
సాక్షి, హైదరాబాద్: క్యూబా విప్లవనేత చే గువేరా వారసులు ఆదివారం హైదరాబాద్‌కు రాను న్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్‌సీఎస్‌సీ), ఐప్సో(ఏఐపీ ఎస్‌వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరగ నున్న క్యూబా సంఘీభావసభకు చే కుమార్తె, క్యూబా బాలల హక్కుల కార్యకర్త, అడ్వకేట్ అలైదాగు వేరా, ఆమె కుమార్తె, చే మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా హాజరుకానున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న అలైదా, ఎస్తిఫినాకు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ క్యూబన్ ప్రతినిధి బృందంతో వారివురూ సమావేశమవుతారు. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞానకేంద్రం, మఖ్దూం భవన్, హరితప్లాజా, రవీంద్రభారతిని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్రభారతిలో జరగనున్న క్యూబా సంఘీభావ సభలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా వారు చేగువేరాతో తమ అనుభవా లను పంచుకోవడంతోపాటు చే సమరశీలత, ప్రజాస్వామిక చైతన్యానికి ప్రేరణ ఇవ్వనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వామపక్ష పార్టీల నేతలు ఎన్.బాలమల్లేశ్, డీజీ నర్సింహారావు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ కార్యక్రమా నికి అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు హాజరుకానున్నారు. రాత్రి హరితప్లాజాలోనే బసచేయనున్న అలైదా, ఎస్తిఫినా సోమవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ విమానా శ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.