Pranab Mukherjee
-
రాహుల్‌పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్‌ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్‌గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్‌లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్‌కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్‌ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు -
PRANAB, MY FATHER: రాహల్‌కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
ప్రణబ్ ముఖర్జీకి లోక్‌సభ నివాళులు
-
ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి -
ప్రణబ్ ముఖర్జీ మృతికి యాదాద్రి ఆచార్యుల దిగ్బ్రాంతి
సాక్షి, యాదాద్రి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో అనుబంధం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాష్ట్రపతి హోదాలో రాజముద్ర వేసిన ఆయనను సీఎం కేసీఆర్ యాదాద్రికి ఆహ్వానించారు. దీంతో ఆయన 2015జూలై 5వ తేదీన యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని, మెమెంటోను సీఎం కేసీఆర్ స్వయంగా బహూకరించారు. యాదాద్రి దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధానాలయం, ఇతర అభివృద్ధి పనులపై సీఎం వివరించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని అర్చకులు ప్రణబ్‌ముఖర్జీకి వివరించారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంలో వెలసిన యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి మహిమగలిగిన దేవుడని ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. రాష్ట్రపతి వెంట ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, అప్పటి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్లశేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, దేవాలయ ఈఓ గీతారెడ్డిలు ఉన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందిన వార్తతో స్థానికంగా ఆచార్యులు, ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రణబ్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
-
ప్రణబ్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థీవదేహాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వాహనంలో 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఆయన నివాసానికి చేరుకుని ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్, గులాం నబీ ఆజాద్, తదితర ప్రముఖులు కూడా ప్రణబ్ చిత్రపటానికి అంజలి ఘటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఓదార్చారు. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రణబ్ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రజలకు అవకాశమివ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా బారిన పడి నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత -
దివికేగిన దాదా
-
సొంత ఊరిపై మమకారం
కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
చరిత్రపై చెరగని ‘సంతకం’
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కల సాకారం దిశగా అప్పటి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చేసిన సంతకం చరిత్రలో నిలిచిపోయింది. అరవైఏళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని అన్ని కోణాల నుంచి చూసిన ప్రణబ్ కేంద్ర మంత్రిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014పై మార్చి ఒకటిన ప్రణబ్ దాదా సంతకం చేశారు. ఆయన సంతకం చేసిన మరుసటిరోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయన పెట్టిన సంతకం మేరకే జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అన్నింటికీ సాక్షి.. యూపీఏ–2 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ అనేకమార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన చర్చోపచర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్–9న వచ్చిన తొలి ప్రకటన సమయంలోనూ ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యనేతలు ప్రణబ్‌తోపాటు చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్‌ల సూచనల మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆ ప్రకటనపై సీమాంధ్ర నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్రం వెనుకంజ వేసినా, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల అభిప్రాయాల సేకరణలో ఆర్థికమంత్రిగా ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. స్థితప్రజ్ఞుడిగా పేరొందిన ప్రణబ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు చేయకున్నా, వారి మనోభావాలు తీవ్రంగా ఉన్నాయని చాలాసార్లు వ్యాఖ్యానించారు. 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక సైతం అనేకమార్లు తెలంగాణ ఏర్పాటుపై వచ్చిన వినతులకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014 ఆమోదం పొందిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియలను పూర్తిగా ఉల్లంఘించి బిల్లును ఆమోదించారని, ఈ దృష్ట్యా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. మరికొన్ని పార్టీల ఎంపీలు సైతం ఇదేరీతిన ప్రణబ్‌ను కలిసి ఫిర్యాదు చేసినా రాజ్యసభకు బిల్లు రాకుండా ఆయన అడ్డుపడలేదు. ‘ది కొయలిషన్ ఇయర్స్’ పుస్తకంలోనూ... ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ను ప్రగతిశీల నగరంగా అభివృద్ధి చేసుకోండి, పెట్టుబడులను ఆకర్షించి ఉన్నత లక్ష్యాలను చేరుకోండి’అని ప్రణబ్ సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హైదరాబాద్‌లో విడిది చేసేందుకు ప్రణబ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి సాదర స్వాగతం పలుకుతూ వచ్చారు. ఇక 2017లో ప్రణబ్ రాసిన పుస్తకం ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలోనూ తెలంగాణ, కేసీఆర్ అంశాలను ప్రణబ్ ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో చేరాలని టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను కోరగా, ‘మాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యం. మీరు కేంద్ర పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా.. మా తెలంగాణ ప్రజల ఆకాంక్షను మాత్రం నెరవేర్చండి’అని అన్నారని ప్రణబ్ ఆ పుస్తకంలో ప్రశంసించారు. చదవండి: ప్రణబ్‌దా.. అల్విదా కేసీఆర్‌కు ప్రశంసలు.. ప్రజా ఉద్యమానికి జోహార్లు.. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం, 24న ఇప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రణబ్‌ని కలిశారు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేస్తూనే తీవ్ర ఉద్వేగానికి లోనైన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు, బంగారు తెలంగాణ అభివృద్ధికి అందిస్తామన్న సహకారం మరువలేనిది. ఇదే సందర్భంలో కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేని లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు. జీవితకాలం పట్టే లక్ష్యాన్ని మీరు 15 ఏళ్లలో సాధించారు. మీకు కృతజ్ఞతలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ సుదీర్ఘ పోరాటం, నిబద్ధత, కృషి అభినందనీయం. అలుపెరగని పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు’అని ప్రణబ్ కొనియాడారు. -
‘నాన్న కోసం ప్రార్ధించండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు తానిచ్చిన దానికంటే వారి నుంచి తాను ఎంతో పొందానని నాన్న తరచూ చెబుతుండేవారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన ప్రజలను కోరారు. ఢిల్లీలోని ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి 96 గంటల అబ్జర్వేషన్ వ్యవధి శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు. ప్రణబ్‌జీ చికిత్సకు స్పందిస్తున్నారని అభిజిత్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని, ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. రక్తపోటు, మధుమేహం సహా కీలక ఆరోగ్య సంకేతాలన్నీ నిలకడగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించలేదని, ప్రణబ్‌జీ కళ్లలో కొంత మెరుగుదల కనిపించిందని ఆయన కుమార్తె షర్మిష్ట పేర్కొన్నారు. కాగా బ్రెయిన్ సర్జరీకి ముందు తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రణబ్ సత్వరమే కోలుకోవాలని బెంగాల్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఇక బీర్బం జిల్లాలో ఆయన బంధువులు మూడు రోజుల పాటు మృత్యుంజయ హోమం జరిపారు. చదవండి : ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు -
విషమంగా ప్రణబ్ ఆరోగ్యం: షర్మిష్ట
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘గతేడాది ఆగష్టు 8న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న భారత రత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా సంవత్సరానికి ఆగష్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. మా తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా నాన్న ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నవారందరికీ ధన్యవాదాలు’ అని షర్మిష్టా బుధవారం ట్వీట్ చేశారు. (విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) సోమవారం ప్రణబ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆపరేషన్ చేసిన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ డాకర్లు దానిని తొలగించారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుల చూపించలేదని, అంతేగాక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్ పూర్వీకుల గ్రామంలో గ్రామస్తులు మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకునేందుకు మంగళవారం మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. కాగా ప్రణబ్ కోవిడ్ బారిన పడిన విషయాన్ని ఆయన కార్యాలయం సోమవారం ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే. 2012-2017 మధ్యకాలంలో ప్రణబ్‌ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
నా సేవలు కొనసాగిస్తా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు. -
లోక్‌సభ సీట్లను వెయ్యికి పెంచాలి
న్యూఢిల్లీ: భారత్‌లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని ప్రణబ్ సూచించారు. ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహించే జనాభా సంఖ్యలోనూ ప్రస్తుతం చాలా తేడా ఉందన్నారు. ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుంచి 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, వారందరికి ఆయనొక్కడు ఎలా అందుబాటులో ఉండగలడని ప్రశ్నించారు. ‘1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై సోమవారం అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్ వెలువరించారు. ఈ సందర్భంగా ఓటరు ఇచ్చే తీర్పును పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ‘ప్రజలు సంఖ్యారూపంలో ఆధిక్యత ఇచ్చి ఉండొచ్చు. కానీ దేశంలోని మెజారిటీ ఓటర్లు ఒకే పార్టీకి మద్దతివ్వడం ఎప్పుడూ జరగలేదు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఆధిక్యతావాదంపై జాగ్రత్త వహించాలి’ అని సూచించారు. ‘భారతీయ ఓటర్లు ఇచ్చే తీర్పును రాజకీయ పార్టీలెప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందువల్ల అఖండ మెజారిటీ రాగానే ఏమైనా చేయొచ్చని భావిస్తాం. అలా వ్యవహరించిన పార్టీలకు ఆ తరువాత అదే ఓటర్లు శిక్ష విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు మీకు సంఖ్యాత్మక మెజారిటీ ఇచ్చారంటే దానర్థం వారు సుస్థిర ప్రభుత్వం కోరుకుంటున్నారు. అలాగే, మెజారిటీ ఓటర్లు మీకు మద్దతివ్వలేదంటే.. వారు ఆధిక్యతావాద ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని అర్థం. అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇచ్చే సందేశం’ అని ప్రణబ్ విశ్లేషించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఒకసారి సాధ్యమవుతుందేమో కానీ, ప్రతీసారీ సాధ్యం కాదని ప్రణబ్ పేర్కొన్నారు. -
హారతి గైకొనుమా
‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం!విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇలాంటివి చాలానే ఉన్నాయ్ రోజూ వినే పాటల్లో, ప్రావెర్బుల్లో.ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉందిఆయన ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అనడం.-మాధవ్ శింగరాజు ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో పదవీ విరమణ పొందిన భారత రాష్ట్రపతులు నివాసం ఉండే భవంతి ఒకటి ఉంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ సామాన్లను అందులోకి మార్పించారు. పుస్తకాలే ఆయన సామాన్లు. ఉండడానికైతే ప్రణబ్ ఇప్పుడు రాజాజీ మార్గ్ నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లోని ఆయన పూర్వీకుల స్వగ్రామం మిరాటీలో స్థానికులకు కనిపిస్తుంటారు. ఢిల్లీలో ఉన్నా, మిరాటీలో ఉన్నా ఆయన చేతిని వదలని మనుషులు.. పుస్తకాలే! అసలు ఢిల్లీ, మిరాటీ కాదు.. పుస్తకాలు ఎక్కడుంటే అక్కడే ఆయన నివాసం. ప్రణబ్ చుట్టూ తిరిగే రాజకీయాలు కూడా ప్రస్తుతం దేశంలో ఏమీ లేవు కనుక ఎక్కడైనా ఆయన మాట వినిపిస్తే, వెంటనే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారోనన్న సందేహం రావడానికి కారణం ఇదే.ఇప్పుడేం జరిగిందంటే.. ‘‘పురుషుడి చదువు పురుషుడికి మాత్రమే పరిమితం అవుతుంది. స్త్రీ చదువు కుటుంబం మొత్తానికీ చదువౌతుంది’’ అని ప్రణబ్ అకస్మాత్తుగా దేశ ప్రజలకు వాక్ దర్శనం ఇచ్చారు! ఢిల్లీలోనే ఒక కార్పొరేట్ కంపెనీ ‘బేటీ పఢావో అభియాన్’ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో గెస్ట్‌గా మాట్లాడుతూ ప్రణబ్ అన్నమాట ఇది. అంతే తప్ప తనకు తానుగా రాజాజీ మార్గ్లోనో, మిరాటీలోనో ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడలేదు. అలా మాట్లాడి ఉంటే ఆయన మాటల్ని సీరియస్‌గానే తీసుకోవలసి వచ్చేది. సందర్భానుసారం మాట్లాడ్డానికి, మాట్లాడవలసిన అవసరాన్నే ఒక సందర్భం చేయడానికీ తేడా ఉంటుంది కదా. ప్రణబ్ చెప్పిన హితవు కూడా కొత్తదేం కాదు. ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యు ఎడ్యుకేట్ ఏన్ ఇండివిడ్యువల్. బట్ ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్, యు ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ’ అని చెప్పారు ఆయన. ఎప్పుడూ వింటుండే మాటే. ఎవరో ఒకరు అంటుండే మాటే. మగ పిల్లవాడిని చదివిస్తే అది వాడికి మాత్రమే మేలవుతుంది. ఆడపిల్లను చదివిస్తే అది దేశానికే మేలవుతుంది అనేది ఆఫ్రికన్ ప్రావెర్బ్. అక్కడి నుంచి మిగతా ప్రపంచానికి ప్రబలింది. వాళ్లు ‘దేశానికి మేలు’ అంటే.. మనం ‘ఇంటికి మేలు’ అని మార్చుకున్నాం. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి మేలు ఎలా అవుతుందంటే ఆమె ఇంట్లోనే కూర్చుని పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తూ, బుద్ధులు నేర్పిస్తూ ఉంటుందని! తను చదువుకుంటున్నప్పుడు తోబుట్టువుల్ని చదివించడం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వాళ్లను చదివించడం, పిల్లల పెళ్లిళ్లు కూడా అయి మనవలు పుట్టాక వాళ్లను చదవించడం.. అలా ఆ విద్యాజ్యోతి తరాలను వెలిగించుకుంటూ పోతుంది. ఆమె ఉద్యోగం చేస్తున్నా కూడా రిటైర్ అయ్యేవరకు ఆమె వెలిగించడం కోసం రోజూ కొన్నిదీపాలు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాయి. ‘మమ్మీ ప్రాజెక్ట్‌వర్క్’. ‘అమ్మమ్మా హోమ్‌వర్క్’! చెయ్యడానికి, చేయించడానికి సంతోషమే. కానీ ఓపిక. అదెక్కడి నుంచి వస్తుంది? ‘ఓపిక దేముందీ.. ఫ్యామిలీ కంటే ఎక్కువా’ అని తను అనుకున్నా.. తనకు శక్తిని, జీవితేచ్ఛను ఇచ్చే సంతోషాల కోసం, సమాజం కోసం చేసుకోవాలనుకున్నవి! వాటికి టైమ్ ఎక్కడ? ఇంట్లో ఇంకో జ్ఞానదీపం ఉంటుంది కదా.. మగ జ్ఞానదీపం. అదెప్పుడూ తనకు తను ఇంట్లో, బయటా వెలుగుతూ ఉంటుంది తప్ప ఇంకొకర్ని వెలిగించేందుకు ఉత్సాహం చూపదెందుకు? సొంత పిల్లదీపాలను కూడా పట్టించుకోదెందుకు? డాడీ ఈ సమ్ అర్థంకావడం లేదు. ‘మమ్మీని అడుగు’. డాడీ.. స్కూల్ టైమ్ అవుతోంది. షూజ్కి పాలిష్ చెయ్యవా ప్లీజ్. ‘నీ షూజ్ నువ్వే క్లీన్ చేసుకోవాలని మమ్మీ చెప్పలేదా నీకు?’. విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాగోలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇంకా ఇలాంటివే చాలానే ఉన్నాయ్ రోజూ వినే మాటల్లో, పాటల్లో.. స్త్రీని నెత్తి మీద పెట్టుకొని ఎటూ కదలనివ్వకుండా పట్టుకునేవి. ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉంది ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అని ఆయన అనడం. ఆడపిల్లల్ని చదివించాలి అని మాత్రమే చెప్పి, రిలేటెడ్‌గా వేరే ఏమైనా మాట్లాడాల్సింది. ‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం. ప్రణబ్ ముఖర్జీ కన్నా నలభై ఏళ్లు ముందు పుట్టిన తెలుగు రచయిత, సంస్కర్త గుడిపాటి వెంకటాచలం. స్త్రీ అభ్యున్నతి కోసం ఆయన రాసినంతగా ఎవరూ రాయలేదు. అయినప్పటికీ ఎక్కడా విద్యతోనే స్త్రీ అభ్యున్నతి అని ఆయన అనలేదు. ‘అసలు జన్మ వల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు పల్లెటూళ్లలో. కానీ చదివి గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు. మళ్లీ చదువుల వల్ల చక్కని పాలిష్ వొచ్చిన పురుషులున్నారు’ అని రాశారు ఒకచోట. ఎందుకలా మగవాళ్లు మాత్రమే పాలిష్ అవుతారూ అంటే ఎంత చదువుకున్న స్త్రీ అయినా ఇంటిని పాలిష్ చేస్తుండటమే ఆ చదువుకు సార్థకత అన్నట్లుగా వాళ్ల మైండ్‌ని వీళ్లు ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తుంటారు కనుక. ప్రణబ్ బాగా చదువుకున్న మనిషి. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ చదువుతున్న మనిషి. రిటైర్ అయ్యి రాజాజీ మార్గ్‌లో ఉంటున్నా, ఆ రిటైర్మెంట్ నుంచి మరికాస్త రిటైర్ అవడం కోసం మిరాటీలో ఉంటున్నా, అప్పుడప్పుడూ సభలు సమావేశాలకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లొస్తున్నా.. కాస్త తీరిక చేసుకుని చిన్నపుస్తకమేదైనా రాస్తే బాగుంటుంది.. దీపమనీ, అపురూపమనీ స్త్రీని మభ్యపెట్టింది చాలు, ఆమె కోసం కూడా కాస్త ఆమెను వెలగనివ్వండి అని చెబుతూ! దీపం వెలుగులో ఎదగాలనుకోవడంలో తప్పులేదు. మనం ఎదగడం కోసమే దీపం వెలుగుతూ ఉండాలని అనుకోవడం అన్యాయం. -
మాజీ రాష్ట్రపతికి నీళ్లు కరువాయే!
అతను భారతరత్న.. మహోన్నతమైన వ్యక్తి.. నడుస్తున్న రాజకీయ చరిత్ర... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. కానీ.. విశిష్ట వ్యక్తిగా.. రాజకీయ దిగ్గజంగా పేరొందిన ప్రణబ్‌కు ఎలాంటి మర్యాద దక్కిందో తెలుసా..? నీటి సౌకర్యం కూడా కరువైన పరిస్థితులు ఎదురయ్యాయి. బస్తీల్లో ట్యాంకర్ వస్తే.. నీటిని తీసుకెళ్లినట్లుగా.. ఆయన గదికి బకెట్లతో నీటిని సరఫరా చేశారంటే.. అధికారుల నిర్లక్ష్యం ఇట్టే బయటపడింది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాల్సిన పోర్టు అధికారులు హడావుడి చేశారే తప్ప ప్రణబ్‌కు అందించాల్సిన సౌకర్యాల్ని మాత్రం గాలికొదిలేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ శనివారం మధ్యాహ్నం నగరానికి విచ్చేశారు. ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ నిర్వహించగా.. పోర్టు గెస్ట్ హౌస్‌లో బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అధికారులు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తికి బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు.. ముందస్తుగా చెక్ చేసుకోవడం, ట్రయల్ నిర్వహించడం చేయాలి. కానీ.. అవేమీ చూడకుండా పోర్టు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు . ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌లో చుక్కనీరు కూడా రాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రణబ్ ఉన్న గదికి పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని మేల్కొన్న అధికారులు తరువాత పరుగులు తీశారు. అగ్నిమాపక శకటాన్ని ఆశ్రయించిన వైనం.. గెస్ట్ హౌస్‌లో నీటి సరఫరా బంద్ అవ్వడంతో ఏంచేయాలో పాలుపోని అధికారులు కాన్వాయ్‌లో ఉన్న అగ్నిమాపక శకటం నుంచి నీరు కావాలని అధికారులు కోరారు. అగ్నిమాపక శకటాల గొట్టాల ద్వారా గెస్టు హౌస్‌లోని వాటర్ ట్యాంక్‌లోకి నీటిని మళ్లించాలని భావించారు. అయితే ఈ నీటితో స్నానం చేయడం మంచిది కాదని కొంతమంది సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో కింద నుంచి నీటిని బక్కెట్లతో తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు. హడావుడి చేశారే తప్ప.. ఇంత జరిగినా.. అక్కడ ఉన్న పోర్టు అధికారులు ఎవరూ నీటి సమస్యని సీరియస్‌గా తీసుకోలేదు. వసతి సౌకర్యాల బాధ్యతలు చూస్తున్న పోర్టు అధికారి బాపిరాజు నీటి సరఫరా ఎలా పునరుద్ధరించాలన్న విషయాన్ని పక్కనపెట్టి.. వస్తున్న సందర్శకులపై విరుచుకుపడుతూ.. చిందులేశారు. ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పటికీ.. పోర్టు ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోటర్ కాలింది.. జనరేటర్ ఆగిపోయింది... నీటిని గెస్ట్ హౌస్ ట్యాంకుల్లో నింపేందుకు ఉపయోగించే మోటరు కాలిపోయింది. అయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యలేదు. జనరేటర్ ద్వారా చేద్దామని కొందరు సలహా ఇచ్చారు. అయితే ఆ జనరేటర్ కూడా పనిచెయ్యడం లేదని అప్పుడు గుర్తించడంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది. డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం.. ప్రొటోకాల్‌లో భాగంగా గెస్ట్ హౌస్‌కి వచ్చిన పోర్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ ఈ విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య తలెత్తినప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్ హరనాథ్ ఆదేశించారు. ఎస్బీ ఎస్ఐ ఓవరాక్షన్.. పోర్టు గెస్టు హౌస్ బయట,లోపల పోలీస్ ఉన్నతాధికారులంతా హుందాగా విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ ఉన్న సంబంధం లేని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శ్రీనివాస్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. అరుపులు, కేకలతో వీరంగం చేశారు. వాస్తవానికి మాజీ రాష్ట్రపతిని కలిసేందుకు ఎవరెవరు వచ్చారనే వివరాల్ని సేకరించడమే ఆయన విధి. కానీ దాన్ని పక్కనపెట్టి వచ్చిన సందర్శకులపై విరుచుకుపడ్డారు. గెస్టు హౌస్ లోపల ఫొటోగ్రాఫర్ బ్యాగ్ ఎందుకంత బరువుందంటూ సంబంధంలేని ప్రశ్నలతో సందర్శకుల్ని ఇబ్బందులకు గురిచేశారు. -
పీవీపై వ్యాఖ్యలు.. చిన్నారెడ్డిపై హైకమాండ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ప్రధాని పీవీ నర సింహారావులను ఉద్దేశించి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడింది. దీనిపై తక్షణమే క్షమాపణ లు చెప్పాలని, ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిం దో వివరణ ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. బుధవారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ’ అని విమర్శించారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారత రత్నతో సత్కరించిందని అన్నారు. దీనిపై పార్టీలో రాజకీయ దుమారం రేగింది. పార్టీ లోని కొందరు ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఇతర సీనియర్ నేతలతో దీనిపై చర్చించిన హైకమాండ్ పెద్దలు దీనిపై వివర ణ ఇవ్వాలని చిన్నారెడ్డికి సూచించారు. వారి ఆదేశాల మేరకు ఆయన వివరణతో కూడిన ప్రకటనను గురువారం విడుదల చేశారు. పీవీ నరసింహారావు, ప్రణ బ్ ముఖర్జీలు అంటే తనకు అపారమైన గౌరవమని, వారు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప అవకాశాలు ఇచ్చిందని చిన్నారెడ్డి అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పీవీ, ప్రణబ్‌లను కాంగ్రెస్ అవమానించిందని అన డం రాజకీయమని, కాంగ్రెస్ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానని అంతే కాని పీవీ, ప్రణబ్‌లను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, వారంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధ పడితే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. -
ప్రణబ్ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) రాయని డైరీ
ఎవరో తట్టి లేపుతున్నారు. ‘‘ఏమిటీ?’’ అన్నాను. ‘‘భారత రత్న వచ్చింది’’ అంటున్నారు. కళ్లు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. పడక్కుర్చీలో ఉన్నాననుకుంటా అంతసేపూ. నేను పడక్కుర్చీలో ఉన్న విషయం తెలుస్తూనే ఉంది కానీ, ఆ పడక్కుర్చీ ఎక్కడ ఉన్నదీ వెంటనే గ్రహింపునకు రాలేదు. న్యూఢిల్లీలోని టెన్ రాజాజీ మార్గ్ రిటైర్మెంట్ హోమ్లోనా లేక, కోల్‌కతా లేక్ రోడ్‌లోని నా పూర్వీకుల కవి భారతి శరణి గృహంలోనా.. ఎక్కడుంది నా పడక్కుర్చీ! గుండెలపై వాల్చుకున్న పుస్తకం కింద పడి ఉంది. ‘ది కోయెలేషన్ ఇయర్స్’. నేను రాసిందే. ఇప్పుడెందుకు బయటికి తీశానో మరి! నేనే తీశానా? పిల్లలెవరైనా తీసి నామీద పడేసి వెళ్లిపోతే, నేను నిద్రలోకి జారుకున్న ప్పుడు దానంతటదే కిందకి జారి పడిందా? ‘కోయెలేషన్ ఇయర్స్’ తర్వాత ఏడాదిగా మళ్లీ ఏమీ రాయలేదు. పబ్లిషర్లు కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ‘‘ప్రణబ్‌జీ.. మీరు రాస్తున్నారు కానీ, రాసుకోవడం లేదు’’ అన్నారు రూపా పబ్లికేషన్స్ ప్రతినిధి ఒకరు ఈమధ్య ఇంటికి వచ్చినప్పుడు. వాళ్ల ఉద్దేశం అర్థమయింది. గాయపడ్డ పులి ఆటోబయోగ్రఫీ రాసుకోకుండా ఉంటుందా అని కొన్నేళ్లుగా వాళ్లు ఎదురు చూస్తున్నారు. ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైజ్’ అని రాస్తే, అందులో కాంగ్రెస్ పార్టీ సతాయింపులు – నా రాజకీయ జీవితంలోని త్యాగాలు ఉంటాయని వెయ్యి ఆశలు పెట్టుకున్నారు! ‘ది డ్రమాటిక్ డికేడ్ : ది ఇందిరా గాంధీ ఇయర్స్’ అని రాస్తే, అందులో పెద్దావిడను తిట్టిపోసి, మిగిలింది ఏమైనా ఉంటే చిన్నావిడపై పోసి ఉంటానని ఉత్కంఠకు, ఉద్వేగానికీ లోనయ్యారు. ‘‘మీరెప్పుడు కొత్త పుస్తకం సిద్ధం చేస్తున్నా అందులోంచి దేశాన్ని కుదిపివేసే కొన్ని సంగతులు బయట పడబోతున్నాయని ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది ప్రణబ్‌జీ. తీరా చూస్తే, ఇండియన్ ఎకానమీ, దేశం ముందున్న సవాళ్లు.. ఇలాంటివి తప్ప వాటిల్లో ఇంకేమీ ఉండవు’’ అని పబ్లిషర్లు నిరుత్సాహపడటం చూస్తుంటే.. పాపం వారిని ఎప్పుడైనా ఒకసారి అనూహ్యంగా ఉత్సాహపరచడానికి మార్గాలేమైనా ఉన్నాయా అని నన్ను నేను అన్వేషించు కోవాలని అనిపిస్తూ ఉంటుంది. ‘‘ఇప్పటికైనా మీ మనసులోని భావాలను బయటపెడతారా?’’ అని అడిగారు కపీష్ మెహ్రా. రూపా పబ్లికేషన్స్ ఎండీ ఆయన. నేరుగా ఆయన నా పడక్కుర్చీ దగ్గరకే వచ్చి అడిగారు! ‘‘ఓ.. ఇంతక్రితం మీరేనా నన్ను తట్టి లేపి, భారత రత్న వచ్చిందని చెప్పారు! చెప్పి, మళ్లీ ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను. ‘‘ఎక్కడికీ వెళ్లలేదు ప్రణబ్‌జీ. మీరు పూర్తిగా మేలుకోడానికి కొంత సమయం ఇచ్చేందుకు బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను’’ అన్నారు మెహ్రా. ‘‘చెప్పండి’’ అన్నాను నవ్వుతూ. ‘‘ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న రావడాన్ని.. మీ మనోభావాలను వెల్లడించ డానికి ఒక తిరుగులేని సందర్భంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న వచ్చిన ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ మీకు భారత ప్రధాని పదవి రాని సందర్భాలతో పోల్చి చూస్తున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ప్రధాని అవవలసి ఉన్న మీరు ప్రధాని కాలేకపోయారు. శ్రీమతి సోనియాగాంధీ మిమ్మల్ని ప్రధానిని చేయవలసి ఉన్నప్పుడూ మీరు ప్రధాని కాలేకపోయారు. అందుకే మీకు భారత రత్న రావడం కన్నా, మీరు భారత ప్రధాని కాలేకపోవడం ఇప్పుడు ముఖ్యమైన విషయం అయింది..’’ అన్నారు మెహ్రా. నవ్వాను. ‘‘ముఖ్యమైన విషయాలను ముఖ్యమైన విషయాలు గానే ఉంచుదాం మెహ్రాజీ’’ అని చెప్పాను. -
భరతరత్నను సంతోషంగా స్వీకరిస్తున్నా : ప్రణబ్
-
నేతలపై రేటింగ్స్‌కూ కొత్త యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐదేళ్లకొకసారి ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవటం కాదు.. అదే ఓటర్లు ఇప్పుడు స్థానిక నాయకులకు రేటింగ్స్, రివ్యూలూ ఇచ్చే అవకాశమొచ్చింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నేత యాప్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ విడుదల చేశారు. ఓటర్లకే కాకుండా నేత యాప్‌తో రాజకీయ పార్టీలకు పారదర్శకత, మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థుల ఎంపిక సులవుతుందని ప్రణబ్ చెప్పారు. ఇప్పటివరకు దేశంలోని 4,120 అసెంబ్లీ, 543 పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులకు 1.5 కోట్ల మంది ఓటర్లు రేటింగ్స్ ఇచ్చారని నేత యాప్ ఫౌండర్ ప్రతమ్ మిట్టల్ తెలిపారు. 16 భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఎలక్షన్ కమీషనర్ ఎస్‌వై ఖురేషీ పాల్గొన్నారు. -
ప్రణబ్ యాత్ర ‘లోగుట్టే్టమిటి’?!
ప్రణబ్ నాగ్‌పూర్ ప్రసంగంపై ప్రసిద్ధ గుజరాత్ విశ్లేషకుడు, విమర్శకుడు ప్రసాద్ చాకో వ్యాఖ్యానిస్తూ ప్రణబ్ నాగ్‌పూర్ ప్రసంగం ఎక్కడ ఎలాంటి ప్రేక్షకుడినైనా ఇబ్బంది పడకుండా ఒప్పిస్తుంది. ఎందుకంటే, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా, ఎవరైనా సరే భాష్యం చెప్పగల ఉపన్యాసం అది. ఆ సభలో ప్రణబ్ ప్రజల సంతోష సౌఖ్యాల సూచికలో భారతదేశం అథమస్థితిలో ఉందని బాధపడ్డారు. కానీ ఆయన ఆ సుఖ సంతోషాలకు దూరమైన వారెవరో గుర్తించడానికి శ్రద్ధ తీసుకోలేదు. అలాగే వారు సుఖంగా జీవితం గడపలేకపోవడానికి గల కారణాలనూ ఆయన విశ్లేషించి చెప్పడానికి శ్రద్ధ తీసుకోలేదని చాకో అన్నారు. ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వ్యవస్థాపకుడు హెడ్గేవార్ భారతమాత గొప్ప పుత్రుడు. భారత జాతీయవాదా నికి పునాది రాజ్యాంగబద్ధమైన దేశభక్తి. ఈ దేశానికి లౌకిక పునాదిపై నిర్మితమైన సెక్యులర్ విధానం, సర్వ మత విశ్వాసాలతో, భిన్న సంస్కృతులతో దీపిస్తున్న ప్రజాబాహుళ్యం కలగలిసి ఉన్నదే మన దేశం.’’ – ఆర్.ఎస్.ఎస్. శిక్షావర్ మూడో సంవత్సర నాగ్‌పూర్ సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం (7.6.18) ‘‘అసలు ప్రణబ్ ఎందుకొచ్చినట్టు? అసలా యన్ని ఎందుకు ఆహ్వానించినట్టని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. ఒక్క విషయాన్ని మరచిపోవద్దు– ఏ రోజు నైనా మా ఆరెస్సెస్ ఆరెస్సెస్సే, ముఖర్జీ ముఖర్జీయే, ఆయన అలాగే ఉంటారు మరి.’’ మోహన్ భాగవత్ ఆరెస్సెస్ నాగ్‌పూర్ శిక్షణా తరగతులయితే ముగి శాయి. కానీ సంఘ్ వ్యవస్థాపకుడైన కేబీ హెడ్గేవార్ను మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ భారత మాత మహా పుత్రుడన్న ప్రశంసపై కొందరు నానా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్థాన్ స్థాపనకు కారకుడైన మహ్మదాలీ జిన్నా లౌకికవాది అని 2005 జూన్‌లో పాక్ పర్యటనకు వెళ్లిన బీజేపీ అగ్రనేత లాల్ క్రిషన్ అడ్వాణీ తొలిసారిగా కీర్తించినప్పుడు ఆరెస్సెస్ నేతలే విరుచుకుపడిన సంగతి బీజేపీ నాయకు లకు పరగడుపు అయిపోయింది. మోదీ ప్రధాని అయ్యాక కూడా అడ్వాణీని బీజేపీలో కొందరు ‘అనా మకుడి’గానే ఆచరణలో చూస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల ఒక సభలో ప్రసంగించడానికి వచ్చిన ప్రధాని మోదీకి గౌరవసూచకంగా నమ స్కారం చేయడానికి వరుసగా నిలబడిన పెద్దల్లో ఒకరైన అడ్వాణీ ముకుళిత హస్తాలతో చేసిన వంద నాన్ని స్వీకరించలేక మోదీ ముఖం తిప్పేసుకున్న దృశ్యాన్ని పత్రికలు స్పష్టంగా ప్రచురించాయి. అలాగే ప్రణబ్ నాగ్‌పూర్ పర్యటన తర్వాత ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగం చూస్తే ‘ఎన్నడూ లేనంత అసాధా రణ బలం వచ్చినట్లు సంఘ్ నాయకులు భావిస్తు న్నార’ని ‘టైమ్స్ న్యూస్ నెట్వర్క్’ రాసింది. అంతే గాదు, ఆరెస్సెస్ సేవకులు ప్రణబ్‌తో కలిసి తీయిం చిన ఫొటోలను, హెడ్గేవార్ విగ్రహానికి ఆయన పూలమాలను వేస్తున్న ఫొటోలను భావితరాలకు చూపించి ఆ దృశ్యాన్ని నాగరికులెవరూ నొచ్చుకోలే దని నిరూపించడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని ప్రసిద్ధ మీడియా విశ్లేషకుడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ వ్యాఖ్యానించారు. ఇంతకూ ఈ పక్కవాటు విమర్శలకు, వ్యాఖ్యలకు మూలం ఎక్కడుంది? కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల దిన పత్రిక ‘టెలిగ్రాఫ్’ హెడ్గేవార్ ప్రసంగాల నుంచి, ప్రక టనల నుంచి సేకరించి ఒక సంకలనంగా ప్రచురిం చిన పుస్తకం (‘పాథీ’ p్చ్టజ్ఛిy) వీటికి ఆధారం. ఈ పుస్తకాన్ని అపూర్వానంద్ ఉటంకించారు. ఆరెస్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఆ పుస్తకం చదవాల్సిం దేనంటాడు అపూర్వానంద్. అందులో ఉదహరించిన హెడ్గెవార్ వచనాలు కొన్ని: 1.హిందుస్తాన్ కేవలం హిందువులదే. హిందుస్తాన్ హిందువుల దేశమే. జర్మన్లకు జర్మనీ ఎలాగో మనది హిందువుల దేశం. 2. ఒక భూమిలోని చెక్కనో, ముక్కనో మనం జాతి అనలేం. ఒకే ఆలోచన, ఒకే భావన, ఒకే సంస్కృతి, ఒకే నాగరికత ఉంటేనే జాతి. ఒకే సంప్రదాయంతో ఉన్నదే జాతి. ప్రాచీన కాలం నుంచి ఈ లక్షణాలు కలదే జాతి. సరిగ్గా ఈ కారణాలన్నింటివల్లనే మన దేశానికి హిందుస్తాన్ అన్న పేరొచ్చింది. ఇది హిందు వుల దేశం. 3. అలాగే ఇతరుల నుంచి ఆశించడం, అందుకోసం అంగలార్చడం అనేది కేవలం బలహీ నత. కాబట్టి, ఇక నుంచి సంఘ్ సేవక్‌లు ‘హిందు స్థాన్ హిందువులది మాత్రమే’నని నిర్భయంగా చాటాల్సిందే. సంకుచిత మనస్తత్వాన్ని తొలగించు కోండి. అయితే ఇతరులకు ఇక్కడ నివసించరాదని చెప్పొద్దు. కానీ, హిందువులదైన హిందుస్తాన్‌లో హిందువులు కాని హిందూయేతర్లు నివసిస్తున్నా రన్న నిరంతర స్పృహతో మాత్రం వారు మెలగాలి. హిందువుల హక్కులను ఇతరులు హరించరాదు. 4. కాషాయ జెండా (భగ్వధ్వజ)ను చూడగానే మొత్తం దేశ చరిత్ర తన సంప్రదాయం, సంస్కృతి మన కళ్ల ముందు వాలి పడాలి. హెడ్గేవార్ సందేశం విస్మరించేసినట్లే... అయితే ఇన్ని ‘సూక్తులు’ ఏకరువు పెట్టిన హెడ్గేవార్, ‘ఇతరులను దేబిరించడం లేదా ఎవరి నుంచో సహాయం కోసం ఎదురు చూడటం పెద్ద బలహీ నతన్న ఆదేశపూర్వక సందేశాన్ని మన పాలకులు మాత్రం పాటించడం లేదు. వారు విదేశీ పెట్టుబడుల కోసం అంగలారుస్తూ, దేశీయ వస్తు తయారీ రంగాన్ని’ ఎందుకు పస్తులు పెడుతున్నారో ప్రజ లకు జవాబు చెప్పాలి. పేరుకు మేక్ ఇన్ ఇండియా నినాదం చాటున దేశీయ చిన్న, మధ్యతరహా పరి శ్రమల్ని మాడ్చుతూ విదేశీ గుత్త కంపెనీలకు ద్వారాలు తెరిచి దానినే ‘ఫారిన్ మేడ్ ఇన్ ఇండి యా’గా ఎందుకు మార్చుతున్నారో కూడా చెప్పాలి. ఇతరులను ‘దేబిరించడం బలహీనతకు నిద ర్శనం అన్న హెడ్గేవార్ సూక్తికి తమ విధానాలు పూర్తిగా విరుద్ధమని మోదీ ప్రభుత్వంగానీ, ఆరెస్సెస్ నాయకత్వంగానీ భావించడం లేదా? అలాగే వందల సంవత్సరాలుగా దేశంలో నివసించే ఇతర జాతు లను, తెగలను, మైనారిటీలను ‘హిందూయేతర్లు’గా, ‘యవనపాములు’ లేదా విదేశీ సర్పాలనీ ముద్ర వేయడం సరికాదంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆరోగ్యకర సంస్కృతిగా భావించి నాగ్‌పూర్ సభలో ప్రకటించిన ప్రణబ్ మాటలను ఆచరణయుక్తమైన సందేశంగా మనం భావించాలి. ‘ఇతరులను అడు క్కుని బతికే సంస్కృతిని, అలవాట్లను’ హెడ్గేవార్ వ్యతిరేకించిన మాట నిజమే. అయితే అనేక పోరా టాల ద్వారా, అపారమైన త్యాగాలతో గాంధీ, నెహ్రూ, పటేల్, అజాద్, సరోజినీ, భగత్‌సింగ్ ప్రభృ తులు నిర్మించిన భారతదేశ విశిష్ట సమ్మేళనా శక్తికి విరుద్ధంగా హెడ్గేవార్ అనేక విషయాలు ప్రబోధిం చారు. ప్రణబ్ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావిం చిన సెక్యులర్ సౌధాన్ని కూల్చే ప్రయత్నం ఎటువైపు నుంచి జరిగినా అది మోదీ సందు దొరికినప్పుడల్లా తన ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్దతుగా వల్లిస్తున్న ‘125 కోట్లమంది భారత ప్రజల సంక్షేమా నికే’ ముప్పు అని గ్రహించాలి. నేడు దేశంలో పాలక పక్షం విశ్వవిద్యాలయ విద్యార్థులపైన, వారి నాయ కులపైన సమావేశ స్వాతంత్య్రానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ అధికార స్థాయిలో జరుపుతున్న దాడులు, పెడుతున్న ఆంక్ష లపై ప్రణబ్ తన ప్రసంగంలో నిరసన వ్యక్తం చేయ లేదు. రాజ్యాంగాన్ని ప్రజా వ్యతిరేక ధోరణులకు, విధానాలకనుగుణంగా మొదలంటా మార్చివేయా లని బీజేపీ–ఆరెస్సెస్ ద్వయం చేస్తున్న ప్రయత్నా లనూ ప్రణబ్ ఖండించలేకపోయారు. ఇక దళితులు, జాతీయ మైనారిటీలపైన ‘లవ్ జిహాద్’ పేరిట భారీగా వివిధ రాష్ట్రాల్లో సాగిస్తున్న దౌర్జన్యకాండను, ప్రజాస్వామ్య సంస్థలపైన, పాత్రికేయులపైన ప్రజా స్వామ్య ఉద్యమాలపైన, ప్రతిపక్ష నాయకులపైన జరుగుతున్న ‘జులుం’నూ ప్రణబ్ తప్పుపట్టకపో వడం ఆయన నాగ్‌పూర్ పర్యటనపై అనేక అనుమా నాలకు తావిచ్చింది. గతంలో హిందూ మహాసభ, ఆరెస్సెస్ నాయకుడు ఎం.ఎస్.గోల్వాల్కర్ అను సరించిన మైనారిటీ వ్యతిరేక విధానాలను ప్రణబ్ కన్నా సర్దార్ పటేల్ బాహాటంగా ఖండించారు. ప్రజల కష్టాలకు కారణాలు విశ్లేషించని ప్రణబ్ ప్రణబ్ నాగ్‌పూర్ ప్రసంగంపై ప్రసిద్ధ గుజరాత్ విశ్లేష కుడు, విమర్శకుడు ప్రసాద్ చాకో వ్యాఖ్యానిస్తూ ప్రణబ్ నాగ్‌పూర్ ప్రసంగం ఎక్కడ ఎలాంటి ప్రేక్షకు డినైనా ఇబ్బందిపడకుండా ఒప్పిస్తుంది. ఎందు కంటే, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా, ఎవరైనా సరే భాష్యం చెప్పగల ఉపన్యాసం అది. ఆ సభలో ప్రణబ్ ప్రజల సంతోష సౌఖ్యాల సూచికలో భార తదేశం అథమస్థితిలో ఉందని బాధపడ్డారు. కానీ ఆయన ఆ సుఖ సంతోషాలకు దూరమైన వారెవరో గుర్తించడానికి శ్రద్ధ తీసుకోలేదు. అలాగే వారు సుఖంగా జీవితం గడపలేకపోవడానికి గల కారణా లనూ ఆయన విశ్లేషించి చెప్పడానికి శ్రద్ధ తీసుకో లేదని చాకో అన్నారు. అలాగే, హత్యలకు దారి తీస్తున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల గురించీ, ప్రణబ్ ప్రస్తావించకపోవడాన్ని చాకో విమర్శించారు. అన్నింటికంటే అసలు విశే షం–నాగ్‌పూర్‌లో స్వయంసేవకుల విన్యాసాలు పూర్తయిన సందర్భంగా కర్ణాటకకు చెందిన సంఘ్ సీనియర్లలో ఒకరైన బసవన గౌడ్ పాటిల్ యత్నాల్ (బీజేపీ కర్ణాటక శాసనసభ్యుడు) మైనారిటీల సంక్షే మం కోసం కార్పొరేటర్లు పని చేయకుండా కేవలం హిందువుల కోసం మాత్రమే పనిచేయాలని, బురఖా లతో ఉన్నవారిని తన ఆఫీసుకు రానివ్వొద్దని ఆదేశిం చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది. అంతే గాదు, కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ అసలు ప్రణబ్ వివిధ దశల్లో చేసిన విరుద్ధ ప్రకటనల సారాం శాన్ని ఇలా బయటపెట్టారు: ‘‘జాతీయ కాంగ్రెస్ విద్యార్థి యూనియన్‌లో ఆరెస్సెస్ స్వభావం గురించి గతంలో ప్రణబ్ ఎందుకు చెడుగా మాట్లాడారు? ఇప్పుడు కొత్తగా సంఘ్‌లో ఏది ధర్మంగా, ఏం గొప్పగా కన్పించిందో ఆయన స్పష్టం చేయాలి. లేకుంటే, ఆరెస్సెస్‌ను లౌకికవాద, బహుళత్వ సమా జంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా రని మేం అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లుగా మాకు 1960–90ల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు మీ తరం నేతలు ఆరెస్సెస్ ఉద్దేశాలు, లక్ష్యాల గురించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కానీ 1975లో ఓసారి, తర్వాత 1992లో ఆరెస్సెస్‌పై నిషేధం విధిం చిన సమయంలో మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. అప్పుడు ఆరెస్సెస్ ఎందుకు తప్పని అనిపించింది, ఇప్పుడు ఎందుకు అది మీకు గొప్ప అనిపిస్తోంది?’’ ఈ ప్రశ్నలకు ప్రణబ్ తానుగా సూటిగా సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నారని ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ప్రణబ్ ప్రధాని అభ్యర్థి కావొచ్చు
ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రాకపోతే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీకి బదులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని శివసేన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 7న నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించడం తెలిసిందే. ఆరెస్సెస్ అసలు ప్రణబ్‌ను ఎందుకు ఆహ్వానించిందో సాధారణ ఎన్నికల అనంతరం కానీ స్పష్టత రాదని శివసేనకు చెందిన సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మాట్లాడుతూ ‘పరిస్థితి చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా లేదు. హంగ్ ఏర్పడిన పక్షంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి ఇతర పార్టీలు మద్దతివ్వకపోతే, ప్రణబ్ ముఖర్జీని ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు’ అని అన్నారు. అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ప్రణబ్ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఖండించారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తన తండ్రికి లేదని ఆమె స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శర్మిష్ట ట్విట్టర్లో స్పందిస్తూ ‘సంజయ్ రౌత్.. మా నాన్న రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రారు’ అని స్పష్టం చేశారు. -
ప్రణబ్ ముఖర్జీ రాయని డైరీ
నాగపూర్ వెళ్లొచ్చినప్పట్నుంచీ నా మనసుకు హుషారుగా ఉంది. ఊహు.. వెళ్లొచ్చినప్ప ట్నుంచీ కాదు, వెళ్లబోయే ముందు నుంచీ! ‘ఆరెస్సెస్ పిలిస్తే మీరు వెళ్లడం ఏంటి ప్రణబ్‌జీ!’ అని.. మా పక్కింట్లో ఉండే బెంగాలీ.. మాణింగ్ వాక్‌లో అవాక్కయ్యాడు. సాధారణ పౌరుడే అవాక్కయ్యాడంటే దేశంలోని అసా ధారణ పౌరులు ఇంకెంత అవాక్కవుతారో కదా అని అప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆలోచిస్తున్నాను. బెంగాల్లో ఉండేది అంతా బెంగాలీలే అయినప్పుడు బెంగాల్‌లోని ఏ పక్కింట్లోనైనా బెంగాలీనే కదా ఉంటాడు. అయితే ఈ పక్కింటి బెంగాలీ ఎప్పుడూ ‘నేను బెంగాలీని కాదు ప్రణబ్‌జీ, భారతీయుడిని’ అని నడుస్తూ, నడుస్తూ.. ఆయాసంగా అంటుంటాడు. అలాగని అతడి గురించి ‘మా పక్కింట్లో ఉండే భారతీయుడు’ అని చెబితే.. ‘ప్రణబ్‌జీ మీరు భారతీయుడు కాదా!’ అని రేపు మాణింగ్ నాతో పాటు నడిచే ఇంకో వాకర్ అవాక్కయ్యే ప్రమాదం ఉంది. బెంగాలీ బెంగాలీనని చెప్పుకోకున్నా భారతీయుడు కాకుండా పోడు. భారతీయుడు భారతీయుడినని చెప్పుకోకపోతే మాత్రం బెంగాలీగా కూడా మిగలడు. ఏం తోచక, మరికొంత సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. బహుశా పక్కింటి బెంగాలీ కూడా నాలాగే తన ఇంట్లో ఏం తోచక, నా గురించే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. నాగ పూర్లో నేనేమీ మాట్లాడలేదు కాబట్టి, నా గురించి ఆలోచించడానికి ఏమీ లేదని దేశ ప్రజలందరికీ తెలిశాక కూడా పక్కింటి బెంగాలీ నా గురించి ఏం ఆలోచిస్తూంటాడు?! ‘‘వెళ్లొద్దంటే విన్నారా.. నాన్నా..’’ అంది శర్మిష్ట దిగాలుగా వచ్చి. ‘‘ఇప్పుడేమైందమ్మా..’’ అన్నాను. ‘‘ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయి ఉంటే!’’ అంది. ‘‘నేనేమైనా బంగీ జంప్ చేసి వచ్చానా తల్లీ! ఊరికే స్టేజీమీద నాలుగు ముక్కలు మాట్లాడ్డానికే కదా వెళ్లాను’’ అన్నాను. ‘‘కానీ నాన్నా.. కాంగ్రెస్ మీద కోపంతో మీరు బంగీ జంప్ లాంటిదేదో చేయబోతున్నా రని మేమంతా భయంభయంగా టీవీల ముందు కూర్చున్నాం. పక్కింటి అంకుల్ కూడా మనింటికే వచ్చి కూర్చున్నారు. ఆయన మాకన్నా భయస్తులు. స్టేజీ మీద ఎవర్ని చూసినా ‘ఆయన మీ డాడీనే కదా’ అని అడుగు తున్నారు. ‘తలపై ఆ క్యాప్ పెట్టుకుంది మీ డాడీనే కదూ’, ‘చెయ్యి అలా అడ్డంగా పైకి లేపి ప్రణామం చేస్తున్నది మీ డాడీనే కదూ’ అని మా ప్రాణం తీశారు’’ అంది శర్మిష్ట. ‘‘పాపం.. వాళ్లు ముందే చెప్పారు కదమ్మా.. మీటింగ్ తర్వాత కూడా ప్రణబ్ ప్రణబ్లాగే ఉంటారనీ, ఆరెస్సెస్ ఆరెస్సెస్లానే ఉంటుందనీ’’ అన్నాను. ‘‘అయినా గానీ భయంగానే ఉంది నాన్నా’’ అంది శర్మిష్ట. ‘‘ఎందుకమ్మా..’’ అన్నాను. ‘‘నాగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచీ మీలో కొత్త ఉత్సాహం ఏదో కనిపిస్తోంది నాన్నా’’ అంది!! మాధవ్ శింగరాజు -
ప్రణబ్ హితవచనాలు
భిన్న సిద్ధాంతాల, అవగాహనల మధ్య చర్చ జరగడం ఎప్పుడూ స్వాగతించదగిందే. ప్రజా స్వామ్య వ్యవస్థ మనుగడకు అది ఎంతో అవసరం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరె స్సెస్) కార్యక్రమానికి రావాలంటూ ఆ సంస్థ నుంచి అందిన ఆహ్వానాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినప్పటినుంచి ఆ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయిదు పదుల సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్వల్పకాలం మినహా మొత్తం కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణించిన ప్రణబ్ ఆ ఆహ్వానాన్ని ఎలా మన్నిస్తారని ప్రశ్నిం చినవారు కొందరైతే... వెళ్తే తప్పేమిటన్నవారు మరికొందరు. వద్దని కోరినవారిలో కాంగ్రెస్ వాదులు మాత్రమే కాదు... కమ్యూనిస్టులు, ఉదారవాదులు కూడా ఉన్నారు. చిదంబరం వంటి కాంగ్రెస్ నాయకులు ‘వెళ్తే వెళ్లండిగానీ, వారి సిద్ధాంతంలోని లోపాలేమిటో చెప్పి రండి’ అని ప్రణబ్‌కు హితబోధ చేశారు. మరికొందరు మాత్రం నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. అధికారికంగా తన వైఖరేమిటో చెప్పని కాంగ్రెస్ చివరికొచ్చేసరికి మాత్రం అలా వెళ్లడం మహాపరాధం అన్నట్టు మాట్లాడింది. ‘మీనుంచి ఇలాంటిది ఆశించలేద’ంటూ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు. ఎందుకైనా మంచిదని ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్టతో కూడా ప్రణబ్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించారు. కానీ ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే ఆ పార్టీ గొంతు సవరించుకుని ప్రణబ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం గంభీరంగా సాగింది. రాష్ట్రపతిగా జాతినుద్దేశించి చేసిన ప్రసం గాల తరహాలోనే ఇది కూడా ఉంది. ఎవరికి వారు తమ తమ వైఖరులకు అనుగుణమైన అంశాలను వెదుక్కోవడానికి వీలుగానే ఉంది. ఆయన భారతీయ సమాజ మూలాల గురించి మాట్లాడారు. శిఖరాలనూ, సాగరాలనూ, ఎడారులనూ దాటుకుని మన సంస్కృతి, విశ్వాసాలు ప్రపంచంలోని నలుమూలలకూ విస్తరించిన వైనాన్ని ప్రస్తావించారు. జాతి, జాతీయతలను భౌగోళిక హద్దులు, భాష, మతం, తెగ వగైరా పరిమితులకు లోబడి చూడరాదని చెప్పారు. భారత జాతీయత కొందరికే పరిమితమైన భావన కాదని, దానికి దూకుడు లేదా విధ్వంసకర స్వభావాలు లేవని చెప్పిన మహాత్మా గాంధీతోపాటు... హిందూ, ముస్లిం, సిక్కు తదితర సమూ హాల సైద్ధాంతిక సమ్మేళనమే భారత జాతీయతగా నిర్వచించిన జవహర్లాల్ నెహ్రూనూ గుర్తు చేశారు. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ఈ నేల నాలుగుచెరగులా వ్యాపించిన పోరాటాల సమష్టితత్వం వ్యక్తిగత, సైద్ధాంతిక, రాజకీయ పాయలకు అతీతంగా దేశభక్తిని ప్రేరేపించిందని వివరించారు. మన రాజ్యాంగం నుంచే మన జాతీయత ఆవిర్భవించిందని నొక్కిచెప్పారు. భిన్నాభిప్రాయాల మధ్య సంవాదం అవసరమని, అవి ఉండొద్దనుకోవడం సరికాదని హితవు పలికారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప అసహనం, ద్వేషం, హింస కూడదని తెలి పారు. సంగమం, సమీకరణం, సహజీవనాల సుదీర్ఘ ప్రక్రియ నుంచే ఈ జాతి రూపు దిద్దు కున్నదని వివరించారు. అయితే ‘భరతమాత మహోన్నత పుత్రుడి’గా ప్రణబ్ అభివర్ణించిన ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ అభిప్రాయాల్లో చాలావాటికి ఇవి భిన్నమైనవి. ఉదాహరణకు ‘రాజ్యాంగ జాతీయత’ను ఆరెస్సెస్ అంగీకరించదు. ఈ గడ్డపై పురాతన కాలం నుంచే ఇది కొనసాగుతూ వస్తున్నదని చెబుతుంది. జాతీయతకు సంబంధించిన ఈ భిన్నమైన అభిప్రాయాల్లో తన వైఖరిలోని సహేతుకతను గురించి ప్రణబ్ స్పృశించలేదు. ఆయనే చెప్పి నట్టు ఇలా భిన్నాభిప్రాయాలుండటం, అవి వ్యక్తం కావడం, వాటిపై చర్చ జరగడం ఇప్పటి పరి స్థితుల్లో ఎంతో అవసరం. ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రణబ్ వర్తమానంలో కనబడుతున్న విభిన్న ఆచరణల గురించి, అవి పోతున్న పోకడల గురించి, వాటి పర్యవసానంగా సంభవించిన విషాద ఉదంతాల గురించి, అందులోని మంచిచెడ్డల గురించి ప్రస్తావించలేదు. ప్రణబ్ ఆ పని చేసి ఉంటే బహుశా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఆ వేదికపై నుంచే ఆ అంశాలపై తమ వైఖరేమిటో వివరించేవారు. 2007లో అప్పటి ఆరెస్సెస్ చీఫ్ కేఎస్ సుదర్శన్ ఆహ్వానంపై ఇలాంటి సమావేశానికే ప్రధాన అతిథిగా వెళ్లిన వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఏవై టిప్నిస్ ఆ సంస్థ ఆచరణపై, దాని సిద్ధాంతాలపై తన అభిప్రాయాలు చెప్పడం, అందుకు సుదర్శన్ సమాధానమివ్వడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే ప్రణబ్ నిష్కర్షగా తన అభి ప్రాయాలు చెప్పిన సందర్భాలున్నాయి. యూపీలోని దాద్రిలో గొడ్డు మాంసం తింటున్నారని అనుమానం వచ్చి ఒక కుటుంబంపై దాడిచేసి ఆ కుటుంబ పెద్దను కొట్టి చంపిన ఉదంతం జరిగినప్పుడు రాష్ట్రపతిగా ప్రణబ్ దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండించారు. ప్రణబ్ ప్రసంగానికి ముందు మాట్లాడిన భాగవత్ తమ సంస్థ ఏ ఒక్క వర్గానికో పరిమి తమైనది కాదని చెప్పడంతోపాటు అందరినీ కలుపుకొని వెళ్తామని వివరించారు. ప్రజల మత విశ్వాసాలతో తమకు పని లేదని, అందరి సహకారంతో దేశాన్ని ‘విశ్వ గురు’గా నిలపడమే ధ్యేయమని తెలిపారు. ప్రణబ్ ఈ సమావేశానికి రావడంపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తా వించి... ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రణబ్ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్ సంఘ్‌గానే ఉంటుందని మోహన్ భాగవత్ చెప్పారు. అయితే మార్పునకు ఎవరూ అతీతం కాదు. పర స్పరం ప్రభావితం కానివేవీ ఉండవు. ఎల్లకాలమూ ఎవరికి వారుగానే ఉండటం సాధ్యమూ కాదు. కొన్నేళ్లక్రితం ఆరెస్సెస్ నుంచి ఇలాంటి ఆహ్వానమే వచ్చి ఉంటే ప్రణబ్ అంగీ కరించేవారా? అసలు ఆరెస్సెస్ ఆయన్ను పిలిచేదా? హెడ్గేవార్ అభిప్రాయాలకూ, ఇప్పుడు మోహన్ భాగవత్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకూ మధ్యనే ఎంతో వ్యత్యాసముంది. అయితే ఆరెస్సెస్ వేదికపై ప్రసంగించినంతమాత్రాన వారితో ప్రణబ్‌కు ఏకీభావమున్నదని అనుకో వడం లేదా ఆ సంస్థ ఈ సందర్భాన్ని తనకనుకూలంగా మలచుకుంటుందన్న వాదన సరికాదు. ఎవరేం చెప్పినా అంతిమంగా ఆచరణే అన్నిటికీ గీటురాయి. దాన్నిబట్టే ఎవరికైనా అభిప్రా యాలు ఏర్పడతాయి. ప్రణబ్ చెప్పారనో, ఆరెస్సెస్ చెప్పుకున్నదనో ఎవరూ దేనిపైనా నిర్ణ యానికి రారు. మొత్తానికి ప్రణబ్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపిందని చెప్పాలి. దేశ రాజకీయాలపై దీని ప్రభావం ముందూ, మునుపూ ఎలా ఉంటుందో చూడాలి. -
ఎల్పీయూ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ‘ఎల్పీయూ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్’ అవార్డులను తన నివాసంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 89 పాఠశాలలు, 29 కోచింగ్ సెంటర్లకు రూ. కోటి విలువైన గ్రాంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా ‘ప్రణబ్ సర్ కి పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి కార్యక్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులతో ముచ్చటిస్తూ.. రిజర్వేషన్లు, సమానత్వం, భావి భారత దార్శనికత తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.