ఇక టీచర్లకు.. గ్రేడింగ్ | gradingsystem for teachers in telangana | Sakshi
Sakshi News home page

ఇక టీచర్లకు.. గ్రేడింగ్

Published Thu, Oct 2 2014 3:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

ఇక టీచర్లకు.. గ్రేడింగ్ - Sakshi

ఇక టీచర్లకు.. గ్రేడింగ్

పనితీరుపై బేరీజు
- మూడు నెలలకోసారి ‘ఆన్‌లైన్’లో నమోదు
- విద్యాప్రమాణాల పెంపునకు పకడ్బందీ చర్యలు
- సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకం రూపకల్పన
- జిల్లా ఇన్‌చార్జిగా కృష్ణారావ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇక నుంచి టీచర్ల పనితీరుకు రేటింగ్ నమోదు చేయనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసే గ్రేడింగ్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందు కు ఏర్పాట్లు మొదలయ్యాయి. పాఠశాల వివరాలు.. విద్యార్థుల స్థాయి.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరుతో పాటు నైపుణ్యాల పెంపు వంటి అంశాలు ఇందులో పొందుపర్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రాష్ట్ర ఓపెన్ స్కూల్ జాయింట్ డెరైక్టర్ కృష్ణారావ్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. ఈ నెలలోనే జిల్లాలోని సుమారు 14వేల మంది ఉపాధ్యాయుల పనితీరుపై విశ్లేషణ ప్రారంభం కాబోతోంది.
 
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లాలో 1963 ప్రాథమిక, 332 ప్రాథమికోన్నత, 645 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2940 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం కింద విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు వారి సామర్థ్యాలు, పని తీరు అంచనా వేసేందుకు క్వార్టర్లీ మాని టరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీని కింద పాఠశాల మానటరింగ్, విద్యార్థి ప్రమాణాలతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. స్కూల్ మాని టరింగ్ కింద పాఠశాల వివరాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు,లైబ్రరీ వినియోగం తది తర అంశాలను నమోదు చేస్తారు.

విద్యార్థి పర్మార్మెన్స్ కింద సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ నమోదు చేస్తారు.  అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్ఫార్మెన్స్ నమోదులో 7 అంశాలుంటాయి. ఒక్కో అంశానికి గరిష్టం గా 4 రేటింగ్ పాయింట్‌లు ఉంటాయి. వీటిని మొదట ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన రేటింగ్‌ను తానే నమోదు చేసుకోవా ల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే పర్యవేక్షణాధికారులు మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగుసార్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుం ది.

జూన్ నుంచి ఆగస్టు వరకు తొలి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2వ క్వార్ట ర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3వ క్వార్ట ర్, మార్చి నుంచి మే వరకు 4వ క్వార్టర్‌ను నమోదు చేస్తారు. గతంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులుకు కాన్ఫిడెన్షియల్ రిపోర్టు పంపేవారు కానీ 20ఏళ్లుగా అలాంటి రిపోర్టులకు మం గళం పలికారు. ప్రస్తుతం రేటింగ్ విధానంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే ఆవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలిచ్చే ఆస్కారం ఉంటుంది.
 
లోపాలను తేల్చిన సర్వే...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సర్వే చేపట్టింది. సర్వేలో ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి బట్టబయలైంది. విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన లేకపోవడం, సిల బస్ సకాలంలో పూర్తికాకపోవడం వంటి అం శాలు వెలుగులోకి వచ్చాయి. పలు చోట్ల ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని కూడా తేలింది. ఒక్కో జిల్లాలో వంద మందికి పైగా టీచర్లు విద్యాబోధనకు దూరంగాఉంటూ ప్రతినెల వేతనాలు మాత్రం తీసుకుంటున్న విషయం బయటపడింది.

ప్రభుత్వ పాఠశాలల్లో అధికారుల పరిశీలన, తనిఖీలు మరుగున పడ్డాయని దీంతో విద్యాబోధన అస్తవ్యస్తంగా తయారైందని గుర్తిం చారు. కొందరు టీచర్లు సంఘనాయకుల పేరిట విధులకు దూరంగా ఉండడం, వ్యాపారాలు చేయడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి కూడా జరుగుతున్నాయని తేలింది. దీంతో రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ నాలుగు జిల్లాల మాదిరిగానే మిగతా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి గాడితప్పిన ప్రభుత్వ పాఠశాలల విద్యను సక్రమార్గంలో పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఎప్పటికిప్పుడు పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి బృందాలను నియమించింది. పంతుళ్లు ఇక జరజాగ్రత్త..
 
గ్రేడింగ్ విధానాన్ని ఉపసంరించుకోవాలి...
పుష్కర కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా విద్యావ్యవస్థలో అప్పటికప్పుడు సమూల మార్పులు, సంస్కరణలు తీసుకరావడం తగదు. ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసే విషయంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల మధ్య బేధాభిప్రాయాలు నెలకొని గందరగోళ వాతావరణ నెలకొనే ప్రమాదం ఉంది.
 -నందికొండ విద్యాసాగర్, ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
 
పాఠశాలలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో తొలుత మౌలిక వసతులు కల్పించి, బోధన, బోధనేతర సిబ్బం ది నియమించి సంస్కరణలు చేపడితే ఫలి తాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పేరుకపోయిన విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి, తనిఖీ బృందాలు పర్యవేక్షణలో చదు వులు చెప్పాలనడం పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవుతోంది.       -ఎం.రఘుశంకర్‌రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement