Trident Hotel
-
ముంబై లగ్జరీ హోటల్లో అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై : దక్షిణ ముంబైలోని లగ్జరీ హోటల్ ట్రిడెంట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్లో మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. హోటల్ బేస్మెంట్లో అగ్నిప్రమాదం జరగ్గా సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదాన్ని లెవెల్ -2 ఫైర్‌గా గుర్తించినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సోమవారం అంధేరిలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో తొమ్మిది మంది మరణించగా, 175 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
ట్రైడెంట్ హోటల్ ఎదుట బ్యాంకు సిబ్బంది ఆందోళన
హైదరాబాద్‌సిటీ: మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంకు సిబ్బంది ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రైడెంట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం..
మాదాపూర్: అవయవ దానం ద్వారా ఒకరు మరణించిన తర్వాత పది మందిలో జీవించవచ్చని, ఇలా కొన్ని కుటుంబాలలో ఆనందం నింపవచ్చని ప్రముఖ సినీనటి సమంత పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో మాక్స్‌క్యూర్ ఆస్పత్రి, ప్రత్యూష సపోర్ట్ అండ్ జీవన్‌దాన్ సంస్థ సంయుక్తంగా అవయదానంపై శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా హాజరైన సమంత మాట్లాడుతూ.. దేశంలో ఏటా అవసరమైన సమయానికి అవయవాలు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అవయదానంపై ప్రతి ఒక్కరు అవ గాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రమణి, బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్, మ్యాక్స్‌క్యూర్ వైద్యులు శరణ్ రెడ్డి, కృష్ణప్రసాద్, ఎంఎస్ఎస్ ముఖర్జీ, అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయదానంపై ప్రతిజ్ఞ చేశారు. -
ఇంట్లో ఉన్నట్టే!
బొమన్ ఇరానీ... పేరు చెప్పగానే ఆయన ఫేస్ కంటే సినిమా క్యారెక్టర్లే కళ్లముందు కదలాడతాయి. అంతగా లీనమైపోతారు ఆయన పాత్రలో. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్ వంటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్సే కాదు... టాలీవుడ్ సన్సేషన్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదిలోనూ నటించి మురిపించిన బొమన్ ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడకు వచ్చినప్పుడల్లా మాదాపూర్‌లో ట్రైడెంట్ హోటల్లో బస చేస్తుంటాను. ఇక్కడి ప్రజలంటే నాకు ఇష్టం. ఎంత కోపం, విసుగు వచ్చినా, ఇక్కడి ప్రజలు సంయమనం కోల్పోకుండా చక్కగా మాట్లాడతారు. సికింద్రాబాద్‌లోని ‘ప్యారడైజ్’ బిర్యానీ ఇష్టం. ముంబై లాంటి నగరాల్లో రెస్టారెంట్లన్నీ పూర్తి కమర్షియల్‌గా ఉంటాయి. ప్యారడైజ్‌లో కూర్చుని తింటే, ఇంట్లో కూర్చుని తిన్నట్లే ఉంటుంది. ఏరియాను బట్టి డ్రెస్సింగ్ అందంగా తయారవడమంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. స్వయంగా తయారు చేసుకున్న బౌ కాలర్కి ధరించేవాణ్ణి. అలా తయారైనప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది. అబ్బాయిలు ఎక్కడకు వెళ్లినా బ్లేజర్లు వేసుకుని వెళుతుంటారు. అయితే, వెళ్లే ప్రదేశాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం. చిన్నప్పటి నుంచి అదే నాకు అలవాటు. బిజినెస్ మీటింగ్స్‌కు వెళ్లేటప్పుడు బ్లేజర్లు వేసుకుంటే ఓకే. పిక్నిక్కు వెళ్లినా అదే డ్రెస్ అంటే ఎలా? వస్త్రధారణ మహిళలకే కాదు, పురుషులకూ ముఖ్యమే. వేసుకున్న దుస్తులే వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తాయి. సిటీ ఆఫ్ రిలాక్స్డ్ షూటింగ్స్ కోసం చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను. ముంబైలో అంతా ఉరుకులు పరుగులు.. ఇక్కడ పనిచేస్తుంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. లొకేషన్స్ చాలా నేచురల్‌గా, లైవ్లీగా ఉంటాయి. అతి త్వరలోనే విదేశీయులు సైతం హైదరాబాద్‌లో సినిమాల షూటింగ్‌కు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కలసి మెలసి పనిచేసుకోవడం నాకు చాలా నచ్చే అంశం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ మూవీలోని దృశ్యాన్ని తలపించేలా ఇక్కడి ఫ్యాషన్ షోలో ర్యాంప్‌వాక్‌లో పాల్గొనబోతున్నాను.