
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
చదవండి: ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి