
సాక్షి, ముంబై : దక్షిణ ముంబైలోని లగ్జరీ హోటల్ ట్రిడెంట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. హోటల్ బేస్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగ్గా సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఈ ప్రమాదాన్ని లెవెల్ -2 ఫైర్‌గా గుర్తించినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సోమవారం అంధేరిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో తొమ్మిది మంది మరణించగా, 175 మంది గాయపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment