరుగుతోందనే అంశాలుంటాయి. వీటిలో విద్యార్థి చూపిన సామర్థ్యం ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయించారు. ఐదు కరెక్టుగా చెప్పి.. ఒకటి తప్పు అయితే ఎ గ్రేడ్ వస్తుంది. మూడు ఎ గ్రేడ్, రెండు బి గ్రేడ్లు వస్తే బి గ్రేడ్ వస్తుంది. కొందరు కేవలం మ్యాపింగ్ ప్రాంతాలను కరెక్టు గా చూపించినా గ్రేడింగ్ ఉన్నతంగా ఉంటుంది. దీంతో బాగా అభ్యసించే విద్యార్థికి తక్కువ గ్రేడింగ్ వస్తోంది. ఫలితంగా ఆ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంలో లోపాలు సమగ్రమూల్యాంకనంపై రాజీవ్ విద్యామిష న్ గత వేసవిలో ప్రతి ఉపాధ్యాయునికి ఇచ్చిన శిక్షణ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోయింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1 కాకుండా అధిక పాఠశాలల్లో 50:1కి మించి ఉంది. దీంతో ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపించే సమయం లేకపోతోంది. అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కుబడిగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తున్నా రు. నిబంధనల మేరకు డైట్ లెక్చరర్లు, ఎంఈ ఓలు నిర్వహించాల్సిన పర్యవేక్షణ కొరవడుతోంది. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు గ్రేడింగ్ విధానాన్ని అయినా సక్రమంగా అమలులోకి తీసు కురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
గురుకులాల్లో ‘గ్రేడింగ్’
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల వర్గీకరణ కార్యక్రమం వివాదాస్పదమవుతోంది. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయులను ఏ,బీ,సీ,డీ గ్రేడ్లుగా వర్గీకరించాలని గత నెల 31న సొసైటీ కార్యదర్శి కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ ప్రకారం ప్యానెల్ ఇన్స్పెక్టర్లు సొసైటీ పరిధిలోని విద్యాసంస్థలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించి ఆ పాఠశాలల పరిస్థితిని బట్టి గొప్పగా ఉంది (ఎ), చాలా బాగుంది (బి), సంతృప్తస్థాయిలో ఉంది (సి), బాగాలేదు (డి) అని వర్గీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పనితీరును బట్టి వారిని కూడా అదే రీతిలో వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులను కూడా గ్రేడింగ్ చేయాలని ఉత్తర్వులివ్వడంపట్ల సొసైటీ పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుని పనితీరును అంచనా వేయాల్సింది వార్షిక పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తప్ప... ఒక్క పీరియడ్‌లో అంటే కేవలం 45 నిమిషాల కాలవ్యవధిలో ఒక నిర్ధారణకు రావడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు. అసలు దేశంలో ఎక్కడైనా ఉపాధ్యాయులను ప్యానెల్ ఇన్స్పెక్టర్లు వర్గీకరించడం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ విద్యాసంస్థల్లోని టీచర్లను వర్గీకరించాలనే ప్రయత్నం చేసిందని, అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల ప్రతిభాపాటవాలను మెరుగుపరిచేందుకు ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. డిగ్రీలు, పీజీలు, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయులుగా నియమితులైన వారి పనితీరు సంతృప్తికరంగా లేకపోతే మరిన్ని శిక్షణా తరగతులు నిర్వహించి సిలబస్‌పై అవగాహన కల్పించాలే తప్ప ఇలా అవమానించే విధానాలను అమల్లోకి తేవడం విద్యావ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. సొసైటీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఉపాధ్యాయుల్లో విభేదాలు రావడంతో పాటు ఒకరంటే ఒకరికి చులకన భావం ఏర్పడే పరిస్థితులు వస్తాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.బాలరాజు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.