చంద్రబాబు కుట్రలతోనే ఇంటివద్దకే పెన్షన్ ఆగిపోయింది
జూన్ 4 తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే యథావిధిగా ఇంటికే పెన్షన్ పంపిణీ
అవ్వాతాతల కాళ్లు కడిగి విషయాన్ని చెబుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం అవ్వాతాతలకు భరోసా ఇస్తున్న వైనం
కుప్పంలో వృద్ధుల కాళ్లు కడిగి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ భరత్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు.
బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment