
డియాజ్ బలార్ట్
హవానా: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కొడుకు డియాజ్ బలార్ట్(68) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ‘ గత కొన్ని నెలలుగా డియాజ్ తీవ్రమైన డిప్రెషన్‌కు చికిత్సపొందుతున్నారు’ అని క్యూబా అధికార పత్రిక గ్రాన్మా తెలిపింది. క్యాస్ట్రో మొదటి భార్య మిర్తా డియాజ్ బలార్ట్‌కు 1949 సెప్టెంబర్ 1న డియాజ్ జన్మించారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తన తండ్రి కాస్ట్రో పోలికలతో ఉండటంతో అక్కడి వారికి ఈయన ఫిడెల్ జూనియర్‌గా చాలా ఫేమస్. ఫిజిక్స్‌లో శాస్త్రవేత్త అయిన డియాజ్ క్యూబాలో అణుశక్తి కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. చనిపోయే దాకా ఆయన క్యూబా ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా, అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment