
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు దివ్యాంగురాలు, యువ పెయింటర్ నఫీస్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ గత నెలలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నఫీస్ అద్భుతమైన చిత్రకళను చూసి మంత్రి అభినందించారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని, జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
పెన్షన్‌తోపాటు ఆమెకు అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ నఫీస్ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రూ.10 లక్షలను జాయింట్ అకౌంట్‌లో జమ చేసింది. దీని ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసింది. నఫీస్‌కు ఈ పెన్షన్ సౌకర్యం జీవితాంతం ఉం టుందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను కేటీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment