
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలను ఈ నెల 13న విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేస్తుండటం.. 14, 15 తేదీల్లో సెలవులుండటంతో 13నాడే ఫలితాలను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చింది.
గుర్తింపు దరఖాస్తుకు 15 వరకు గడువు ..
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు గుర్తింపు పొందేందుకు ఈ నెల 15 లోపు తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే సోమవారం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. హాస్టళ్లకు సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని యాజమాన్యాలు తెలిపాయని.. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అశోక్ వివరించారు