టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు | Cuban Woman Makes BIG Allegation Late Football Star Diego Maradona | Sakshi
Sakshi News home page

Diego Maradona: టీనేజ్‌లో మారడోనా నాపై అత్యాచారం చేశాడు

Published Tue, Nov 23 2021 4:10 PM | Last Updated on Tue, Nov 23 2021 4:17 PM

Cuban Woman Makes BIG Allegation Late Football Star Diego Maradona - Sakshi

Diego Maradona Rapes Me In Teenage Allegation By Cuban Woman.. డిగో మారడోనా.. దివంగత అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ గెలవడంలో మారడోనా పాత్ర మరువలేనిది. ఆటలో ఘనమైన రికార్డులు కలిగి ఉన్న మారడోనా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో​ వివాదాల్లో చిక్కుకున్నారు. నిషేధిత డ్రగ్స్‌ వాడాడని నిరూపితం కావడంతో మారడోనాను కొన్నాళ్ల పాటు ఫుట్‌బాల్‌ నుంచి బహిష్కరించారు. గతేడాది నవంబర్‌ 25న మారడోనా శస్త్ర చికిత్స అనంతరం కన్నుమూశాడు. కాగా మారడోనా జీవితంపై తాజాగా 'డిగో మారగోనా' పేరుతో ఒక వెబ్‌సిరీస్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా రెండు దశాబ్దాల క్రితం డిగో మారడోనా తనను అత్యాచారం చేశాడంటూ క్యూబన్ మహిళ మావిస్ అల్వారెజ్ ఆరోపించారు. తాను  యుక్తవయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని 37 ఏళ్ల అల్వారెజ్ అనే మహిళ పేర్కొంది. ఈ వ్యవహారంపై బాధిత మహిళ వారిపై ఫిర్యాదు చేయలేదు. కానీ అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది. కాగా అల్వారెజ్ అర్జెంటీనా న్యాయ మంత్రిత్వ శాఖ కోర్టుకు గత వారం వాంగ్మూలం ఇచ్చింది.


Photo Credit: Guardian

ఆ వాంగ్మూలంలో .. ‘నేను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిశాను. అప్పుడు ఆయన డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించి చికిత్స కోసం క్యూబాకు వచ్చాడు. ఆ సమయంలో నాపై ఓ సందర్భంలో అత్యాచారం చేశాడు. అప్పుడు మారడోనాతో నాలుగైదేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నా. ఆ సమయంలో నన్ను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేశాడు. పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేశాడు. దీంతో అమితంగా ఇష్టపడిన అతడిని ఆ తర్వాత  అసహ్యించుకున్నా’ అని ఆమె చెప్పుకొచ్చింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement