హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐదేళ్లకొకసారి ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవటం కాదు.. అదే ఓటర్లు ఇప్పుడు స్థానిక నాయకులకు రేటింగ్స్, రివ్యూలూ ఇచ్చే అవకాశమొచ్చింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నేత యాప్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ విడుదల చేశారు. ఓటర్లకే కాకుండా నేత యాప్‌తో రాజకీయ పార్టీలకు పారదర్శకత, మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థుల ఎంపిక సులవుతుందని ప్రణబ్ చెప్పారు. ఇప్పటివరకు దేశంలోని 4,120 అసెంబ్లీ, 543 పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులకు 1.5 కోట్ల మంది ఓటర్లు రేటింగ్స్ ఇచ్చారని నేత యాప్ ఫౌండర్ ప్రతమ్ మిట్టల్ తెలిపారు. 16 భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఎలక్షన్ కమీషనర్ ఎస్‌వై ఖురేషీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment