Diego Maradona Death: 8 Doctors Nurses Tried For Homicide In Argentina - Sakshi
Sakshi News home page

Diego Mardona Death: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం

Published Thu, Jun 23 2022 8:44 AM | Last Updated on Thu, Jun 23 2022 9:48 AM

Diego Maradona Death: 8 Doctors Nurses Tried For Homicide In Argentina - Sakshi

డీగో మారడోనా.. వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలున్నా ఫుట్‌బాల్‌లో అతను ఎప్పటికి దిగ్గజమే. 2020 నవంబర్‌ 25న 60 ఏళ్ల వయసులో ఆసుపత్రి బెడ్‌పై మరణించి కోట్లాది ఫుట్‌బాల్‌ అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తాడు. మెదుడులో రక్తం గడ్డకట్టడం.. కొకైన్‌ లాంటి డ్రగ్స్‌ పరిమితికి మించి తీసుకోవడం.. మద్యాపానాకి బానిస కావడంతో మారడోనా మృతి చెందినట్లు రిపోర్ట్స్‌ వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మారడోనాకు చికిత్స అందించిన ఎనిమిది మంది వైద్యుల బృందం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఫుట్‌బాల్‌ దిగ్గజం మరణించినట్లు తెలిసింది.

దీంతో ఆ ఎనిమిది మందిపై అర్జెంటీనా కోర్టులో కేసు నమోదు అయింది. కాగా మారడోనా మరణంలో నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడినందుకు ఎనిమిది మంది వైద్య సిబ్బంది త్వరలో విచారణకు హాజరు కానున్నారు. వీరిలో న్యూరోసర్జన్‌, అతని కుటుంబ వైద్యుడు లియోపోల్డో లుక్, మానసిక వైద్య నిపుణుడు అగస్టినా కోసాచోవ్, సైకాలజిస్ట్ కార్లోస్ డియాజ్, మెడికల్ కోఆర్డినేటర్ నాన్సీ ఫోర్లిని, నర్సులతో సహా మరో నలుగురు వైద్యులు ఉన్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా అపస్మారక స్థితిలో చనిపోయాడని.. నిర్లక్ష్యపూరిత హత్యకు పాల్పడిన వారిపై విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరారు.నేరం రుజువైతే నిందితులకు ఎనిమిది నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇక 1986 ఫిఫా వరల్డ్‌కప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్‌ను ఫిఫా.. ''గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ''గా పేర్కొంది. అంతేగాక కెప్టెన్‌గా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి మారడోనా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు.

చదవండి: Diego Maradona: టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు

Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement