ప్రణాళికల పితామహుడు ఎవరు? | Who is the father Plans? | Sakshi
Sakshi News home page

ప్రణాళికల పితామహుడు ఎవరు?

Published Sun, Jun 15 2014 10:24 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ప్రణాళికల పితామహుడు ఎవరు? - Sakshi

ప్రణాళికల పితామహుడు ఎవరు?

 పంచవర్ష ప్రణాళికలు
     
నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అనుసరించే విధా నాన్నే  ప్రణాళిక అంటారు. లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపునకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళిక అంటారు.
     
వివిధ పెట్టుబడుల మార్గాంతరాలకు ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళికను ‘ఆర్థిక ప్రణాళిక’ అంటారు. మనదేశంలో ఈ ప్రణాళికలనే అనుసరిస్తున్నారు.
     
 ప్రపంచంలో తొలిసారి ప్రణాళికలను అమలు చేసింది ్ఖఖ. దీన్ని ఆదర్శంగా తీసుకుని భారత్ ప్రణాళిక రచనను ప్రారంభించింది. భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం  ఉండాలని లాహోర్‌లో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

1947కు పూర్వం భారతదేశంలో ప్రణాళికలు
     
స్వాతంత్య్రానికి పూర్వమే ప్రణాళికల అవసరాన్ని గుర్తించారు. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారత ఆర్థిక అభివృద్ధికి పదేళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 'Planned Economy for India' అనే గ్రంథాన్ని రచించారు. ఆయనను ప్రణా ళికల పితామహుడు అంటారు. 1943లో బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు ’అ Plan for Economic Development of India'ను రూపొందించారు. దీన్నే ‘బాంబే ప్లాన్’  లేదా ‘టాటా-బిర్లా ప్లాన్’  అంటారు. ఈ ప్రణాళికలో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 10వేల కోట్ల రూపాయలతో 15  ఏళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది ఈ ప్రణాళిక లక్ష్యంగా తీసుకుంది.
 
1943 – 44 కాలంలో Indian Labour Federationకు చెందిన M.N. రాయ్ ప్రజా ప్రణాళిక (People's Plan) ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇచ్చారు. బాంబే ప్రణాళిక పెట్టుబడిదారి లక్షణాలతో, ప్రజాప్రణాళిక సామ్యవాద లక్షణాలతో ఉన్నాయి. 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ‘గాంధీ ప్రణాళిక’ ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను  ఇచ్చారు. ఈ ప్రణాళిక లక్షణాలు గ్రామీణ స్వయం సమృద్ధి, వికేంద్రీకరణ. పై ప్రణాళికల్లో ఏదీ అమలు కాలేదు. అందుకే వీటినే పేపర్ ప్లాన్స్ అంటారు.  జయప్రకాశ్ నారాయణ్ 1950 జనవరిలో  ‘సర్వోదయ ప్రణాళిక’ను రూపొందించారు. దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. కానీ, ఈ ప్రణాళికలోని కొన్ని మౌలిక అంశాలను స్వీకరించారు.
     
1944లో ఆర్థిక వ్యవస్థకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ‘ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ’ (ఈ్ఛఞ్చట్టఝ్ఛ్ట ౌజ ్క్చజీజ ్చఛీ ఈ్ఛఠిౌ్ఛఞఝ్ఛ్ట)ను ఎ. దళాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం చిన్నాభిన్నమైన భారత ఆర్థిక వ్యవస్థను  గాడిలో పెట్టేందుకు  ఈ శాఖ స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలను తయారు చేసింది.
     
1946లో ‘‘ప్రణాళిక సలహా బోర్డు’’ను (్క్చజీజ అఛీఠిజీటౌటడ ఆౌ్చటఛీ)ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా జవహర్‌లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడిగా గుల్జారీలాల్ నందా, కార్యదర్శిగా కృష్ణమాచారీని నియమించారు.
 
 ప్రణాళికా సంఘం
     
స్వాతంత్య్రానంతరం కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా 1950, మార్చి 15న  ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర, శాసనేతర, చట్టబద్ధం కాని సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వానికి సలహా సంస్థ మాత్రమే. ప్రణాళిక సంఘానికి చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. పరిపాలనా సౌలభ్యం, కార్యనిర్వహణ కోసం ప్రణాళికా సంఘంలో క్రియాశీలకంగా పనిచేసే ఒక ఉపాధ్యక్షుడు (ఈ్ఛఞఠ్టడ ఇజ్చిజీటఝ్చ) ఉంటారు. ఇతనికి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది.
     
భారతదేశంలో  ప్రణాళిక సంఘం తొలి చైర్మన్ అప్పటి ప్రధానమంత్రి  జవహర్ లాల్ నెహ్రూ కాగా, డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నంద. ప్రస్తుత  ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ప్రణాళికా సంఘం దేశంలో లభించే వనరులను అంచనావేసి వాటిని సమర్థంగా, సంతులనంగా ఉపయోగించడం కోసం అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తుంది. దాని ముసాయిదాను ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు, జాతీయ అభివృద్ధి మండలికి పంపుతుంది.
 
జాతీయ అభివృద్ధి మండలి
     
జాతీయ అభివృద్ధి మండలిని  1952, ఆగస్టు  6న  ఏర్పాటు చేశారు. ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ. దీనికి కూడా చట్టబద్ధత లేదు. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలించడం దీని ముఖ్య విధి. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించకపోతే ప్రణాళికలు అమలు కావు. దీనికి కూడా చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
     
 ప్రారంభంలో ఎన్‌డీసీలో కేంద్ర ఆర్థికమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండేవారు. కానీ 1967 నుంచి  అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లను, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్  సెక్రటరీలను సభ్యులుగా పరిగణిస్తున్నారు.
 
  పంచవర్ష ప్రణాళికలు - సాధారణ లక్ష్యాలు

 1.    జాతీయాదాయాన్ని, తలసరి ఆదాయాన్ని గరిష్టం చేయడం.
 2.    దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం.
 3.    త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడం.
 4.    ఆహారధాన్యాల ఉత్పత్తిలో, ముడిసరు కులలో స్వయం సమృద్ధిని సాధించడం.
 5.    {పాంతీయ అసమానతలను తొలగించి, ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించడం.
 6.    ఆదాయ, సంపదల్లో వ్యత్యాసాలను తగ్గించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం.
 7.    ఉద్యోగావకాశాలు  పెంచడం ద్వారా నిరుద్యోగ నిర్మూలనను సాధించడం.
 8.    ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక     వృద్ధిని సాధించడం.
 9.    సేవల రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆధునికీకరణను సాధించడం.
 
 మొదటి పంచవర్ష ప్రణాళిక (1951ృ56)
     
ఈ ప్రణాళికను హరడ్ -డోమార్ వ్యూహా న్ని అనుసరించి రూపొందించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.1960 కోట్లు మాత్రమే. అత్యధిక వాటా(31 శాతం) ను వ్యవసాయం, నీటిపారుదలకు కేటాయించారు.   అందువల్ల ఈ ప్రణాళికను ‘వ్యవసాయ - నీటి పారుదల ప్రణాళిక’అని అంటారు. మొదటి ప్రణాళికను ‘చిన్నప్రణాళిక’ అని, ‘నెహ్రూ వియన్ ప్లాన్’ అని కూడా అంటారు.
     
ఈ ప్రణాళికలో  రవాణా, సమాచార రంగాలకు రెండో ప్రాధాన్యం ఇచ్చారు. వీటికోసం 27 శాతం  అంటే రూ.520 కోట్లు కేటాయించారు. ఈ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 2.1శాతం ఉండగా, సాధించిన వృద్ధిరేటు (వాస్తవ వృద్ధిరేటు) 3.6శాతం ఉంది. ఈ ప్రణాళికలోనే ఆశించిన వృద్ధిరేటు కంటే సాధించిన వృద్ధిరేటు గరిష్టంగా ఉంది. అంటే 1.5 శాతం ఎక్కు వ వృద్ధిరేటు సాధించింది. తలసరి ఆదా య వృద్ధిరేటు 1.8 శాతం సాధించింది.
     
 గాంధీ భావనలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, గ్రామాల్లో ప్రాథమిక అవసరాలను కల్పిం చే కార్యక్రమమైన 'Community De-velopment Programme'ను 1952, అక్టోబరు 2న  ప్రారంభించారు. దీంట్లో భాగంగానే 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  సీడీపీని విస్తరించి 1953, అక్టోబరు 2న ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం’ (Nati-onal Extension Service Scheme -  NES)గా ఏర్పాటు చేశారు.
     
 ఈ ప్రణాళిక కాలంలోనే సింధ్రీ ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం, దుర్గాపూర్‌లో హిందూస్థాన్ కేబుల్స్, విశాఖపట్నంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్, మైసూర్‌లో హెచ్‌ఎంటీ,  బెంగళూరులో  ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీని ప్రారంభించారు. బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు.
     
 రుతుపవనాల అనుకూలత వల్ల మొదటి ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఈ ప్రణాళిక విజయవంతమైంది.  ఈ ప్రణాళికలో ధరలు 13శాతం వరకు తగ్గాయి. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళికగా గుర్తింపు పొందింది.
 మాదిరి ప్రశ్నలు
 
 1.    భారతదేశ ప్రణాళికల రూపశిల్పి అని ఎవరిని పిలుస్తారు?
     1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
     2) జవహర్ లాల్ నెహ్రూ
     3) మోతీలాల్ నెహ్రూ
     4) సుభాష్ చంద్రబోస్

 2.    సామ్యవాద లక్షణాలున్న ప్రణాళిక?
     1) సర్వోదయ  2) గాంధేయ
     3) బాంబే      4) ప్రజా

 3.    {పణాళికా వ్యవస్థ రూపకల్పనలో భారత దేశం   ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంది?
     1) బ్రిటన్  2) జర్మనీ  3) రష్యా  4) చైనా

 4.    భారతదేశంలో ప్రణాళికా సలహా బోర్డును  ఎప్పుడు ప్రారంభించారు?
     1) 1936      2) 1944
     3) 1946     4) 1947

 5.    1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణాళిక, అభివృద్ధి శాఖకు అధ్యక్షులు ఎవరు?
     1) జవహర్ లాల్ నెహ్రూ
      2) మహాత్మాగాంధీ
     3) బాబు రాజేంద్రప్రసాద్   
     4) ఎ. దళాల్

 6.    {పణాళిక సంఘానికి ప్రస్తుత అధ్యక్షుడెవరు?
     1) నరేంద్రమోడీ     2) మన్మోహన్‌సింగ్
     3) మాంటెక్ సింగ్ అహ్లూవాలియా     4) ఎవరూ కాదు

 7.    మనదేశంలో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది?
     1) రాష్ర్టపతి     2) ప్రధానమంత్రి
     3) ప్రణాళిక సంఘం
     4) జాతీయ అభివృద్ధి మండలి

 8.    ‘ఎ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా’ను రూపొందించింది?
     1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
      2) ఎం.ఎన్.రాయ్
     3) జవహర్‌లాల్ నెహ్రూ
      4) కొంతమంది పారిశ్రామిక వేత్తలు

 9.    చిన్న ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు?
     1) ఒకటో    2) మూడో
     3) ప్రజాప్రణాళిక     4) గాంధీ ప్రణాళిక

 10.    ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
     1) ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ     2) హిందూస్థాన్ షిప్‌యార్డ్
     3) వైజాగ్ స్టీల్ ప్లాంట్  4) హెచ్‌ఎంటీ

 11.    నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని  ఎన్నో ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
     1) 1          2) 2         3) 3      4) 4

 12.    భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం?
     1) 1947      2) 1935
     3) 1950     4) 1952

 13.    వీటిలో భారతదేశం ఏ ప్రణాళికను అనుసరిస్తోంది?
     1) భౌతిక ప్రణాళిక      2) ఆర్థిక ప్రణాళిక
     3) దేశీయ ప్రణాళిక    
     4) సామాజికన్యాయంతో కూడిన ప్రణాళిక

 14.    దేని సూచనల మేరకు ప్రణాళిక సంఘాన్ని 1950, మార్చి 15న ఏర్పాటు చేశారు?
     1) రాష్ర్టపతి తీర్మానం
     2) క్యాబినెట్ తీర్మానం
     3) సుప్రీంకోర్టు సలహా 4) పైవన్నీ

 15.    జాతీయాభివృద్ధి మండలిలో 1967కు ముందు సభ్యులు కానివారు?
     1) రాష్ట్రాల ముఖ్యమంత్రులు
      2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు
     3) కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి
      4) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

 16.    భారతదేశంలో ప్రారంభించిన తొలి పథకం పేరు?
     1) కుటుంబ నియంత్రణ కార్యక్రమం     2) సామాజిక అభివృద్ధి కార్యక్రమం     
     3) జాతీయ విస్తరణ కార్యక్రమం     4) గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం

 సమాధానాలు
 1) 2;    2) 4;    3) 3;    4) 3;5) 4;    6) 1;    7) 4;    8) 4;    9) 1;    10) 2;11) 1;12) 4;13) 2;14) 2;15) 2;16) 2.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement