స్టార్ హీరోయిన్ అవయవ దానం | samantha to donate her organs now | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్ అవయవ దానం

Published Thu, Nov 5 2015 1:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

స్టార్ హీరోయిన్ అవయవ దానం

స్టార్ హీరోయిన్ అవయవ దానం

టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించటమే కాదు. సామాజిక సేవలోను స్టార్ అనిపించుకుంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత, ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆమె అవయవ దానానికి సిధ్దమవుతోంది.

హీరోయిన్గా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సమంత అవయవ దానం చేస్తున్నట్టుగా ప్రతిజ్ఞ చేయనుంది. అంతేకాదు తన అభిమానులు కూడా అవయవధానం చేయాలంటే కోరుతోంది. ఈ నెల 7న ప్రత్యూష ఫౌండేషన్తో పాటు, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేయనుందట. ఆ తరువాత కూడా అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' సినిమాతో పాటు, నితిన్ సరసన 'అ.. ఆ..' సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు తమిళ్లోనూ బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement