సాక్షి, నెల్లూరు : రుణమాఫీ హామీని చంద్రబాబు నెరవేర్చకపోవడంతో రైతులు అన్ని విధాలుగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బాబును నమ్ముకుని అప్పులు చెల్లించక పోవడంతో వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయి. పాత అప్పులు చెల్తిస్తేనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకులు షరతు పెట్టడంతో ఇప్పుడు పంటల బీమాకు ఎసరొచ్చి పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినా పరిహారం పొందలేని పరిస్థితి నెలకొంది.
ఇలా జిల్లా రైతులు సుమారు రూ.500 కోట్ల మేర బీమా మొత్తాన్ని కోల్పోనున్నారు. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో 2.5 లక్షల మంది, రబీ సీజన్‌లో 3 లక్షల మంది బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. రుణాలు మంజూరు చేసే సమయంలోనే ఆయా పంటలకు సంబంధించి బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడం ఆనవాయితీ. చంద్రబాబు తీరుతో రుణమాఫీ గందరగోళంలో పడిన నేపథ్యంలో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే క్రమంలో పంటలకు బీమా ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. బ్యాంకులు రుణాలు ఇస్తాయనే ధీమాతో ఎవరూ
ప్రత్యేకంగా బీమా ప్రీమియం చెల్లించడం లేదు.
వందల కోట్లలో నష్టం
జిల్లాలో ఒక్క ఖరీఫ్ సీజన్‌లోనే 55,402 హెక్టార్లలో వరి, 969 హెక్టార్లలో సజ్జ, 723 హెక్టార్లలో వేరుశనగ, 7,759 హెక్టార్లలో చెరకు పంటలు సాగయ్యాయి. ఎకరా వరికి బీమా ప్రీమియం రూ.459 కాగా పంట నష్టం సంభవిస్తే పరిహారంగా రూ.22,934 వస్తుంది. సజ్జకు ప్రీమియం రూ.278, పరిహారం రూ.10,296, వేరుశనగకు ప్రీమియం రూ.951, పరిహారంగా రూ.31,704, చెరకుకు ప్రీమియం రూ.1,578 కాగా పరిహారంగా రూ.78,876 లభిస్తుంది. అయితే బీమా ప్రీమియమే చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో ఏ కారణంతోనైనా పంటను కోల్పోతే వరి రైతులు రూ.316.5 కోట్లు, సజ్జ రైతులు రూ.21.5 కోట్లు, వేరుశనగ రైతులు రూ.5.7 కోట్లు, చెరకు రైతులు రూ.131.5 కోట్లు నష్టపోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి
నెల్లూరురూరల్ : నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ శ్రీకాంత్ వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రేషన్, పింఛన్, పట్టాదారు పాసుపుస్తకాలు, గ్యాస్, జాబ్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లకు ఆధార్ నంబర్లు తప్పనిసరై ఉన్నాయని, సంబంధిత అధికారులు ఆధార్ సీడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ తీయించుకోని వారిని గుర్తించి ఆధార్ తీయించాలన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నెల్లూరు ఆర్డీఓ పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, నెల్లూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు వీడీయోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
యూనిఫాం దుస్తులకు నిధుల విడుదల
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆప్కో ద్వారా యూనిఫాం దుస్తులకు సంబంధించి 50 శాతం నిధులను విడుదల చేసినట్లు సర్వశిక్షా అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఎస్‌ఎంసీ అకౌంట్లకు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆప్కో వారి ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్ 055910100055900కు బదిలీ చేయాలని సూచించారు. ఆంధ్రాబ్యాంకు వారు జారీ చేసిన రెఫరెన్స్ నంబరును ఈనెల 10వతేదీ లోపు మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలన్నారు. ఇతర వివరాలను టఞటట్ఛౌట్ఛటఠిఝ.ఠ్ఛీఛౌఛ్ఛీ.ఛిౌఝ లో పొందుపరచామన్నారు.
బీ(ధీ)మా ఏదీ?
Published Sat, Aug 9 2014 3:33 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement