
పరిసరాలను శుభ్రం చేస్తున్న విద్యార్థులు
నిర్మల్‌టౌన్ : జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్మల్‌రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికినీరును శుభ్రం చేశారు. ఇందులో సర్పంచ్ చింతకింది నర్సయ్య, ఎంపీటీసీ దాసరి పంతులు, వీడీసీ మెంబర్ భీమన్న, కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి, అధ్యక్షుడు తుల భోజన్న, అధ్యాపకులు, విద్యార్థులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment