మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభ ఇకపై విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కనిపించనుంది. విద్యార్థులు రాస్తున్న పరీక్షల తాలూకు మార్కులను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం పాఠశాలల్లో సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫలితాలను ఇప్పటివరకు సర్వ శిక్షా అభియాన్ అధికారులు సేకరించి క్రోఢీ కరించేవారు. తాజాగా ఈ మార్కులను వెబ్ సైట్లో పొందుపర్చాలని అధికారులు నిర్ణయిం చారు. ఏటా పాఠశాల వారీగా విద్యార్థుల వివరాలను ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలకు మార్కు లను జోడిస్తే సులభతరమవుతుందని విద్యా శాఖ ఈమేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమాచార లింకుకు ఆయా సబ్జెక్టులలో వచ్చే మార్కులను జతచేసేలా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రక్రియతో పిల్లలకు ఆయా సబ్జెక్టులలో వచ్చే మార్కులను తెలుసు కునే అవకాశము ఉంటుంది. అంతే కాకుండా పాఠశాల వారీగా వచ్చే మార్కులతో పాఠ శాల, గ్రామ, మండల స్థాయిలో గ్రేడింగ్‌లు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్‌లో ప్రభుత్వ బడిపిల్లల మార్కులు
Published Sun, Dec 25 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM