చేగువేరా పోరాటం | Che Movie Teaser Released on the Death Anniversary of Revolutionary Icon Che Guevara | Sakshi
Sakshi News home page

చేగువేరా పోరాటం

Published Mon, Oct 9 2023 3:17 AM | Last Updated on Mon, Oct 9 2023 3:17 AM

Che Movie Teaser Released on the Death Anniversary of Revolutionary Icon Che Guevara - Sakshi

బీఆర్‌ సభావత్‌ నాయక్‌

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూ΄పొందిన చిత్రం ‘చే’. ‘లాంగ్‌ లివ్‌’ అన్నది ఉపశీర్షిక. బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషించి, దర్శకత్వం వహించారు. నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌పై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించారు.

నేడు (అక్టోబర్‌ 9) చేగువేరా వర్ధంతి సందర్భంగా ‘చే’ టీజర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా బీఆర్‌ సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ– ‘‘క్యూబా తర్వాత ప్రపంచంలో, తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్‌ ‘చే’. విప్లవ వీరుడు, యువతకి స్ఫూర్తి అయిన చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఉంది.

ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో చూస్తారు. ‘చే’ పోస్టర్‌ను చేగువేరా కుమార్తె డా. అలైదా గువేరా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా సినిమా ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యింది. నవంబర్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్‌ సమి, జగదీష్, సంగీతం: రవిశంకర్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement