'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా' | CM KCR Teachers day Speech | Sakshi
Sakshi News home page

'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'

Published Fri, Sep 5 2014 11:52 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా' - Sakshi

'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'

హైదరాబాద్: అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికైనా మొదటి బడి అమ్మ ఒడి అని ఆయన వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గురువులు పెట్టిన అక్షరభిక్ష వల్లే తానీ స్థాయిలో ఉన్నానని అన్నారు. తమను తీర్చిదిద్దిన ఘనత గురువులదే అన్నారు.

మృత్యుంజయ శర్మ దగ్గర తాను విద్య నేర్చకున్నానని గుర్తు చేసుకున్నారు. ఫీజు తీసుకోకుండా తనకు ఆయన పాఠాలు చెప్పారన్నారు.  9వ తరగతిలో చంపకమాల పద్యం రాశానని వెల్లడించారు. దేశానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో సేవ చేశారని కేసీఆర్ కొనియాడారు. సర్వేపల్లి ఏకసంధాగ్రహి అని చెప్పారు. గురువులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement