
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో మూవీ దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసినా.. ప్రేక్షకులను అంతగా మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. తాజాగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్దే కనిపించనున్నారు. పీరియాడిక్ రొమాటింక్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూళ్లు పూర్తవ్వగా.. ఒకటి ఇటలీ, మరొకటి హైదరాబాద్‌లో జరిగింది. సెట్ ఏర్పాటుల విషయంలో ఆలస్యం కారణంగా మూడవ షెడ్యూల్ జాప్యం అయినట్లు సమాచారం.
చదవండి: ప్రభాస్ కొత్త సినిమా ‘జాన్’ కాదా?
తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘నా తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఫన్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దీంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. కాగా సినిమాకు సంబంధించి షెడ్యూల్ నవంబర్‌లోనే చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉండగా..కొన్ని కారణాల రీత్యా షూటింగ్ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment