నా సేవలు కొనసాగిస్తా | Champions of Change 2019 award for Allu Aravind | Sakshi
Sakshi News home page

నా సేవలు కొనసాగిస్తా

Published Tue, Jan 21 2020 12:19 AM | Last Updated on Tue, Jan 21 2020 12:19 AM

Champions of Change 2019 award for Allu Aravind - Sakshi

ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అవార్డు స్వీకరిస్తున్న అల్లు అరవింద్‌

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ‘చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement