పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ గ్రామాల నుంచి 8 వేల క్వింటాళ్ల మక్కలు, వడ్లు విక్రయానికి వచ్చాయి. పీఏసీఎస్ అధికారులు బీట్‌ను నిర్వహించి గ్రేడింగ్‌కు అనుగుణంగా వాటిని కొనుగోలు చేశారు. వీటిని తూకం వేసి బస్తాల్లో నిం పి గోదాంలకు తరలిస్తున్నారు. సుమారు 7 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని వాహనాల్లో వేసి తరలించారు.
మరో వెయ్యి క్వింటాళ్ల మక్కల తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఊహించని రీతిలో వర్షం మొదలైంది. ఇది అధికం కావడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ముత్యంరెడ్డి హుటాహుటిన యార్డును సందర్శించి మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి తడిసిన మక్కలను పరిశీలించారు. ఈ సమయంలో రైతులు ఆర్డీఓతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ధాన్యం తడిసిందనే కారణంతో కొనుగోళ్లను నిలిపేయొద్దని కోరారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ, జాయింట్ కలెక్టర్ శరత్‌లకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. అయితే తడిసిన మక్కలను పత్తి మార్కెట్ ఆవరణలో ఆరబోసి ఎండిన తర్వాత మార్క్‌ఫెడ్ అధికారులకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆర్డీఓను ఆదేశించారు. రైతులకు ఇబ్బం దులు కలగకుండా చూడాలని తెలిపారు.
సమస్యపై ఆర్డీఓ సమీక్ష...
సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు ఆర్డీఓ ముత్యంరెడ్డి వేగవంతంగా చర్య లు చేపట్టారు. యార్డులోని 2 వేల బస్తా ల మక్కలను వెంటనే ఆరబెట్టాలని మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ అధికారుల కు తెలిపారు. అవసరమైతే గురువారం రైతులు మార్కెట్‌యార్డుకు ధాన్యం తేకుండా చూడాలని పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డికి సూచించారు. బుధవారం రాత్రంతా యార్డులోని ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షంకారణంగా గురువారం కొనుగోళ్లు నిలిపేస్తున్నామని మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగప్ప తెలిపారు.
రైతుల్లో ఆందోళన...
సిద్దిపేట రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఇర్కోడ్, పొన్నాల, తోర్నాల, నారాయణరావుపేట, పుల్లూరు, చిన్నగుండవెల్లిలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ధాన్యం తడవలే దని ఐకేపీ ఏపీఎం ధర్మసాగర్ తెలిపారు.
సిద్దిపేటలో భారీ వర్షం
Published Wed, Nov 12 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM