విద్యావ్యవస్థ పటిష్టతకు కేసీఆర్ కృషి
విద్యావ్యవస్థ పటిష్టతకు కేసీఆర్ కృషి
Published Wed, Sep 21 2016 7:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నాగార్జునసాగర్ : రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభంతోపాటు రూ.3కోట్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనానికి బుధవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శిలాఫలకం వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.750కోట్ల వ్యయంతో విద్యాలయాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల భవణ నిర్మాణాలతోపాటు టీచీంగ్ స్టాఫ్, బయోమెట్రిక్, ఆర్‌వో ప్లాంట్లు, టాయిలెట్స్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఈ విద్యావ సంవత్సరం నుండే ప్రారంభమయినట్లు వివరించారు. పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ భవనం పూర్తిచేసేందుకు రెండేళ్లు పట్టవచ్చని.. అప్పటివరకు తాత్కాలికంగా ఎన్‌ఎస్‌పీ క్వార్టర్లు తీసుకోని అందులో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకుంటారన్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి : మంత్రి జగదీశ్‌రెడ్డి
విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని రాష్ట్రవిద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగారాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధనకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఐటీహబ్‌గా మారిన నేపథ్యంలో మనవాళ్లు మనదగ్గరే ఉద్యోగాలు పొందేవిధంగా ఇంజనీరింగ్ విద్యను అత్యంత నాణ్యతాప్రమాణాలు కలిగిన పనినేర్పేవిధంగా తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్మన్ బాలునాయక్, వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, పెద్దవూర ఎంపీపీ వస్త్రపురి మళ్లిక, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్న బ్రహ్మానందరెడ్డి, సునందారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి, యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఎంసి.కోటిరెడ్డి, సాంకేతిక విద్య డైరెక్టర్ ఎంవీ.రెడ్డి ,మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, రమేశ్‌జీ, వల్లపురెడ్డి, బషీర్, చంధ్రమౌళి, శేఖరాచారి, మసీదురాము తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement