ravindra bharati
-
నందికాదు కానీ.. గద్దర్ అవార్డులు
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ప్రభుత్వం తరపున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఇటీవల సినీ ప్రముఖులు నన్ను కలిశారు. గత ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చాయని, వాటిని పునరుద్ధరించాలని అడిగారు. నంది అవార్డులు కాదుగానీ, మా ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తుంది..బాహుబలిలో శివగామి శాసనం మాదిరి ఈ వేదికగా చెబుతున్న ఈ ప్రకటనే శాసనం, జీఓ’అని సీఎం తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమకు స్ఫూర్తి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జెకట్టి గళం విప్పిన గొప్పవ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ఆయనతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలను బద్ధలు కొట్టామని తెలిపారు. దళితుడిని సీఎంను చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావుపూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత వచ్చి ఆ దళితుడికే వినతిపత్రం ఇచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయమై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు కలలు కంటున్నారు ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి ఆలోచన చేసేవారికి తెలంగాణ ప్రజలే ఘోరీ కడతారని స్పష్టం చేశారు. అది వారి ఒంటికి, ఇంటికి మంచిది కాదని హితవు పలికారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్‌ను అవమానించిన ప్రగతిభవన్ గేట్లను బద్ధలు కొట్టామని, దానిని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజాభవన్‌గా మార్చామన్నారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, అందరం కలిసి నడుద్దామని, సామాజిక ప్రగతిశీలరాష్ట్రాన్ని నిర్మి ద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ‘పాటకు జీవకణం’, ‘తరగని ఘని’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గద్దర్ సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్, కూతురు వెన్నెలఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. -
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్‌భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్‌లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్‌వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్‌కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్‌ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణకు చేగువేరా కుమార్తె, మనవరాలు
సాక్షి, హైదరాబాద్: క్యూబా విప్లవనేత చే గువేరా వారసులు ఆదివారం హైదరాబాద్‌కు రాను న్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్సీఎస్సీ), ఐప్సో(ఏఐపీ ఎస్వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరగ నున్న క్యూబా సంఘీభావసభకు చే కుమార్తె, క్యూబా బాలల హక్కుల కార్యకర్త, అడ్వకేట్ అలైదాగు వేరా, ఆమె కుమార్తె, చే మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న అలైదా, ఎస్తిఫినాకు పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ క్యూబన్ ప్రతినిధి బృందంతో వారివురూ సమావేశమవుతారు. ఆ తర్వాత సుందరయ్య విజ్ఞానకేంద్రం, మఖ్దూం భవన్, హరితప్లాజా, రవీంద్రభారతిని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్రభారతిలో జరగనున్న క్యూబా సంఘీభావ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారు చేగువేరాతో తమ అనుభవా లను పంచుకోవడంతోపాటు చే సమరశీలత, ప్రజాస్వామిక చైతన్యానికి ప్రేరణ ఇవ్వనున్నారని నిర్వాహకులు వెల్లడించారు. వామపక్ష పార్టీల నేతలు ఎన్.బాలమల్లేశ్, డీజీ నర్సింహారావు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ కార్యక్రమా నికి అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు హాజరుకానున్నారు. రాత్రి హరితప్లాజాలోనే బసచేయనున్న అలైదా, ఎస్తిఫినా సోమవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ విమానా శ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
రామ రామ రామ ఉయ్యాలో..
సాక్షి, హైదరాబాద్: రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించే ఈ పండుగను విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతున్నారు. శనివారం రవీంద్రభారతి వేదికగా విదేశీయులు బతుకమ్మ ఆడా రు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాల యం గచ్చిబౌలి వారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన దుస్తులు దరించిన విదేశీయులు కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఇండోనేసియా, మలేసియా, రష్యా, అమెరికా, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, రష్యా తదితర 21 దేశాలకు చెందిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు, పురుషులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా దాదాపు రెండు నెలలపాటు బతుకమ్మ ఆటపాటలపై శిక్షణ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్ డైరెక్టర్ బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్, రష్యాలో బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ సంతోష్ సిస్టర్, రజనీ సిస్టర్, జస్టిస్ ఈశ్వర య్య, జస్టిస్ అమర్నాథ్, జస్టిస్ రమేశ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీఎం రెడ్డి పాల్గొన్నారు. ఒక్క పండుగతో వంద లాభాలు.. ప్రపంచంలో ఇలాంటి పండుగ ఎక్కడా చూడలేదు. ప్రకృతి, వైద్యం, వ్యాయామం, సమైక్య త, సమగ్రత వంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఆచార, వ్యవహారాలు తెలియచేసేది బతుకమ్మ పండుగ. –బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్ బతుకమ్మ విశ్వవ్యాప్తం అవుతుంది.. మేం ఎక్కడా ఇలాంటి సంబరాలు చూడలేదు. ప్రకృతిలో వికసించే పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఆడటం వల్ల మనస్సు వికసిస్తోం ది. భవిష్యత్‌లో ఈ పండుగ విశ్వవ్యాప్తం అవుతుంది. బతుకమ్మ ఆటపాటను తమ దేశంలో కూడా ఆడతామని ముందుకు వస్తున్నారు. – సంతోష్ సిస్టర్ ఏకాగ్రత పెరుగుతుంది.. పెద్దలు, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడటం వల్ల అందరి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తిరుగుతూ ఆడటంతో ఏకాగ్రత పెరు గుతుంది. ప్రకృతితో మమేకమవుతూ మహిళలు పేర్చే బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగను ఇక ముందు రష్యాలో కూడా కొనసాగిస్తాం. – నాగమన్జ్, థాయ్‌లాండ్ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశాం.. బ్రహ్మకుమారీస్ 130 దేశాల్లో ఉన్నారు. మూడేళ్లుగా వారితో బతుకమ్మ సంబరాలు చేయిస్తున్నాం. ఈసారి 21 దేశాల కళాకారులు వచ్చారు. 25 దేశాలతో ఎంవోయూకు సిద్ధంగా ఉన్నాం. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయటమే లక్ష్యం. ప్రపంచ పర్యాటకులు అంతా తెలంగాణ వైపు రావాలి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు తిలకించి వెళ్లాలి. – బుర్రా వెంకటేశం -
ప్రపంచవ్యాప్తంగా ‘బతుకమ్మ’ వైభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం, జీవన విధానాలను బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా బ్రహ్మకుమారీలు, విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకుంటామని చెప్పారు. 25 దేశాలకు సంబంధించిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు మన రాష్ట్రంలో బతుకమ్మ ఆడతారన్నారు. విదేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల్లో బతుకమ్మలు, సాహిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఢిల్లీ, ముంబై, సూరత్ వంటి నగరాలతోపాటు యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్, పోలాండ్ తదితర దేశాల్లో భారత మహి ళలు పాల్గొనేలా చూస్తామన్నారు. వేయిమంది దివ్యాంగ, బధిర, అంధ మహిళలు బతుకమ్మ ఆడేవిధంగా ప్రత్యేకంగా హైటెక్స్‌లో ఏర్పాట్లు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో మొదటిసారిగా 12 ఏళ్లలోపు బాలికల కోసం బొడ్డెమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు. ఆకాశంలో 50 మందితో పారామోటరింగ్ ద్వారా బతుకమ్మ హరివిల్లులు కనిపించేలా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రవీంద్రభారతిలో 9 నుంచి 16 వరకు రవీంద్రభారతిలో 9 నుండి 16 వరకు బతుకమ్మ పై ఫిలిమోత్సవం నిర్వహించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తామని తెలిపారు. ఆర్ట్ క్యాంపును ఒక నెల పాటు నిర్వహిస్తామని, ఈ ఆర్ట్ గ్యాలరీలో 55 దేశాల ఫోటోగ్రాఫర్ల ద్వారా ఫోటో ప్రదర్శన జరుగుతుందన్నారు. మహిళాసాధికారతపై అవగాహన బతుకమ్మ సందర్భంగా బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు అందించడంతోపాటు మహిళాసాధికారతపై అవగాహన కల్పిస్తామని వెంకటేశం పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ రోజున లేజర్ షో, ఫైర్ వర్క్, కల్చర్ కార్నివాల్ ఉంటుందని, ఐటీ, పరిశ్రమల సహాయంతో పూలశకటాలు నగరంలో ప్రదర్శించటానికి కృషి చేస్తున్నామని వివరించారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రయాణించే మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలున్నందున బతుకమ్మ పండగ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులు ఉండరని ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా బతుకమ్మ పండుగలో పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, జిల్లా లో రూ.15 లక్షలు, విదేశాల్లో 2 కోట్లతో నిర్వహిస్తామన్నారు. బ్రహ్మకుమారీల ద్వారా గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంతోష్ దీది తెలిపారు. అనంతరం పండుగకు సంబంధించిన సీడీ, పోస్టర్‌ను కార్యదర్శి వెంకటేశం, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి సంతోష్ దీది, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. -
ఉత్తమ గురువులకు వందనం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తమ గురువులను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సన్మానించనుంది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది ఉపాధ్యాయులను బుధవారం రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా సన్మానిస్తారు. వీరికి పతకంతో పాటు, రూ.10వేల నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ మంగళవారం తెలిపారు. ఉన్నత విద్యా శాఖ పరిధిలో 29 మందిని, ఇంటర్ విద్యలో 10 మందిని ఉత్తమ అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి కూడా బుధవారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. -
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు దివ్యాంగురాలు, యువ పెయింటర్ నఫీస్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ గత నెలలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నఫీస్ అద్భుతమైన చిత్రకళను చూసి మంత్రి అభినందించారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని, జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్‌తోపాటు ఆమెకు అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ నఫీస్ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రూ.10 లక్షలను జాయింట్ అకౌంట్లో జమ చేసింది. దీని ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసింది. నఫీస్‌కు ఈ పెన్షన్ సౌకర్యం జీవితాంతం ఉం టుందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను కేటీఆర్ అభినందించారు. -
నాట్యానందం
-
అణగారిన వర్గాలకు చరిత్ర ఉంది
-
తెలుగువాడి వర్ణఫలం ‘వాసు’
పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి. అక్కడి నుంచి లేచాడా.. బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. ఉదయాన్నే ఇంట్లోకి వచ్చి పడే దినపత్రిక లోగిల్లో తీరైన రేఖతో ప్రభాత వర్ణాల ఆ నీటి రంగుల ముగ్గు పేరు వాసు - తెలుగమ్మాయిల బుగ్గల ఎరుపు ముక్కు చివరి ముక్కెరను తాకి బంగారు కాంతిని జిగేల్మనిపించినా అది వాసే. అమ్మా, నాయనమ్మల కంచి ధర్మవరం బెనారస్ పోచంపల్లి చీరల ధగధగల మధ్య అల్లరల్లరిగా ఆటలాడే పిల్లిమొగ్గల, కోతి చేష్టల పిల్లకాయల నిండు పండులాంటి ముద్దు మొఖాల చిరునవ్వుకు సంతకం తెలిస్తే అది వాసు. ఈ రోజు తెలుగు వాడి వర్ణ ఫలం పేరు వాసు. తెలుగురేఖ దీటుకు దాని ఎనలేని సానకు బాపు, బాలి, గోపి, మోహన్, కరుణాకర్ వంటివారు శిఖర స్థాయికి చేరిస్తే ఆ పతాకం వెనుక నుంచి పంచ రంగుల సూర్యుణ్ణి వెలుగింప జేసింది చిత్రకారులు చంద్ర, ఆపై ఆయన ప్రియాతి ప్రియ అంతే వాసి వాసు. పాపం చాలామంది శిష్యులు ఒక పెద్ద నడక నడిచాకా వెనక్కి తిరిగి చూసే ఓపికా అవసరమూ లేక నడిచిన దారి గురుతులు మరిచి ‘పాపం ఆయనా! నా గురువా? అబ్బే!’ అని మొహమాటపడతారు కానీ... ఏనాడు చంద్రగారి పక్కన నిలబడి నాలుగునిముషాలైనా ఆయన చిత్రకళా విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడని వాసు, నిద్దరలో కూడా ఇదంతా చంద్ర బొమ్మల భిక్షేనని ఆయన్ని కన్నులక ద్దుకుంటారు. బొత్తిగా వెర్రి ఏకలవ్యుడు. చంద్ర మాత్రం ద్రోణుడు కారు. పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. ఒక చిత్రకారుడిగా ఆయన బొమ్మలు ప్రపం చానికి తెలియడమే తప్ప ఆయన గురించి ఫలానా సంవ త్సరం, ఫలానా నెల, ఫలానా ప్రాంతంలో ఫలానా జిల్లాలో పుట్టారు. అప్పుడు అది ఆ జిల్లే కానీ ఇప్పుడు అది ఈ జిల్లా అయ్యింది. పైగా రాష్ర్టం కూడా బదలాయించింది వంటి సమాచారం ఒక అనవసరం. మన వెర్రి కాకపొతే కళాకా రుడికి ఫలానా ఫలానా ఏమిటి? పైగా వాసు వంటి వారికి! వాసు అంటే కొందరి వ్యక్తి కాదు అది అందరి బొమ్మ. కోన సీమ పచ్చని బయలుపై ఠీవిగా నడిచే కోడెదూడ మెడన మెరిసే మువ్వల వరుస తళుకు వాసు కుంచెదే, భద్రాది రాములవారి గోపురంపై నీడ కప్పిన కొబ్బరాకు పచ్చదనం కూడా అదే. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి నల్లని విగ్రహపు నవ్వు రంగు కూడా అంతే, శ్రీశైల మల్లికార్జుని కొలువులో సేదతీరుతున్న మల్లియలకు అద్దిన తెల్లని తెలుపు ముత్యపు రంగు కూడా వాసూదే. వాసు ఒక రకంగా కర్మ యోగి ఒక్క ఖానా, పీనా, పిలానాలో తప్ప మరే ఆర్టు గ్రూపుల్లో, గ్రూప్ ఫొటోల్లో తోసుకువచ్చి కనపడే రకం కాదు. ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటాడు. మన బొమ్మలో చేవ సత్తా వుంటే దాన్ని ప్రపంచం చూస్తుంది కానీ మన మొహం వెళ్ళి ప్రపంచం ముందు ఎందుక్కనపడాలని పేరు ప్రఖ్యాతులపై సిగరెట్ పొగ ఊదే ఒక తెంపరి. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి, అక్కడి నుంచి లేచాడా బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. వాసు ఆర్టిస్ట్‌గా కన్నా, ఒక స్నేహిగా, ఒక నిరంతర ప్రయా ణిగా, తనకు నచ్చినవారి మధ్య ఒక సందడిగా బతకాలను కునే మామూలు మనిషి. నేను 24 గంటలు కేవలం ఆర్ట్‌నే పీలుస్తానని హడావుడిగా ఆర్ట్ అ్ప్డేట్స్ కోసం పాకులాడే బాపతు కాదు కాబట్టే ప్రపంచానికి వాసు బొమ్మ తెలిసినంత వాసు అంటే ఏమిటో ఎవరికీ తెలుపదలుచుకోలేదు. తెలుగు బొమ్మల పెద్దలు బాపు, చంద్ర, మోహన్, బాలి, కరుణాకర్ల తరువాత తన బొమ్మల్తో ఈ తరానికి స్ఫూర్తి కలిగిస్తున్న ఈ కాలపు ఒకే ఒక చిత్రకారుడు వాసు. చాలా ఏళ్ళ తరువాత బొమ్మల కాలేజీలో చదువుకునే పిల్లలు, చిత్రకారులమవుదామనుకుని తపించే జనం ఓనామహ శివా యహ దిద్దినంత సీరియస్‌గా ఇప్పుడు వాసు రంగుని రేఖని సాధన చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విప్లవం. అందుకు తరచు ఫేస్బుక్లో కనబడే వాసూలా గీయాలనుకునే చాలామంది బొమ్మలే సాక్షి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరిట వాసు తన మొదటి బొమ్మల ప్రదర్శన హైదరాబాద్ రవీంద్రభారతి కళాభవన్‌లో డిసెంబర్ 3, 4, 5న ఏర్పాటు చేస్తున్నారు. వర్ణానికి, వర్గానికి, ప్రాంతానికి కట్టుబడని ఈ కళాకారుడి దారిలో వెలిసిన బొమ్మల మైలురాళ్ళ జాతర ఇది. ఈ శుభ సమయాన ఇక్కడ హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్న ఈ రంగుల పండుగను ఇరు రాష్ట్రాల కళాభిమా నులు తమకు తామే పూనుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నగరాల్లో బొమ్మల కొలువుగా కొలువు తీరుస్తే బావుంటుంది. నిజానికి ఈ ప్రదర్శన ఎప్పుడో జరగ వలసింది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత జరుగుతున్న వాసు బొమ్మల కొలువు కూడా ఎవరో బలవంతపెట్టి చేయిం చడం తప్ప వాసు తనకు తాను చేస్తున్నది అని నేను అనుకోవడం లేదు. ఆ పర్సన్- బిహైండ్ ది సీన్ ఎవరో అదే చేత్తో వాసు బొమ్మల పుస్తకం కూడా మార్కెట్లో తెస్తే మా తరం, మా తదుపరి తరం చిత్రకారులకు చాలా పెద్ద బొమ్మల బాలశిక్ష అవుతుంది. నిజానికి వాసు తన బొమ్మల పుస్తకానికి తన సొంత జేబులోంచి చెల్లని అయిదు వందలు, వెయ్యి రూపాయల నోటు తీయనవసరం లేకుండా కొండంత ప్రేమతో ఆ పుస్తక భారం వహించే పెద్దలు ఎంతోమంది వాసు అభిమానులుగా వున్నారు. కానీ ముందుగా చెప్పు కున్నట్టు ఇటువంటి సరదాలు ఏం పట్టని వాసు కర్మ యోగి. అదే మన ఖర్మ. (డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్ రవీంద్రభారతిలోని కళాభవన్‌లో వాసు మొదటి బొమ్మల ప్రదర్శన సందర్భంగా) అన్వర్, సాక్షి కార్టూనిస్టు -
జానపదం..ప్రాణపదం
సాక్షి, సిటీబూర్యో: భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, లయన్ క్లబ్ ఆఫ్ కొత్తపేట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బోనాల జానపద నృత్య జాతర ఆకట్టుకుంది. రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 204 జానపద పాటలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను మంత్రముగ్థుల్ని చేశాయి. అనంతరం నృత్య గురువులు, నృత్య జాతరలో భాగస్వాములైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ ఎస్ రాజ సదారాం, కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా కో–ఆర్డినేటర్ డాక్టర్ కేవీ రమణరావు తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. కమనీయం
-
యాదాద్రి వాసా.. మనసాస్మరామి
-
నాట్యాభినయం..
-
ఆద్యంతం ఆసక్తికరం...
-
రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది కవులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన పలువురు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 'కొత్తసలు' పుస్తకావిష్కరణ చేశారు. -
'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'
హైదరాబాద్: అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికైనా మొదటి బడి అమ్మ ఒడి అని ఆయన వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గురువులు పెట్టిన అక్షరభిక్ష వల్లే తానీ స్థాయిలో ఉన్నానని అన్నారు. తమను తీర్చిదిద్దిన ఘనత గురువులదే అన్నారు. మృత్యుంజయ శర్మ దగ్గర తాను విద్య నేర్చకున్నానని గుర్తు చేసుకున్నారు. ఫీజు తీసుకోకుండా తనకు ఆయన పాఠాలు చెప్పారన్నారు. 9వ తరగతిలో చంపకమాల పద్యం రాశానని వెల్లడించారు. దేశానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ కొనియాడారు. సర్వేపల్లి ఏకసంధాగ్రహి అని చెప్పారు. గురువులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
‘కన్యాశుల్కం’ నాటకం