తమిళసినిమా: మానవత్వం కలిగిన మనిషిని మహా నుభావుడంటారు. మా నవత్వం కోసం పెద్దగా యాగాలు, త్యాగాలు చేయనవస రం లేదు. కొంచెం ప్రేమ, కాస్త కరుణ, మ రి కాస్త దయ, ఇంకాస్త జాలి ఉంటే అదే మానవత్వం అవుతుంది. మనకు కలిగిన దానిలో కొంచెం అది అవసరమైన వాళ్లకు పంచడం దయాగుణమే అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రాణాన్ని పోయడం సాధ్యం కాదు గానీ, పోయే ప్రాణాన్ని సాయం అనే మాటతో కాపాడగలం.
ఇక సమంత గురించి సినిమా అనే మూడక్షరాలు పరిచయం ఉన్న వారందరికి తెలుసంటుందన్నది అతిశయోక్తి కాదేమో. తెలుగు, తమిళం భాషల్లో మేటి నటిగా రాణిస్తున్న ఈ చెన్నై చిన్నది ఇటీవలే తెలుగింటి కోడలైంది. నటుడు నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని కుటుంబంలో శాశ్వత సభ్యురాలైంది. ఇకపోతే సమంతలో చలాకీగా ఆడిపాడి అల్లరి చేసే యువతినే చాలా మంది చూసి ఉంటారు. సినిమాలోనే కాకుండా, తన పెళ్లి వేడుకలో కూడా అందంగా ఆడి పాడి సందడి చేసిన సమంతను అలా చూడడంలో పెద్దగా ఆశ్చర్యం కూడా ఉండదు. అయితే అలాంటి సమంతలో మరో కోణం కూడా ఉంది. అదే మానవత్వం.
అవసరం అయిన వారికి తగిన సాయం చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం. సమంత ప్రత్యూష పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెల కొల్పి, పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయం చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి సేవలకు ఎలాంటి ప్రచారాన్ని ఆశించని సమంత ఇటీవల ఒక బృహత్కర కార్యాన్ని నిర్వహించారు. ప్రాణాపాయంలో ఉన్న 15 మంది పసికందులకు తన ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ ద్వారా శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారులకు పునర్జన్మను కలిగించారు. ఇందుకు రూ.కోటికి పైనే ఖర్చు అయ్యిందట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్‌లో పేర్కొంటూ చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి ధన్యవాదాలు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment