![UK Royal Navy adds saree to ceremonial mess dress code](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Royal-Sari.jpg.webp?itok=y3ZOk21d)
వైవిధ్యం
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్‌తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’ను అప్‌డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్‌లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్‌లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది.
బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్‌ఎన్) డైవర్సిటీ నెట్‌వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్‌లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్‌తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్‌కోడ్ అప్‌డేట్‌పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment