uniform dress
-
కన్నడనాట ‘హిజాబ్’ రగడ
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్‌కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వారికి పోటీగా కొందరు స్టూడెంట్లు కాషాయ శాలువాతో క్లాసులకు హాజరవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్‌తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్తో పాటు బెల్గావీ, హసన్, చిక్‌మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించింది. హిజాబ్ తమ హక్కు అంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేశా రు. వాటిలో పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హిజాబ్‌ను అనుమతించాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికారు. ఈ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘చదువుల తల్లి సరస్వతి తన బిడ్డలకు ఎలాంటి తేడా చూప దు. జ్ఞానాన్ని అందరికీ పంచుతుంది’’ అని వసంత పంచమి పర్వదినాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిజాబ్ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. హిజాబ్ ధరించినంత మాత్రాన విద్యా సంస్థల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. ‘‘హిజాబ్ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు. ఈ గొడవలకు మూలకారకులను తక్షణం అరెస్టు చేయాలని సీఎం బస్వరాజ్ బొమ్మైని డిమాండ్ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే ప్రధాని మోదీకి ఈ గొడవలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్‌కుమార్ కటీల్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు. హిజాబ్ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్ తరహా పరిస్థితులను అనుమతించబోం. నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్‌ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. హిజాబ్‌ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
అందరికీ యూనిఫాం
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై స్కూల్ యూనిఫాం 9, 10వ తరగతి విద్యార్థులకు సైతం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందేది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో మిగతా రెండు తరగతుల విద్యార్థులకు సైతం యూనిఫాం అందించనున్నారు. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగానూ అయ్యే కుట్టుకూలిని సైతం విడుదల చేసింది. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఒకేరకమైన యూనిఫాం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందజేస్తోంది. గత కొన్నాళ్లుగా 1వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే వీటిని అందించేవారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా సరఫరా చేస్తున్న వీటిని ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ మేలు జరగనుంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 450 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు(డీఈవో పరిధిలో) ఉన్నా యి. వీటితో పాటు 17 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే. ఈ పాఠశాలల్లో చదువుకుంటున్న 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేసేవారు. అయితే కేజీబీవీల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థినిలకు మాత్రమే ఏకరూప దుస్తులు అందిస్తున్నారు. 13 కేజీబీవీల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 527 మంది, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 534 మంది ఉన్నారు. ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్లలో 9, 10వ తరగతులు చదివే బాలికలు 4910, బాలురు 5182 మంది, మొత్తం 10092 మంది ఉన్నారు. అలాగే ఆరు ఆదర్శ పాఠశాలల్లో 277 బాలురు, 467 మంది బాలికలు ఉన్నారు. వీరికి త్వరలోనే బట్ట రాగానే ఎమ్మార్సీల తీర్మానం అనంతరం యూనిఫాం కుట్టి అందజేయనున్నారు. కుట్టుకూలి విడుదల..ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. కుట్టుకూలీకి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతీ విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులు అందజేయనున్నారు. అయితే ఒక జతకు రూ.100 చొప్పున దర్జీకి చెల్లించనున్నారు. 1061 మంది కేజీబీవీ విద్యార్థినిలకు సంబంధించి రూ.53,050, మోడల్ స్కూల్ విద్యార్థులు 694 మందికి గానూ రూ.69,400, ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 10,092 మందికి గానూ రూ.1,09,200ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఎస్ఎంసీ ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదే 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే. ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు యూనిఫాం కుట్టిస్తుండడంతో వారికి ఆర్థికంగా కొంత భారమయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వమే రెండు జతల యూనిఫాం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. – దానిష్, 10వ తరగతి విద్యార్థి ఆనందంగా ఉంది.. మాకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే యూనిఫాం ఉచితంగా అందించారు. 9వ తరగతిలో ఇవ్వలేదు. ఈఏడాది నుంచి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు యూనిఫాం ఇస్తున్న విషయం తెలిసింది. చాలా ఆనందంగా ఉంది.– నిఖిత, 10వ తరగతి విద్యార్థిని -
బీ(ధీ)మా ఏదీ?
సాక్షి, నెల్లూరు : రుణమాఫీ హామీని చంద్రబాబు నెరవేర్చకపోవడంతో రైతులు అన్ని విధాలుగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బాబును నమ్ముకుని అప్పులు చెల్లించక పోవడంతో వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయి. పాత అప్పులు చెల్తిస్తేనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకులు షరతు పెట్టడంతో ఇప్పుడు పంటల బీమాకు ఎసరొచ్చి పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినా పరిహారం పొందలేని పరిస్థితి నెలకొంది. ఇలా జిల్లా రైతులు సుమారు రూ.500 కోట్ల మేర బీమా మొత్తాన్ని కోల్పోనున్నారు. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.5 లక్షల మంది, రబీ సీజన్లో 3 లక్షల మంది బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. రుణాలు మంజూరు చేసే సమయంలోనే ఆయా పంటలకు సంబంధించి బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడం ఆనవాయితీ. చంద్రబాబు తీరుతో రుణమాఫీ గందరగోళంలో పడిన నేపథ్యంలో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే క్రమంలో పంటలకు బీమా ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. బ్యాంకులు రుణాలు ఇస్తాయనే ధీమాతో ఎవరూ ప్రత్యేకంగా బీమా ప్రీమియం చెల్లించడం లేదు. వందల కోట్లలో నష్టం జిల్లాలో ఒక్క ఖరీఫ్ సీజన్లోనే 55,402 హెక్టార్లలో వరి, 969 హెక్టార్లలో సజ్జ, 723 హెక్టార్లలో వేరుశనగ, 7,759 హెక్టార్లలో చెరకు పంటలు సాగయ్యాయి. ఎకరా వరికి బీమా ప్రీమియం రూ.459 కాగా పంట నష్టం సంభవిస్తే పరిహారంగా రూ.22,934 వస్తుంది. సజ్జకు ప్రీమియం రూ.278, పరిహారం రూ.10,296, వేరుశనగకు ప్రీమియం రూ.951, పరిహారంగా రూ.31,704, చెరకుకు ప్రీమియం రూ.1,578 కాగా పరిహారంగా రూ.78,876 లభిస్తుంది. అయితే బీమా ప్రీమియమే చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్లో ఏ కారణంతోనైనా పంటను కోల్పోతే వరి రైతులు రూ.316.5 కోట్లు, సజ్జ రైతులు రూ.21.5 కోట్లు, వేరుశనగ రైతులు రూ.5.7 కోట్లు, చెరకు రైతులు రూ.131.5 కోట్లు నష్టపోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి నెల్లూరురూరల్ : నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ శ్రీకాంత్ వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రేషన్, పింఛన్, పట్టాదారు పాసుపుస్తకాలు, గ్యాస్, జాబ్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లకు ఆధార్ నంబర్లు తప్పనిసరై ఉన్నాయని, సంబంధిత అధికారులు ఆధార్ సీడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ తీయించుకోని వారిని గుర్తించి ఆధార్ తీయించాలన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నెల్లూరు ఆర్డీఓ పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, నెల్లూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు వీడీయోకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. యూనిఫాం దుస్తులకు నిధుల విడుదల నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆప్కో ద్వారా యూనిఫాం దుస్తులకు సంబంధించి 50 శాతం నిధులను విడుదల చేసినట్లు సర్వశిక్షా అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసీ అకౌంట్లకు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆప్కో వారి ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్ 055910100055900కు బదిలీ చేయాలని సూచించారు. ఆంధ్రాబ్యాంకు వారు జారీ చేసిన రెఫరెన్స్ నంబరును ఈనెల 10వతేదీ లోపు మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలన్నారు. ఇతర వివరాలను టఞటట్ఛౌట్ఛటఠిఝ.ఠ్ఛీఛౌఛ్ఛీ.ఛిౌఝ లో పొందుపరచామన్నారు.