
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తమ గురువులను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సన్మానించనుంది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది ఉపాధ్యాయులను బుధవారం రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా సన్మానిస్తారు. వీరికి పతకంతో పాటు, రూ.10వేల నగదు బహుమతి అందజేయనున్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ మంగళవారం తెలిపారు. ఉన్నత విద్యా శాఖ పరిధిలో 29 మందిని, ఇంటర్ విద్యలో 10 మందిని ఉత్తమ అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి కూడా బుధవారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు.