అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం.. | Pratyusha support and jeevandan organization | Sakshi
Sakshi News home page

అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం..

Published Sun, Nov 8 2015 3:32 AM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం.. - Sakshi

అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం..

మాదాపూర్: అవయవ దానం ద్వారా ఒకరు మరణించిన తర్వాత పది మందిలో జీవించవచ్చని, ఇలా కొన్ని కుటుంబాలలో ఆనందం నింపవచ్చని ప్రముఖ సినీనటి సమంత పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో మాక్స్‌క్యూర్ ఆస్పత్రి, ప్రత్యూష సపోర్ట్ అండ్ జీవన్‌దాన్ సంస్థ సంయుక్తంగా అవయదానంపై శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా హాజరైన సమంత మాట్లాడుతూ.. దేశంలో ఏటా అవసరమైన సమయానికి అవయవాలు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

అవయదానంపై ప్రతి ఒక్కరు అవ గాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రమణి, బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్, మ్యాక్స్‌క్యూర్ వైద్యులు శరణ్ రెడ్డి, కృష్ణప్రసాద్, ఎంఎస్‌ఎస్ ముఖర్జీ, అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయదానంపై ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement