సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జూలై–2024) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి గతనెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కీ సైతం రెండు రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 6న విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు, డీఎస్పీ నోటిఫికేషన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment