
జానపదం..ప్రాణపదం
సాక్షి, సిటీబూర్యో: భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, లయన్ క్లబ్ ఆఫ్ కొత్తపేట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బోనాల జానపద నృత్య జాతర ఆకట్టుకుంది. రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 204 జానపద పాటలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను మంత్రముగ్థుల్ని చేశాయి. అనంతరం నృత్య గురువులు, నృత్య జాతరలో భాగస్వాములైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ ఎస్ రాజ సదారాం, కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా కో–ఆర్డినేటర్ డాక్టర్ కేవీ రమణరావు తదితరులు పాల్గొన్నారు.