
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది.
గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్‌గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment