
ఫుట్ బాల్ స్టార్ పెళ్లి బాజా..!
అర్జెంటీనా మాజీ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనా మాజీ స్నేహితురాలు ఒలివా ఒక ఇంటివారు కానున్నారు. ఈ విషయం స్వయంగా ఈ ఫుట్ బాల్ స్టార్ మాజీ ప్రియురాలే తెలిపింది. తన సోదరుని పుట్టిన రోజు సందర్భంగా అర్జంటీనా వచ్చిన ఈ జంట మీడియాతో మాట్లాడారు. వాటికన్ సిటీలో పోప్ సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. డిసెంబర్ 13న పెళ్లి ఉంటుందనే వాదనను.. ఒలీవా ఖండించింది. అయితే ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని.. డేట్స్ ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. కాగా.. మారడోనా.. మాజీ భార్యతో వచ్చిన ఆర్థిక విబేధాల్లో తలమునకలుగా ఉన్నాడు. భార్య క్లౌడియాకు ఈ ఫుట్ బాల్ దిగ్గజం 2003లో విడాకులు ఇచ్చాడు. అయితే. జాయింట్ అకౌంట్ కి సంబంధించిన లావాదేవీల్లో పేచీలు రావడంతో.. క్లౌడియా కోర్టుకెక్కింది. కాగా.. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 54 ఏళ్ల మారడోనా.. తాజాగా 25ఏళ్ల ఒలీవాను పెళ్లాడనున్నాడు.